బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– కూసే గాడిదొచ్చి మేసే గాడిదను…


   మొన్నెప్పుడో రోడ్డుమీదనుండి వెళ్తూంటే,ఒకావిడ మా ఫాక్టరీలోనే పనిచేసి, నాకంటె ముందే రిటైరయ్యారు, అంటే నాకంటే ఓ మూడు నాలుగేళ్ళు పెద్దన్నమాట, కనిపించారు. నాతోపాటే, మా ఇంటిదాకా నడచివస్తూ, కబుర్లు చెప్పడం మొదలెట్టారు. మా స్వంత ఫ్లాట్ కి ఎదురుగానే , వాళ్ళ అబ్బాయీ కోడలూ ఉంటున్నారుట, వాళ్ళు ఆఫీసుకెళ్ళే టైముకి ఈవిడ అక్కడకి చేరడం, వాళ్ళు ఆఫీసునుండి తిరిగి వచ్చేదాకా, ఆ కుర్రాడిని చూడ్డం.వీళ్ళ ఇంకో ఇద్దరు మనవళ్ళని( ఇంకో కొడుకు పిల్లలు) వీళ్ళ వియ్యపరాలు చూస్తుందిట. వీళ్ళేమీ, మధ్యవయస్కులు కూడా కాదు, ఒక్కోరికీ 70 ఏళ్ళు పైమాటే.పైగా ఓ కోడలుకి త్వరలో ఓ బాబో, పాపో వస్తారుట. ‘అయితే ఈ లెఖ్ఖన, వచ్చే నాలుగైదేళ్ళూ, మీరు మీ పిల్లలకి, హైపోథికేటెడ్ అన్న మాట’ అన్నాను. ఏం చేయమూ మరీ,పిల్లలకి పట్టదు, మాకా ఓపికా లేదూ అని పాపం ఆవిడ గోల పెట్టేసింది. ఈ మధ్యనే, మాకు దగ్గరలో ఉన్న ఓ సొసైటీ లో, మా పాత ఫ్రెండొకాయన, ఇలాగే మనవణ్ణి చూసే కార్యక్రమంలో, వాడితో పరిగెట్టలేక, పడిపోయి, పెరాలిసిస్ వచ్చి, రెండు నెలల్లో పోయారుట. ఇలాటివన్నీ వింటూంటే, ఈవిడకి హడలెత్తిపోతోందిట. రేపెప్పుడైనా, నాకు అలాటి పరిస్థితే వస్తే ఏం చేయాలో అని ఈవిడ భయపడిపొతున్నారు. ‘నీగురించి పట్టించుకోడానికి ఎవరికీ టైమనేది ఉండదూ, వాళ్ళు వాళ్ళ పిల్లల్నే చూసుకుంటారా, లేక నీసంగతే చూస్తారా?’ అన్నాను.

   అప్పుడు, మా పిల్లలు ఆచరించిన పధ్ధతి చెప్పాను.మనవణ్ణి డే కేర్ కి పంపేస్తారూ, మహా అయితే సాయంత్రం వాడు తిరిగి వచ్చిన తరువాత,ఓ గంటో గంటన్నరో చూడడం. ఆ తరువాత ఈ పిల్లలూ మన దగ్గరకి రారూ వాళ్ళ అమ్మా నాన్నల్ని వదిలి. మనకీ grandchildren తో గడిపినట్లుంటుందీ, అంత శ్రమా ఉండదూ.65 ఏళ్ళు దాటినతరువాత, చిన్న పిల్లల్ని చూడడం అంత తేలిక కాదు, వాళ్ళతో సమానంగా పరిగెట్టే ఓపికా ఉండదూ, పోనీ పరిగెట్టామా అంటే,అదిగో ఎక్కడో స్లిప్ అయి, మా ఫ్రెండులాగ అవుతుంది.

   నా ఉద్దేశ్యమేమిటంటే, ఖర్చు భరించే ఓపికున్నప్పుడు,హాయిగా పిల్లల్ని డే కేర్ సెంటరు మంచిది చూసి, దాంట్లోనే వేయాలని. డబ్బిస్తే శ్రధ్ధగా చూడ్డానికి, అందులోనూ నగరాల్లో కావలిసినన్ని ఉన్నాయి.ఏ వంట్లో బాగుండనప్పుడో ఈ grandparents ఎలాగూ ఉన్నారు. grandchildren ని చూడమూ అనే grandparents ఎక్కడా ఉండరు. అలాగని ఉంటే వాళ్ళ ఖర్మ! అలా కాకుండా, ఇంట్లోనే ఉన్నారూ, పనీ పాటూ లేదూ, ఉత్తినే డబ్బుఖర్చెందుకూ, క్రెచ్ లకి వాటికీ అని,grandparents మీదే పెట్టారా ఈ బాధ్యతా,ఇంక చూసుకోండి, జరిగేదేమిటీ, రోజంతా ఈ పిల్లల్ని ఓ డ్యూటీ లాగ చూసి, తమ కొడుకూ/కోడలూ సాయంత్రం ఆఫిసునుండి తిరిగ రాగానే, ఏదో handing over/ taking over లాగ ఆ పిల్లల్ని వాళ్ళ చేతుల్లో వదిలిపెట్టి, ఈవెనింగ్ వాక్ కి వెళ్ళిపోతారు. ఇంక కొడుకూ కోడలూ, ఫ్రెష్ అవడానికి కూడా టైముండదు. ఇంక చిరాకులూ పరాకులూ,‘రోజంతా ఆఫీసులో స్లాగ్ చేసి,ఇంటికి వచ్చేటప్పటికి,ఇదేమిటీ, మీ అమ్మా నాన్నా, పిల్లల్ని మనకప్పగించేసి వెళ్ళిపోతారూ, ఆ మాత్రం కొంచంసేపు, మనం ఫ్రెష్ అయేదాకా ఉండకూడదా’ అని కోడలూ, ప్రొద్దుటినుంచీ వీళ్ళని చూస్తున్నారుగా, వాళ్ళకి మాత్రం రిలీఫ్ ఉండొద్దా, అంత కుదరదూ అనుకుంటే, మీ అమ్మా నాన్నల్ని పిలుచుకో’ అని కొడుకూ,ఒకళ్ళమీదొకళ్ళు అరుచుకోడంతోటే సరిపోతుంది. పిల్లల సంగతి చివరికి ఎవరూ పట్టించుకోరు. ఇందులో ఎవరినీ తప్పు పట్టడానికి వీల్లేదు. ఎవరికి వారే రైటే కదా.

   ఇంకో సంగతి, ఇంట్లో పిల్లల్ని ఏ నానమ్మా తాతయ్యా చూస్తున్నారనుకోండి, అమ్మమ్మా తాతయ్యా అదే ఊళ్ళోనో, లేక ఇంకో ఊళ్ళోనైనా సరే, ఒక్కొక్కప్పుడు కొన్ని సమస్యలొస్తూంటాయి. కూతురు పిల్లలు, ఏ శలవల్లోనో మనతో ఓ వారం గడిపితే బావుండునూ అనుకుంటారు.అనుకోవడందాకా బాగానే ఉంటుంది,ఆ తరువాతే వచ్చేదే సమస్యల్లా. మనవరాలో, మనవడో ఉన్న వారం రోజులూ, వాళ్ళకి మహరాజభోగంగా ఉంటుంది. పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నల గురించి ఎక్కడేడుస్తారో అని లేనిపోని గారాలు చేస్తారు. ఇంక వీళ్లు అక్కడున్నంతకాలం ఆడింది ఆటా పాడింది పాటాగా ఉంటుంది.ఓహో మనం అడగి పేచీ పెట్టాలే కానీ, కావలిసినవన్నీ దొరికేస్తాయన్నమాట అని వీళ్ళూ డిసైడయిపోతారు. ఇంక back to pavilion వచ్చిన తరువాత ప్రతీదీ ఫీకా ఫీకా గా కనిపిస్తుంది. అక్కడేమో అంతా Royal treatment, ఇక్కడేమో ఆం ఆద్మీ అయిపోతే ఎలాగా? అందుకోసమే ఎప్పుడైనా పిల్లల్ని ఎక్కడికైనా పంపాల్సినప్పుడు, పేరెంట్స్ లో ఒక్కరైనా వాళ్ళతో ఉండేటట్లుగా చూసుకోండి. ఉన్నారుకదా అని మరీ strict గా ఉండఖ్ఖర్లేదు. అప్పుడప్పుడు రిలాక్సేషన్ ఉంచండి. దానితో, మీ పిల్లల్ని పెంచే పధ్ధతిలోనూ continuity ఉంటుంది.అంతే కానీ, పిల్లలు ఒక్కళ్ళూ ఉండడానికి ధైర్యం చేస్తారా లేక భయ పడిపోతారా అవీ చూడ్డానికి ముందుముందు కావలిసినంత టైముంది.

   ఇవన్నీ చదివి ‘కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొడుతోందీ’ అనకండి….

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: