బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


   ఒక్కొక్కప్పుడు చూస్తూంటాము, ఎవరైనా వాళ్ళింట్లో జరగబోయే, వివాహ మహోత్సవానికి, ఆహ్వాన పత్రిక ఇచ్చేటప్పుడు, దాంట్లో ‘బంధుమిత్ర పరివారం…’ అని ఉన్నప్పటికీ, మన పేరు వ్రాసేటప్పుడు, కవరు పైన, ఫలానా శ్రీమతి, శ్రీ అని వ్రాస్తూ ఎండ్ ఫామిలీ అనికూడా వ్రాస్తూంటారు. కానీ కొంతమందుంటారు, ఇంటి పెద్ద ఒకడినే పిలుస్తారు! మహ అయితే, అతని భార్యనీ.రిసెప్షన్ లో ఎన్ని ప్లేట్లు డిన్నరో, లంచో ఖర్చవుతుందో తెలియాలి కదా.ఈ మధ్యన నేను బాపట్ల వెళ్ళిన సమయం లో, మా స్నేహితులిద్దరి కొడుకుల వివాహ రిసెప్షన్లయ్యాయి. నేను వెళ్ళలెకపోతున్నాను కదా అని, మా ఇంటావిడా, అబ్బాయీ కోడలూ పిల్లలూ వెళ్ళారు. కారణం- ఆ ఇద్దరూ కూడా, వెడ్డింగ్ కార్డిచ్చినప్పుడు, నా పేరుతో ఎండ్ ఫామిలీ అని వ్రాశారు.

మా నవ్యని హైదరాబాద్ లో వాళ్ళ అమ్మమ్మ దగ్గర దిగబెట్టడానికి, మా అబ్బాయీ కోడలూ, తనని కారులో తీసికెళ్ళారు. నిన్న, మా సొసైటీ లో ఒకతని కొడుకు పెళ్ళి రిసెప్షనూ, మా అబ్బాయి అడిగాడు, డాడీ, ఆ రిసెప్షన్ కి మా తరపున ఎటెండ్ అవకూడదా అని, నేను చెప్పానూ, నాయనా అతను కార్డిచ్చినప్పుడు, నీదీ, నీభార్యదీ మాత్రమే పేర్లు వ్రాశాడు, మమ్మల్ని ఎకౌంటులోకి తీసికోలేదూ, అందువలన నాకు వెళ్ళే కోరిక ఏమాత్రమూ లేదూ, అని చెప్పేశాను.తను కొద్దిగా ఫీలు అయినట్లనిపించింది. కానీ ఏం చెయ్యను, నాకు ఇలాటివాటిల్లో కొద్దిగా పట్టింపు ఉంది. It may look a bit silly for others. ఇలాటివన్నీ అనుభవం మీదే తెలుస్తాయి. మేము వరంగాం లో ఉంటున్నప్పుడు, మా కొలీగ్గొకడు, వాళ్ళ అమ్మాయి పెళ్ళికి, మగ కొలీగ్గులని మాత్రమే పిలిచాడు. పొనీ మర్చిపోయాడా అందామా అంటే, ప్రత్యెకంగా మరీ చెప్పాడు- కొలీగ్గులని మాత్రమే పిలుస్తున్నానూ అని! ఈ కారణంగా ఎవరూ వెళ్ళలేదనుకోండి, అది వేరే విషయం. అలాగే ఇక్కడ పూణె లో పని చేస్తున్నప్పుడు ఇంకొకతనూ అలాగే, కొలీగ్గులనే పిలిచి, ప్రత్యేకంగా చెప్పాడు, ఇంటికొక్కరే అని!
అందుకే అంటాను, ఏ విషయమైనా, అనుభవం మీదే తెలుస్తుందీ అని. ఎవరో చెప్తే అంత పట్టించుకోరు. ఊరికే చెప్పొచ్చారూ పేద్ద, ఎవరో ఒకరి పేరు వ్రాస్తే సరిపోదా అని.అది పధ్ధతి కాదు, శ్రీమతి, శ్రీ ఫలానా ఎండ్ ఫామిలీ అని వ్రాస్తే, మీ సొమ్మేంపోయిందండీ, అలా వ్రాస్తే, ఏమైనా ఫామిలీ అంతా తీసికొచ్చేస్తారని భయమా, అలా తీసికొచ్చేవాడు, మీరు వ్రాసినా వ్రాయకపోయినా తీసికొస్తాడు.కానీ, అలా వ్రాయనప్పుడు మాత్రం, నాలాటి తిక్క శంకరయ్యలు పట్టించుకుంటారు! రేపెప్పుడో కనిపించి, మా రిసెప్షన్ కి ఎందుకు రాలేదూ అని అడిగితే, ఇదీ కారణం అని చెప్పే ధైర్యం ఉందా, అదీ లేదూ,ఏదో అతను ఈ బ్లాగులూ అవీ చదవడులే అని ధైర్యం! కారణం అతను మళయాళీ!!

శుభలేఖల్లో చూస్తూంటాము, క్రింద ఫలానా వారి అభినందనలతో అని, వాళ్ళ కుటుంబం లోని బంధువులందరి పేర్లూ వ్రాస్తూంటారు. ఎవరి పేరు వ్రాయకపోతే వారికే కోపం.ఎక్కడిదాకానో ఎందుకూ, మా ఇంట్లోనే, మా పెద్దన్నయ్య గారి పెళ్ళి అయినప్పుడు, శుభలేఖ, మా పెదనాన్నగారి పేరుమీద వేశారు, ఫలానా మా సోదరుడి కుమారుడు అని మా నాన్నగారి పేరు ఎలాగూ వేశారు, వచ్చిన గొడవల్లా, మా ఇంకో పెదనాన్నగారి పేరు రాలేదని ఆయనకి కోపం వచ్చింది! ఈ రోజుల్లో అసలు ఆ గొడవలే లేవు- ” బంధుమిత్రుల అభినందనలతో..” అని వ్రాసేస్తున్నారు!

చెప్పొచ్చేదేమిటంటే, ఎప్పుడైనా శుభకార్యాలకి ఆహ్వానం పంపేటప్పుడు వీలైనంతవరకూ ఇంటి పెద్ద పేరు వ్రాసేసి, ఎండ్ ఫామిలీ అని వ్రాసేస్తూండండి. ఇంకో విషయం ఈ కార్డులు ఇచ్చేటప్పుడు చూస్తూంటాము, ఎవడిదో పేరు కొట్టేసి, ఏ ఇంటికైతే వెళ్ళామో ఆఇంటాయన పేరు వ్రాసేయడం! ఇదో పరమ దౌర్భాగ్య పధ్ధతి.ఏదో టైము కలిసొస్తుంది కదా అని , ఎవరెవరికివ్వాలో వాళ్ళ పేర్లన్నీ వ్రాసేస్తారు, ఆ ఇంటికెళ్ళే సరికి, వాళ్ళ పేరున్న కార్డు ఛస్తే దొరకదు, దాంతో చేతికొచ్చిన కార్డు తీసి, దాని మీదున్న పేరు కొట్టేయడం. హాయిగా బ్లాంకు కార్డులు తీసికుని, ఎవరింటికైతే వెళ్ళేమో వారి పేర్లు వ్రాసి ఇవ్వడం మంచి పధ్ధతి. పైగా మనం పేరు వ్రాసే లోపులో, కాఫీయో, చాయో దొరికినా దొరకొచ్చు!. ఇలా బ్లాంకు కార్డులుంటే, ఎవరింటికో వెళ్ళినప్పుడు, ఏ తెలిసిన పెద్ద మనిషో ఉంటే ఆయన పేరుమీదా, ఓ కార్డిచ్చేయొచ్చు. ఇలాటివన్నీ మొహమ్మాటం పిలుపులే అనుకోండి. మేము ఈ గొడవలన్నీ దాటేశాము.భవిష్యత్తులో ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఈ సలహానూ టపానూ !!!

6 Responses

 1. ఇది మీ ౫౦౦వ టపా!

  Like

 2. అవును. మా అత్తగారు వాళ్లు, అమ్మ,నాన్నగారు మా ఇంట్లో అప్పుడు ఉన్నారని తెలిసినా.. చాలా సార్లు ఎవరో ఒకరు మా ఇంటికి ఫోన్ చేసి మీరు మా ఇంటికి భోజనానికి వచ్చేయండి.. అనే పెట్టేసేవారు. ఆ పెద్దలకి వెళ్లాలా? అక్కర్లేదా? అన్న పరిస్థితి. కొద్దిగా కేర్ తీసుకుని ‘రమ్మని ‘ చెప్పటం రెండు నిమిషాల పని. చిన్న థాట్ అంతే..

  Like

 3. మందు భోజనానికి తప్ప విందు భోజనానికి ఇద్దరం కలిసే వెళతాము. నిజం చెప్పాలంటే అంత పరీక్ష గా నేను ఎప్పుడూ గమనించలేదు &co అని వ్రాసారా లేదా అని. ఇదివరకు హైదరాబాద్ వచ్చిన కొత్తలో పిలిస్తే చాలు పరిగెత్తుకు వెళ్లిపోయేవారం. ఏమో ఎవరైనా ఏమైనా అనుకున్నారా అని అనుమానం వస్తోంది ఇది చదివిన తరువాత .

  ఇప్పుడు మరీ తప్పదు అనుకుంటే తప్ప వెళ్ళటం లేదు.

  Like

  • >మందు భోజనానికి తప్ప విందు భోజనానికి ఇద్దరం కలిసే వెళతాము.
   :-))

   Like

 4. పిలుపులాటంలో పుల్లదనం .
  మా అమ్మాయి పెళ్లి అనుకున్న పక్షం రోజుల్లో శ్రీఘ్ర మార్గంలో అయి పోయింది.
  తపాలా శాఖ పుణ్యమా అని చాలామంది అయిన వారు అలిగారు.
  మా అబ్బాయి పెళ్లి అనుకున్న చాలా నెలల తరువాత అనిశ్చితంగానే జరిగింది.
  అప్పుడూ ఇప్పుడూ అయినవారు చాలా మంది అలిగారు.
  ఏమీ చెయ్యలేని పరిస్థితి.
  చేసు కున్న వారికి చేసుకున్నoత.
  మీ మ్యూసింగ్స్ ఎప్పటి లాగానే చాలా బాగున్నాయి.
  మోహన్

  Like

 5. @రెహమానూ,

  నెంబర్లు కొద్దిగా సరీగ్గా రాలేదు. ఆరువందలకి దగ్గరలో ఉన్నాను. నెంబర్లకేమిటిలే, కంటెంటనేదుండాలిగా. అది మాత్రం శూన్యం !!

  @కృష్ణప్రియా,

  నిజమే. ఆ టాపిక్కు గురించి త్వరలో ఒకటపా వ్రాస్తాను.

  @సుబ్రహ్మణ్యం గారూ,

  మీకు అవతలివారితో ఉండే సంబంధబాంధవ్యాలని బట్టుంటుంది మందైనా మాకైనా !!

  @పానీపూరీ,

  థాంక్స్.

  @మోహన్ గారూ,

  ఇప్పుడు ఆ అలిగినవారిగురించి తలుచుకుంటూ ఊరికే మూడ్ పాడిచేసికోవడం అనవసరం.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: