బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


epaper-sakshi-com (13)epaper-sakshi-com (14)

   శ్రీ ముళ్ళపూడి వారు అస్తమించిన వార్త విన్న తరువాత,అసలు కంప్యూటరు ముందు కూర్చుని వ్రాయాలనే అనిపించడం లేదు. కానీ ఎన్నాళ్ళు? Life must go on… ఈ నాలుగైదు రోజులూ, మా దగ్గర ఉన్న ‘రచన’ పాత సంచికలన్నీ తీసి, అప్పుడెప్పుడో బాపు-రమణ ల గురించి వేసిన ప్రత్యేక సంచికతో సహా అన్నీ చదివాము. అలాగే ఆయన వ్రాసిన రచనలన్నీ మళ్ళీ మళ్ళీ చదివేసి, ఇప్పుడిప్పుడే కొద్దిగా తేరుకుంటున్నాము. బాపూ గారికి గానీ, శ్రీమతి శ్రీదేవి గారికి గానీ, ఫొను చేసే ధైర్యం కలగడం లేదు. ఏ చుట్టరికం లేని మనకే ఇలా ఉంటే, అరవై ఏళ్లపైన ఉన్న తన సహచరుడి గురించి శ్రి బాపు గారు ఎలా ఉన్నారో ఉహించుకుంటూంటేనే భయం వేస్తోంది.యూట్యూబ్ లో వచ్చిన ప్రతీ వీడియో చూసాను. నాకైతే అన్నిటిలొకీ నచ్చిన ట్రిబ్యూట్ ఆదివారం ‘సాక్షి’ లో ఇచ్చిందే అనిపించింది.

   ప్రస్థుత పరిస్థితుల్లో ఆంధ్రదేశం లో పిల్లల పరీక్షల గురించి ఊహిస్తూంటేనే భయం వేస్తోంది. దానికి సాయం ఈ క్రికెట్టోటీ! అదేం ఖర్మమో కానీ, ఈ World Cup కూడా ఇప్పుడే రావాలా? నిన్నటి match, అసలు చూడకూడదనే అనుకున్నాను. కానీ చూడకుండా, దానిగురించి ఎక్కడో చదివి వ్రాయడం బాగుండదు. రేడియోల్లో కామెంట్రీలు వచ్చే రోజులనుండి ఫాలో అయేవాడిని. కానీ అదేమిటో, మన రవి శాస్త్రి కామెంటరీ ఇచ్చినప్పుడు, ఎక్కడలేని చిరాకూ వచ్చేస్తుంది.ఆ అరుణ్ లాల్ అనే వాడొక్కడూ. very very limited vocabulary! ఇంతకంటే మంచివాళ్ళే దొరకరా వీళ్ళకి. ఇంకో విషయమేమంటే,మన దేశంలో ఇంకోళ్లెవరిని సపోర్ట్ చేసినా, మనల్ని ‘ దేశద్రోహులు’ కింద కట్టేస్తారు. అవతలి వాళ్ళలోనూ బాగా ఆడేవాళ్ళున్నారు కదా! వాళ్ళెవరైనా బాగా ఆడితే just by chance, అదే మనవాళ్ళైతే class ! జనాలకి పిచ్చెక్కిపోతోంది, అసలు ఆ స్టేడియం లో వాళ్ళకి ఏం కనిపిస్తుందిట? అక్కడ Giant Screen లో చూసేదేదో హాయిగా ఇంట్లోనే కూర్చుని చూసుకోవచ్చుగా! Yesterdy’s result was very apt.

Advertisements

6 Responses

 1. బాగా చెప్పారు. క్రికెట్ ఒక రకంగా అలవాటు కాలేదని నేను సంతోషించని రోజు లేదు

  Like

 2. ఈనాడు లొ బుడుగుపేరుతొ వ్రాసిన “నాన్నోయ్” అన్న కధనం
  చదివారా? నా బ్లాగులో వుంచాను. ఆంధ్రజ్యోతి సంపాదకీయం
  వ్రాసారు. నాన్నోయ్ నా బ్లాగులో వుంచాను.చూశారనుకుంటాను.
  నాల్గో తేదీన మద్రాసు వెళుతున్నాను. మా అమ్మాయి బాపుగారు
  తట్టుకోలేకపోతున్నరని ఫోను చేసింది. అక్కడి పరిస్ఠితి బట్టి కలుస్తాను.

  Like

 3. అందరూ బాపూ గారి గురించి దిగులు పడుతున్నారు. ఒక ఆత్మీయుడు, స్నేహితుడు నిష్క్రమించినప్పుడు, బాధ సహజం. తన ప్రియ మిత్రుని వియోగ బాధ నుండి అతి త్వరలో బయటపడి, తన పని తాను కొనసాగించగలిగే మనస్థైర్యం బాపు గారికి ఉన్నదని నా నమ్మకం.

  Like

 4. Belated anniversary wishes to both of you. Feb 28th was your anniv,right?

  Like

 5. @రహ్మానుద్దీన్,

  మన దేశం లో ఏ కొద్దిమందో మాత్రం చేసికున్న అదృష్టం ఇది!

  @శివ గారూ,

  బెంగళూరు లో ఉంటూ కూడా, మీరు వెళ్ళలేదంటే నిజంగా హాట్సాఫ్ !

  @గురువుగారూ,

  మీరు తిరిగి వచ్చిన తరువాత తెలియచేయండి.

  @ఋషీ,

  గుర్తుంచుకుని శుభాకాంక్షలు తెలియచేసినందుకు మా ఇద్దరి తరఫునా ధన్యవాదాలు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: