బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


   ఈ రోజుల్లో నగరాల్లో ఉండే స్కూళ్ళ ( ప్రభుత్వం వారివి కాదనుకోండి) యాజమాన్యాలు, వాళ్ళిష్టం వచ్చినట్లు రూల్స్ మార్చేస్తూంటారు. స్కూళ్లకెళ్ళే పిల్లల కోసం, ఓ బ్లాక్ షూ, వారం లో పీ.టీ. ఉన్న రోజున తెల్ల కాన్వాసు షూ ఉండేది.ఏదో వారానికి ఒక్కరోజే కదా పరవా లేదూ అని ఓ రెండు జతల కాన్వాసు షూలు కొనిపెట్టేస్తే సరిపోయేది. ఈవేళ మా నవ్యకి యూనిఫారం, పుస్తకాలూ, షూలూ కొందామని, మా కోడలు షాప్ కి వెళ్ళింది. పైగా ఇవన్నీ దొరికే షాపు ఊరంతటికీ, ఒక్కటే ఉంటుంది. మొత్తం స్కూల్లో ఉండే పిల్లలందరూ అక్కడికే వెళ్ళాలి, ఈ ఏడాది, సంవత్సరం పొడుగునా తెల్ల షూస్సే వాడాలిట. పైగా ఆ విషయం, ఆ కొట్టువాడు చెప్తేనే తెలిసింది! అదేదో పెరెంట్స్ కి ముందరే చెప్తే, ఆ స్కూలువాళ్ళ సొమ్మేంపోయిందీ? వర్షా కాలం లో ఆ కాన్వాసు షూలు,తడవకుండానూ, మాయకుండానూ అసలుంటాయా? ఇలాటి రూల్స్ ఎలా పెడతారో ఆ భగవంతుడిక్కూడా తెలియదు! ఏమిటీ విషయం అని అడిగే ధైర్యం, తల్లితండ్రులకి ఉండదూ, ఇంక స్కూలు వాళ్ళకి ఆడిందే ఆటా పాడిందే పాటానూ.

   ఈ ప్రెవేటు స్కూళ్ళు వసూలు చేసే ఫీజులు చూస్తూంటేనే,అసలు వణుకూ దడా పుట్టుకొస్తూంటుంది. వాటికి సాయం ఈ తింగరి వేషాలోటీ.ప్రొద్దుటే, స్కూళ్లకెళ్ళే పిల్లల చేతుల్లో చూస్తూంటాము, పెద్ద పెద్ద థర్మో కోల్ బోర్డులూ అవీనూ, ప్రాజెక్టులుట,పిల్లలే చేయాలని రూలేమీ లేదుట, ఎవరు చేసినా ఫరవాలేదుట కానీ, తిసికుని రావడం మాత్రం తప్పనిసరిట. పిల్లల దగ్గరనుండి ఏ క్రియేటివిటీ ఆశిస్తున్నారో ఈ స్కూళ్ళ వాళ్ళు. పైగా ప్రతీ స్కూల్లోనూ, ఓ పీ.టీ.ఏ ఒకటీ.ఈ రోజుల్లో, విద్య కూడా ఓ వ్యాపారమయిపోయింది. పైగా ఎంత పెద్ద కాన్వెంటు/ పబ్లిక్ స్కూల్లో చేర్పిస్తే అంత పెద్ద గొప్పోటీ.

   ఇంకో విషయం, చిన్న క్లాసుల్లో, పిల్లలకి, ఇంట్లో మనం ఏమీ నేర్పించకూడదుట, అలా నేర్పిస్తే పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతారుట.ఏమిటో అంతా గందరగోళంగా ఉంది. ఆ మధ్యనెక్కడో ఓ బోర్డు చూశానులెండి. Tutions from LKG to Class IX అని! ఎల్ కేజీ కి కూడా ట్యూషన్లు చెప్ప వలసిన పరిస్థితిలో ఉంది!అందుకేనేమో, ఓ పిల్లో పిల్లాడో, ఓ డిగ్రీ సంపాదించి, ఉద్యోగస్థుడవడానికి ఓ కోటి రూపాయలదాకా ఖర్చవుతుందని,వాటికోసం, financial planning చేయాలని, ప్రతీ financial consultant వచ్చి ఊదరగొట్టేస్తూంటాడు.ఇందులో నిజమెంతో తెలియదు. ఏదో ఉన్న ఇద్దరు పిల్లలకీ చదువు చెప్పించి, వాళ్ళ కాళ్ళమీద నుంచోబెట్టేశాము.కానీ, వాళ్ళు తమ పిల్లల కోసం పడే తిప్పలు చూస్తూంటే, గుండె బేజారెత్తిపోతోంది.

   ఏదో పెళ్ళవనంత కాలమూ,పెళ్ళయిన తరువాత ఓ నలుసొచ్చేదాకా మాత్రమే వీళ్ళ హనీమూన్లూ, స్వీట్ నథింగులూనూ.ఆ తరువాత ఎవరిని చూసినా,ఎక్కడ చూసినా ఏదో సీరియస్సుగా ఆలోచిస్తున్నట్లే కనిపిస్తారు. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారులెండి? ఏమిటేమిటో ప్లానింగులూ, ఫలానా స్కీంలో వేస్తే ఇంత రిటర్న్స్ వస్తాయిట, అదేదో స్కీంలో వేస్తే అంతొస్తుందిట అంటూ ఎప్పుడు చూసినా ఏవేవో లెఖ్ఖలూ, జమా ఖర్చూనూ. ఇళ్ళల్లో ఉండే పెద్దవాళ్ళకి ఇదంతా, అగమ్యగోచరంగా ఉంటుంది.

   ఈ చదువులూ ఉద్యోగాలూ ఓ ఎత్తూ, ఆ తరువాత కూతురి పెళ్ళి చేయడం ఓ ఎత్తూనూ. ఆ మధ్యన మా ఫ్రెండొకరు కూతురి పెళ్ళి చేశాడు, ఏదో చనువుండడం వలన అడిగాను కట్నం ఎంతిచ్చావూ అని అతనన్నాడూ” MRP 10,00,000″ అని.నవ్వొచ్చింది! ఎంత కరెక్టుగా, MRP అని చెప్పాడో అని!

Advertisements

2 Responses

 1. MRP 10,00,000

  ———————-

  భలే చెప్పారు

  Like

 2. రవితేజా,

  ధన్యవాదాలు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: