బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


   భాగ్యనగరం లో తిరుగు ప్రయాణం లో జరిగిన విశేషాలు ఓ టపా వ్రాసి, దానికి అలంకారాలూ గట్రా చేసి, తీరా పోస్టు చేద్దామనుకుంటూంటే, అకస్మాత్తుగా కనెక్షన్ పోయింది! అయినా ఇలాటివి మామూలెగా, సేవ్ చేశానుకదా అని అనుకున్నంతసేపు పట్టలేదు, ‘అన్ని టపా’ ల్లోకీ వెళ్ళి చూస్తే, శీర్షిక ఒకటే మిగిలింది! రాసిన కంటెంటంతా గాయబ్ అయిపోయింది! ఏదో వ్రాసుకుంటూ పోతే, వ్రాసేయకలను కానీ, మళ్ళీ అదంతా గుర్తుపెట్టుకుని వ్రాయాలంటే కొంచెం కష్టమే!మళ్ళీ రేపు వ్రాయాలి
ఆరోజెప్పుడో, కాచిగూడాలో నవోదయా కి వెళ్ళానని చెప్పాను కదూ. అదేమిటో ఇలాటివన్నీ నాకళ్ళకే కనబడతాయి!1.. కి ఎదురుగా వ్రాశారు చూడండి..” తెలుగు వల్ల ఓరిగేదేమిటి..” అంటే అర్ధం ఏమిటి? ‘ఒరిగేదేమిటి’ అని వ్రాయడానికి బదులుగా ‘ఒ’ కి దీర్ఘం ఇచ్చారా లేక ‘ ఓరుగేది’ అనే పదమే సరైనదా?  కొద్దిగా చెప్పండి

   ఏదో  కబుర్లు చెప్తూంటే, ఎవరో అన్నారులెండి, ప్రయాణాలు చేసేటప్పుడు, హాయిగా ఇంటినుండే online లో టిక్కెట్టు బుక్ చేసికోవచ్చు కదా, ఊరికే హైరాణ పడి ఆ క్యూల్లో గంటల తరబడి వేచి ఉండఖ్ఖర్లేకుండా అని. అవునూ నిజమే,బ్యాంకు పనులు కూడా చేసికోవచ్చూ అనుకున్నాను. ఏం లేదులెండి, నాకు ఈ కంప్యూటరు నేర్చుకున్నప్పటినుండీ, స్టేషనుకి కానీ, బ్యాంకుకికానీ వెళ్ళలేదు. హాయిగా ఉంది.ఆఖరికి రిలయన్స్ సెల్ బిల్లులూ, డి.టి.ఎచ్, బ్రాడ్ బాండ్ బిల్లులూ ఆన్ లైన్ లోనే! అక్కడకేదో నేను Computer savvy అయిపోయానని కాదు.

   అవతలి వారెందుకు అలా చేయలేకపోతున్నారూ అంటే, వారికి Comfort zone మాన్యుఅల్ గా చేయిస్తేనేమో బాగుంటుందనేమో! ఎవరి కంఫర్ట్ లెవెల్ వారిదీ.అందరూ flight లో వెళ్తేనే, బాగుంటుందీ, టైమూ సేవ్ చేయొచ్చు, కంఫర్టబుల్ గా ఉంటుందీ అంటారు. నాకైతే ట్రైనులో వెళ్తేనే సుఖంగా ఉంటుంది. అది నా కంఫర్ట్ లెవెలూ!పైగా వెళ్ళిన ఒక్కసారీ దడా వణుకూనూ.ఎన్ని రోజులైనా సరే హాయిగా ట్రైన్లో వెళ్తే ఉండే సుఖం దేంట్లోనూ లేదనిపిస్తుంది. మావాళ్ళూ వదిలేశారు ‘నీ ఖర్మ’ అని.

హాయిగా కాళ్ళు మడత పెట్టుకుని సోఫాలో కూర్చోడం నాకిష్టం. మా ఇంటావిడ గయ్యిమంటుంది. ఏం చేస్తాను? ఏదొ ఇంటర్వ్యూకి కి కూర్చున్నట్లు, సిన్సియర్ గా ‘రాముడు మంచి బాలుడు’ లాగ కూర్చుంటాను, ఎక్కడికెళ్ళినా!భోజనం చేసి, చెయ్యి కడుక్కుని, ఏ లుంగీకో తుడిచేసికుంటే ఉండే ఆనందం,ఏదో ఫార్మాలిటీకి పెట్టిన న్యాప్కిన్ను తో తుడుచుకుంటే వస్తుందా? అవన్నీ ఇంటికి వచ్చేవాళ్ళకి. ఏమిటో అర్ధం చేసికోరూ, చెప్తే వినరూ…

3 Responses

 1. chala bagundandi naku mi migurinci Sarada Muraligaru chepparu and want to meet u when i come to Pune.

  Like

 2. i knew something of this kind would happen
  అందుకే ముందే రాయమని చెప్పేను

  సర్లే మా మాట ఎందుకు వింటారు మీరు?
  ఏమాటకామాటే చెప్పాలి, ఇవాళ్టికీ నాకు ఆఖరికి ఎమెంటీఎస్ టికెట్ కూడా ఆన్లైన్ లో బుక్ చేసే విధానం ఉంటే బాగనిపిస్తుంది

  Like

 3. @అర్పితా,

  మోస్ట్ వెల్కం !

  @రెహమానూ,

  ఏదైనా సొల్యూషను లాటిది చెప్పాలి కానీ, ‘i knew something of this kind would happen’ అంటూ, నసేమిటీ? మొత్తానికి ఈవేళ వ్రాశాను !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: