బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- తల్లితండ్రులూ జాగ్రత్త !

   ఈవేళ ప్రొద్దుట, పేపర్లో పైన ఇచ్చిన వార్త చదవగానే, మనసంతా ఏదోలా అయిపోయింది. ఈ రోజుల్లో పిల్లల్ని స్కూలుకి మూడో ఏటినుంచే పంపుతున్నాము. ఏదో ఇంటికే బస్సొస్తుందీ, మన ఫ్లాట్ దగ్గరే కుర్చోబెడతామూ, పైగా వీళ్ళని జాగ్రత్తగా స్కూలు దగ్గర దింపడానికి, ఆ బస్సులో ఇద్దరు ఎటెండెంట్లు కూడా ఉన్నారనే, భరోసాతో, చిన్న పిల్లల్ని ఆ బస్సులో కూర్చోబెడతాము. తల్లితండ్రుల కుండే శ్రధ్ధ ఆ బస్సు యజమానికుండదుగా. బస్సు తలుపుల లాక్కులు సరీగ్గా ఉన్నాయో లేదో నెలకోసారైనా చెక్ చేసికునుంటే, ఇలాటి దుర్ఘటన జరిగేది కాదేమో? డబ్బులు సంపాదిద్దామనే యావ తప్పించి, బస్సుకి మైంటెనెన్స్ చేయించాలనే జ్ఞానం ఉండదు. ఓసారి ఓ ‘సారీ’ చెప్పేసి, వాడు చేతులు దులిపేసికుంటాడు.నష్టపోయెది మనమే కదా. పొనీ బస్సు ఆగేదాకా తలుపు దగ్గర నుంచోకమ్మా అని చెప్పినా, వినే వయస్సు కాదు ఆ పసి పిల్లలది.వాళ్ళ ఉత్సాహం వాళ్ళది. ఈ దుర్ఘటన లో డ్రైవరునీ, ఆ ఎటెండెంట్లనీ అరెస్ట్ చేశారు. మహ అయితే వాళ్ళకి ఓ వార్నింగిచ్చి వదిలేస్తారు.జైల్లో కూర్చొబెడతారు. మన దేశంలో చట్టాలు కూడా అంతంత మాత్రమే.

   ఆటోల్లో పిల్లల్ని ఎలా కుక్కి స్కూళ్ళకి తీసికెళ్తూంటారో మనం రోజూ చూస్తూనే ఉన్నాము.అక్కడికి ఏదో బస్సుల్లో అయితే ఇంకా సేఫ్ అనుకుని, డబ్బులు ఎక్కువైనా, బస్సులో పంపితే ఇదిగో ఇలాగ.బస్సు డ్రైవరు కూడా ఏదో సరదాకి సడెన్ బ్రేక్ వేసుంటాడని ఎలా అనుకుంటాము?పోనీ వాడేనా, తను నడిపే బస్సు ఎలా ఉందీ అని చూసుకున్నా ఈ దుర్ఘటన జరిగేది కాదు. అంత చిన్న పిల్లాడి ఇంపాక్ట్ కే బస్సు తలుపు తెరిచేసికుందంటే, దాని కండిషన్ఎలా ఉందో తెలుస్తోంది.

   అందువలన చెప్పెదేమిటంటే, అమ్మల్లారా, నాన్నల్లారా, ఏదో పిల్లాడిని బస్సెక్కించేస్తే, మీ బాధ్యత తీరిపోయిందనుకోకండి. అప్పుడప్పుడు, ఆ బస్సు డ్రైవరుని అడుగుతూండండి.అలాగే, మీ పసిపిల్లల్ని, మరీ ఫ్రంట్ సీటులోనే కూర్చోబెట్టుకోనఖ్ఖర్లేదు. హాయిగా ఛైల్డ్ లాక్ పెట్టేసి, వెనక్కాలే ఉండనీయండి. కారుందికదా అని ఊళ్ళోవాళ్ళందరికీ, ఫ్రంట్ సీట్ లో కూర్చోబెట్టి మీ పిల్లల్ని చూపించుకోనఖ్ఖర్లేదు. తరువాత ఏమైనా జరిగినా, ప్రతీవాడూ సానుభూతి చూపించడం తప్ప ఇంకేమీ చేయలేడు. మన పిల్లల్ని మనమే చూసుకోవాలి, ఇలా చెప్తున్నారుకదా అని కోపగించుకోకండి.ఎవరి పిల్లలైనా ఇలాటి దుర్ఘటనలు జరిగినప్పుడు చాలా బాధేస్తుంది.
ప్రతీ రోజూ ‘మా’ టి.వీ. లో శ్రీ చాగంటి వారు, అర్ధనారీశ్వర స్తోత్రం గురించి ప్రవచనం చెప్తున్నారు. ఈవేళ తాతా- మనవళ్ళ అనుబంధాన్ని గూర్చి, అద్భుతంగా చెప్పారు.ఈ తాతయ్య/ చదివేవారందరికీ బాబయ్య, బాధల్లా ఏమిటంటే, మీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా సరే, మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ప్లీజ్ ప్లీజ్… వింటారు కదూ ?

%d bloggers like this: