బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-రెండేళ్ళయింది….


   ఏమిటో చూస్తూ చూస్తూండగానే రెండేళ్ళు గడిచిపోయాయి, మిమ్మల్నందరినీ ‘హింసించడం’ ప్రారంభించి ! ఏదో పాత జ్ఞాపకాల గురించి వ్రాద్దామని ప్రారంభించి, ఫరవాలేదూ చదువుతున్నారు,ఇంకా ఎవరూ చివాట్లు వేయలేదూ అనే భరోసాతో
వ్రాస్తూండడంతో, రెండో ఏడు పూర్తిచెసికున్నాను. స్నేహితులు కొందరడిగారు ప్రతీ రోజూ ఏదో ఒకటి వ్రాస్తూంటారూ, అన్ని టాపిక్కులు మికు అసలు ఎలా దొరుకుతాయీ అని.టాపిక్కులకేమిటీ, వెదికితే లక్షల టాపిక్కులు అడక్కుండానే కనిపిస్తాయి. వ్రాసే ఓపికుండాలి. ఓపిక్కి సంబంధించినంతవరకూ, నాకు కావలిసినంత ఉంది!ఉద్యోగం సద్యోగం లేదు,ఇంట్లో వాళ్ళ మాటెలా ఉన్నా, పాపం ఆ కంప్యూటరు మాత్రం, నా మాట వింటోంది ఇప్పటివరకూ.ప్రతీ దాంట్లో అడక్కుండా సలహాలిప్పించుకోడం తప్పింది కదా, అని మా ఇంట్లోవాళ్ళూ, నా దారిన నన్నొదిలేశారు.’రోగికి కావల్సిందీ, వైద్యుడు చెప్పిందీ ఒకటే’ అన్నట్లుగా!

   అయినా ఈ రొజుల్లో సలహాలు వినే ఓపిక ఎవరికుంటుందీ? ఉత్తినే, నేను కూడా ఉన్నానోచ్ అంటూ, ప్రతీ దానిలో వేలెట్టడం కానీ, వినేవాళ్ళుండొద్దూ? నలభై ఏళ్ళు ఓపిక పట్టారు. వాళ్ళ కాళ్ళమీద నిలబడేవరకూ విధాయకం కాబట్టి విన్నారు, ఆ తరువాత మనమే పరిస్థితులు తెలిసికుని,strategic retreat చేసేస్తే పోలేదూ? మనకి మనశ్శాంతీ ఉంటుంది, మాట దక్కినట్ట్లూ ఉంటుంది.నా డైలీ రొటీన్ లో ఇంకోరు, interfere అవనంతవరకూ, అవతలివాళ్లు ఏం చేసికున్నా పట్టించుకోను. అడిగారా నాకు తెలిసినదేదో చెప్తాను. నచ్చిందా సరేసరి, లేదూ మీ ఇష్టం. I love freedom, దానికి ధోకా లేనంతవరకూ, no issue. ఈ పధ్ధతీ అందరికీ నచ్చినట్లే ఉంది, దానితో ఏ గొడవాలేకుండా హాయిగా రోజులెళ్ళిపోతున్నాయి. కాలూ, చెయ్యీ ఆడ్డం మానేస్తే, ఈ వేషాలెలాగూ సాగవు, పోనీ, అన్నీ బాగున్నంతకాలమైనా, నాక్కావాల్సినవి నేను చేసికుంటే ఉన్నంత హాయి ఇంకోటి లేదు అని నమ్మేవాడిని. మా వాళ్ళకీ నచ్చింది, దేంట్లోనూ interefere అవరు.వాళ్ళకీ హాయి, నా ప్రాణానికీ హాయిగా ఉంది!ఇదండి సంగతి, నా టపాల వెనుక ఉండే విషయం.

   అన్నిటికంటే ముఖ్యం మా ఇంటావిడ సపోర్ట్! తిక్క శంకరయ్యలాగ, నాకు ఫ్రీడం కావాలీ అంటూ అనుకుంటే సరిపొతుందా ఏమిటీ? దానికి కావాలిసిన infrastructure అంటే తిండానికి తిండీ వగైరా ఇచ్చేదెవరూ ఆవిడే కదా!పాపం అమాయకురాలు, రాజమండ్రీ వెళ్దామూ అన్న వెంటనే వచ్చేసింది, మా మనవడొచ్చే టైముకి పూణె తిరిగి వెళ్దామూ అన్నా వచ్చేసింది, సామాన్లెక్కువా ఇంకో ఫ్లాట్ విడిగా తీసికుని ఉందామూ అన్నప్పుడూ ఒప్పుకుంది, కట్టుకున్న భార్య సపోర్ట్ ఉంటేనే అన్నీ సవ్యంగా ఉంటాయి.ఏమిటో మనకే అన్నీ తెలుసుననుకుంటాము కానీ, vital issues వాళ్ళాలోచించినట్లుగా, మనకి తట్టవు.అప్పుడప్పుడు చిరాకేసినా, మెల్లిగా ఆలోచిస్తే తెలుస్తుంది.పైగా ఎప్పుడూ పక్కనే ఉంటుంది కదా, తను చెప్పేదేమిటీ, మనం వినేదేమిట్లే అని వెధవ్వేషాలు వేసిన సంఘటనలూ ఉంటాయి.కానీ ఒకసారి తల బొప్పి కట్టిందంటే తెలుస్తుంది, భార్య సలహాలో ఉండే పవరేమిటో!
మరి మనకి భార్య సలహా సంప్రదింపులు లేకుండా, ముద్దేనా దిగదు కదా, మరి అదే పని, మనం కన్న పిల్లలు చేస్తే ఏడిచేసి మొత్తుకోవడం అవసరమంటారా? మనలాగే మన పిల్లలూనూ.అది అర్ధం చేసికున్నంతవరకూ అన్నీ బాగానే ఉంటాయి.మనకో రూలూ, పిల్లలకో రూలూ అంటేనే, కొట్టుకు చస్తారు.

   ఈ రెండేళ్ళలోనూ, ఈ బ్లాగుల ధర్మమా అని కొత్త కొత్త స్నేహితులిని సంపాదించుకున్నాను. మా టెండర్ లీవ్స్ కి కూడా ఒకావిడ, నా బ్లాగులు చదివిన తరువాతే సభ్యత్వం తీసికున్నట్లు చెప్పి, నన్ను మరీ మునగ చెట్టెక్కించేశారు.ఏదో నచ్చినా నచ్చకపోయినా, నా టపాలు చూస్తున్నారు.మొదట్లో వ్యాఖ్యలు పెడితేనే సంతోషించేసేవాడిని, క్రమక్రమంగా వ్యాఖ్యలు తగ్గిపోయాయి.పోనిద్దురూ,నన్ను మరీ ఇగ్నోర్ చేయడం లేదులే అని సరిపెట్టుకుంటున్నాను.ఆ మధ్యన ఎవరో అజ్ఞాత, చాలా దరిద్రపు కామెంట్స్ పెట్టి మనస్సు పాడిచేస్తే, ఆ విషయం నేను టపాలో పెట్టగానే, నా శ్రేయోభిలాషులు చాలా మంది స్పందించి, ఆ ‘దరిద్రుడి’ ఆట కట్టించారు!అంతకంటే ఏం కావాలి నాలాటి వాడికి? నిజం చెప్పాలంటే ఆ రోజునే ఎప్పుడూ రానన్ని హిట్స్ 748 వచ్చాయి! దేనికైనా సంతృప్తనేది ఉండాలి అంటాను.

Advertisements

4 Responses

 1. Happy Blog-Day Sir….!

  Keep Writing 🙂

  -Sriram

  Like

 2. భలే భలే.. నేను పూణే వచ్చి కూడా ఇదే రోజుకు రెండేళ్ళు పూర్తయ్యాయి. 🙂

  మీ బ్లాగింగ్ ఇలానే ఆనందంగా కొనసాగాలని ఆశిస్తున్నాను..

  Like

 3. అభినందనలు.

  Like

 4. @శ్రీరాం,

  ధన్యవాదాలు.

  @శ్రీనివాసా,

  మీ అందరూ భరిస్తున్నారు. థాంక్స్ .

  @జేబి,
  ధన్యవాదాలు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: