బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టైంపాస్


    చిన్నప్పుడు గణతంత్ర దినోత్సవం అంటే, ఎంతో ఉత్సాహంగా ఉండేది. ముందురోజు, రేడియో లో దేశాద్యక్షుడి ప్రసంగం, ఆ తరువాత జాతీయ గీతాలాపనా, అబ్బో ఆనాటి మన దేశాద్యక్షులు, ఎవరికి వారే చాలా గొప్పవారు. మర్నాడు అంటే జనవరి 26 న, జాతీయ బహుమతులు భారత రత్న, పద్మ విభూషణ్, భూషణ్, శ్రీ వచ్చిన వారి పేర్లు తెలిసికోడానికి, ఎంతో ఆత్రంగా, ప్రొద్దుటే ఏడు గంటలకి, రేడియో లో వచ్చే తెలుగు వార్తలూ, వాటిని చదివే శ్రీ పన్యాల రంగనాథ రావు గారూ, ఇంగ్లీషులో 8.00 గంటలకి మళ్ళీ వినడం, ఆ తరువాత స్కూలుకి వెళ్ళడం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలూ, వాటినన్నిటినీ గుర్తుచేసికోవడం ఎంతో బాగుంటుంది.

   ఆ తరువాత దూర్ దర్శన్ ధర్మమా అని, ఢిల్లీ లో జరిగే రిపబ్లిక్ డే పెరేడ్ చూసే అదృష్టం కలిగింది. రానురానూ రిపబ్లిక్ డే సందర్భంగా ఇచ్చే ఎవార్డులు లలో ఇదివరకుండే, ఉత్తేజం కలగడం లేదు.ఎవరి influence ని బట్టి వారికి, ఇస్తున్నారు. వాటికి పెద్దగా వరసా వావీ ఉండడం లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే, ఎవార్డ్ ఇవ్వకపోతేనే బాగుంటుందేమో అనిపిస్తోంది. గత నాలుగైదు రోజుల్నుండీ టి.వీ లో చూస్తున్నాము, సచిన్ తెండూల్కర్ కి భారత రత్న ఇవ్వాలని మహరాష్ట్ర ప్రభుత్వం రికమెండు చేశారని. సచిన్ definete గా ప్రపంచంలో ఉన్న క్రికెట్ ఆటగాళ్ళలో గొప్పవాడే. ఈ విషయం నిర్వివాదాంశం. కానీ అతను ఇంకా ఆడుతున్నాడు, తనకిష్టమైనప్పుడే రిటైరవుతానని, నొక్కి చెప్పాడు.ఇంకా ఎన్నేన్నో పోటీల్లో పాల్గొంటాడు, అటువంటి పరిస్థితుల్లో అతనికి ఇప్పటినుంచీ భారత రత్న ఈయవలసిన అవసరం ఏమిటో అర్ధం కాదు. No doubt, Sachin Tendulkar deserves the highest civilian decoration of the Country. Can’t we wait till he retires? మన దేశం లోని ఫాన్లు most fickle minded అని మనకందరికీ తెలుసు. రేపెప్పుడో World Cup లో, సచిన్ ఆడలెకపోవడంతో, అతనిని దుయ్యబట్టేతంత ఘనులు మన క్రిటిక్సూ, ఫాన్లూనూ ! మరి అది బాగుంటుందా?

   కజోల్, టబూ లకి పద్మశ్రీ ఇచ్చారుట. వాళ్ళూ మామూలుగా చేసే నటులే.మరి వారిలో మన ప్రభుత్వానికి ఏం ప్రత్యేకత కనిపించిందో, ఆ భగవంతుడికే తెలియాలి. వీరికంటే గొప్ప నటులే దొరకలేదా? అందుకే అంటున్నాను, ఏదో ఓ నలుగురైదురు తప్పించి, ఈ సంవత్సరపు ఎవార్డులు వచ్చిన వారిలో,ఏదో కలకాలం గుర్తుపెట్టుకునేటంతటి ఘనులెవరూ కనిపించలేదు.వారికి ప్రభుత్వంలొ ఉన్న ప్రాపకం బట్టి వచ్చినవె!అసలు ఒక విషయం అర్ధం అవదు ఈ ఎవార్డులకి కొలమానం ఏమిటీ అన్నది.Less said the better.

   ఇంక ఈరోజు ప్రసారమైన కార్యక్రమాల్లో, ‘మా’ టి.వీ. లో వచ్చిన ‘వెలుగు వెలిగించు’ కార్యక్రమంలో చూపించిన నృత్య ప్రదర్సన అద్భుతం! రిపబ్లిక్ డే పెరేడ్ లో ప్రదర్శించే వివిధ రక్షణ బలాల కవాతు చూస్తూంటే, మనం ఈ రోజు ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే, వీళ్ళ చలవే కదా అనిపిస్తుంది. కానీ, మళ్ళీ మన రాజకీయ నాయకులు వేసే వెధవ్వేషాలు చూస్తూంటే,Do we really deserve all the sacrifices made by our Armed Forces? అనికూడా అనిపిస్తుంది. మన దేశాద్యక్షురాలినె తీసికోండి, ఆవిడ అంత అత్యుత్తమ పదవిలో ఉండబట్టి, మనం ఏమీ అనకూడదు కానీ, అసలు ఆవిడలో ఏం చూసి అద్యక్ష పదవి ఇచ్చారో? ఇలాటి పదవులు రాజకీయ ప్రాభవంతో వచ్చినంతకాలం మనకి ఇవి తప్పవు

   నిన్న మన్మాడ్ లో ఒక అసిస్టెంటు కలెక్టరుని పెట్రోల్ పోసి దహించేశారుట. ఆయన చేసిన తప్పేమిటీ, ఆయిల్ మాఫియా ని పట్టుకోవడం, తప్పకుండా ఈ మాఫియా వెనక ఎవడో రాజకీయనాయకుడి హస్తం ఉండే ఉంటుంది.ఎప్పుడో పాపం పండిన తరువాత, బయట పడతారు. ఈలోపులో వీళ్ళందరూ మనల్ని పరిపాలిస్తూంటారు. ఖర్మ! కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్డీ, పూణె ఎం.పి. కల్మాడీ,సి.వీ.సీ థామస్, మాజీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయాధిపతి బాలకృష్ణన్ వీటికి ఉదాహరణ మాత్రమే. పట్టుకుంటే దొంగా, పట్టుకోనంత కాలం దొరా! మేరా భారత్ మహాన్ అంటూ చప్పట్లుకొట్టుకుంటూ కూర్చోడమే !!

Advertisements

5 Responses

 1. >>అసలు ఆవిడలో ఏం చూసి అద్యక్ష పదవి ఇచ్చారో?

  మహిళలంటే పైగా వెనకబడిన తరగతుల మహిళలంటే చిన్న చూపు అని అన్నా అంటారు మిమ్మల్ని.

  పద్మ శ్రీ కామనయిపోయింది లెండీమధ్య. అలాంట్ వాళ్ళ మధ్యలో Deserved people కి వచ్చినా వారు కనపడటం లేదు.సచిన్ కి భారత రత్న ఎందుకు అనిపిస్తుంది నాకు.
  ఫీజు తీసుకుని అతను ఆడే ఆట దేశానికి సేవ ఎలా అవుతుంది. ఏమో లెండి ఇలా ప్రశ్నిస్తే అసలు కళాకారులకి,క్రీడాకారులకి ఎందుకు ఈ అవార్డు అనిపిస్తుంది.

  Like

 2. “అసలు ఒక విషయం అర్ధం అవదు ఈ ఎవార్డులకి కొలమానం ఏమిటీ అన్నది”

  నాదీ ఇదే సందేహం మాస్టారూ. నిన్న అవార్డులు ప్రకటించగానే నేను ఎంతో ఆశగా చూసిన వాళ్లకి రాలేదు. రాలేదు అనేకన్నా ఆ అవార్డులకి అంత అదృష్టం లేదు అనచ్చేమో!

  http://blogavadgeetha.blogspot.com/2011/01/blog-post_25.html

  Like

 3. @ఆవకాయ గారూ,

  సొ కాల్డ్ ‘వెనకబడిన’ మహిళల్లో కూడా ఇంకెందరో ఉన్నారు.

  @శ్రీనివాస ఉమా శంకర్ గారూ,

  మీరు చెప్పింది నిజమే.

  Like

 4. తి సు రా రె అనే ఆయన మంగళంపల్లికి భారత రత్న ‘ఇప్పించడానికి ‘ ప్రయత్నాలు మొదలుపెట్టానని ఓ పబ్లిక్ మీటింగులో ప్రకటించాడు!

  తెలియడం లేదా–ఈ అవార్డులెలా వస్తున్నాయో?! ఈయనలాంటివాళ్లు కనీసం రాష్ ట్రానికొకడైనా వుండడంటారా?

  Like

 5. కృష్ణశ్రీ గారూ,

  నిజమేనండి.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: