బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-పేరు పేరునా అందరికీ వందనాలు !


క్రిందటేడాది ఒక టపా వ్రాశాను. నా బాతాఖాని కబుర్లమీద తమ తమ స్పందనలు తెలిపిన నా ‘బంధువులు’ అందరికీ. అదే విధంగా ఈ ఏడాది కూడా, కొత్తవారు కొంతమంది వచ్చారు. పాతవారిలో ‘కొద్దిమందికి’ నా టపాలు బొరు కొట్టేసుండొచ్చు.’శీత కన్ను’ వేశారు! వ్యాఖ్య పెట్టడానికి కొద్దిగా ‘బధ్ధకం’ వేసినా, చదువుతున్నారనే ఆశిస్తున్నాను. ఏమైనా లోటుపాట్లుంటే చెప్పండి, అంతేకానీ చదవడం మానేస్తే, నేనెవరితో చెప్పుకోనూ?

అభిజ్ఞాన, జ్యోతి,రవిచంద్ర, శ్రీవాసుకి,విరుభొట్ల వెంకట గణేష్,శ్రినివాస రాజు,మాలతి,చందు, సామాన్యుడు,పాని పురి,ఉమ, మల్లిన నరసింహరావు,కృష్ణ,సి.బి.రావు, బాలు,అప్పారావు,శివరామ ప్రసాద్,అబ్బులు,రాజశేఖరుని విజయ శర్మ,సుజాత, ఫణి, బొనగిరి,శాం,కుమార్,చేతన,శరత్,లక్కరాజు ఎస్.రావు,స్పురిత,జ్యోతి,చదువరి, శ్రీ,నూతక్కి రాఘవేంద్రరావు,ఫ్రెండ్,లేదు,రాజేశ్వరి,రాము,శ్రీనివాస్,ఋషి,నాగేస్రావు,బంగారు తల్లి, రామచంద్రుడు,స్నేహ,అపర్ణ, విరజాజి,ఏరియన్,తిక్క తింగరి,మేధ, వేణు,రాం,రా 1,మాలాకుమార్,నేస్తం,భావన,శారద, హంసవాహిని,తెలుగు యాంకీ,శ్రావ్య,కొత్తపాళీ,సాహితి, వేణు,కృష్ణప్రియ, శిరీష,లలిత, మోహిత్,హరేకృష్ణ,శ్రావ్య,వెన్నెలరాజ్యం,శ్రీకాంత్,శ్రీనివాస ఉమాశంకర్,శివగణేస్,లేఖరి, అశ్వినిశ్రీ,జేబి,లింగరాజు,శేషు,గౌరి కిరుబందనన్,శివాని, విశ్వనాద్,కిషన్ రెడ్డి,మద్దులపల్లి చంద్రశేఖర్,విజయభాను కోటె, వినయ చక్రవర్తి,విజయశ్రీ,మంజు,శ్పాం 1001,శ్రీనివాస గుప్త,సుధీర్ కుమార్,ఇందు, అప్పారావు శాస్త్రి,రాజేంద్రకుమార్ దేవరపల్లి,రాణి,కుసుమాయి,శివాని,గోపికాంత్,శ్రీని,సతీష్ కుమార్ యనమండ్ర,కశ్యప్, మురళీధర్,తెలుగు బాటసారి,తెలంగాణా ప్రాంత వృధ్ధ పండితుడు,భాస్కరరామి రెడ్డి,కోడిహళ్ళి మురళి మోహన్,శేషేంద్ర శాయి,కిరణ్ కుమార్,రహమానుద్దీన్,బాలు,సత్య,సుధాకర్, తృష్ణ,ఇండియన్ మినర్వా,శ్రీరాం,వసంతలక్ష్మి,సుభద్ర,ఎస్.బి.ఐ,బులుసు సుబ్రహ్మణ్యం,ఫల్గుణి,ఎనానిమస్ కోడలు,ఎస్.కె.ఎన్.ఆర్,శంకర్,సిరిసిరిమువ్వ,వజ్రం,అన్నపూర్ణ,లేఖరి,వేణు శ్రీకాంత్,వ్రతాస్,అరుణ,అద్వైత,నిరుపమ,ప్రవీణ,వీకెండ్ పొలిటీషియన్,మధు,ఏకలవ్య,ఎన్నెల,తెలుగుభావాలు,రాజాకొల్లి,వెంకట్,విష్,శుభ,ఆవకాయ,లాక్,శ్రీరాగ,చిన్నారి,దువ్వూరి సుబ్బారావు,అనూరాధ, సూర్య,శంకర్ వోలేటి,చిలమకూరు విజయమోహన్,కిరణ్మయి,ఎస్.బి.మురళి,ఏ2జెడ్ డ్రీమ్స్,ఊకదంపుడు, నగేష్,గీతాచార్య,రమణ,సత్య,ఎస్,భారతి, జాబిల్లి,దినవహి హనుమంతరావు,రాకేశ్వరరావు,కృష్ణ,లక్ష్మి, గీతిక,నిషిగంధ, చారి,పద్మవల్లి, మలక్ పేట రౌడి,చింతా రామకృష్ణరావు,మేధ,శ్రీనివాస్ పప్పు,అన్వేషి,వంశీ,
ప్రభాకర్ మందలపర్తి,మనవాణి,తేజశ్వి,భవాని మల్లాది,ఎస్ ఎస్ ఐ ఆర్,హృద్య,మంచు,అమరుడు,కర్లపాలెం హనుమంతరావు,ఫ్రెండ్,మునిపల్లె శ్రినివాస్,నాగార్జున, విజె,కృష్ణ గోపాల్,కేవిఏస్వీ,చంటి,శ్రినివాస్ మజ్జి,ఇందు, రాం చెరువు,వల్లి,
కొండముది సాయి కిరణ్ కుమార్,బీకే, కిష్ణా,వేణు,మయూరి,తార,దుర్గ,కోటేశ్వరి,బాబీ, శివ,శ్యామల,సుధాకర్, సత్య,

నాకు వీలైనంతవరకూ వ్యాఖ్యలు పెట్టిన వారి పేర్లు పైన వ్రాశాను. ఏ కారణం చేతైనా, ఎవరిదైనా పేరు మర్చిపోతే, అది ఉద్దేశ్యపూర్వకంగా చేసినది కాదని భావించ ప్రార్ధన! ఎంతైనా డెభై కి దగ్గరలో పడ్డాను. ఆ మాత్రం కన్సెషన్ ఇస్తారు కదూ! అందరికీ పేరుపేరునా కృతజ్ఞతాభివాదములు.
మీ అందరి సహకారంతో ఇప్పటికి టపాలు వ్రాశాను. ఓ లక్ష కి పైన హిట్స్ వచ్చాయి. నన్ను tolerate చేస్తున్నందుకు మరోసారి ధన్యవాదాలు.

Advertisements

18 Responses

 1. 🙂 మీకన్నా నేను కరెక్ట్ గా ఒక్క సంవత్సరం చిన్న అన్నమాట!
  Hearty Congratulations to you sir!

  Like

 2. ధన్యవాదాలు, నాపేరు మీ హిట్ లిస్టు లో చేర్చినందుకు. రెండవ పుట్టినరోజుకి శుభాభినందనలు, శుభాకాంక్షలు.

  డెబ్బై కి దగ్గరైనా మీరు నవ యువకులే. ఇల్లాగే వ్రాస్తుండండి. మేమందరం చదివి ఆనందిస్తూనే ఉంటాము.

  Like

 3. Happy Blog Anniversary..

  అందరినీ భలే గుర్తుపెట్టుకున్నారే.. మీమీద, మీ బ్లాగు మీద ఎవరూ శీతకన్ను వేయరులెండి. అప్పుడప్పుడు బిజీ ఐపోతారు జనాలు..కాని For a change… మీ Writing Style మార్చకూడదు. బోర్ అవుతుందేమో అని మీరే అంటున్నారుగా..

  Like

 4. ‘నన్ను tolerate చేస్తున్నందుకు’ – ఇలా చెణుకులతో రాస్తుండటం మీ రాతల్లో ప్రస్ఫుటంగా కనిపించే ప్రత్యేకత. మీరు ఇలాగే, ఇలాంటి ఉత్సాహంతోనే సరదా టపాలు రాస్తుండాలి.

  ఇక మీరిచ్చిన మీ వ్యాఖ్యాతల జాబితాలో నా పేరు మూడు సార్లు ఉంది. మిగిలిన వాళ్ళ సంగతెలా ఉన్నా నా పేరు ను మాత్రం మీరు గ్యారంటీగా ప్రస్తావించినట్టే! : -))

  Like

 5. ఏడిపిస్తున్నారు మేస్టారు.

  ఎంటో పెద్దాయన 70 యేళ్ల జీవితం, అనుభవాలూ, ఆలోచనలూ, అనుభూతులూ మనుమలూ మనవరాళ్ళూ, బ్లాగులూ కామెంట్లూ ..

  మంచితనం, సహృద్బావం కొండోకొచో అమాయకత్వం.
  ఇంటావిడ, గోదావరి, పుస్తక సమాజం, పూణే ఆంధ్ర సమాజం, ఉగాదీ, భోజనం, కారు తాళాలూ కష్టాలూ, దూరదర్శన్ నోస్టాల్జియాలూ, ఎవడో కూతురొద్దన్నాడని వాడిమీద కారాలూ మిరియాలూ, ఏక్ దం వూరిమధ్యలో డైజైనర్ ఫ్లాటూ, జీతానికి రెండింతలు లోను పెట్టేసి కొత్త టీవీ, మిస్టరీ షాపింగూ, గ్రుహప్రవేశం, కాలెండర్లూ, దైరీలూ, ఇంకోతికొమ్మచ్చి, రికీ పాంటింగ్ చూయింగ్ గమ్మూ, వర్షంలో పడిపోయిన కళ్ళజోడూ, తెలుగు లలితకళాతోరణం మీద ఎవడో అనామకుడితో గొడవా ..

  ఒకటా రెండా. ఈ టపాచదివి ఒక్కసారి రెండునిముషాలు కళ్ళుమూసుకుoటే ఎన్ని మధురానుభూతులు మాస్టారూ, ఎలా మర్చిపోతాం ..

  అయితే ఇక్కడో గొప్ప విషయముంది ..

  మీ బ్లాగులో ఇదినా మొదటి కామెంటు

  ఒక్క కామెంట్ రాయలేదు, మరి పాఠం అప్పజెప్పినట్టు ఇన్ని విషయాలెలా చెప్పావురా? అడగండి, అమ్మగారితో అడిగించండి

  మీ టపాకొచ్చే కామెంట్లు వేరు, మీ కబుర్లు మా మనసులో పాతేసే ఇంప్రెషన్లు వేరు. 🙂

  Like

 6. nenu srik gari tho ekeebhavistunnanu. memu daily me blog chustamu. commemts pettaledu kani rendu rojulu miru blog lo emi rayakapothe phanibabu garu emi rayaledenti ani wait chestu untanu

  Like

 7. congratulations sir !!

  Like

 8. మీ బ్లాగు నాకు చాలా జీవిత పాఠాలు చెపుతుంది. ముఖ్యంగా ఒక ఐదేళ్ళ తర్వాత (అంటే నాకు పెళ్లై వాళ్ళకి మనవళ్ళొచ్చాక) మా తల్లిదండ్రులు ఎలా ఆలోచించొచ్చు, మానుండి ఏమి ఆశిస్తారు, వారి భావాలు ఎలా ఉండొచ్చు లాంటివి తెలుస్తుంటాయి. బులుసు సుబ్రహ్మణ్యంగారు, సురేఖ అప్పారావుగారు రాసే బ్లాగులు కూడ ఈ కోవలోవే.

  Like

 9. ఫణిబాబుగారు! ఆహ; ఇంతమంది(ద) పేర్లు గుర్తుంచుకొని పేరు పేరునా అభినందించిన
  మీకు ఆ అందరి తరఫునా శుభాభినందనలు అందుకోండి. ఇంట్లో మీ అందరికీ మా
  ఇద్దరి శూభాశీస్సులు.!

  Like

 10. srik గారు చాలా బాగా చెప్పారు. మా అందరి అభిప్రాయం కూడా అదే.

  Like

 11. రెండేళ్ళు (డెబ్భై ఏడు కాదు సుమా! ) పూర్తి చేసుకున్నందుకు అభినందనలు మాస్టారూ. మీ బ్లాగాభిమానుల జాబితాలో నాకూ చోటిచ్చినందుకు ధన్యవాదాలు. (అన్నట్టు మీరు నాకో పోస్టు బాకీ ఉన్నారు…త్వరగా రాసేద్దురూ 🙂 )

  Like

 12. nenu koncham busy ga vundatam tho ee roje chusanu post naku blaagu ante interest kaliginde mee blaagu chadavadam valla mee anubhavalanni animuthalaithe meero muthala danda inka enno vunde vuntayi anthamanedi lekunda

  bharathi

  Like

 13. రెండవ బ్లోగోత్సవం, లక్ష వెన్ను తట్టులు పూర్తి చేసుకున్న సందర్భం లో శుభాకాంక్షలు .
  మరిన్ని విశేషాలతో మరింత సాధించాలని కోరుకుంటున్నాను.
  మోహన్

  Like

 14. Congratulations sir.
  nenu mee blog regular gaa chaduvutanandi.
  kaka pote comment pettadaniki baddakam.
  maa amma antundi panditi gunja ki kuda pani cheppe rakanive nuvvu ani, antha baddakam anna mata naaku.
  kaka pote naaku edyna chadive vishayam lo matrame baddakam ledandi.
  adi class book ayna ,story book ayna okate.

  Like

 15. @కృష్ణప్రియా,

  నాకంటె సంవత్సరం ‘చిన్నే’ అయినా, నాకంటె బాగా వ్రాస్తావు. Keep it up.

  @సుబ్రహ్మణ్యం గారూ,

  మరీ ‘హిట్ లిస్ట్’ అంటే, ఏ పోలీసులైనా పట్టుకుపోవచ్చు !

  @జ్యోతీ,
  Writing style మార్చకూడదనే అనుకుంటున్నాను, For the simple reason,ఇంకోలాగ వ్రాయలేను !

  @వేణూ,

  థాంక్స్. మూడు సార్లు రావడానికి ఇంకో కారణం ఏమిటంటే, వేణూ అని ఇంకొకాయన కూడా ఉన్నారు. ఇప్పుడు, నాపేరు వ్రాయలేదూ అని ఆయన కోప్పడకుండా ఉంటే చాలు.tolerate చేయడానికి మీరందరూ ఉండగా, నాకేం వ్రాస్తూనే ఉంటాను.మళ్ళీ తరువాత, ఎరక్కపోయి అన్నామురా బాబూ అనుకోకుండా ఉంటే చాలు!

  @శ్రీకృష్ణా,

  నేను ఏడిపించడం కాదు. మీరు వ్రాసిన వ్యాఖ్య చదివిన తరువాత, నాకు అనిపించింది My day is made అని.నేను వ్రాసిన ప్రతీ టపా గురించీ, అంత అందంగా వర్ణించడం చదివితే, నాకే నమ్మకం కలగడం లేదు.పైగా, ఇప్పటిదాకా ఎప్పుడూ వ్యాఖ్య పెట్టకుండా, మొత్తం మీ అభిప్రాయాలని, ఒక్క పేరాలో పెట్టగలిగారంటే శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారితో విద్వాన్ విశ్వం గారన్నట్లు, ఇడ్లీ కంటె పచ్చడే బావున్నట్లుంది !

  @జ్యొతి,

  ఆమాత్రం అభిమానం ఉంటే చాలదూ? ఇంకేంకావాలి?

  @తృష్ణ,

  థాంక్స్.

  @జెబీ,

  ఏమీ ఫరవాలేదు. జీవితంలో జరిగే ప్రతీ సంఘటనా, ఓ పాఠం నేర్పుతుంది. మరీ నేను నేర్చుకోనూ అంటే కొంచం కష్టం కానీ, నేర్చుకోవాలనే తపనే ఉంటే, అన్నీ బాగానే ఉంటాయి.

  @గురువుగారూ,
  ఇన్నాళ్ళూ వ్యాఖ్యలు పెట్టి నా టపాలకి ప్రాణం పోసి,నాకంటూ ఓ గుర్తింపు తెచ్చిన, నా బంధువులందరినీ మర్చిపోయే ప్రశ్నే లేదు.

  @సుబ్రహ్మణ్యం గారూ,
  ధన్యవాదాలు.

  @శ్రీనివాస ఉమాశంకర్ గారూ,
  ధన్యవాదాలు. అన్నానని కాదూ, మీకు బాకీ ఉన్న టపా కొంపతీసి తరవాణి గురించా ఏమిటీ?

  @మోహన్ గారూ,

  ‘వెన్ను తట్టు’–అబ్బ ఏం అద్భుత ప్రయోగం అండీ! నిజంగా ప్రత్యక్షంగా వెన్ను తట్టినట్లే అనిపించింది.

  @అద్వైతా,

  “panditi gunja ki kuda pani cheppe rakanive nuvvu”-సూపర్ ! అమ్మకంటే, కరెక్టుగా ఎనలైజ్ చేసేవారు ఇంకోరుండరు !!

  Like

 16. అదే మాస్టారూ

  Like

 17. నా పేరు Top10 లో పెట్టినందుకు ధన్యవాదములు… 🙂

  Like

 18. పానీపురీ,

  ఊరికే టాప్ టెన్నూ, బాటం టెన్నూ అని మనస్పర్ధలు పెట్టేయకు. అనవసరంగా మిగిలినవారు అపోహ పడతారు !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: