బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–మాటలు మాత్రం కోటలు దాటుతాయి…


   ఇదివరకటి రోజుల్లో, ఊరికి ఏ కొద్దిమంది మాత్రమే విదేశాలకి వెళ్ళేవారు.ఇప్పుడో, విదేశాలకి వెళ్ళని వారు ఏ కొద్దిమంది మాత్రమో ! అంత తేడా అప్పటికీ ఇప్పటికీ.ఉద్యోగనిమిత్తంగా అయితేనేమిటి, పై చదువుల నిమిత్తమేమిటి, కూతురు/ కోడలు పురిటి విషయమయితేనేమిటి, సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంగా అయితేనేమిటి,వ్యాపార విషయమైతేనేమిటి, చివరాఖరికి పనీ పాటూ లేక, ఏ టూర్స్ ట్రావెల్స్ వాళ్ళు డిస్కౌంట్లిస్తున్నారనేమిటి, కారణాలు ఏమైతేనేం, చాలా మంది విదేశాలకి వెళ్తున్నారు. అది చాలా ఆనందకరమైన విషయం.

   జీవితంలో ఒక్కసారైనా, విదేశాలకి వెళ్ళకపోతే, ఈ వెధవ జీవితం ఎందుకూ అనుకుని, ఆన్సైటు ప్రాజెక్టులకి తను పనిచేస్తున్న కంపెనీ వాడు పంపట్లేదని, కంపెనీలు కూడా మార్చేసిన వారిని చూశాను.ఏది ఏమైనా విదేశం ఒక్కసారి వెళ్ళొస్తే జీవితం ధన్యమైనట్లే! అడిగినవాడికీ, అడగనివాడికీ కావలిసినన్ని కబుర్లు చెప్పొచ్చు. వినడానికి శ్రోత అనేవాడొకడుండాలి అంతే.ఇదివరకు ఈ అంతర్జాలాలూ వగైరా అంత ప్రాచుర్యం సంపాదించుకోని టైములో, ఆహా ఓహో అనుకునేవారు. ఇప్పుడా గొడవే లేదు. ఏది కావలిసినా గూగుల్ ఎర్తులూ, గూగుల్ ఇమేజిలూ, ఒకటేమిటి కావలిసినన్ని ఉన్నాయి.ఏదో పక్క ఊరు వెళ్ళినంత సుళువుగా వెళ్ళొచ్చేస్తున్నారు.

   వచ్చీ రాగానే, ముందుగా నోటంపట వచ్చే మొదటి మాట- ‘అమెరికాలో అయితేనా, రోడ్లన్నీ అద్దాల్లాగ ఉంటాయండి, అసలా డిసిప్లీనేమిటి,నీట్ నెస్సేమిటి,ఫ్రీడం ఆఫ్ స్పీచ్చేమిటి, పిల్లలకి ఇచ్చే స్వేఛ్ఛా స్వాతంత్రాలేమిటి, అడక్కండి,ఒకటనేమిటి, ప్రతీ విషయం లోనూ, బయటి దేశాలెంత ప్రగతి సాధించేయో, మన దేశం ఎంత వెనకబడుందో చెప్పేవాళ్ళే.మరి స్వదేశాన్ని కూడా ముందుకు నడిపించడానికి, మన వంతు ఏం చేస్తున్నారో అని ఒక్కసారైనా ఆలోచిస్తారా ఈ పెద్దమనుష్యులు?

   ఈ మధ్యన ఆంధ్రదేశం లో ఎక్కడ చూసినా కుక్కకాట్లే. దానికి విరుగుడు మందు లేక, చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారని,ప్రతీ రోజూ పెపర్లలో చదువుతున్నాము, టి.వీ.ల్లో చూస్తున్నాము. ఈ విదేశం వెళ్ళొచ్చిన దేశీ ప్రాణులు,ముందుగా చెప్పే మాటేమిటంటే, ‘అస్సలు కుక్కనేది కనిపించదండీ బయటా, దానిని బయటకెప్పుడైనా తీసికెళ్ళాల్సివచ్చినా, దాని వెనక్కాలే, మనం కూడా ఓ బ్యాగ్గు పట్టుకుని వెళ్ళి, అదేదో పాడిచేస్తే, దాన్ని కలెక్టు చేసి, ప్రత్యేకంగా పెట్టిన ఓ డబ్బాలో వేయాలి. అలా చేయలేదా, మనకీ, కుక్కకీ జుర్మానాయే! అబ్బో ఏం రూల్సండి బాబూ.’ అని. మరి అన్ని రూల్సూ, వగైరాలు తెలిసిన పెద్దమనుష్యులు, తెల్లారగానే తమతమ కుక్కల్ని, రోడ్దుమీదకి ఎందుకు తీసికెళ్తారూ? పైగా అది ఓ స్థంభమో, ఇంకోటో చూసుకుని, దాని అవశిష్టాలు తీర్చుకునేదాకా ఆ ఫుట్ పాత్తులమీదే, ఇంకో కుక్కుచ్చుకుని వచ్చినవాడితో కబుర్లూ. మరి అమెరికాలో అంత క్రమశిక్షణతో (కుక్కల విషయంలో) ఉన్న ఈ పెద్దమనిషికి ఇదేం రోగం? అడిగేవాడెవడూ లేడనా? పోనీ ఇక్కడకూడా అలాటి రూల్స్ పెడితే ఊరుకుంటారా? ధర్నాలూ, దీక్షలూ ‘కుక్కలికి కూడా స్వేచ్చాస్వాతంత్రాలు లేవా .. అని టి.వీ.ల్లో చర్చలూ’ర్యాలీలూ,ఎస్.ఎం.ఎస్సులూ, ప్రత్యేక సంచికలూ, బ్రేకింగ్ న్యూసులూ, ప్రతిపక్షం వారు, ప్రభుత్వం చేతకానితనం, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలీ అని డిమాండ్లూ, అబ్బో కావలిసినంత హడావిడి!ఇది ఉదాహరణకి మాత్రమే.

   ఇంకో విషయం రోడ్లమీద ట్రాఫిక్కు గురించి. ప్రతీ వి.వె.దే.ప్రా లూ పొగిడేది, రోడ్లమీది లేన్ డిసిప్లీన్ గురించి.ఇక్కడెవరైనా పాటించొద్దన్నారా వీళ్ళని? ఎక్కడ సిగ్నల్ బ్రేక్ చేద్దామా, ఎప్పుడు కొంపకి చేరుదామా అనే ఎప్పుడూనూ. అక్కడికేదో సిగ్నల్ బ్రేక్ చేసేవాళ్ళందరూ ఈ వి.వె.దే.ప్రా లనడం లేదు. కార్లలో వెళ్ళే స్థోమతా, సామర్ధ్యం వీళ్ళక్కాక, ఇంకెవరికున్నాయి? ఇంక శుభ్రత గురించి వినేవాళ్ళుంటే చాలు, వీళ్ళ లెక్చర్లకి అంతుండదు. ఆమధ్యన రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు చూశాను, ఒకావిడ కాళ్లు బాసినపట్టేసికుని, వేరుశనక్కాయలు, తొక్కలు తీస్తూ బెర్త్ క్రింద పడేస్తూ, ఎడా పెడా కబుర్లు చెప్పడం! ఏమైనా అంటే, మనదేశంలో మనం ఎంత చెయ్యాలనుకున్నా చేయలేమండీ,గుంపులో గోవిందా అంటూ లాగించేయడమే అని ఓ జ్ఞానబోధోటి కూడా చేస్తారు.

   బయటి దేశాల్లో Airport Security వాడు frisk చేశాసేరో అని ఏడుస్తారే, అదే ఫ్రిస్కింగ్ మన విమానాశ్రయాల్లో చేస్తే ఊరుకుంటారా?దేశంలో మెడమీద తలున్న ప్రతీ వాడికీ ఎదొ ఒక ఇమ్యూనిటీయే. మరీ ఎవడైనా ధైర్యం చేస్తే, ఓ ఫోను కాల్ చాలు, వాడి ఉద్యోగం ఊడడానికి. అలాగే పోలీసువ్యవస్థా అలాగే ఉంది.

   చెప్పొచ్చేదేమిటంటే, ఈ వి.వె.దే.ప్రా లకి, చేతనైతే మీవంతు మీరు క్రమశిక్షణ పాటించండి.Be a Roman while in Rome అని అర్ధం పర్ధంలేని కబుర్లొద్దు.అస్తమానూ బయటిలా ఉందీ,అలా ఉందీ అని ఊరికే కబుర్లు చెప్పడం కాదు,
మనం society upliftment కీ,ఏం చేయగలమూ అని.ప్రతీ వి.వె.దే.ప్రాలూ అలాగే ఉంటారనడం లేదు. పాపం వాళ్ళల్లోనూ బుధ్ధిమంతులున్నారు, రోడ్లమీద చెత్తనేది వేయరు. డస్ట్ బిన్నులోనే, ఎంతదూరంలో ఉన్నా సరే,చెత్తని జేబులోనైనా పెట్టుకుంటారు కానీ, ఇష్టమొచ్చిన చోట పడేయరు.వచ్చిన గొడవల్లా అందరూ నవ్వుతారు- ‘అబ్బ వచ్చేడండి బాబూ, ఇప్పుడే ఏ బయటనుండో వచ్చుంటాడు. ఇంకా హాంగోవరు వదల్లేదు,చూస్తూంటే తెలియడంలా …”

Advertisements

9 Responses

 1. meeru cheppindi baagaane undi

  chaala rojulnundi choostunna-meeku foreign vellina vaallante subconscious gaa jealousy undi sir.

  please adi correct chsukondi

  Like

 2. “‘అబ్బ వచ్చేడండి బాబూ, ఇప్పుడే ఏ బయటనుండో వచ్చుంటాడు. ఇంకా హాంగోవరు వదల్లేదు,చూస్తూంటే తెలియడంలా …””
  బానే ఉంది, అంతా చెప్పి ఇలా ముగించారు 🙂 మరి ఇప్పుడేం చెయ్యమంటారు?

  Like

 3. meeku foreign returns meeds unna jealousy chaala clear gaa undi

  Like

 4. అమెరికాలో జనాలూ ఇలానే నీలిగుంటారు కదండీ మొదట్లో..వాళ్ళని అమెరికా ఎలా..కంట్రోల్ చేసి దారికి తెచ్చిందో..?
  మీరన్నట్లు అమెరికాలాంటి దేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళైనా బుధ్ధి తెచ్చుకుని మిగతా మన దేశ అజ్ఞానులకు వారు పాటించి మార్గ దర్శకులు కావచ్చు కదా..?

  Like

 5. same nenu alochinchede rasaru meeru. 🙂

  Like

 6. నిప్పులాంటి నిజాలు రాసారు. మనకిక్కడ సాగుతుంది కాబట్టి చల్తాహే.. రోడ్డుమీద చెత్తవేస్తారు.. పక్కోడిమీద ఉమ్ములేస్తారు. ఇంకా ఎన్నైనా చేస్తారు. అక్కడ సాగదు కాబట్టి వాహ్.. ఏమి ఎటికెట్స్ అని పొగుడుతారు. అవి ఒక్కరోజులో ఒక్కరివల్ల వచ్చినవు కావు అని తెలుసుకోవాలి.
  అదేదో దేశంలో కుక్కల యొక్క డి.ఎన్.ఏ రిపోర్ట్ తో సహా డాటాబేస్ లో ఉంటాయంట. ఎక్కడైనా ఓ కుక్క చెండాలంచేస్తే అది సేకరించి.. డేటాబేస్ లో వున్న డి.ఎన్.ఏతో పోల్చి వాళ్ళ ఎజమానికి ఫైన్ పంపుతారంట. ఆ దేశంలో మొత్తం జనాభా కోటిమంది కూడా వుండరేమో. వందలకోట్లు దాటిన మన ఇండియాలో అలాంటివి సాధ్యమా?. అలాఅని మనల్ని మనం తక్కువచేసుకుంటే ఆకాశంలోకి చూసి ఉమ్ముకున్నట్టే. మంచైనా చెడైనా మననుండే మొదలవుతుంది. ఇది తెలుసుకుని మసలుకుంటే మనమూ ఎవరికీ తీసిపోము. ఏమంటారు!!

  Like

 7. @లలిత గారూ,

  కాశ్మీరు సమస్యలా, ఇలాటివాటికి సొల్యూషన్స్ ఉండవు.నేను వ్రాసిందంతా, ఊరికే మాట్లాడితే ఉపయోగం ఉండదూ అని.పరిస్థితులతో కాంప్రమైజు అవడమే శరణ్యం. అదే కదా చేస్తున్నదీ?

  @అనూరాధా,

  నేను చెప్పేదీ అదే !

  @ఎస్ ఎస్ ఎస్,

  నామీద మీకు అలాటి అభిప్రాయం కలగడం నా దురదృష్టం. నాకు బయటకి వెళ్ళివచ్చిన వారిమీద అసూయ అని ఎలా అనుకున్నారో అర్ధం కావడం లేదు! Ofcourse, మీ అభిప్రాయం మీది!నేను ఇప్పటికి 600 టపాలు వ్రాశాను. ఒక్కదానిలోనూ, ఎవరిమీదా అసూయ పడ్డట్లు మీకు అనిపిస్తే చెప్పండి. మీకో విషయం చెప్పనా, జీవితంలో ఇప్పటిదాకా ఈ అసూయ అనేది దగ్గరకు రానీయలేదు. I believe in destiny.

  @అద్వైతా,

  ధన్యవాదాలు.

  @శ్రీనివాసూ,

  నీవు చెప్పింది నూటికి పదహారణాల నిజం. కానీ అలా వ్రాసుకుంటూ పోతే, ఏదో బయటకెళ్ళొచ్చినవారిమీద అసూయ అని అపోహ పడ్డానికి ఆస్కారం ఉంది.( చూ.. పై వ్యాఖ్య !)

  Like

 8. idi nootiki nooru pallu nijam andi.. mee blog lu nenu chala rojulu nunchi follow avuthunna. Chala baaga rasthunnaru..

  Like

 9. అవునండీ. ఎస్. ఎస్. ఎస్ గారు అన్నట్టు నాకు కూడా ఎక్కడో లోతున వారిపై జెలసీ వున్నట్టే వుంది. కానీ నేను ఎన్ని దేశాలెల్లొచ్చినా అలావుండలేనండి అదేంటో. నేనెక్కడనుండొచ్చానో ఎప్పటికీ మరువలేకపోతున్నాను అదేం రోగమో ఏంటో.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: