బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- Owner’s pride and neighbour’s envy…


   మా మనవరాలు నవ్యకి స్కూలుకి శలవలు ఇవ్వడంతో, ఓ నాలుగు రోజులు మాతో గడపొచ్చని, మేముండే ఇంటికి తీసికునివచ్చాము.తనేమో ఓ సూట్ కేసుడు సామాన్లు తెచ్చుకుంది.ప్రస్తుతం మా ఇంట్లో చిన్నపిల్లలు ఆడుకోడానికి ఏమీ లేవుగా అందుచేతన్నమాట.తను మాతో exclusive గా గడపాలని వచ్చింది. కానీ రెండో రోజుకల్లా అగస్థ్య కి ఒంట్లో బాగులేకపోవడం వలన, తనని క్రెచ్ కి పంపకుండా, మా ఇంటికే తీసికుని వచ్చి వదిలేశాడు మా అబ్బాయి.మధ్యాన్నానికల్లా జ్వరం తగ్గిపోయి, ఆటల్లో పడ్డాడు.

   మా అబ్బాయన్నాడూ, మా ఇంటికే వచ్చి ఉండిపోకూడదా, ఇక్కడ మరీ ఇరుగ్గా ఉంటుందేమో, ఇద్దరు పిల్లలతో ఉండడం కష్టం అవుతుందీ అని. మేం చెప్పాము, వద్దునాయనా ఇక్కడ అయితే ఏదో ఒకరూం కాబట్టి, వాణ్ణి కంట్రొల్ చేయడం సులభం, అక్కడ మనింట్లో నాలుగు రూమ్ముల్లోకి వాణ్ణి వెళ్ళనీయకుండా, కంట్రోల్ చేసే ఓపిక లేదూ మాకు, అని చెప్పేసి ఇక్కడే ఉండిపోయాము.వామ్మోయ్, రూమ్ములు ఎన్నైనా, అగస్థ్యని మేమిద్దరం, కంట్రోల్ చేసేటప్పటికి, సాయంత్రం మా అబ్బాయీ, కోడలూ వచ్చేటప్పటికి, పది రోజులు లంఖణం చేసినవాళ్ళలా తయారయ్యాము!ఒకచోట ఉండడూ, నడక వచ్చేటప్పటికి, వాణ్ణి కింద వదులుదామంటే, ఇల్లంతా పికి పందిరేస్తాడు.అలాగని రోజంతా ఎత్తుకునే ఓపికా లేదు. ఏదో లాగ మొత్తానికి కాలక్షేపం చేసి, మాట దక్కించాడు! మరీ చెప్తారు కానీ, అంత చిన్న పిల్లాడిని చూడడం, అదేం బ్రహ్మవిద్యా ఏమిటీ అనకండి.బ్రహ్మవిద్యే మరి !

   పోనీ బయటకు తీసికెళ్దామా అనుకున్నా, నడవడానికి నామోషీ ! ప్రళయం వచ్చినా సరే, చంక దిగడు.చంకెక్కడం తన జన్మహక్కనుకుంటాడు. నిజమే కదూ, తాతల దగ్గర కాకుండా ఇంకెక్కడ సేవలు చేయించుకుంటారులెండి?ఇంక వాళ్ళ నాన్నమ్మని, ఇంట్లో ఉన్నంతసేపూ వదలనివాడు, బయటకు వచ్చేసరికి తనని నమ్మడం మానేస్తాడు.ఆ మధ్యన ఏదో ‘జాత్రా’ కి వెళ్ళాము, అందరం కలిసి, మా అబ్బాయీ, కోడలూ నవ్యతో బిజీగా ఉండడంతో, మనవణ్ణి మేము చూడవలసి వచ్చింది.చెప్పానుగా, బయటకు వెళ్ళినప్పుడు, నానమ్మని నమ్మడూ అని, దానితో పూర్తిగా నాతోనే ఉన్నాడు.

   ఇదివరకటి రోజుల్లో, ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు,కుటుంబం అంతా కలిసి భోజనం చేద్దామనుకునేవారు. మరి ఈ రోజుల్లోనో,ఏదైనా హొటల్ కి వెళ్దామనే అనుకుంటారు.అక్కడేమైనా మనం వెళ్ళీ వెళ్ళగానే సీట్లిస్తారేమిటీ, పైగా ఆదివారమాయే, ఫోను చేసి టేబిల్ బుక్ చేసికున్నా, ఓ గంటైనా వెయిట్ చేయాల్సొస్తుంది.అలా సోఫాల్లో కూర్చుని, వెయిట్ చేస్తున్నప్పుడు, మనలాటి ‘పక్షుల్ని’ పరిశీలించే అవకాశం వస్తూంటుంది.ఎన్నెన్ని తాతా మనవళ్ళ జంటలొచ్చాయో,లాటివి. ఎక్కడ చూసినా, ఈ మనవళ్ళు, వాళ్ళ వయస్సెంతైనా కానివ్వండి, తాతల్ని ‘take it for granted’ గా తీసేసికుంటారు. అలాగని ఏదో అల్లరి పెట్టేస్తారని కాదూ,వాళ్ళ సూకరాలన్నీ వీళ్ళ దగ్గరే! అమ్మా నాన్నల దగ్గర కుదరవుగా ఈ వేషాలు!

   ఎంత పుణ్యం చేసికుంటే వస్తుందిలాటి అదృష్టం? భగవంతుడి దయవలన కాలూ చెయ్యీ బాగానే ఉన్నాయి,ఏదో చాలా సేపు ఎత్తుకోవాల్సివస్తే కొంచం కష్టం అవుతూంటుంది,అదైనా ఓ పైన్ కిల్లర్ వేసికుంటే పోతుంది.అలాగని ఇలాటి సదవకాశాలు వదులుకుంటామా ఏమిటీ?రేపు ఇంకో ఏడాదెళ్ళిందంటే ఎత్తుకోమంటాడా ఏమిటీ?అలా అనుకోడానికీ లేదు, మా ఇంకో మనవడు చి.ఆదిత్య మూడ్ వచ్చినప్పుడు, గోదీ మే లేవోనా తాతయ్యా అంటూంటాడు.వాడి చిన్నప్పటి జ్ఞాపకాలు తాజా చేసికుంటూంటాడు. అలాటప్పుడు మా అమ్మాయి నా రెస్క్యూకి వస్తూంటుంది!

   మా పిల్లలు మాకిచ్చిన అపురూపమైన గిఫ్ట్ ఇదే మరి! చాలామందిలాగ ఏ అమెరికా కో వెళ్ళి సెటిల్ అయి, ఏడాదికో, రెండేళ్ళకో వచ్చి, ఓ నెలరోజులు గడిపేసి వెళ్ళిపోవడం కాకుండా, ఇక్కడే, అదీ ఒకే ఊళ్ళోనే ఉండి, మా తాతా మనవళ్ళ అనుబంధాన్ని ఇంకా గట్టిగా చేసే అవకాశం ఇచ్చారు. అలాగని, బయట ఉండే మనవళ్ళకీ,ఇక్కడే ఉండే తాతయ్యలకీ బాండింగ్ ఉండదనడం లేదు.నాకున్న బెనిఫిట్ ఏమిటంటే, నాకు ఎప్పుడు కావాలనుకున్నా, అర్ధరాత్రైనా, అపరాత్రైనా మా మనవళ్ళని చూసుకోవచ్చు!అదేదో యాడ్ లో చెప్పినట్లు Owner’s Pride and neighbour’s envy !! భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని ప్రార్ధిస్తూ….

Advertisements

4 Responses

 1. నాకు చాలా అసూయగా ఉంది. మా మనమరాలు పూజిత మాకు స్కైపు లో మాత్రమే కనిపించి కబుర్లు చెబుతుంది .

  Like

 2. so nice 🙂

  Like

 3. nijamgaa meeru,mee pillalu adrushtavantulu and abhinandaneeyulu alaanti erpatlu cheskunnanduku.mee blogs are inspiring us to return to India and be closer to parents

  Like

 4. @మోహన్ గారూ,

  అందుకే కదా శీర్షిక అలా పెట్టింది !!!! ( సరదాగా అన్నాను !)

  @బాలు,

  ధన్యవాదాలు.

  @అన్నపూర్ణ,

  తాతయ్యలకు, అమ్మమ్మా/నానమ్మలకు తమ పిల్లలకంటే మనవలూ,మనవరాళ్ళతోనే అనుబంధం ఎక్కువగా ఉంటుంది. అయినా చెప్పుకోలేరు! మీరే గుర్తిస్తే అంతకంటే ఇంకేం కావాలమ్మా?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: