బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- కిరికిట్ట్ పిచ్చి..


   ఈరోజుల్లో ఎక్కడ చూసినా ప్రపంచ కప్ క్రికెట్టు గురించే! మనకు నచ్చినా నచ్చకపోయినా సరే, మన దేశ టీం పక్షమే మాట్లాడాలి. ఆడిన ప్రతీసారీ మనమే నెగ్గాలనేమీ లేదుకదా!అవతలివాళ్ళు కూడా, ఏదో ఆడుతారు కాబట్టే,అంతమంది జనం, అంత గోలానూ ! ఇదివరకటి రోజుల్లో నేనూ క్రికెట్ ఆడేవాడినే, అంతే కాదు,క్రికెట్ మాచీలు కూడా రేడియో కామెంటరీలు వినేవాడిని. కానీ ఇప్పటిలాగ అంత పిచ్చేమీ ఉండేది కాదు.ఈ రొజుల్లో చాలా మందిని చూశాను, గుడికెళ్ళి పూజలూ, ఇంట్లో ఉపవాసాలూనూ!

   ఖర్మకాలి మనవాళ్ళు ఓడిపోయారా ఇంక, ఆరోజు ఇంట్లో ఎవరో పోయినట్లు మోర్నింగులూ, శ్మశాన వాతావరణాలూనూ!ఒకళ్ళమొహం లోనూ కళ అనేదుండదు.అంత ఫెనాటిజం అవసరం అంటారా? ఇదివరకటి రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్ మాచ్చిలు ఏడాదికి ఏదో ఒక ప్రత్యేకమైన సీజన్లో ఉండేవి. ఇప్పుడో, ఎక్కడచూసినా, టెస్టులూ, ఓ.డి.ఐ లూ, వాటికి సాయం టి-20 లూ!ఇవేమీ సరిపోవన్నట్లు అదేదో ఐ.పి.ఎల్. ట ! ఆడే ప్రతీవాడూ రెండేసి, మూడేసి వందల మాచ్చీలు ఆడేడంటే ఆడడూ మరి.అదేదో పేద్ద ఘనకార్యం చేసేసినట్లు.

   ఇదివరకటి రోజుల్లో ఎప్పుడైనా మన దేశం జట్టు నెగ్గితే , ప్రెసిడెంటు, ప్రధానమంత్రి ల దగ్గరనుండి శుభాకాంక్షలూ, పార్లమెంటు లో ఓ చర్చా వగైరాలుండేవి! అదృష్టం కొద్దీ ఆ గోలోటి తప్పింది.ఇంకో విషయమేమంటే, ఈ డే నైట్ మాచ్చిలు వచ్చిన తరువాత, అర్ధరాత్రి దాటేవరకూ జరుగుతున్నాయి. ఇంక అప్పుడు మనవాళ్ళు నెగ్గితే, అర్ధరాత్రీ అపరాత్రీ చూసుకోకుండా, టపాకాయలూ, బాణ సంచాలూనూ! ఓ రాత్రివేళ అంతంత చప్పుళ్ళు చేసి, పసిపిల్లల్నీ, అనారోగ్యంతో బాధపడే వారినీ అలా హింసించడం ఏమైనా బాగుందా? పోనీ ఎవరైనా ధైర్యం చేద్దామంటే, ‘దేశద్రోహులు’ క్రింద జమ కట్టేస్తారు.

   క్రీడలంటే ఉత్సాహం ఉండాలి, కాదనం, కానీ మరీ ఇంత వేలం వెర్రా? ఆటగాళ్ళు కూడా, ఐ.పి.ఎల్ లో ఆడడానికి ఏమీ బాధ పడరు. ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు మాత్రం, ‘మాకు రెస్ట్ అనేదే ఉండడం లేదూ, అందుకనే ఫెటీగ్ తో ఓడిపోయామంటారు‘. మరి ఆ ఐ.పి.ఎల్ లూ అవీ ఎవరాడమన్నారుట? అక్కడ వీళ్ళకి మూటలకి మూటలొస్తాయి. అదీ విశేషం! పోనీ మన దేశమంతా, ఏదో క్రీడాభిమానులా అంటే అదీ లేదు. ఇంకో ఏ ఆటైనా సరే, ఓ ఫుట్ బాల్ అనండి, ఓ హాకీ, ఓ బిలియర్డ్స్, ఓ బ్యాడ్మింటన్ ఇంత ఉత్సాహం చూపుతారా?

   ఎలా ఉందంటే, క్రికెట్ గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడడం ఓ సాక్రిలేజ్ గా చూస్తున్నారు. ఎవరింటికైనా వెళ్దామంటే, ఏ మాచ్చీ లేనిరోజు వెళ్ళాల్సొస్తోంది.లేకపోతే ఆ వచ్చినవాళ్ళని తిట్టుకుంటారు. ఇంక ఈ మాచ్చీలు జరుగుతున్నంతకాలం, వాటిమీద బెట్టింగులూ వగైరా.. ఆటగాళ్ళే అమ్ముడుపోయిన తరువాత వీళ్ళందరినీ అని లాభం ఏమిటిలెండి? వాడెవడో మోడీ, ఐ.పి.ఎల్ ప్రారంభించినప్పుడు, ఇంద్రుడూ,చంద్రుడూ అని పొగిడేశారు. ఇప్పుడో ఇల్లూ వాకిలీ వదిలేసి దేశాలు పట్టి తిరుగుతున్నాడు.మా శరద్ పవార్ గారు చూడండి, ఉల్లిపాయ ఖరిదెలా ఉన్నా పరవాలేదు, ఐ.సీ.సీ అద్యక్ష పదవి మాత్రం మర్చిపోలెదు.ఇంక ఆయన కూతురు,ఐ.పి.ఎల్ వ్యవహారంలో, అబ్బే నాకేమీ తెలియదే అంది. చివరకి ఆవిడగారి భర్తా, మామగారూ వీధిన పడ్డారు.తరూరో ఎవడో, అతనికెందుకండీ, ఈ క్రికెట్టులూ సింగినాదాలూనూ?
పోనీ ఆ ఆడేదేనా సరీగ్గా ఆడతారా అంటే అదీ లేదూ. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోడం, గుర్రుమనడాలూ!

   ఈ హింసనుంచి విముక్తెప్పుడో ఆ భగవంతుడిక్కూడా తెలియదు.ఇదివరకటి రోజుల్లో ఇంట్లో ఆడవారు, ఈ క్రికెట్ ఎడిక్ట్స్ కాదు,ఇప్పుడు ప్రతీవారూ మాట్లాడేవారే!చివరకి ఇంట్లో ఉండే వయోవృధ్ధులు కూడా, ఈ వరదలో పడి కొట్టుకుపోతున్నారు.
పోనీ ఇందులో వీళ్ళందరికీ ఒరిగేదేమైనా ఉందా అంటే అదీ లేదు. మొన్న పేపర్లో చదివాను- హైదరాబాద్ నుండి ఓ అరడజను బడుధ్ధాయిలు, నాగపూర్ వెళ్ళి, 50,000 రుపాయల తిరుక్షవరం చేయించుకొచ్చారుట.They fully deserved it ! ఏదైనా అనుభవం మీదే కదా తెలిసేది.

6 Responses

 1. ఏమిటో ఈ వేళ, మాస్టారు బెత్తం పట్టుకున్నారు మా అందరి మీదాను. :))

  Like

 2. >104,591 hits
  congrats…

  Like

 3. They fully deserved it !!

  I donno the story but all I can say is “they deserve it”.

  Like

 4. @సుబ్రహ్మణ్యం గారూ,
  ఈసారి తణుకు వెళ్ళేటప్పుడు ఫోను చేస్తాను. మీ నెంబరిస్తారా?దారిలో ఏలూరు లో కలుద్దాం.

  @పానీ పురి,

  థాంక్స్.మీ అందరి చలవానూ ఇది !

  @ఇండియన్ మినర్వా,

  నేను ఏ పేపరులో చదివానో ఆ లింకు ఇస్తాను, ఓ రెండు రోజుల్లో.

  Like

 5. చాలా బాగా చెప్పారు.
  నిన్నటి మ్యాచ్ కి మా ఆఫీస్ కేంటిన్ ని స్టేడియం చేసేసి హో.. హూ.. హా.. ఓ.. అంటూ అరుపులు పెడబొబ్బలూ.
  ఆన్ లైన్లో స్కోర్ చూడటానికి అందరూ ఒకేసారి ఆ వెబ్సైట్స్ ఓపెన్ చేయటంవల్ల నెట్వర్క్ కూడా డౌన్ అయ్యింది.
  ఇదేం రోగమో తెలియదు. మనం చూస్తున్నట్టుగా మిగతా దేశాలవాళ్ళు ఇంతలా చూస్తారో లేదో నాకు డౌటొచ్చింది.
  పనిలేకుండా ఖాళీగా టైమ్ పాస్ చెయ్యటంలో మనకు మనమే సాటి అనుకుంటాను.
  ఈ క్రికెట్ గురించి మాట్లాడుకునే వాళ్ళలో తొంభైశాతం మందికి అసలు ఏంటో తెలియదు. పొద్దున్నే పేపర్ చదువుకుని వచ్చేసి అందులోవున్న హైలెట్ పాయింట్స్ మాట్లాడేవారూ వున్నారు. అంత ఖర్మెందుకో తెలియదు.

  ఏదిఏమైనా మంచి బిజినెస్ అవుతుంది. మా ఇంటిదగ్గర్లోవున్న బార్ అండ్ రెస్టారెంటు వాడు పెద్ద స్క్రీన్ పై క్రికెట్ వేసి వాయించేస్తున్నాడు. మ్యాచ్ గెలిచాకా టపాసులుకూడా సప్లై చేసి డబ్బులు దండుకుంటున్నాడనుకుంట. ఏరోజు చూసినా పండగవాతవరణమే.

  Like

 6. శ్రీనివాసా,

  “ఈ క్రికెట్ గురించి మాట్లాడుకునే వాళ్ళలో తొంభైశాతం మందికి అసలు ఏంటో తెలియదు. పొద్దున్నే పేపర్ చదువుకుని వచ్చేసి అందులోవున్న హైలెట్ పాయింట్స్ మాట్లాడేవారూ వున్నారు”– నూటికి నూరు పాళ్ళూ నిజం !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: