బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-అసలు అర్ధం అవదు…


    ‘పెళ్ళంటే నూరేళ్ళపంట’ అన్నది పాతచింతకాయ పచ్చడి.ఇప్పుడు చూడండి, యూజ్ ఎండ్ త్రో లాగ నూటికి,కనీసం యాభై మంది ఎవరో ఓ పిల్లని పెళ్ళి చేసికోడం, ఓ నాలుగో అయిదో ఏళ్ళపాటు కాపరం చేయడం, తరువాత ఎవరి దారి వారు చూసుకోడం.ఇదికూడా గ్లోబలైజేషన్ ధర్మమే అనుకుంటా.గత పది పదిహేను సంవత్సరాలనుండీ ఈ వేలంవెర్రి మరీ ఎక్కువైపోయింది. ఇదివరకటి రోజుల్లో, ఏదో సినిమావాళ్ళకే పరిమితమయ్యేది, ఇప్పుడు సెలిబ్రెటీస్ తో పాటు, మామూలు జనాలకి కూడా ఇదో రోగం పట్టింది.

   ఒక విషయం అర్ధం అవదూ, అన్నేళ్ళు కాపరం చేసి, ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కన్న తరువాత, విడిపోదామని ఎలా అనుకుంటారండి బాబూ? అసలా ఆలోచన ఎలా వస్తుందిట? ఈ మధ్యన చాగంటి వారి ప్రవచనాలు వింటూంటే, భార్యకీ, భర్తకీ ఉండే అనుబంధం అదే బాండింగ్ ఎంత బలంగా ఉంటుందో విని వినీ,ఈ టపా.పోనీ ఉన్న పెళ్ళాం పిల్లల్ని వదిలేసి, వీడేమైనా ఉధ్ధరించేడా అంటే అదీలేదు.వీడికి వచ్చే ‘కొత్త భార్య’ కూడా ఇంకోళ్ళని వదిలేసి వచ్చిన మనిషే.పైగా తల్లికి పిల్లలంటే ఎంతో ప్రేమా అభిమానమూ ఉంటాయని ఘోషిస్తూంటారు,అవన్నీ వదిలెసి ఇంకోళ్ళతో ఎలా ఉంటారు? ఉదాహరణకి థరూరో ఎవడో, కుంబ్లే కూడా ఈ జాతికి చెందిన వాడేట.

   ఏదో సెలిబ్రెటీస్ అనే కాదు, నాకు తెలిసినవాళ్ళలోనూ ఉన్నారులెండి ఇలాటి వారు. దీనికి సాయం మన చానెళ్ళలో వచ్చే సీరియల్స్ చూసికూడా నేర్చుకుంటున్నారు.ఇప్పటి ఉద్యోగాల్లాగే ఈ పెళ్ళిళ్ళూనూ.ఓ కంపెనీ లాయల్టీ ఉండి ఏడ్చిందా ఏమిటీ? ఎక్కడ ఎవడు డబ్బులెక్కువిస్తే అక్కడికి పోవడం.అంతదాకా ఎందుకూ, ఆర్మీలో పనిచేసేవారు కూడా ఈమధ్యన వి.ఆర్.ఎస్ తీసికుని, ఐ.టి. లోకి వచ్చేస్తున్నారు.అసలు ఆర్మీలో చేరిందెందుకంట,ఏదో దేశసేవా, దేశభక్తీ అనేకదా, మరి అవన్ని మర్చిపోయి,ఎక్కువ డబ్బులు వస్తాయని ఐ.టి.లో చేరడం ఎంతవరకూ భావ్యం?పైగా ఏమన్నా అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ లేదండీ అనడం. ఈ సాటిస్ఫాక్షన్ అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్ మాత్రమే.నన్నడిగితే, ఫికిల్ మైండెడ్ అంటాను. దేనిమీదా నమ్మకం ఉండదు, కట్టుకున్న భార్యైనా సరే, చేసే ఉద్యోగమైనా సరే.రెండూ ఒకటే ఇలాటివారికి.జస్ట్ ఏ కేస్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ.

Advertisements

2 Responses

  1. రెండో పెళ్ళేమిటండీ పెదనాన్న గారూ( మనలో మన మాట-పెద్దవారు కదా అందుకని ఇలా సంబోధిస్తున్నాను,ఏమీ అనుకోకండి).

    మీరు పొరపాటున “మా ఎక్స్ ఛేంజ్” అనే టీవీ ప్రోగ్రాం చూసుంటే ఒకవేళ,దాని ఫ్రెష్ కాపీ “బీవీ ఎక్స్ ఛేంజ్” అనే కొత్త కార్యక్రమం యథేచ్ఛగా ఇప్పుడు జరుగుతోందండీ!

    Like

  2. లేఖరీ,

    ఎలా పిలిచినా ఫరవాలేదు! తిట్టుకోకుండా ఉన్నంతవరకూ !! మీరు చెప్పిన కార్యక్రమం ఇంకా చూడలేదు.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: