బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-బధ్ధకం


   ఈ బధ్ధకం అనేది, రానేకూడదు కానీ,వచ్చిందా ఒక్కటంటే ఒక్కపనీ టైముకవ్వదు. మామూలుగా ప్రతీ రోజూ ప్రొద్దుటే లేవడానికి బధ్ధకం. చదువుకున్నప్పటి రోజులనుండి, ఉద్యోగం చేసినంతకాలం, అవసరార్ధం ప్రొద్దుటే లేవాలికదా, అబ్బే అదేం చిత్రమో, ఒక్కరోజుకూడా, మనస్పూర్తిగా లేచిన పాపాన్ని పోలేదు.ఎప్పుడూ బధ్ధకమే. రిటైరయిన తరువాత తెల్లారకుండా నిద్రలేచేసి, ఇంట్లో వాళ్ళ ప్రాణాలు తీయడం.అంటే అర్ధం అయిందేమిటిటా, పనీ, బధ్ధకం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నమాట.

ఈ బధ్ధకం అనేది రకరకాల సందర్భాల్లో ఉపయోగిస్తూంటారు. ఇదివరలో నేను ఒక టపా పెట్టాను. దాంట్లో సినీ నటుడు శ్రీ కొంగర జగ్గయ్య గారు ‘వెధవ’ శబ్దం గురించి వ్రాసిన వ్యాసం పెట్టాను. ఈ బధ్ధకం కూడా అలాటిదే, నా ఉద్దేశ్యం- మనం వాడే సందర్భాన్ని బట్టి అర్ధం మారుతూంటుంది. ఉదాహరణకి, పిల్లాడికి మార్కులు తక్కువొచ్చాయనుకోండి, తండ్రంటాడూ,”మామూలుగా బాగానే చదువుతాడండీ, ఇంకొంచం శ్రధ్ధగా చదవడానికి బధ్ధకం” లాగన్నమాట!

ప్రొద్దుటే లేవడానికి అలారం మరీ పెట్టుకుంటారు.పైగా గడియారం ఓ పదిహేను నిమిషాలు ఫాస్ట్ గా పెడతారు. ఆ అలారం కాస్తా పాపం మ్రోగినా, దాని నోరునొక్కేసి, పెళ్ళాం నిద్రలేపినా, ‘ఇంకో పది నిమిషాలు పడుక్కోనీయవోయ్, ఇదిగో లేచెస్తున్నా..”అనడమూ బధ్ధకంలోకే వస్తుంది.అలాగే పొద్దుటే స్కూలుకెళ్ళడానికి పిల్లల్ని లేపేడప్పుడు చూస్తూంటాము. ఏ రోజునా టైముకి లేవరు. ప్రతీ రోజూ ఓ యజ్ఞమే!

ఎప్పుడైనా కూతురు పురుటికి వస్తే, నెలలు నిండిన తరువాత,ఎప్పుడైనా డల్ గా ఉన్నట్లు కనిపించిందా, ‘ ఏమ్మా బధ్ధకంగా ఉందా? హాస్పిటల్ కి ఈవాళో రేపో వెళ్ళాలేమో’అనే మాట ప్రతీ తల్లి నోటినుండీ వింటాము.అంతదాకా ఎందుకూ, తిన్నది అరక్క, పొట్ట ఖాళీ అవకపోతే వాడే పదం ‘మల బధ్ధకం’ కూడా ఈ క్యాటిగరీ లోకే వస్తుందనుకుంటా.

ఈ రోజుల్లో పిల్లలు, ఆ బధ్ధకం శబ్దాన్ని మార్చేసి స్టైలుగా ‘బోరు’ అంటున్నారు. తెలుగులో చెప్పుకోడానికి నామోషీ!ఏ రాయైతేనేం బుర్ర పగలుకొట్టుకోడానికీ!చిన్నప్పుడు న్యూస్ పేపరు చదవడం తప్పనిసరైపోయేది. అదే ఓ అలవాటుగా మారింది. అందుకనే మన ఇళ్ళల్లో ఉండే పెద్దవారు, స్కూళ్ళకీ, కాలేజీలకీ వెళ్ళి డిగ్రీలు సంపాదించకపోయినా, న్యూస్ పేపరు చదివే, వారి లోక జ్ఞానం ఇంప్రూవ్ చేసికున్నారు.అందుకే వారికున్న general knowledge ముందర మనం పనికి రాము.ఇప్పుడో, న్యూస్ పేపరు చదవడానికి టైమే ఉండడం లేదూ, ఈ టి.వీ. ల ధర్మమా అని.పైగా, కంప్యూటరు లో ఓ నొక్కు నొక్కగానే, మనకి కావలిసిన సమాచారం వచ్చేస్తోందాయే! మరి బధ్ధకం పెరిగిపోతుందంటే పెరగదు మరీ?

పిల్లాడిని అన్నం తినరా అంటే బధ్ధకం.ఈ బధ్ధకం అనేది ఓ national obsession అయిపోయింది. మన ఆటగాళ్ళని, ప్రతీ రోజూ ప్రాక్టీసు చేయండిరా బాబూ, అని ఆ కోచ్ లు మొత్తుకున్నా సరే, ఛస్తే వెళ్ళరు.ఈ వేళ చేయవలసిన పని రేపటికి వాయిదా వేస్తున్నామంటే, ఈ ‘బధ్ధకం భూతం’ మనల్ని ఆవహించేసిందన్నమాటే.భగవంతుడు కూడా బాగుచేయలేడు మనల్ని.ఏదో అదృష్టం కొద్దీ, ఈ బధ్ధకం అనేది లేనిది ఆ ఒక్క ‘అమ్మ’ కే! ఆవిడకి సరాదాకైనా, బధ్ధకం వేసిందా, ఇంట్లోవాళ్ళ పని గోవిందాయే !

మా మనవడున్నాడే చి.అగస్థ్య- వాడికి నడకొచ్చింది. అయినా సరే పిలవగానే, నడవకుండా పాకుతూ వచ్చేస్తాడు! ఏదోలా పనైపోతూందిలే, ఇలా అయితే శ్రమ పడఖ్ఖర్లేదూ అని! మరి ఇదికూడా ‘బధ్ధకం’ లోకే వస్తుంది. ఇదివరకటికి వాడెవడో, ‘ నీ నెత్తిమీద బూజుందిరా’ అంటే, ‘ఆ చేత్తో నువ్వే తీసేయకూడదూ?’ అన్నాట్ట!ఇది అల్టిమేట్ బధ్ధకం లోకి వస్తుంది !

9 Responses

 1. కామెంటు రాయడానికి బధ్ధకంగా ఉందండీ :))

  Like

 2. అబ్బ ఎంత బద్దకంగా ఉందండి…బద్దకాన్ని ఎంజాయ్ చెయ్యటం కూడా రావాలండోయ్

  Like

 3. డిటో

  (నాకు వీకెండ్ పొలిటీషియన్ గారికన్నా బద్ధకం అన్నమాట 🙂 )

  Like

 4. బద్ధకం మీద బద్ధకం లేకుండారాసి నా బద్ధకం వదలగొట్టినందుకు మీకు
  ధన్యాలు! అర్ధమవలేదా ధన్యావాదాలని పూర్తిగా రాయడానికి బద్ధకమేసి
  అలా వ్రా.

  Like

 5. అయ్యా ఇన్నాళ్ళకు తెలిసింది బోర్ అంటే బద్ధకం అని. నా కెందుకో ఏమీ పని చెయ్యకుండా ఏదో ఆలోచిస్తూ ఫోజు కొడుతూ కూర్చోటం అలవాటు. మా ఆవిడ బద్ధకం అంటుంది. నేను “Intellectual thought process” అంటాను. మీరేమంటారు. ఒకమాట, మా ఆవిడ బ్లాగులు చూడదు కామెంటు వెయ్యదు..

  Like

 6. ఏమిటో ఈ మధ్య మీ బ్లాగ్ చదవాలంటే బద్దకం వేస్తుంది 😛

  Like

 7. Ha ha… Bore ante baddhakam. Bhale khachhitam gaa chepparu guruvu gaaroo….

  Chandu

  Like

 8. >>ఈ బధ్ధకం అనేది ఓ national obsession అయిపోయింది.
  నిజం గా నిజం.
  పైన కామెంటిన అందరికీ బద్దకం అంటున్నారు. మరి మీకు టపా వ్రాయడానికి బద్ధకం ఉండదా అధ్యక్షా .

  Like

 9. @వీకెండ్ పొలిటీషియన్,

  తప్పు నాదే! ఈ బధ్ధకం గురించి చేయడం !!

  @ప్రవీణా,
  నిజమే !

  @శంకర్,

  అర్ధం అయింది !!

  @గురువుగారూ,

  ధన్యవాదాలు !

  @రావుగారూ,
  అదృష్టవంతులు. మా ఇంటావిడ ఏం చేయబోయిందో ఈవేళ ఓ టపా వ్రాశాను!

  @పానీపురీ,

  అనండి అనండి అందరూ నన్నే అనండి. ఎరక్కపోయి గుర్తుచేశాను !!

  @చందూ,

  నాకు తోచిన అర్ధం అలా అనిపించింది.

  @సుబ్రహ్మణ్యం గారూ,

  అప్పుడప్పుడు బధ్ధకం వేస్తూంటుందనుకోండి !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: