బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


   క్రిందటిసారి మా నవ్య మాతో గడపడానికి వచ్చినప్పుడు, తనకి మాతో గడపవలసిన టైమంతా తన తమ్ముడు అగస్థ్య హడప్ చేయడంతో, పాపం చాలా disappoint అయింది. కానీ మొదటిసారి, మాతో గడపడానికి వచ్చింది కదా అని,
మా ఇంటికి దగ్గరలో ఉండే ‘మెగా మార్ట్’ కి తీసికెళ్ళాను.ఒక్కడినీ వెళ్ళి ఏదో ఒకటి తెచ్చి ఇవ్వొచ్చుగా, అబ్బే ఏదో ఉధ్ధరించేద్దామని, ఎరక్కపోయి తనని కూడా తీసికెళ్ళాను. పిల్లలతో, అదీ ఈకాలపు పిల్లలతో షాపింగుకి వెళ్ళడమంత మహాపాపం ఇంకోటి లేదు! కనిపించిన ప్రతీదీ కావాలంటుంది,కాదంటే ఏడుస్తుందేమో అని భయం! ఏదో వాళ్ళ అమ్మానాన్నలతో వెళ్ళడం వేరూ, ఏం కావలిసిస్తే అవి కొనే స్థోమత ఉంటుంది, వాళ్ళకి. పైగా తమ పిల్లలకి, తామేదో మిస్ అయిపొయినవన్నీ ఇద్దామనే తపనోటీ. మనలాటివాళ్ళతో వస్తే ఏముంటుందీ?అన్నీ తనకే సంబంధించినవే సెలెక్ట్ చేస్తోందని, అగస్థ్య కి కూడా ఏదో తీసికోమన్నాను. ఏదో మొత్తానికి అదీ ఇదీ చెప్పి, ఓ నాలుగైదు ఐటంస్ తీసికుని కొంపకి చేరాను. ఆ మాల్ లో ఎమైనా సుఖపడ్డానా అంటే అదీ లేదు. అక్కడ అదేదో ఎస్కలేటరో ఏమిటో అంటారు, దానిమీద వెళ్దామంటుంది. నాకు మామూలుగా లిఫ్టులమీదే నమ్మకం లేదు, అలాటిది ఈ ఎస్కలేటర్లూ అవీ ఎందుకూ, అని శతవిధాల ప్రయత్నం చేశాను. అబ్బే అంతదృష్టం కూడానా!నన్నెక్కించింది, అసలే భయం నాకు, దీనిల్లు బంగారం గానూ, కాళ్ళెత్తాలో లేదో తెలిసేడవదు,ఎత్తితే ఏం తప్పో, ఎత్తకపోతే ఏం తప్పో? మా రోజుల్లో ఇలాటివేమైనా చూశామా పెట్టామా? అసలు మా ఇంటావిడని తీసికెళ్తే ఏ గొడవా ఉండేది కాదు.ఎగరేసికుంటూ, తగుదునమ్మా అని, ఒక్కణ్ణీ వెళ్ళి ప్రాణం మీదకు తెచ్చుకున్నాను! అదేదో, దాని దారిన ఆ ఎస్కలేటరు తీసికెళ్తోందిగా, ఊరుకొవచ్చా,సడెన్ గా కాలెత్తేసరికి, వెనక్కి పడబోయాను! ఏదో నా రోజు బావుండి, ఏ కాలూ చెయ్యీ విరక్కొట్టుకోలేదు, కారణం, అతనెవడో పడబోతూంటే, నన్ను పట్టుకున్నాడు.ఇంక మా మనవరాలు, నాకు క్లాసులు తీసికోడం మొదలెట్టింది. అసలే వణుకూ, దడా, దానికి సాయం, మా నవ్య జ్ఞానబోధోటీ ! వాళ్ళ అమ్మా నాన్నలతో చిన్నప్పుడే సింగపూరూ అవీ వెళ్ళింది. నాకేమో గోదావరి మీద పడవలో వెళ్ళడమే భయం! ఏమిటో ఈ జీవితం అనిపించింది.ఇంతా చేసి, పడబోయినందుకా లేక
మనవరాలితో జ్ఞానబోధ చేయించుకున్నందుకా నా ఏడుపు అనేది అర్ధం అవలేదు!

   ఆ రెండు రోజులూ తను గడపాలనుకున్న పధ్ధతి లో గడపలేకపోవడం వలన, మళ్ళీ సూట్ కేసూ, బట్టలూ వగైరాలు సద్దుకుని మళ్ళీ వచ్చింది నిన్న. ఏదో మరీ అగస్థ్య లా కాక, చెప్తే మంచీ చెడూ తెలుస్తాయీ, అనుకుని, మా ఇంటావిడ ఎక్కడికో పార్టీ కి వెళ్ళవలసివచ్చినా, నేనొక్కడినే తనతో ఉంటానని ప్రగల్భాలు చెప్పి, తనతో సెటిల్ అయ్యాను. ఏం తిప్పలు పెట్టిందండీ బాబూ?తనతో ఆడమంటుంది.అంతవరకూ ఫరవా లేదు. తన ఖజానాలో అవేవో బార్బీ డాల్స్ ట. నన్ను వీధిన పెట్టడానికి వచ్చాయి. వాటికి ‘చోటీ’ వేయమంటుంది. ఈ చోటీ అంటే ఏమిటో తెలియదు నాకు, రైల్వే వాళ్ళల్లాగ హిందీ,తెలుగు, ఇంగ్లీషు భాషల్లో, ఆ చోటీలెలా వేయాలో చెప్పి మొత్తానికి వేయించిందండి.ఏమిటో, మా అమ్మాయి రేణు కి ఎప్పుడూ తలైనా దువ్వలేదు.అలాటిది, ఈ మనవరాలు నాచేత చోటీ వేయించింది అదీ ఓ డాల్ కి!

   ఇంకా ఏమేమి పన్లు చేయిస్తుందో దేముడా, అనుకునే లొపులో, మా ఇంటావిడ వచ్చేసింది. బ్రతికిపోయాను. అందుకే అంటారు అన్ని రోజులూ మనవి కాదంటారు !

Advertisements

2 Responses

  1. Bhale. Mi Navya baga adistundi mimmalni.

    Like

  2. ఏం చేస్తాం?బంగారు తల్లాయే !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: