బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


   ఈమధ్యన రోజూ గుడికి వెళ్తున్నప్పుడు, ఒకావిడ బస్ స్టాప్ లో నన్ను చూడగానే, లేచి నుల్చుని దండం పెడుతున్నారు. ఒకనెలరోజులనుండి జరుగుతూంది.నిన్న అనుకోకుండా, నేను ప్రతీ రోజూ వెళ్ళే గణపతి ఆలయం లో, ఆవిడ కూడా కనిపించారు. మామూలుగా, నమస్కారం చెప్పగానే, అడిగేశాను,’మీరెవరూ, ఇదివరకెప్పుడైనా కలిశామా,ప్రతీ రోజూ,నమస్కారం చేస్తున్నారూ’ అని.దానికి ఆవిడందీ, ‘మీకు నేను గుర్తుండకపోవచ్చు, కానీ మిమ్మల్నీ, ఆంటీనీ ఎప్పుడూ గుర్తుంచుకుంటాను’అన్నారు. వామ్మో ఇంటావిడకూడా వచ్చిందే పిక్చరులోకీ అనుకున్నా!

   జరిగిన విషయమేమిటంటే అసలు, ఓ నెలక్రితం అనుకుంటా,మా ఇంట్లో పిల్లలతో భోజనం చేసి, మేముండే ఫ్లాట్ కి వెళ్ళే ఉద్దేశ్యంతో, బస్ స్టాప్ లో నుంచున్నాము. రాత్రి తొమ్మిది దాటింది.మా ఇంటావిడ జాతకంలో బస్ ప్రయాణం లేదు.అదేం అదృష్టమో,ఎప్పుడు బస్సుకోసం నుల్చున్నా, ఛస్తే ఆ బస్సు రాదు.దానితో ఆటోలోనే వళ్ళవలసివస్తుంది. అందుకే అంటారు,దేనికైనా పెట్టిపుట్టాలని!నేను ఒక్కణ్ణీ వెళ్తే మాత్రం, ఏ సమస్యా ఉండదు. ఇంక అసలు విషయానికొస్తే, బస్ స్టాప్ లో ఇంకొకావిడ నుంచున్నారు, ఆవిడకూడా మేమెళ్ళే చోటకె వెళ్తారుట.షేర్ ఆటో దొరుకుతుందేమో, చూస్తున్నారుట.మేము ఆటో మాట్లాడుకోగానే, ఆవిడనికూడా పిలిచాము. దిగే ముందర, ఓ పది రూపాయలిస్తూంటే, మా ఇంటావిడ, అఖ్ఖర్లేదూ అందిట. అక్కడ, డబ్బుకాదు ముఖ్యవిషయం, అంతరాత్రిపూట, ఒంటరిగా ఉన్న తనకి సహాయం చేయడం, జీవితంలో మర్చిపోలేని సంఘటన అని ఆవిడ అభిప్రాయం.అందుకే నెను ఎప్పుడు కనిపించినా, ఆవిడ దండం పెడుతున్నారుట.

   ఇదేదో, మేము చేసిన ‘ఘనకార్యం’ గురించి చెప్పుకోవాలని వ్రాసింది కాదు, అందరూ తమతమ తాహతులో, ఎవరికైనా సహాయం చేయడంలో తప్పేమీ లేదు.అది డబ్బే కానఖ్ఖర్లేదు, ఓ మాట సహాయం కూడా చేయొచ్చు.అంతదాకా ఎందుకూ, ఏ బస్సులోనో వెళ్తున్నప్పుడు, మీకంటే పెద్దవారు నుంచుని ఉంటే, మీరు లేచి వారికి సీటిస్తే తప్పేమీలేదు.ఏమీ అరిగిపోరు! నేను బస్సుల్లో వెళ్ళేటప్పుడు చూస్తూంటాను, సీనియర్ సిటిజెన్లకోసం ఉంచిన సీట్లలో కొందరు కూర్చుని ఉంటారు, నాలాటివాడు వెళ్ళినా, చూసీ చూడనట్లూరుకుంటారు, ఎక్కడ చూస్తే లేవమంటామో అని భయం. వాడితో ఉన్నవాడితో ఎక్కడలేని ఖబుర్లూ అప్పుడే వస్తాయి.ఛస్తే లేచి సీటు (అదికూడా వీడు ఆక్రమించిందే)ఇవ్వడు. వాడినెత్తిమీద పెద్ద పెద్ద అక్షరాల్లో రాసుంటుంది- Reserved for Senior Citizens అని.పోనీ చదువూ సంధ్యా లేనివాడా అంటే, అబ్బే మెళ్ళో ఓ తాడూ, దానికి ఓ ఐ.డి ! అందుకే అంటారు చదువుందికదా అని సంస్కారం ఉండాలని లేదు.సంస్కారమనేది జన్మతో రావాలి.

   మా ఇంటావిడ ఫొను సైలెంటయిపోయింది! దానికి సిరిసిరిమువ్వ అని ఓ పేరుకూడా పెట్టి, దానిమీద ఓ టపా వ్రాసింది! ఊరికే అలాటివన్నీ రాయకూ, అందరూ అపార్ధం చేసికుంటారూ, ఈ నెలలో ఓటి కొనిపెడతానులే అని చెప్పేశాను!ఆ ఫోను మోగదూ, నేను మామూలుగా బయటకి వెళ్తే, ఓ అరగంట ముందుగా ఫోను చేస్తూంటాను, అప్పుడు ఆవిడ కుక్కరు పెడుతుంది. గత కొన్ని రోజులుగా, ‘మీరు ఫోను చేయలేదని ఇంకా కుక్కరు పెట్టలేదండీ’ అంటూ సాగతీసికుంటూ,చెప్పి అప్పుడు పెడుతుంది!ఇలా అయితే కష్టమేనండి బాబూ, ఏదో ఆ ఫోనోటి కొనిచ్చేస్తే మళ్ళీ status quo కి వచ్చేయొచ్చు!

   ఇంక నిన్న బస్ స్టాప్ లొ నుంచుంటే, ఓ అమ్మాయొచ్చి నమస్తే అంకుల్ అంది, ఎవరో అనుకుని చూస్తే,కళ్ళోటీ వదిలేసి, మొహం అంతా ఓ scarf తో కవర్ చేసికుంది.ఇదేమైనా, టి.వీ ల్లో వచ్చే క్విజ్జా ఏమిటీ, కళ్ళోటీ చూపించి, వారెవరో గుర్తించండీ అనడానికి. నాకు పూర్తి మొహం చూస్తేనే గుర్తుకు రాదు, ఇంక కళ్ళోటీ చూసి గుర్తించడమంటే అడక్కండి. చూడు తల్లీ, ఆ మాస్కేదో తీయనైనా తీయి,లేకపోతే, నువ్వెవరో చెప్పనైనా చెప్పు, అంటే చెప్పింది, మా పక్క ఇంటివారి కూతురని!
నిన్న మా ఇంట్లో ఉండే Pure it వాటర్ ఫిల్టర్ బాటరీ అయిపోతే, కొత్తది తెప్పించాను. ఆ వచ్చినతనితో కబుర్లు చెబుతూ ఉంటే, తెలిసింది, అతని తల్లీ,తండ్రీ కూడా, నేను 1963 లో మొదటచేరిన ఫాక్టరీలోనే పనిచేస్తున్నారని, పైగా నా పేరు విన్నాడుటకూడానూ వాళ్ళ అమ్మా నాన్నా మాత్లాడుకుంటుంటే.అబ్బో ఫరవాలెదు, ఎప్పుడో పనిచేసిన చోటకూడా, మనల్ని గురించి గుర్తుంచుకున్నారూ అని ఓ చిన్న సంతోషం!తనువిన్నది నాగురించి మంచిగానా, చెడుగానా అని మాత్రం అడగలేదండోయ్, ఏం అడిగితే ఏం వినాలో?

   బస్ స్టాప్ లో థమ్సప్ పెట్టి లిఫ్ట్ అడుగుతూంటారు కొంతమంది. వాళ్ళనేమీ నెత్తికెక్కించుకోనఖ్ఖర్లేదు. వాళ్ళు, బస్సు ఖర్చు కలిసొస్తుందికదా అని లిఫ్టడుగుతారు.అంత బస్సుకోసం వెయిట్ చేయలేనివాడు, ఆటోలో వెళ్ళొచ్చుగా, అబ్బే ఫుకట్ గావస్తే వెళ్ళడానికి రెడీ.ఇలాటివారిని చూస్తే మాత్రం చిరాకొస్తుంది. మీరు ఆఫీసుకెళ్ళేటప్పుడు, యూనిఫారం లో ఉండే ఏ స్కూలు కుర్రాడికైనా లిఫ్ట్ ఇవ్వండి.పుణ్యం పురుషార్ధమూనూ!

Advertisements

9 Responses

 1. > అదేమీ నామీద ప్రేమనుకోకండి, ఆయనొచ్చేటప్పటికి కుక్కరు పెట్టేయమనీ!
  > ఆయనకే ఉపయోగం. లేకపోతే నాకేం
  ఒకవేళ ఫణిబాబు గారు బయట భోజనం చేసి వస్తే, మీకు భోజనం ఆలస్యం అవుతుంది కదా?

  Like

 2. అడిగానని అనుకోవద్దు. చెప్పకుండ దాటేయద్దూ..
  యీ రహస్యమేంటండీ, సిరి సిరి మువ్వకి కామెంటుదామంటే, ఇక్కడికి పట్టుకొచ్చేస్తోంది…ఇంటికి మీరే ఓనరూ అంటే వాకే, కామింటికి (కామెంటుకి) కూడా మీరే ఓనరా?
  ఇద్దరి కబుర్లు…సుపరో సూపరు..

  Like

 3. @wish,

  ఏమిటో నాగురించే ఫోను చేస్తాననుకుంటుంది.ఏం చేస్తాం లెండి, మంచివాళ్ళకు రోజులు కావు!

  @ఎన్నెలా,

  ఇందులో దాటేయడానికేముందీ? తన టపాలు తనవీ, నా టపాలు నావీ.ఎప్పుడైనా లింకులు పెడుతూంటాను. అయినా ఇంతకాలం నుండీ కాపరం చేస్తున్నాము ( ఈ 28 కి నలభైయ్యో ఏళ్ళో ప్రవేశిస్తాము!), వారు వీరౌతారంటారుగా! అందుకే ఒక్కొక్కప్పుడు, భాష లో పోలికలుంటూంటాయి.అయినా వాళ్ళెవరో లాగ, అన్నేసి ఐ.డీ లు క్రియేట్ చేసికోవలసిన ఖర్మ మాకేం పట్టిందండి?మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

  Like

 4. post bavumdi

  Like

 5. chala bavundi

  Like

 6. @శివానీ,

  ధన్యవాదాలు.

  @వెంకట్,

  ధన్యవాదాలు

  Like

 7. >>>ఇంక ఆయన ఇంటికొచ్చి, అన్నిసార్లు ఫోను చేసినా తియ్యలేదే,బయటకేమైనా వెళ్ళావా అనడం. నేనెక్కడికి వెళ్తానూ వేషాలు కాపోతే? ఆ దిక్కుమాలిన ఫోను మోగదూ, అది ఎప్పుడు మోగుతుందో చూస్తూ కూర్చోడానికి, నాకేమీ ఇంకో పని లేదా ఏమిటీ?అదండి నా సిరిసిరిమువ్వ విషయం!ఎప్పుడో తీరికున్నప్పుడు, కొత్త ఫోనోటి కొనిపెడితే, ఆయనకే ఉపయోగం. లేకపోతే నాకేం?
  కొత్తది కొన్నారా లేదా. ఇంతకీ ఎవరికి ఎక్కువ ఉపయోగం ఆ సిరిసిరి మువ్వ తో? మీ టపా కన్నా మీ శ్రీమతి గారి టపా యే బాగుంది సిరిసిరి మువ్వ గురించి.
  మీ ఇద్దరి ముచ్చట్లు చాలా బాగున్నాయి. ఓల్డ్ ఏజ్ (అని అనడం ఇష్టం ఉండదు) లో ఎల్లా ఉండాలో నేర్చుకుంటున్నాము మీ నుండి. థాంక్యూ.

  Like

 8. :)) బాగా చెప్పారు.. ముఖ్యంగా..

  టి.వీ ల్లో వచ్చే క్విజ్జా ఏమిటీ, కళ్ళోటీ చూపించి, వారెవరో గుర్తించండీ అనడానికి. నాకు పూర్తి మొహం చూస్తేనే గుర్తుకు రాదు, ..
  టూ గుడ్!..

  Like

 9. @సుబ్రహ్మణ్యం గారూ,

  ధన్యవాదాలు.ప్రస్తుత పరిస్థితి గురిమ్చి మా ఇంటావిడ ఓ టపా పెట్టింది…

  @కృష్ణప్రియా,

  థాంక్స్.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: