బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఆంధ్రభూమి లో నా వ్యాసం


Dilmil

ఈవేళ్టి ( 22/03/2011) ఆంధ్రభూమి దిన పత్రికలో నేను వ్రాసిన వ్యాసం ప్రచురించారు.మాకు ఇక్కడ (పూణెలో), ఈ పత్రిక దొరకదు. నెట్ లో చదివి చాలా సంతోషించాను. ప్రింటు మీడియా లో ఇది నా మొదటి రచన.</font

14 Responses

 1. Excellent andi.. this is 100% true

  Like

 2. అభినందనలు. ఇక్కడే ఆగిపోకుండా ఇంకా రాయండి. మీ వ్యాసం, చిత్రం మీ బ్లాగులో పెడితే చదివి కూసింత సంతోషిస్తాం కదా
  బాబాయ్ గారు..

  Like

 3. Congrats!!Nice Post..

  Like

 4. అభినందనలు
  పూనా లో ఈ పేపర్ రాదనే ధైర్యంతో రాసేసారన్నమాట

  Like

 5. చాలా సంతోషం. ఇంకా మరి కొన్ని దినపత్రికలు, వారపత్రికల్లో ను వ్రాయాలని కోరుకుంటున్నాను.

  టపా ఎప్పటిలాగానే చాలా బాగుంది.

  హార్దిక శుభాకాంక్షలు

  Like

 6. అత్తా ఒక్కింటి కోడలే అన్న విషయం కోడలికి తెలియదు అత్తకు గుర్తుండదు .
  అందుకనే అత్తా లేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్తా గుణవంతురాలు అని అన్నారు.
  చాల బాగా వ్రాసారు, అభినందనలు

  Like

 7. mee e-mail id ivvara please

  Like

 8. బహుశా మగవాళ్ళకి చాలా వరకు భార్యల మీద జోకులో, లేక కోడళ్ళ మీద విమర్శలో ఇష్టం లాగుంది! ఎవరి బ్లాగు చూసినా ఇవి రెండే కనిపిస్తున్నాయి.
  బాబు గారు! ఇలాటి విషయాల్లో ఏదో ఒక పక్షాన్ని నిన్దిన్చటం చాలా తేలికే కానీ, వాళ్ళ పరిస్థితులు అర్ధం చేసుకోవటం దాదాపు అసంభవమండీ!
  రెండు వేరు వేరు తరాల్లొ పుట్టి, వేరు వేరు కుటుంబాల్లో పుట్టి , వేరు వేరు పరిస్థితులలో పెరిగిన ఇద్దరు స్త్రీలు సఖ్యతతో మెల్గలేక పోతున్నారు అని అరిచి గీపెట్టే వాళ్ళు, వాళ్ళెంతవరకు పక్క మనిషితో సర్దుకు పోతున్నారో ఆలోచించరు!
  ఒక్క నాలుగు రోజులు ఇంకొక కొలీగ్తో (లేదా మీ మామగారితో!) మీ ఆఫీసు క్యూబికలో, ఇంట్లో మీ కంప్యూటరో పంచుకొండి. అప్పుడందులో సాధక బాధకాలు అర్ధమవుతాయి.
  కుటుంబానిక్కావాల్సిన తిండీ తిప్పలు చూడటం అన్నది ఆడవాళ్ళ జెనెటిక్ కోడింగ్లో వుంది. అందుకే వాళ్ళు వంటింటిని తమ టెరిటరీలా భావిస్తూ అక్కడ ఇంకొకరితో సర్దుకోలేక అవస్థపడతారు. ఈ టెరిటొరియల్ ఇంస్టిన్క్ట్ ఆడా మగా అందరికీ సహజమే! అయితే వంటిల్లు అందరికీ తెలిసే వ్యవహారం కాబట్టి ఆధిపత్య పోరు బయటపడుతుంది. అందుకని కేవలం ఆడవాళ్ళే వంటింటి కోసం కుటుంబాల్లో కలతలు రేపుతారు అన్న వాదన అర్ధరహితం. అలా స్పేస్ పంచుకోవాల్సిన పరిస్థితొస్తే మగవాళ్ళూ అలాగే ప్రవర్తిస్తారు. ఆ ఇద్దరు స్త్రీలూ దురదృష్టవశాత్తూ వాళ్ళ స్వభావాలకీ, సహజమైన ఇన్స్టింక్టులకీ వ్యతిరేకమైన పరిస్థితులలో చికుకున్నారు. దానికి తోడు సమాజంలో జరిగే ప్రతి చిన్న విషయాన్నీ గోరంతలు కొండంతలుగా చేసి మనసులు చెడగొట్టటానికి మీడియా వుండనే వుంది!

  ఇంకొక విషయం-
  ఇతరులు చేసే దానిలో తప్పులు వెతకటం చాలా చాలా తేలిక.
  మీ ఉదాహరణలో కోడలు
  -“అత్తయ్యా! ఈ వంటింటి సామ్రాజ్యానికి మీరే మహరాణీ! మీరెలా వండి పెట్టినా మేం తింటాం!” అన్నదనుకోండి, అప్పుడు మీలాటి పెద్దలే “హమ్మో! ఈ కాలం కోడళ్ళ తెలివే వేరు. వంటింటి పనంతా అత్తకంట గట్టి తాము టింగురంగా అంటూ ఆఫీసుకెళ్తారు” అంటారు.
  “మీరిన్నాళ్ళూ చేసి అలిసిపోయారు. నేనే చేసుకుంటాను, లేదా వంటకి మనిషిని పెడతాను,” అంటే ఏమంటారో మీరే రాసారు.
  మీరు చెప్పండి, ఏం చేస్తే కోడలిని విమర్షిన్చకుండా వుంటారు?
  పిల్లల్ని చూసుకొమ్మంటే, “మమ్మల్ని పని మనిషుల్లా మార్చేసింది” అంటారు. “సరే వద్దులే, బేబీ కేర్ సెంటర్ లో వేస్తాను,” అంటే, “పిల్లల్ని మా నించి దూరం చేస్తుంది” అంటారు!
  నాకెందుకో రాను రాను మన కుటుంబ వ్యవస్థ మారుతున్న కాలంలో ఆడవాళ్ళ శారీరక మానసిక శ్రమని అర్ధం చేసుకోకుండా “ఏం చేసినా తప్పే!” అనే ముళ్ళ కంచె లోకి నడిపిస్తుందేమో అనిపిస్తుంది.
  వ్యాఖ్య పెద్దదైనందుకు క్షమించండి. కానీ ఈ మధ్య ఎక్కడ చూసినా భార్యల మీదైతే జోకులు, కోడళ్ళ మీదైతే విమర్షలూ చదివి చదివీ విసుగొస్తుంది.
  శారద

  Like

 9. నేను శారదగారితో ఏకీభవిస్తున్నాను. మీ వ్యాసానికి నేను కౌంటర్ వేయాలనుకుంటున్నాను.:)) ఎలాగూ ఆ పత్రిక ఎడిటర్ ఆహ్వానించారుకదా…

  Like

 10. Dear Phani Babu garu Pl .present it in your blog. Iam unable to read it…Sreyobhilashi ..NUTAKKI.

  Like

 11. చాలా మన్డి కొడలిని విమర్సిస్తారు కాని, వాల్ల అమ్మయి కూడ ఒక ఇన్టి కొడలు అని మర్చిపొతారు. ఈ కొడల్ని విమర్సిన్చటము అనెది పెల్లయ్యక స్టర్ట్ అవుతున్డి మున్డుగా మా అమ్మయి పెల్లిలొ చీరల selection అదుర్స్, మా అమ్మయిని మిన్చిన international fashion designer ఇన్కెవరు లెరు అని.పెల్లిలొ ఫొటొలు బాగ రాకపొతె అయిపొయము. పొని బాగ వచయన్టె, అది కూడ makeup వల్లనొ,లెక మన face photogenic వల్లనొ(అన్టె నువ్వెమన్త andhagatthevu కావు, ఫొటొగ్రఫెర్ లెక, makeup,lighting mahima ani). payigaa photo thechi chooputharu vaalla ammayi entha andangaa undedho. ఇన్క పెల్లిలొ మన ఖర్మ కాని ఎవరికయినా చెయ్యి నొప్పి, కాలు నొప్పి లెద దొమ కుట్టిన కూడ కొత కొడలు వచిన వెల విసెశమ్ మీద blame చెస్తరు. ఇక పొతె కొడలు పెల్లయ్యక ఎదన్న చదివి డెగ్రీ వస్తె వాల్ల abhayi మహిమ అన్టరు.(నిజనికి abhayiki అమ్మయి చదివిన దన్లొ ఎమి తెలియక పొవచు). job వచినా వాల్ల అభయి influence వల్లనొ లెక green card వల్లనొ అన్టరు.(ఆ అమ్మయి తన credit వల్ల తెచుకున్న job ayinaa.)వాల్ల అమ్మయిని vaalla అతగరు పని చెయిస్తె అమ్మొ మా అమ్మయి రాక రాక india vasthe panicheyisthara antaru. అదెన్టొ వాల్ల abhayi, కొడలు వచినప్పుడె పని కట్టుకుని పని అమ్మయి maanesthundhi. అప్పుడు intlo pani motham, 1 year నున్చి కడగని devuni vendi సామన్లు అన్ని okkasaeri వస్తయి kodaliki. పయిగా complaints , సరిగ్గా పని చెయ్యలెదు అని.(మన ఇన్ట్లొ పని మనమ్ చెసుకొవటమ్లొ తప్పు లెదు కాని కొడలికి ఒక rule, అమ్మయికి ఒక rule endhuko..)ఇక పిల్లలు పుడితె బాగున్టె వాల్ల పొలికలు, లెకపొతె కొడలి వయిపు.కొడలు officeలొ పని చెసి, intlo pani chesi alasi pothe, andharu chesedhe kadha antaru. payigaa maa abhayi diaper change cheyyadu , maa pillaliki chinnapati nundi pani alavaatledhu ani. chaa ..memu(kodalu) chinnappati nundi 10 illallo pani chesamu.andhuke ippudu goddu chakiri chaala happy gaa chesthunnamu. మరి వాల్ల అమ్మయి work చెయ్యకున్డ intlo ఉన్న paapam తనె ఎక్కువ కస్తపడుతున్నట్లు showofflu.

  ఇల రాస్తు పొతె ee double standards మీద book raayochu .
  sorry uncle, ippudintha endhuku antara.. just venting.. anonymous ani endhuku pettanante malli antaru ma ammayayithe bayata ila cheppadhu ani. leniponi godavalu.

  asalu kodalu ante pellayyaka kotha family loki vasthundhi kadha. alantappudu aa ammayini koncham baaga choosukovachu kadha adjust ayye varaku. ento mari kontha mandhiki ila sadist laa cheyyatam ante ishtam. inkontha mandi inkaa too much. maaku aa sambandham vachindhi, ee sambhandam vachindhi ani, mari vaallane chesukokapoyara. ayinaa okasari pelli ayyaka eppudo choosina matches gurinchi endhuku. ilanti vaatike kontha madhi kodallaki impression pothundhi athala meedha.
  andharu athalu ilaga undaru kaani edho kontha mandhi athalandariki chedda peru thestharu.

  Like

 12. @అనూ,

  ధన్యవాదాలు.

  @జ్యోతీ,

  ఇప్పుడు బాగానే కనిపిస్తోందనుకుంటాను.శారద గారు వెలిబుచ్చిన అభిప్రాయానికి,స్పందిస్తూ ఈవేళ ఒక టపా పెట్టాను.

  @శిరీషా,

  ధన్యవాదాలు.

  @లలిత గారూ,

  పూణే లో వచ్చినా ఫరవాలేదు. మీ అంతరార్ధం తెలిసింది. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫో. మా కోడలికి చూపించాను!!!

  @సుబ్రహ్మణ్యంగారూ,

  మీకేమిటండీ స్వామీ, మీగురించి పేపర్లలో వ్రాస్తారు. మాలాటి అల్పజీవులు స్వంతంగా వ్రాసుకోవాలి. ఏం చేస్తాం? !!!!

  @మోహన్,

  ధన్యవాదాలు.bphanibabu@gmail.com

  @శారద గారూ,

  మీరు వ్రాసిన వ్యాఖ్యకి జవాబిద్దామని మొదలెడితే, ఒక టపా అవుతోంది. అందుకనే ఒక టపా వ్రాశాను. మాకు ఒక అమ్మాయీ, అబ్బాయీ కూడా ఉన్నారు. పైగా ఇద్దరూ ఈ ఊళ్ళోనే ఉన్నారు. నాకూ తెలుసు సాధకబాధకాలు ! టేక్ ఇట్ స్పోర్టివ్లీ !!

  @రాఘవేంద్రరావుగారూ,

  పైన బ్లూ కలర్ లో ఉన్న dilmil ని ఒకసారి నొక్కితే, వ్యాసం క్లియర్ గా కనిపిస్తుంది.

  @అజ్ఞాత కోడలా,
  మరీ నన్ను కోప్పడేయకమ్మా!! ఈ విషయం మీద అంటే, ఇద్దరి దృక్కోణం వివరిస్తూ ఇదివరలో చాలా టపాలు వ్రాశాను. ఒక్కసారి నా పాత టపాలు చదివితే, నేనెంత మంచివాడినో తెలుస్తుంది !!!!

  Like

  • meeru, aunty manchi vaare uncle kaani vere athalu andharu alaga undaru kadha.
   ayinaa maa vaalla kante inka dharunamayina vaallani choosanu lendi. vaallani choosi nenu koncham better ani feel avuthuntanu.
   telugu lipi kosam meeru emi vadatharu uncle. nenu use chese dhantlo telugu dharunagaa vasthundhi.

   Like

 13. Do you’ve got a spam drawback on this web site; I conjointly am a blogger, and I was wondering your state of affairs; we have a tendency to have created some nice practices and we tend to are trying to swap solutions with other people, please shoot me an email if interested.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s