బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–షార్టు కట్లు !!


   అసలు మనం ఈ షార్ట్ కట్లనేవి చిన్నప్పుడే నేర్చేసికుంటాము. పెద్ద అయేకొద్దీ, ఏదో వాటిని రిఫైన్ చేయడం తప్ప ఏమీ కొత్తగా నేర్చుకునేదేమీ లేదు. చిన్నప్పుడు క్లాసుల్లో పాఠాలు శ్రధ్ధగా వినని వారు, ఆరోజుల్లో గైడ్లని వచ్చేవి. వాటిల్లో మళ్ళీ వడబోసి imp అని కొన్నుండేవి. మళ్ళీ వాటిని వడబోసి ఇంట్లో ఉండే ఏ చిన్న పిల్లాడిచేత్తోనో చీటీలు తీయించడం.లేదా పుస్తకాన్ని పైకి గాలిలోకి ఎగరేసి,ఏ పేజీ వస్తే ఆ పేజీలో ప్రశ్నలు/జవాబులు చదవడం. మన అదృష్టం బావుందా, అలా చేసింతరువాత హీనపక్షం ఓ అరడజను ప్రశ్నలొచ్చినా సెప్టెంబరుకి వెళ్ళే అవసరం ఉండేది కాదు!

   ఈరోజుల్లో చూస్తూంటాము రోడ్డు మీద టూ వీలర్లు డ్రైవు చేసే చాలా మంది, ఛస్తే ట్రాఫిక్ రూల్స్ పాటించరు. ఎక్కడ ఛాన్సు దొరికితే అక్కడే షార్టు కట్లు! ఫుట్పాత్ మీద జుయ్యిమంటూ లాగించేయడమే. అక్కడ నడిచే నాలాటి అర్భకులు, ఏ గంగలో దిగితేనెమిటి? ఒక్కొక్కప్పుడు బస్సులోంచి దిగేటప్పుడు చూస్తూంటాము, బస్సుకి అదీ ఏ స్టాప్ లోనైనా ఆగినప్పుడు, ఎడంవైపునుండి ఏ వెహికిలూ రాకూడదు. అయినా సరే ఈ షార్టు కట్టు దరిద్రులు, అక్కడినుంచే వెళ్తారు. మనం చూసుకోకపోయామా గోవిందా!

   ఈవేళ సాయంత్రం నేనూ, మా ఇంటావిడా వాక్ కి వెళ్తూంటే చూశాము-ఫుట్ పాత్ ప్రక్కనే ఓ ఇంట్లోంచి,ఒకావిడ వచ్చి చేతిలో ఉన్న చెత్త బుట్టని, ఎదురుగా ఉండే డ్రైన్ లో ఖాళీ చేసేసింది.మరి వర్షాకాలంలో ఈ డ్రైన్లన్నీ ఛోక్ అయ్యేయంటే అవవూ మరి.రాజమండ్రీలో చూసేవాడిని, అక్కడ చాలా చోట్ల ఓపెన్ డ్రైన్లే చూసేవాడిని. పాపం మునిసిపాలిటీ వాళ్ళు ప్రతీ వీధికీ పెద్ద పెద్ద చెత్తకుండీలు పెట్టినా సరే, అవి కొద్దిగా దూరంగా ఉండడంతో, దగ్గరలో ఉండే ఓపెన్ డ్రైన్ లోనే వేసేవారు. ఇలాటివాళ్ళని భగవంతుడు కూడా బాగుచేయలేడు.

   అలాగే మనం ఈ రోజుల్లో చూస్తున్న ఎపార్ట్మెంట్లలో, ఏ అరటి పండైనా తిన్నాక, ఆ తొక్కని ఇంట్లో ఉండే డస్ట్ బిన్ లో వేయొచ్చుకదా, అబ్బే అలా చేస్తే మన ఘనతేముందీ? బాల్కనీ లోకి వెళ్ళి, కిందకు విసిరేయడం. రోడ్డు మీదెళ్ళేవాడెవడి నెత్తిమీదో పడుతుంది. వీడిదేం పోయిందీ? వీళ్ళనే అనఖ్ఖర్లేదు, కారుల్లో వెళ్ళే ఘనుల్నీ చూస్తూంటాము, ఆ విండో లోంచి, ఏ గుట్కా ఖాళీ పోచ్చో పడేస్తూంటారు. ఏమైనా అంటే ఓనరు కాదూ, ఛాఫర్ అలా చేస్తాడూ అనే అంటారు చాలా మంది.

   రైల్వే స్టేషన్లలో అయితే, చూస్తూంటాము, చాలామంది పట్టాలు దాటే వెళ్తూ.ఏ ట్రైను చక్రాలకిందో పడడం ప్రాణాలు పోగొట్టుకోవడం. హాయిగా ఓవర్ బ్రిడ్జి మీదనుంచి వెళ్ళొచ్చుకదా. అలాగే, లెవెల్ క్రాసింగులదగ్గరా అంతే, గేటు వేసున్నా సరే, దానికిందనుంచి దూరి వెళ్ళడం. ఒక్కోప్పుడు బైక్కులూ, స్కూటర్లూ కూడా దాటిస్తూంటారు.ఇంక దగ్గరగా ఉంది కదా అని ఒన్ వే లోంచికూడా దూసుకుంటూ వెళ్ళడం ఎప్పుడూ చూసే దృశ్యమే! కార్ పార్కింగు గురించైతే అడగఖ్ఖర్లేదు. అవతలివాడు కారు ఎలా తీసికుంటాడో అని ఆలోచించకుండా, తనిష్టం వచ్చినట్లు పార్కింగు చేయడం.

   ఈ షార్ట్ కట్ సిండ్రోమ్ నుండి ఎప్పుడు బయట పడతామో?

Advertisements

2 Responses

  1. పోస్టు బావుంది. షార్ట్ కట్స్ ని , సివిక్ సెన్స్ ని కలిపి ఉతికి ఆరేశారు. పదాల్ని కుదిన్చేసి ముక్కలుగా చేసి అక్షరాలు మింగేసే SMS షార్ట్ కట్స్ (hw r u, whr r u లాగ) గురించి కూడా కలిపి రాసేయాల్సింది.

    Like

  2. శంకర్,

    అర్రే అసలు ఈ ఎస్.ఎం.ఎస్ ల గురించే మర్చిపోయానే! పోన్లెండి అప్పుడే ఎక్కడయిందీ?ఈసారి టపాలో పెడతాను. గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: