బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Status Symబళ్ళు


   మనకి బ్యాంకెకౌంటెంతుందని ఎవడికీ అవసరం లేదు. ఎన్ని బ్యాంకుల్లో ఎకౌంట్లుంటే అంత గొప్ప. ఎన్ని క్రెడిట్ కార్డులుంటే అంత గొప్ప! నేను వ్రాసేది, దౌర్భాగ్యపు రాజకీయనాయకుల గురించీ, వారి అనునాయుల గురించీ కాదు. వాళ్ళు దేశీయ బ్యాంకుల్లో డబ్బులుంచితే, ఎప్పుడు ఏ సుప్రీం కోర్టువారో, సి.బి.ఐ వారో సీజ్ చేస్తారో తెలియక బుర్ర పగలుకొట్టుకోవాలి. హాయిగా ఏ స్విస్ బ్యాంకులోనో దాచేసికుంటే,ఎవడికీ తెలియదు, ఇప్పుడిప్పుడే తెలిసే అవకాశమూ లేదు.రాందేవ్ బాబాలూ, అన్నా హజారేలూ ఎన్ని దీక్షలు చేసినా ఏమీ లాభం లేదు.ఏదో తూతూ మంత్రం గా ప్రతీవాడూ, ఏదో ఒక ప్రకటన చేసేస్తున్నాడు కానీ, వాళ్ళకేమైనా పిచ్చా ఏమిటీ,అదేదో చట్టం తేవాలిట, నల్లధనం అంతా బయటకు తీయాలిట! తిన్న తిండరక్క చెప్పే మాటలన్నీనూ ఇవి.మన రాజకీయనాయకులు ఏ పార్టీ అయినా సరే, వెర్రి వెంగళప్పల్లాగ కనిపిస్తున్నారేమిటీ? ఇంకో అయిదారు తరాలవాళ్ళకి సరిపడేలాగ డబ్బులు తిన్నారు,వాళ్ళందరూ ఎంజాయ్ చేయొద్దూ? ఎవరో అడిగారుట, వీళ్ళిచ్చేయాలిట,అమ్మ, ఆశ దోశ….

   వాళ్ళ సంగతొదిలేయండి, ఊరికే మనం మొత్తుకోడం కానీ, ఏమీ జరగదు. ప్రతీ పార్టీ వాడూ తినాలా వద్దా, ఇవన్నీ పూర్తయేసరికి టైము పడుతుంది.నేను వ్రాసేది, సాదా సీదా ఆంఆద్మీ గురించి.ప్రతీవాడికీ ఓ కోరికుంటుంది,తన స్టేటస్ అవతలివాడికి తెలియాలని. మరీ చేతిలో మైక్కెట్టో, రిక్షాకి లౌడ్ స్పీకర్లు పెట్టో, అందరికీ చెప్పుకోలేరుకదా. ఏదో వీలున్నంతవరకూ, మనకి అందుబాటులో ఉన్న సాధనాలతో చూపించుకోడం.ఇదివరకటి రోజుల్లో, పధ్ధతులు ఒకలా ఉండేవి, 1990 లనుంచీ కొద్దిగా మార్పులూ వచ్చాయీ, avenues పెరిగాయి. స్కూలుకి వెళ్ళే పిల్లల్లో నూటికి ఇరవైమంది, కాళ్ళకి చెప్పుల్లేకుండానో, మహ అయితే ఆకు చెప్పులో వేసికుని వచ్చేవారు, ఎండైనా వానైనా సరే. ఏ డబ్బులున్న ప్లీడరుగారో, డాక్టరుగారో తమ పిల్లలకి బాటా షూస్ లాటివి వేసి పంపేవారు.ఆరోజుల్లో డబ్బున్నవాళ్ళంటే వాళ్ళే మరి. రాజకీయనాయకులు మరీ అంత బరితెగించేవారు కాదులెండి. ఉన్న ఊళ్ళో కాక, పొరుగూరు ఏ పట్టణానికో పంపి హాస్టల్ లో ఉంచేవారు.క్లాసులో కొంత మందికి కంపాస్ బాక్సులూ, వాటిలో వృత్తలేఖినిలూ, డివైడర్లూ,ఓ రబ్బరూ, పెన్సిలూ వగైరాలుండేవి, పైగా ఆ కంపాస్ బాక్స్ కూడా, చాలా stylish గా ఉండేది. పుస్తకాలు పెట్టుకోడానికి ఓ బ్యాగ్గూ, పైగా ఇవన్నీ మోసుకురావడానికి ఓ పని కుర్రాడో ఎవరో. ఈ కుర్రాడు పైన చెప్పిన ప్లీడరు/డాక్టర్ గారి పిల్లాడో పిల్లో అన్న మాట.వారు క్లాసులోకి రాగానే, పాపం ఏమీ లేకుండగా వస్తారే ఆ పిల్లలు వీళ్ళని హీరోల్లా చుసేవారు.’ఒరేయ్ ఒక్కసారి నీ కంపాస్ బాక్స్ చూడనివ్వరా అని బ్రతిమాలించుకునేవారు.అక్కడ ఆ కుర్రాడి స్టేటస్ సింబల్ కంపాస్ బాక్సన్నమాట!

   ఈరోజుల్లో, ఆ తేడాలు అంతగా కనిపించడం లేదనుకోండి, ప్రతీవారూ కావలిసినదానికంటే ఎక్కువే సంపాదించి, పిల్లలడిగింది నోరుమూసుకుని provide చేస్తున్నారు. ఏమైనా అంటే peer pressure అని ఓ మాటనేస్తే చాలు.బస్సుల్లో ఎక్కడ చూసినా, ఈ మధ్యన వచ్చే లాప్ టాప్ బ్యాగ్గులే చూస్తూంటాము. తెరిచి చూస్తే, దాంట్లో లాప్పూ ఉండదూ, టాప్పూ ఉండదు, ఏ గోంగూర కట్టో, మెంతికూర కట్టో ఉంటుంది. కానీ బస్సులో చూసే ప్రతీవాడూ, వీణ్ణీ, వీడి బ్యాగ్గునీ నోరెళ్ళబెట్టి చూస్తూంటారు Point scored !!ట్రావెల్స్ వాళ్ళ బస్సుల్లోనూ, రైళ్ళలోనూ తెచ్చే బ్యాగ్గులూ, సూట్ కేసులూ చూస్తూంటాము, వాటికి ఏదో Airlines వాళ్ళ ట్యాగ్గు తప్పకుండా ఉంటుంది. ప్రతీవాడికీ తెలియాలన్న మాట, ఈ ప్రాణి విదేశాలకి వెళ్ళొచ్చాడని.బయటనుండి రాగానే తీసేయొచ్చుగా ఆ ట్యాగ్గులూ, అబ్బే అలా తీసేస్తే బయటి ప్రపంచానికి ఎలా తెలుస్తుందీ, మనం వెళ్ళొచ్చామనీ?

   అన్నిటిలోకీ టాప్పేమిటంటే, ఇదివరకటి రోజుల్లో ఓ సంత సంచీలాటిదేదో, చందనా వారి చక్కల సంచీయో తీసికుని మార్కెట్ కి వెళ్ళేవారు. ఇప్పుడలా కాదుగా, ఎక్కడ చూసినా మాల్ లూ బ్రాండెడ్ ఔట్లెట్లూనూ. ఓ జేబురుమ్మాలు కొనుక్కున్నా సరే, వాడు ఓ బ్యాగ్గులో పెట్టిస్తాడు. ఇంక ప్రతీవాడి చేతిలోనూ ఈ బ్యాగ్గులే, తెలియొద్దు మరీ, మనం రెడీ మేడ్ షాప్పుల్లోనూ, కిరాణా కొట్లల్లోనూ సరుకులు కొనమనీ.కావలిసినంత పబ్లిసిటీ!

   అంతదాకా ఎందుకూ, ఈవేళ నా మిస్టరీ షాపింగ్ కోసమని Peter England కి వెళ్ళాను. మా అబ్బాయికో టీ షర్ట్ కొన్నాను, ఆ డబ్బులెలాగూ కంపెనీ వాడిస్తాడు,అంటే ఊరికే వచ్చినట్లే కదా,వాడిచ్చిన కంపెనీ కారీ బాగ్ తీసికుని, బస్సెక్కి వచ్చాను. ఆ బ్యాగ్గు బస్సులోని ప్రతీవాడూ చూస్తున్నాడా లేదా అని ఓ తాపత్రయం.ఇంటికి వచ్చి, ఓ Nike బాక్స్ లో, మా ఇంటావిడ చెప్పులు తెగిపోతే కుట్టించడానికి తీసికెళ్ళాను!!

   ప్రతీవాడూ మాటకి ఎన్ని సార్లు బాబా రాందేవ్, అన్నా హజారే,ఎం.ఎఫ్.హుసేన్ గురించి ప్రస్తావిస్తే అంత గొప్పన్న మాట !

   చెప్పొచ్చేదేమిటంటే, సరుకులు తెచ్చికున్న బాక్సులూ, బ్యాగ్గులూ ఊరికే బయట పారేయకండి ! మన స్టేటస్ అవతలివాళ్ళకు తెలియాలంటే ఇవే Symబళ్ళు మరి !!!!

Advertisements

5 Responses

 1. _______________________________
  వాటికి ఏదో Airlines వాళ్ళ ట్యాగ్గు తప్పకుండా ఉంటుంది. ప్రతీవాడికీ తెలియాలన్న మాట, ఈ ప్రాణి విదేశాలకి వెళ్ళొచ్చాడని.బయటనుండి రాగానే తీసేయొచ్చుగా ఆ ట్యాగ్గులూ, అబ్బే అలా తీసేస్తే బయటి ప్రపంచానికి ఎలా తెలుస్తుందీ, మనం వెళ్ళొచ్చామనీ?
  _______________________________

  Correct sir 🙂

  Like

 2. నాకు సెల్ ఫోన్ లేదు. సాధారణంగా ఉపయోగించను. నా భూమి గీత దూరశ్రవణ యంత్రము (Land line telephone) సంఖ్య—– 08812 244494
  ఖోయా ఖోయా చాంద్ ఖులా ఆసుమాన్ అన్న పాట ఈ వేళ మూడు మాట్లు విన్నాను. కానీ హం కో భీ నీద్ ఆయేగి అని మీరు అనుకున్నారో లేక నాదగ్గర ఉన్న మీ కారాగార గది (cell phone) దూరశ్రవణ యంత్ర సంఖ్య తప్పో తెలియదు. :))

  Like

 3. Oh ! Is Ur caller Tone is ‘Khoya khoya chand ! Very romantic. (& Bulusu garu is very clever)

  I too had this weakness for bags. I still like using fancy shopping bags to give ‘things’ to friends and relatives. I dont throw them out.

  Like

 4. @సుబ్రహ్మణ్యం గారూ,

  ఏదో నన్ను వీధిలోపెట్టాలని కానీ, రింగు టోన్లూ అవీ చెప్తారా బయటకి? చూడండి,సుజాతం గారు ఎలా వ్రాశారో?

  @సుజాతం,

  ఔను ఇది తట్టే లేదు! బయటవారికి ఇవ్వడంతో మన స్టేటస్ ఇంకా పెరుగుతుంది !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: