బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–What Tatayyaa, you have to grow up…


   మా చిన్నప్పుడు స్కూల్లో, మరీ పెద్ద క్లాసుల్లో కాదనుకోండి, Moral Instruction (MI ) అని ఒకటుండేది. టైంటేబిల్ లో ఏదో వారాంతం లో రెండేసి పిరియడ్లుండేది. దానికి క్లాసు టీచరని ఒకాయనుండేవారే, ఆయన వచ్చి చెప్పేవారు.మాస్టారి సిలబస్ పూర్తవకపోతే ఆ పాఠాలు చెప్పేవారు. లేదా ఏదో పురాణేతిహాసాల్లోంచి నీతికథలనేవి చెప్పేవారు. ఒక్కొక్కప్పుడు, భారతీయ చరిత్రలోంచి కథలు చెప్పేవారు. రాత్రిళ్ళు పడుక్కునేముందర, అమ్మో,అమ్మమ్మో,తాతయ్యో ఎవరో ఒకరు ఎదో ఒక నీతికథచెప్పే నిద్రబుచ్చేవారు.ఆ చెప్పేవారికీ, కావలిసినన్ని టాపిక్కులు దొరికేవి.
పెద్ద కారణమంటూ ఏమీ లేదు,ఆ రోజుల్లో చాలామంది నీతికీ, నిజాయితీకీ ప్రాణం ఇచ్చేవారు. దానితోపాటే వారిగురించి కథలూ కమామీషులూ ఉండేవి, మనకీ కాలక్షేపం అయ్యేది.ఇప్పుడు, కరిక్యులం లో ఆ Moral Instruction (MI ) అనేదే లేదనుకుంటాను.చెప్పుకోడానికీ మరీ అన్నన్ని కథలెక్కడున్నాయి? ఎవడిని చూసినా ఏదో ఒక స్కామ్మో, లంచమో, లేక ఇంకోటేదో. ఇంక ఎవరిగురించి నేర్చుకుంటారు పిల్లలు? పైగా ‘నీతికథలు’ చెప్పడం ప్రారంభిస్తే నవ్వొచ్చుకూడానూ! What Tatayyaa, you have to grow up..అన్నా అనొచ్చు!

   ఆరోజుల్లో Freedom movement గురించి చెప్పి, స్వాతంత్రం సంపాదించడంలో ఎందరెందరు ఎన్నెన్ని త్యాగాలు చేశారో, కుటుంబం కంటే దేశమే ముఖ్యమని అనుకునేవారో, వగైరాలగురించి చెప్తే, కన్నార్పకుండా వినేవారు.ఇప్పుడు చెప్పుకోవాలంటే, అలాటి శాల్తీయే కనిపించదు, పీడా వదిలింది!ఎవడిని చూసినా, ఎక్కడెక్కడ ధర్నాలు చేయాలో, ఏ రోజు ఏ పార్టీలో చేరితే డబ్బులూ,పదవీ వస్తుందో,అయిదేళ్ళలో ఎంతంత నొక్కేయొచ్చో, ఇవే కదా కబుర్లు.కొవ్వొత్తి పెట్టి దేశమంతా వెదికినా, ఒక్కడంటే ఒక్కడు, నీతీ నిజాయితీ ఉన్న రాజకీయ నాయకుణ్ణొక్కడిని చూపించండి. వాడి బాబు నాయకుడవగానే, వాడి కొడుకూ మొదలెడతాడు. నాకొక్కటి అర్ధం అవదు, అసలు ఈ రాజకీయనాయకులని ఏమనాలో తెలియదు.వీళ్ళు ఛస్తే, వీడి పెళ్ళామో, కొడుకో,కూతురో తగులుకుంటారు మనల్ని.ఈ దౌర్భాగ్యులనుండి మాత్రం ముక్తీ మోక్షం లేదు మనకి.

   ఏదో పెళ్ళాం, పిల్లలూ దాయాదులూ లేరూ బావుందీ, అనుకున్నంతసేపు పట్టలేదు, ఆ అబుల్ కలాం గారిని ఇంటికి పంపించేశారు. ఏదో పెంపుడుకూతురి మొగుడు ఎదొ ఒకటీ అరా అప్పుడప్పుడు కక్కూర్తిపడ్డా, ఆ వాజపేయే నయం!మన్మోహన్ సింగు గారు, పాపం ఉద్దేశ్యాలు మంచివే, అప్పుడు 92 లో చూళ్ళేదూ,Economic Reforms ఆయన ధర్మమే మరి, పేరంటే మన పెద్దాయన పట్టికెళ్ళిపొయాడు కానీ. ఏ రాష్ట్రం తీసికోండి, ఏ రాజకీయ నాయకుణ్ణి తీసికోండి,సిగ్గూ శరమూ వదిలెసిన వాళ్ళే! ఇక్కడికి రాజకీయనాయకులయ్యారా, ఇంక మన అసలు’ పాలకుల’ సంగతికొద్దాము.
అసలు పాలకులు అంటే బ్యూరోక్రాట్స్. వీళ్ళంత ఘనాపాఠీలు ఇంకోళ్ళూండరు! తెరవెనక్కాల నాటకాలాడడం, ఓపికున్నంత తినడం( పట్టుబడేదాకా), మరీ పట్టుబడితే, మినిస్టరు మీదికి తోసేయడం!ఈ మధ్యకాలంలో ఎంతమందిని చూశాము!
ఈ బాధలు భరించలెక ఐ.ఏ.ఎస్ లోంచి బయటకు వచ్చెసిన కొంతమందిని చూశాము ఉదాహరణకి ఓ జయప్రకాశ్ నారాయణ, ఓ శరద్ జోషి లాటివారు. పోనీ Armed Forces లో ఏమైనా నీతిమంతులున్నారా అంటే, వాళ్ళ ఘనకార్యాలూ చూశాముకదా.పోనీ ఏదో నీతీ నిజాయితీ అని ఖబుర్లు చెప్పాడా, ఆయన పని అయిపోయిందన్నమాటే.

   పోనీలెండి, వీళ్ళందరినీ వదిలేసి, ఏ సినిమా వాడిగురించో చెప్పుకుందామా అంటే, ప్రతీ వాడికీ ఏదో ఒక గొడవే!ఒకడు కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేసేవాడొకడు, ఇంకోడు పక్కవాడి పెళ్ళాం తో తిరిగేవాడొకడు,ఇంకోడు ఫుట్ పాత్ ల మీద నిద్రపోయేవారిమీద కారు పోనిచ్చేవాడొకడు, ఇంకోడు ఇంకోటీ అడక్కండి.ఇంక వీళ్ళగురించి పిల్లలకి ఏం నేర్పుతాము?

   అదీ కాదూ,ఇదీ కాదూ క్రీడల్లోకి వెళ్దాం అంటారా, వాళ్ళుమాత్రం ఏం తక్కువతిన్నారు? మాచ్ ఫిక్సింగన్నారు,ఇంకోటేదో అన్నారు, చివరికి ఎం.పి. అయి కూర్చున్నాడు.భరిస్తాం ఛస్తామా?
మరి పిల్లలకి కరిక్యులం లో Moral Instruction (MI) లేదో అని ఏడవడం ఎందుకూ అంటారా, తిన్న తిండి అరక్క! మరి ఇప్పటి పిల్లలు What Tatayyaa, you have to grow up… అన్నారంటే అనరు మరీ !!

Advertisements

2 Responses

  1. మీరన్నది నూటికి నూరు శాతం నిజమండీ. మోరల్ వాల్యూస్ నేర్పని చదువు పెద్ద దండగ.

    Like

  2. వజ్రం,

    థాంక్స్.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: