బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


   చూస్తూ ఉంటాము, కొంతమందికి ఓ అలవాటుంటుంది.కనిపించినదల్లా కొనేయడం. అది అవసరమా కాదా అన్నది చూసుకోరు. ఇంటినిండా పేర్చేసికోవడమే! ఏమిటీ అని అడిగితే అదో సరదా అంటారు. ఒక్కళ్ళూ ఉన్నంత కాలం అయితే ఫరవాలేదు. కానీ, ఏ అత్తారింటికో వెళ్ళినప్పుడు, అక్కడ కూడా ఇదే అలవాటు కంటిన్యూ అవుతూంటుంది. అందుకనే, వాళ్ళుండే ఫ్లాట్లు ఒక్కొక్కప్పుడు సరిపోని పరిస్థితి ఏర్పడుతూంటుంది! ఇదివరకటి రోజుల్లో అయితే, అంత availability ఉండేది కాదు కాబట్టి, పెద్ద సమస్య అయేది కాదు. అవసరమున్నదేదో కొనుక్కోవడం, అది కాస్తా పూర్తవగానే మళ్ళీ బజారుకెళ్ళడం.అంతే కాక అప్పటిరోజుల్లో ఇంటి పెద్దలు discretion ఉపయోగించేవారు కూడా!కారణం మరేమీ పెద్దది కాదూ, జేబు బరువును బట్టి అంతే! దాన్నే మనం discretion అని మొహమ్మాటానికి అంటాం!

ఇప్పుడు అంతా mall culture. దానికి సాయం, ఏ చిన్న పిల్లల్నో కూడా తీసికెళ్ళారో, ఇంక అంతే సంగతులు! సడెన్ గా मा की ममता ooze అయిపోయి, వాళ్ళు అడిగినదీ, అడుగుతారేమో అనుకున్నదీ, ప్రతీదీ వాళ్ళతో తీసికెళ్ళే trolley లో పడేయడం! బిల్లు పే చేయవలసినవాడు ఇవన్నీ ఎందుకూ అని అడిగాడో చచ్చాడే !ఆ రోజుకి ఉపవాసమే!నోరు మూసుకుని,అవన్నీ పోగుచేసి, బిల్లు పే చేసి, కారు డిక్కీ లో పడేసి కొంపకు చేరడమే. వాళ్ళు అవ్విధంబుగా కొన్న వస్తువుల్లో సగానికి సగం, తిన్న తిండరక్క పోగుచేసినవే! ఏదో జ్యూసంటారు, స్నాక్కంటారు, పైగా ఆ జ్యూసులు ఒకసారి ఓపెన్ చేస్తే, ఫ్రిజ్ లోకూడా ఉంచకూడదుట. ఇంతా చేసి, ఆ జ్యూసు కొనిపించిన పిల్లో పిల్లాడో,ఆ బాటిల్ ఓపెన్ చేసిన తరువాత పూర్తిగా తాగుతారా, అబ్బే, ఏదో ఔపోసన చేసినట్లు, ఓ సారి నోటి దగ్గర పెట్టుకుని, ‘యాక్! టేస్ట్ బాగో లేదు మమ్మీ’అనడం.ఆ ఇల్లాలు, ఫిగర్ maintain చేసే హడావిడిలో, ఆ జ్యూసుని, మన వాడిని తాగమంటుంది. ఛాన్సొచ్చింది కదా అని ఇంక ఈయన పెళ్ళాం మీద ఎగిరాననుకుంటూ, ‘ అక్కడే చెప్పానా, కనిపించిందల్లా కొనద్దూ అనీ, ఇప్పుడేమో నా ప్రాణానికొచ్చింది, ఈ దరిద్రపు జ్యూసులన్నీ నామొహాన్ని కొడుతున్నారు’అని.అందుకే అన్నారు భరించేవాడే భర్త అని!అక్కడికి ఆరోజు కార్యక్రమం పూర్తవుతుంది. అమ్మా నాన్నా కొట్టుకోవడం చూసి, ఆ పిల్లలు , వాళ్ళమానాన్న వాళ్ళని వదిలేసి, ఆటలకి పోతారు.మాల్ నుంచి తెచ్చినవన్నీ, చివరికి కప్ బోర్డ్ లోకి చేరతాయి.

ఎప్పుడో ఆ వస్తువులకి ముక్తీ మోక్షం వచ్చినప్పుడు గుర్తొస్తాయి. తీరా చూస్తే, best used within 72 hours అనో, లేకపోతే, దాని పుణ్యకాలం( expiry date) పూర్తయో కనిపిస్తుంది.చివరకి వాటన్నిటినీ, చింపి చీరేసి, ఏ వేస్ట్ బాస్కెట్ లోనో తగలేయడం. మరీ అలా చేయకుండా పడేస్తే, ఎవరైనా వాటిని త్రాగి ప్రాణం మీదకు తెచ్చుకుంటే, మళ్ళీ అదో గోలా! ఈ తెలివేదో ముందరే ఉంటే ఎంత బావుండేది?ఏదో యాడ్ చూడ్డం, దాన్నే కొనాలని పిల్లలు పేచీ పెట్టడం
వగైరా వగైరా అవన్నీ అంత అవసరమా? ఇప్పటి వాళ్ళని అడిగితే అవసరమే అంటారు,మీకేం తెలుసూ, మార్కెట్ లో ఎన్నెన్ని వస్తున్నాయో, మీరింకా రాతియుగం లో ఉన్నారు మాస్టారూ అంటారు.

ఇదంతా తిండి వ్యవహారం.ఇంక ఇంటాయనకి కనిపించిన సీడీ కొనేయాలి. ఇదివరకటి రోజుల్లో ఈ సీడీ లూ అవీ లేని రోజుల్లో కాసెట్లొచ్చేవి. పైగా కొన్ని కొట్లల్లో, రికార్డెడ్ కాసెట్లూ, అలాగే వీడియో కాసెట్లూ.పోనీ రోజూ ఏమైనా పెట్టుకుని వింటారా, చూస్తారా? అదేం లేదు, తెచ్చిన మొదటి వారంలో sincere గా వాటిని వాడడం. ఆ తరువాత వాటికి ఓ డబ్బా, మొదట్లో చెక్కది, తరువాత్తరువాత, ఏ కార్డ్ బోర్డ్ కార్టనో.ఇలా ప్రోగు చేసిన కాసెట్లు చివరకి అటకమీద తేల్తాయి, అక్కడే దుమ్ముకొట్టుకు పోయి చరిత్ర లోకి వెళ్ళిపోతాయి. ఏ ఇంట్లో చూడండి, కనిపించేవి ఈ పాత కాసెట్లే! ఆ రోజుల్లో వీడియో కాసెట్లొచ్చేవి. ప్రతీ ఇంటిలోనూ, ఏపిల్లదో పిల్లాడిదో పెళ్ళి క్యాసెట్టు కంపల్సరీ.ఆ కాసెట్లకో ప్లాస్టిక్కు కేసూ, దానిమీద అడ్డంగా ఓ కాగితం మీద పెద్దబ్బాయి పెళ్ళి, ఇంకో దానిమీద అమ్మాయి పెళ్ళి అని వ్రాసి అంటించడం. పైగా పిల్ల పెళ్ళి చేస్తే, వియ్యాలారికో కాపీ ఇవ్వాలి.తీరా, ఏ అయిదేళ్ళకో ఆరేళ్ళకో ఏ పాత చుట్టమో ఇంటికి వస్తే, వాళ్లు మన ఇంట్లో పెళ్ళికి రాలేదని గుర్తొస్తుంది, అంతే, వాళ్ళని కూర్చోపెట్టి ఓ రెండు మూడు గంటల పాటు ఈ దృశ్యకావ్యాన్ని చూపించడం. చూడకపోతే, వెళ్ళేటప్పుడు బట్టలు పెట్టరేమో అనే భయంతో వాళ్ళూ నోరెత్తకుండా చూస్తారు! మధ్యలో, మాటవరసకి,’ ఈమధ్యన కాసెట్లు, సీ.డీ ల్లోకి మారుస్తున్నారుట, పోనీ వీటన్నిటినీ మార్చేయకూడదూ.. ‘ అని ఓ ఉచిత సలహా పడేస్తారు. పైగా ఇదో ఖర్చోటీ! ఇంకోటండోయ్, అక్కడికేదో విన్న ప్రతీదీ రికార్డు చేసేవాడిలాగ,బ్లాంక్ కేసెట్లోటి. దాంట్లో మన పిల్లల మొదటి మాటలూ, మొదటి పచర్ పచర్లూ, మళ్ళీ వాళ్ళ పిల్లలకి వినిపించడానికి, మనం అంతదాకా బ్రతికి బావుంటే!

చివరకి తేలేదేమిటంటే ఇంటినిండా, కాసెట్లూ, సీడీలూ వాటికి సంబంధించిన వైర్లూ వగైరా. పైగా అవి పాడైపోతే, వాటిని బాగుచేసేవాడు దొరకడు, దొరికినా వాటి స్పేరు పార్ట్స్ ఉండవు.ఎప్పటివో ఇక్ష్వాకులపు రోజులనాటివి, ఏ కొట్టుకైనా తీసికెళ్తే నవ్వుతారు కూడానూ! ఆ సీడీ లు కూడా పోయి ఇంకేదో అదేదో బ్లూ..వచ్చిందిట.

Advertisements

5 Responses

 1. you said well .now a days unnecessary shopping is a current problem.due to publicity magic many people become uncontrolled ;kids are very active inthis waste shopping.2nd one is cd’s &cassettes we have a mount of cassetsin our home. no taperecorders .moreover no time to …

  Like

 2. :)) మా అటకెక్కి ఎప్పుడు చూశారు మీరు?

  Like

 3. oka nijamaina joke cheppana, maa intlo boledu cassettes, kanee ippatikee tape recorder ledu.1994 nunchee 2003 daaka maa srivaru maa…nchi music system kondamantoo time pass chesaru. tarwata bandhu mitrula to nenu complaint cheste rosham vachi philips transitor konnaru. teera ee FM rojullo, kkd lo aa radio pani chesedi kadu (shop atanu ee rojullo radio emiti sir, chepalu pattevallu matrame radio kontaru ani jokadata) . sare tarwata CD player, Computer annee konnam anukondi. Hyd lo radio kuda chala baga panichestundi. kani cassettes moskuntoo desam anta tirigamani visukkuntanu nenu.
  Meeru cheppinatlu ga unnecessary shopping maneste chala bavuntundi. 3 varasa gadullo haiga boledu mandimi santosham ga batikese vallam. ippudu enta pedda flat aina saripovatledu.
  mee blogs annee pakkinti vallato kaburlu cheppinatlu haiga untayandi. anduke inta pedda vyakhya.

  sree raaga

  Like

 4. బాగా వ్రాశారు!

  మొన్ననే ఓ బీరువానిండా వున్న వీడియో, ఆడియో క్యాసెట్లని కేజీ 15 రూపాయలకి (ఆమధ్య మన ఏవీఎం లు పలికిన రేటు) అమ్మేశాను.

  ఇప్పుడు డీవీడీలు కదా. అదేదో బ్లూ గురించి నేను విననేలేదండోయ్!

  Like

 5. @చిన్నారీ,

  ‘kids are very active in this waste shopping’ కరెక్టు కాదు. నాకు తెలిసినవారిలో పెద్దవారినీ చూశాను. పిల్లలమీద వంక పెట్టేస్తూంటారు!ఆ పిల్లనో, పిల్లాడినో గిల్లి, ఏడిపించి వాళ్ళ నాన్నని అడిగిస్తారు!!

  @కృష్ణప్రియా,

  అటకలే ఎక్కఖ్ఖర్లేదమ్మా !!

  @శ్రీ రాగ,

  అంత పెద్ద వ్యాఖ్య పెట్టినందుకు ధన్యవాదాలు. కానీ ఈ వ్రాసిందంతా http://type.yanthram.com/te/ లో టైపుచేసినట్లైతే, హాయిగా తెలుగు లిపిలోనే చదువుకునే వాడిని కదా! ఒక్కసారి ప్రయత్నించకూడదూ బంగారు తల్లివి!!

  @కృష్ణశ్రీ గారూ,
  ధన్యవాదాలు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: