బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-పూణె లో ఉగాది


   క్రిందటి ఉగాది కి పూణె లో ఆంధ్రసంఘం వారి ఆధ్వర్యంలో జరిగిన ఉగాది గురించి, నా అభిప్రాయం ఒక టపాలో వ్రాశాను. ఈ ఏడాది ఎలా జరిగిందో కూడా వ్రాయడం నా బాధ్యత. లేకపోతే, పూణే లో ప్రతీసారి ఒకలాగే జరుగుతుందనే అపోహ కలగవచ్చు.ఈసారి ఉగాది కార్యక్రమానికి వెళ్ళడానికి మరో కారణం కూడా ఉందనుకోండి, మా గ్రంధాలయం వివరాలిస్తూ ఒక పాంఫ్లెట్ ,అదీ తెలుగులో తయారు చేశాము. పైన ఫొటో పెట్టేనే అదీ. వ్రాయడం వరకూ నేను, దానికి టెంప్లేట్ తయారుచేసి, అలంకరణలు చేయడం మా కోడలు చి.శిరీషా.ఏదో బాగానే ఉందనిపించింది, ప్రింటై వచ్చిన తరువాత! మన భాషలో చేస్తే,కొద్దిగా బావుంటుందేమో అనే ఉద్దేశ్యంతో తయారుచేశాము.

   నేనూ, మా అబ్బాయి బయలుదేరి వెళ్ళాము.ఓ టేబిలూ, కుర్చీ వేసికుని పోనీ, అందరికీ ఇద్దామా అనుకుంటే, ఆంధ్రసంఘం సెక్రెటరీ గారు, దానికి ప్రెసిడెంటు పెర్మిషన్ తీసికోవాలీ, ఓ అయిదు వేలదాకా తీసికోవఛ్ఛు అన్నారు.ఏదో సభ్యత్వం తీసికునేవారు ఎక్కువగా ఉంటే ఏమో కానీ, ఉత్తి పబ్లిసిటీ కి అంత డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేకపోయింది చెప్పొద్దూ!ఆ డబ్బులతో ఇంకా చాలా పుస్తకాలు కొనొచ్చు.ఇక్కడ కాకపోతే, ఇంకో మార్గం చూస్తాము.సరే, ఎలాగూ, లోపల ఈయనీయరన్నారు, సరే అని, కార్యక్రమానికి లోపలకి వచ్చేచోటే, నుంచుని, మా పాంఫ్లెట్లు పంచిపెట్టాము. పుస్తకాలు చదవడంలో ఆసక్తి ఉన్నవారు, వివరాలు అడిగారు. చూద్దాం ఎంతమందికి ఇంటరెస్ట్ ఉందో.

   ఎలాగూ ఏడున్నరయింది కదా అని, లోపలికి వెళ్ళి, డిన్నర్ కి టికెట్లు తీసికున్నాము. ఒక్కోటీ 250 /- రూపాయలు. క్రిందటేడాదికి రెట్టింపు!ఈలొపులో కార్యక్రమం జరుగుతోంది. హైదరాబాద్ నుంచి శ్రీ గంగాధర్ గారు, బృందంతో పాటలు పాడారు. వచ్చిన గొడవల్లా ఏమిటంటే, పక్కనే ఏదో పెళ్ళనుకుంటా, వాళ్ళూ పాటలు పాడడం మొదలెట్టడంతో అంతా గందరగోళం అయింది. వాళ్ళని డామినేట్ చేయడానికి వీళ్ళూ సౌండు పెంచేశారు!

   ఎలాగూ అయిదు వందలు ( ఇద్దరికి) పెట్టి టిక్కెట్లు కొన్నాము కదా, భోజనం సావకాశంగా చేద్దామూ అనుకుని, తిండి పెట్టే చోట సెటిల్ అయ్యాము. భోజనం అద్భుతం ! క్రిందటి సారి ‘తెలుగు భోజనం’ ఇంకా గొంతుకు దిగలెదేమో, ఆ జ్ఞాపకాలే గుర్తుచేసికుంటూ,కొద్దిగా అనుమానంగానే,ప్లేటు తీసికున్నాను.కందిపొడీ,గోంగూర పచ్చడి,కొత్తావకాయా, ఆవపెట్టిన పనసపొట్టుకూరా( ఏక్ దం టాప్!), వంకాయ కూర,బంగాళా దుంపల వేపుడు, బూరెలు, పులిహోర, సేమ్యా పరమాన్నం, జిలేబీ,మిరపకాయ బజ్జి,అప్పడాలు, మామిడికాయ పప్పు,వేయించిన మజ్జిగ మిరపకాయలూ, మజ్జిగ పులుసూ, చారూ, పెరుగూ !! వహ్వా వహ్వా !! ఇన్నాళ్ళకి అసలు సిసలైన తెలుగు భోజనం పెట్టారు మా వాళ్ళు!

   మరీ 250 రూపాయలు కొద్దిగా ఎక్కువే అనుకోండి, పోనిద్దురూ , ఇలాటి భోజనం మళ్ళీ మళ్ళీ వస్తుందా ఏమిటీ?కేటరర్స్ భాగ్యనగరానికి చెందిన శాస్త్రీ క్యాటరర్స్ ట!

Advertisements

6 Responses

 1. five years back nenu ugadi utsavalaki pune (in aundh) lo unnanu. aa taruvata mallee avakasam raledu.

  Like

 2. శ్రీ,

  మీరు ఏమీ మిస్ అయిపోవడంలేదు లెండి !!

  Like

 3. పూనా లో 82-84 మళ్లీ 2005-2009 వరకు AFMC లో ఉన్నాను. మా అమ్మాయి ( 83లో ) మా మనమరాలు (2008లో) పూనా కమాండ్ హాస్పిటల్ లో పుట్టారు . ఇద్దరు పూనేకర్ లే .
  Pune ఉగాది సంబరాలలో మేము ఆనందంగా ఎంజాయ్ చేసాము. మీ బ్లాగ్ విడవక చదివే అభిమానిని నేను. పూనా విశేషాలే కాకుండా మీరు వ్రాసిన టపాలన్నీ ఎంతో ఉత్సాహంగా చదువుతుంటాను.
  అనేకానేక అభివందనములు.
  మోహన్

  .

  Like

 4. మోహన్ గారు,

  ధన్యవాదాలు. మీ ఐ.డి కి ఒక మెయిల్ పంపాను. ఒకసారి చూడండి.

  Like

 5. రైళ్లలో 40 రూపాయలకి కొనుక్కొనే, అర్థాకలి కూడా కాదు–ఓ 10% ఆకలి కూడా తీరని చెత్త కంటే చాలా నయం.

  రాజమండ్రి లాంటి చోట, కాస్త బాగున్న యేసీ హోటళ్లలో, రెండు కూరలూ, రెండు పచ్చళ్లూ, సాంబారూ, మజ్జిగపులుసూ, అప్పడం, పెరుగూ, ఓ స్వీటూ ఇచ్చి 80 దాకా తీసుకొంటున్నారు.

  సీజన్ అయినా కాకపోయినా, కూరగాయలూ అవీ దొరికే చోటికే వెళ్లి, వాళ్లు చెప్పిన రేటుకే కొని, రుచిగా వండి వడ్డించేవాళ్లకి ఆ రేటు గిట్టుబాటు అయినా, కాకపోయినా, మీ అభినందన వుంది చూడండి–అదే చాలనుకుంటా.

  Like

 6. కృష్ణశ్రీ గారు,

  ధన్యవాదాలు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: