బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- చిరుగు కూడా మంచిదేట !!


   ఇదివరకటి రోజుల్లో, వేసికున్న చొక్కాకి,కట్టుకున్న చీరకీ, పంచకీ చిరుగు కనిపిస్తే, ‘ఉత్తరేణి కుట్టు’ అని వేసికుని మళ్ళీ కట్టుకునేవారు. వారి వారి ఆర్ధిక స్థోమతని బట్టి ఉండేవి, వారు కట్టే బట్టలు. పాత సినిమాల్లో చూసేవారం-బాగా బీద గా ఉండే, బడిపంతులు గారో, లేకపోతే ఏ ఇంట్లోనో వంటలు చేసే ఆవిడనో చూపించవలసివస్తే, తప్పని సరిగా ఎక్కడో అక్కడ ఓ చిరుగు చూపించేవారు.అది ఆ సినిమా దర్శకుడి,ప్రావీణ్యం చూపించినట్లన్నమాట.It was symbolic of the poverty, that particular character was suffering!అప్పుడెప్పుడో శంకరాభరణం సినిమాలో చూసినట్లు జ్ఞాపకం- శంకరశాస్త్రి గారు, తన వైభవాన్ని కోల్పోయి, అతి బీద స్థితి లోకి వచ్చినప్పుడు,
‘ఆహా విశ్వనాథ్ గారు, ఎంత అద్భుతంగా తీశారో వగైరా వగైరా.’ ప్రశంశలు కురిపించేశారు!

   అంతదాకా ఎందుకూ, చిరిగిన పాంటు వేసికుంటే, బయటకు వెళ్ళనిచ్చేవారు కాదు.అలాగే చిరిగిపోయిన ఓణీ ఓ అతిబీదస్థితిలో ఉండి, తండ్రి పెళ్ళి చేయలేని స్థితిలో ఉన్నట్లన్నమాట.అలాగ చిరుగు అన్నది ఓ నెగటివ్ సంకేతం లా ఉండేది. ‘ఏ అమ్మాయి మీదైనా అత్యాచారం జరిగితే, ‘పాపం ఆ అమ్మాయి జీవితం చిరిగిపోయిన విస్తరి లా అయిపొయింది’ అనే వాక్య ప్రయోగాలు కూడా చదివాము, విన్నాము!ఇలాటివన్నీ, ఎకనామిక్ రిఫార్మ్స్ ముందర లెండి!

   మరి ఇప్పుడో, చిరుగు అన్నది ఓ status symbolఅయిపోయింది! కట్టుకున్న బట్టకి ఎన్ని చిరుగులుంటే అంత ఫాషనుట!అదేం ఖర్మమో, బయటకు వెళ్తే చూసేది ఈ చిరుగులే!ఇదెక్కడి ఫాషనండి బాబూ?అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే కట్టుకున్న జీన్స్ పాంటుకి, మోకాళ్ళు రెండింటి మీదా రెండు చిరుగులుండాల్సిందే!ఇంక అమ్మాయిలకైతే, అడక్కండి,అసలే ఓ గుడ్డపీలిక కట్టుకుని వస్తారు, దానికి సాయం ఈ చిరుగులోటి.ఇదంతా నేను చాదస్థం గా వ్రాస్తున్నది కాదు,బస్సుల్లోనూ, మాల్స్ లోనూ చూస్తూంటాము, ఒంటిమీద బట్ట ఉండదు.ఇందులో వాళ్ళు పొందుతున్న ఆనందం ఏమిటి? శీతాకాలం లో అసలు వాళ్ళకి చలేయదా?ప్రొద్దుటే, స్కూలుకి వెళ్ళే పిల్లలు, ఆ చలిలో, మోకాళ్ళ పైదాకా వచ్చే యూనిఫారం వేసికుంటేనే, గుండె కరిగిపోతుంది అయ్యో పాపం ఈ చలిలో ఎలా వెళ్తున్నారో అని!
సినిమా స్టార్లూ,ఫాషన్ పెరేడ్ లో పాల్గొనేవారూ, పోనీ అలాటి బికినీలూ, వళ్ళంతా చూపించుకునే బట్టలూ వేసికున్నారంటే అర్ధం ఉంది, ఎందుకంటే వాళ్ళు పూర్తి బట్టలతో ఉంటే ఎవడూ వాళ్ళవంక చూడడు కాబట్టి.మామూలుగా ఉండే వాళ్ళకి ఏం రోగం? ఊళ్ళో వాళ్ళందరికీ వాళ్ళ అందాలు చూపించుకోవలసిన అవసరం ఏమిటో ఇప్పటికీ అర్ధం అవదు. ఇలాటి దరిద్రపు డ్రెస్సులు వేసికుని, వాడెవడో ఈలేశాడూ, కాలు తొక్కాడూ, గిల్లాడూ అని ఏడవడం ఎందుకూ? ఇంట్లో తల్లితండ్రులకి బాధ్యత ఉండదా? లేక వాళ్ళ ప్రోత్సాహంతోనే ఇలా ‘ప్రదర్శనలు’ ఇస్తున్నారా? క్రీడలు ఆడేవారూ, ఆసుపత్రిల్లో పనిచేసే నర్సులకీ అయితే వేసికోవాలే ఆ స్కర్టులు. అ స్కర్టులూ అవీ వేసికోకూడదనడం లేదు. కానీ దానికీ ఓ సమయం సందర్భం ఉంది.చీరల్లోనూ, పంజాబీ డ్రెస్సుల్లోనూ ఉండేవాళ్ళు అందంగా ఉండరా? కట్టుకునే పధ్ధతిలో ఉంది అందం అంతా.

   బయటకు వెళ్ళినప్పుడు చూస్తూంటాము ఇంక ఈ అబ్బాయిలు- underarm growth అంతా ఊళ్ళో వాళ్ళకి చూపించుకుంటేనే, వాడు macho అనుకుంటాడా ఏమో! ఎంత అసహ్యంగా ఉంటుందో ఎప్పుడైనా తడుతుందా వీళ్ళకి అసలు?అలా ఉండడం unhygeinic అని వీళ్ళకు తెలియదా? బస్సుల్లోనూ, రైళ్ళల్లోనూ నుంచున్నప్పుడు, ఖర్మకాలి, మన మొహం వాడి చంక దగ్గరకి వస్తుంది, దేర్భ్యంలా చెయ్యి పైకెత్తి నుంచుంటాడుగా.వెధవది ఏదో deodrant స్ప్రే చేసికుంటే చాలనుకుంటాడు ఆ దరిద్రుడు.ఇళ్ళల్లో ఎన్నెన్ని వెధవ్వేషాలు వేసినా ఫరవా లేదు, బయటకి వచ్చినప్పుడైనా ఇంకోరికి అసౌకర్యం కలక్కుండా చూసుకోవాలి.

   ఇదివరకటి సినిమాల్లో చూసేవారం, చీర కొద్దిగా,పకి వెళ్ళిందంటే సెన్సార్ వాళ్ళు కట్ చేసేవారు. ఇప్పుడో పూర్తిగా బట్ట కడితే కట్ చేసేస్తున్నారు.ఏదైనా ‘అతి’ అయితే మొహం మొత్తుతుంది. దేనికైనా ఓ’అడ్డం’ ఉంటేనే,దానిమీద ఆసక్తి పెరుగుతుంది. ఈ విషయం ఈ జనరేషన్ వారికి ఎప్పుడు తెలుస్తుందో? అందరూ అలా డ్రెస్ చేసికుంటారని కాదు,చూపించుకునేవేవో, చూడవలసినవారికే పరిమితం చేయండి, అంతేకానీ, ఊళ్ళో వాళ్ళందరికీ కనువిందు చేయఖ్ఖర్లేదు.ఏమిటీ ఈ పాతచింతకాయ పచ్చడీ అంటారా మీ ఇష్టం.అయినా ఎవడెలా డ్రెస్ చేసికుంటే, మీకెందుకూ, వాళ్ళిష్టం,కావాలంటే మీరూ వేసికోండీ అంటారా.Fine, no issue. కానీ మనం ఓ సొసైటీ లో ఉంటున్నాముగా, ఓసారి వాళ్ళగురించీ ఆలోచించండి.

Advertisements

14 Responses

 1. కూసే గాడిద మెసే గాడిదను చెరిచిందని! ఇలాంటి దిక్కుమాలిన బట్ట కట్టుడు విధానాలకు ఆకర్షితులయ్యెవారిది మరో గోల. పర్వతాకార శరీరాలుంటాయి. పిల్లలుంటారు. అయినా, ఏవో బిగుతు పాంట్లు టీ-షర్టులు. కడుపులో దేవుతుంది. ఇంతటి బాధ నా ఒక్కడికేనా? ప్రపంచంతో పంచుకుందామనుకుంటారో ఏమో కొందరు భర్తలు.

  కొందరు కాస్త నాజూకుగా ఉన్నా, వేరే అమ్మాయిలను చూసి ప్రేరణ పొంది బిగుతు పాంట్లు, టీ-షర్ట్లు. కానీ ఎక్కడ ఎవరు చూసేస్తారో ఏంటో అని పైన ఒక చున్నీ! ఎందుకొచ్చిన తిప్పలట?

  Like

 2. As usual great post from you sir. Here either I blame the parents or spouse. Horrible situation here is married females (modern women) wear these these kind of dresses. I don’t know how her husband allow here to wear these kind of dresses and entertain the public at Mal’s and public places.

  ఏదైనా ‘అతి’ అయితే మొహం మొత్తుతుంది. దేనికైనా ఓ’అడ్డం’ ఉంటేనే,దానిమీద ఆసక్తి పెరుగుతుంది. ఈ విషయం ఈ జనరేషన్ వారికి ఎప్పుడు తెలుస్తుందో? అందరూ అలా డ్రెస్ చేసికుంటారని కాదు,చూపించుకునేవేవో, చూడవలసినవారికే పరిమితం చేయండి, అంతేకానీ, ఊళ్ళో వాళ్ళందరికీ కనువిందు చేయఖ్ఖర్లేదు.

  Like

 3. ఇప్పుడు అమ్మాయిలు పంజాబీ ద్రెస్ వేసుకొని చున్నీతో మెడను కప్పుకుంటున్నారు.
  అలాటప్పుడు ఆ చున్నీ వేసుకోవడమెందుకో! మా రోజుల్లో సినిమా తారలపై “కలై
  నేశన్” లాంటి ఎల్లో జర్నలిజమ్ పత్రికలు అడ్డమైన రాతలూ వ్రాస్తే నమ్మేవాళ్ళం కాదు.
  కారణం సినిమాల్లో వాళ్ళ కట్టూ బొట్టూ ఎంతో బాగుండేది. మరిప్పుడు అబద్ధమైనా
  నిజమని నమ్మాల్సి వస్తుంది. ఒకసారి ప్రఖ్యాత రచయిత భరాగో గారిని కలిసినప్పుడు
  ఆయన అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. “పూర్వం సావిత్రినో మరొ నటినో చూస్తే
  ఇలాటి చెల్లెలో, భార్యో వుండాలని అనిపించేది. మరి ఈనాటి వాళ్ళను చూస్తుంటే..
  ………” అని ఆయన అన్నారు. రేఖాచిత్రం సురేఖ

  Like

 4. హాహాహ్హా. ఇప్పుడు చొక్కాలు కూడా పొట్టివి సారూ. బాహుమూల సౌందర్యమే కాదు వాడి నాభి భీభత్సం కూడా దర్శించుకోవాలి. పైగా చిరుగులు వహ్వా. అయినా మనది అరణ్య రోదన వినేవాడు ఎవడూ ఉండడు. ప్రగతి నిరోధకులు, కుత్సిత భావాలు, సంకుచిత హృదయాలు అని కూడా అంటారు. మేరా భారత్ కూడా మహాన్ అనుకోని ఊరుకోవడమే. జై హింద్.

  Like

 5. Very good post sir.
  Dress code has gone for a toss. Showing undergarments has become a sign of freedom. If we write on this, they blame us as anti-woman. I strongly believe that we should have a dress code keeping the civil society in mind. This is applicable to both men and women.
  Ramu
  apmediakaburlu.blogspot.com

  Like

 6. మీరింకా చెప్పగలిగారు. ఇదే మేం, కుర్రాళ్ళం చెబితే.. చూస్తున్నవాళ్ళది మనదే తప్పంటారు.
  బట్టకట్టడంలో రూలుపెడితే పాటించేవాళ్ళెవరు. మా కంపెనీలో ఎన్ని రూల్సున్నా అబ్బాయిలకే.. టైకట్టుకురావాలి.. ప్యాంటేసుకురావాలి అని. అది అమ్మాయిలకు వర్తించదు. ఒకొక్కసారి ఆ రూల్ పెట్టిన హెచ్చార్ టీమ్ వాల్లే అలా వస్తుంటారు ఇంకెవరికి చెబుతాం చెప్పండి.
  నాకైతే ఆ చంకలెత్తి చూపిస్తూ.. జారిపోయే ఫ్యాంటులేసుకు తిరిగే
  అబ్బాయిల్ని.. మనూర్లో అంటారు చూసారూ.. తాటికమ్మపట్టుకుని ఒక్కటి తగిలిస్తేగానీ.. ఫ్యాషనేంటో.. ఎక్కడున్నాడో తెలుస్తుందని. :-).

  మెడకప్పుకునే చున్నీ గురించి మా ఫ్రెండొకడు కాలేజి రోజుల్లో ఒకటన్నాడు.
  చున్నీ ఎందుకేసుకొస్తారు అని అంటేనట.. ఇంట్లో వాళ్ళ అమ్మానాన్న పోరుపడలేక.. సరిగ్గా కప్పుకునొస్తారంట.. కాలేజికొచ్చేకా.. కొంటెకుర్రాళ్ళపోరుపడలేక మెడలు కప్పుకుంటారంట. 😉
  ——————-
  ఇక దుస్తులు ఎలా వుండాలి అంటే..

  మనకు నచ్చినవి వేసుకోటంలో లేదు తప్పు..
  ప్రక్కవాడికి నచ్చేట్లు వేసుకోవటంలోనూ లేదు తప్పు..
  నాకంటూ.. ఒక స్టైలుండాలి…,
  నేనే అందంగా కనపడాలి అనుకోవడంలోనూ
  లేదు తప్పు…

  పక్కవాడికి చూపించాలన్నట్లు వేసుకోవటం.. తప్పు..
  వాళ్ళకు ఇబ్బంది కలిగించేలా మన దుస్తులుండటం తప్పు..
  ఇంకా పచ్చిగా చెప్పాలంటే… అందాలేమన్నా ఉంటే…
  వాళ్ళ.. ఆయనకి చూపించుకుంటే.. మంచిది…
  పక్కవాడికి పడి పడి..చూపించడం తప్పు..
  ఏదేమైనా.. అది… పబ్లిగ్గా.. చూపించటము.. తప్పే…

  ఇలాంటిదే నేనొకప్పుడు నా బ్లాగులో రాసుకున్నాను. “మగువ తెగువా మగాడి లోకువా” అనే పోస్టులో. అదిక్కడ చూడగలురు
  http://www.padamatigodavari.com/2007/07/blog-post_4050.html

  🙂

  Like

 7. నిజమే బాబాయి గారూ, మొన్న ఈ మధ్యనే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మా టీం పార్టీ ఇవ్వాలని నిర్ణయించినప్పుడు కొంత మంది అమ్మాయిలు – పార్టీ పబ్బులో ఇస్తామని అంటే ; తాగుబోతుల పక్కన మేము పార్టీలో ఉండమని మొరాయించారు – కానీ చివరికి పార్టీకి వాళ్ళంతా వంటికి అంటుకుపోయేలా వేసుకు వచ్చిన బట్టలని చూసి అమ్మాయిలమైన మాకే చిరాకు వచ్చింది. ఇక అలాటివారితో అబ్బాయిలు వెధవ వేషాలు వేశారంటే వెయ్యరూ మరి? శుక్రవారం వచ్చిందంటే కొందరు అమ్మాయిలు ఆఫీసుకి వచ్చినట్లు రానే రారు మరీ అస్సలు భారతదేశంలో లేనట్లే వస్తారు !- పోనీ ఏ ముంబాయో, బెంగుళూరో అయితే పరవాలేదు అక్కడ సంస్కృతి మొదటినుంచీ కాస్త వేరుగానే ఉండేది. కానీ హైదరాబాదులోనూ ఈ జాడ్యాలు ఎక్కువ కావటం చూస్తూంటే బాధ వేస్తోంది. పైగా ప్రతీ శుక్రవారం నేను చీర కట్టుకొస్తానని – అదేమిటీ, ఈరోజు ఫార్మల్ డ్రస్సు అక్కరలేదు కదా అని నవ్వుతారు! మా కంపెనీ ఫార్మల్ డ్రస్సు కోడ్ లో చీర కూడా ఉన్నదన్న విషయం చాలా మందికి తెలీదు కూడాను! అలా ఉన్నారండీ ఇప్పటి తరం వారు. పైగా, చీర కట్టుకొస్తానని నన్ను ఆంటీ అని పిలిచిన వారిని కూడా చూశాను నేను. పై పై మెరుగుల కన్నా మనం అన్నిటా ఎంత ముందున్నామా అన్నది ముఖ్యమని వీళ్ళకి ఎప్పుడు అర్ధం అవుతుందో ఏమో!!

  Like

 8. @తెలుగు భావాలు గారూ,
  ధన్యవాదాలు.

  @లాక్,

  నా టపా నచ్చినందుకు ధన్యవాదాలు.

  @కృష్ణ ప్రియా,

  ఊరికే స్మైలీ పెట్టేసి వదిలేస్తే ఎలా తెలుస్తుందీ నచ్చినట్లా లేదా?

  @గురువుగారూ,

  ఇప్పుడు, ఏ కొందరినో తప్ప అలా భావించఖ్ఖర్లేదు!

  @సుబ్రహ్మణ్యం గారూ,

  థాంక్స్.

  @రామూ,

  ఏదో వయస్సడ్డంపెట్టేసికుని, నాకు తోచినదేదో వ్రాసేశాను.కొంతమందికి కోపం రావచ్చు. మా ఇంటావిడే కోప్పడింది- ఊరికే ఎందుకూ ఇలాటి టాపిక్కులు వ్రాస్తారూ-అని!ఏదో సరదా. పనేం లేదుగా!

  @శ్రీనివాసూ,
  నీ పాత పోస్టు చదివాను. ఏమిటీ వ్యాఖ్యలకి సమాధానాలు వ్రాయలేదూ?

  @విరజాజి,

  పోన్లెండి, నన్ను మరీ ఎం.సి.పి. అనుకోకుండా, మీరైనా వ్యాఖ్య వ్రాశారు. నా ఉద్దేశ్యమల్లా ఫాషను పేరుతో వెర్రితలలు వేస్తున్న ఈ జనరేషన్ గురించి, ఆడైనా మగైనా !

  Like

 9. స్మైలీ పెడితే.. నవ్వొచ్చినట్టు..
  మీ బ్లాగు లో ఏం రాసినా.. బ్రహ్మాండం గా రాస్తారు.. అనుమానమే లేదు. ఇంక బట్టల వ్యవహారం అంటారా.. మీరన్నదాంట్లో కనీసం 90% ఏకీభవిస్తాను..

  Like

 10. అవునండి.. అప్పట్లో అంత తీరికవుండేది కాదు. అసలు విషయం ఏమింటటే.. వ్యాఖ్య నా బ్లాగులోనే రాస్తే వాళ్ళొచ్చి చూస్తారేంటి అనిపించేది. మెయిల్ ఐ.డి వున్నవారికి మెయిల్ పంపించేవాడిని. తరువాత తరువాత తెలిసింది. వ్యాఖ్యలకి సమాధానాలు కూడా రాస్తే బాగుంటుంది అని. 🙂

  Like

 11. @కృష్ణప్రియా,

  థాంక్స్.

  @శ్రీనివాసూ,

  ఏదొ అందరూ చూస్తారుగా, నీ స్పందనకూడా!

  Like

 12. బాబుగారూ!

  అక్కడితో సరిపెట్టారెందుకు…..”డీ కోలెట్టేజ్” ల గురించి వ్రాయకుండా?

  అక్కగారన్నారంటే అనరూ మరి?

  మీ చెల్లెలు కూడా సతాయిస్తోంది…..బుధ్ధిగా టపాలు వ్రాసుకోక ఈ కోలెట్టేజ్ ల గొడవెందుకూ మీకు? అంటూ.

  యేం చేస్తాం లెండి మరి.

  Like

 13. కృష్ణశ్రీ గారూ,

  మీరు వ్రాసిన “డీ కోలెట్టేజ్”” అంటే నాకు తెలిస్తే కదా వ్రాయడానికి !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: