బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-తెలిసింది ఇతరులతో పంచుకోడం


   రాజమండ్రీ లో ‘భక్తి’ టి.వి. చానెల్ కి అలవాటు పడిపోయి, పూణె తిరిగి రాగానే,Airtel వాడిస్తున్నాడు కదా అని, ఏడాది subscription కట్టేసి తీసికున్నాను. ఏం పోయేకాలం వచ్చిందో, ఆ చానెల్ కాస్తా తీసేసి, ABN ఇచ్చాడు.ఉన్న న్యూసు చానెళ్ళు చాలకనా, ఇంకో న్యూసూ అనుకున్నాను కానీ, ఏడాదికీ కట్టేయడం వలన, చచ్చినట్లు అట్టేపెట్టుకున్నాను, ఏం చేస్తాను? డిశంబరు 1 న ఆ పుణ్యకాలం కాస్తా పూర్తవడం తో, Reliance Big TV లోకి మారిపోయాను. దీంట్లో ‘భక్తి’ ఇప్పటివరకూ ఇస్తున్నాడులెండి, చూద్దాం ఇదెన్నాళ్ళో? నాకు ఆ చానెల్ లో శ్రీ గరికపాటి వారి, మహాభారతం మీద సామాజిక వ్యాఖ్యలు, శ్రీ చాగంటి వారి ప్రవచనాలూ చాలా ఇష్టం. మా ఇంటావిడ, రాత్రి 11.00 నుండి, 12.00 వరకూ, టి.వీ. నాకొదిలేస్తూంటుంది.

   ఈ వారం లో ధర్మరాజు-యక్షప్రశ్నలు గురించి, అద్భుతం గా చెప్పారు.ఆయన చెప్పినట్లుగా, డబ్బులు తగలేసి, ఏవేవో కోర్సుల్లో చేరే బదులు, హాయిగా మహాభారతం చదివి అర్ధం చేసికుంటే చాలు, మనకి ఇంకో దాని అవసరమే ఉండదు.ఏదో ‘ఆయనే ఉంటే….’ అన్న సామెత లాగ, ఆ మహాభారతం చదివి అర్ధం చేసికునే తెలివితేటలే ఉంటే,ఇలా ఎందుకుంటాము? అందుకనే, ఈ భక్తి టీవీల వెనక్కాల పడడం! మొన్నెప్పుడో ఆయన చెప్పారు’ ప్రతీదీ మనకే తెలుసునూ అన్నట్లు,ఎక్కడ పడితే అక్కడ వేలెట్టకూడదుట.కానీ, మనకేదైనా విషయం, గ్యారెంటీ గా తెలిస్తే మాత్రం, తప్పకుండా ఓ పదిమందితో పంచుకోవాలి’ట, ఈ సందర్భం లోనే, నేను అప్పుడెప్పుడో ఓ టపా పెట్టాను.అందులోది ఎంతమంది ఉపయోగించుకున్నారో తెలియదు. కానీ ఆ కంపెనీల వాళ్ళు మాత్రం నన్ను ఊదరకొట్టేస్తున్నారు. మీకు తెలిసినవారెవరినైనా చేర్పించండి అని.అందుకోసమే ఆ టపా లింకు మరోసారి ఇచ్చాను పైన. మిస్టరీ షాపింగు కోసం ఈమధ్యనే వచ్చిన ఇంకో ఏజన్సీ ఇది. వీళ్లకోసం ఒక ఎసైన్మెంటు చేశాను.

   ఇక్కడ మా ఫ్రెండ్స్ తో పంచుకుంటే, హాయిగా మన దారిన మనం ఉండకుండా, ఈ గొడవలన్నీ ఎందుకూ అన్నారు! నిజమే కదా,సాయంత్రం పూట అదేదో సీనియర్ క్లబ్బుల్లో పేకాడడం లో ఉన్న మజా దేంట్లో ఉంటుందీ? లేకపోతే, మనవళ్ళనీ, మనవరాళ్ళనీ స్కూలుకి దింపడం, అదేదో పేద్ద ఘనకార్యం చేసేస్తున్నట్లు, అడిగిన వాడికీ, అడగని వాడికీ చెప్పుకుని సింపతీ సంపాదించుకుంటే ఉన్న హాయి ఇందులో ఎక్కడుంటుందీ?నిజమే లెండి, ఎవడి comfort level వారిది! ఏదో ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ తమకే వచ్చేసినట్లు,చెప్పుకుంటే, ‘అయ్యో అలాగా…పాపం…’అని కావలిసినంత సింపతీ సంపాదించవచ్చు!cheap and best!

   ఈ గోలంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, గత 25 సంవత్సరాలనుండీ పరిచయం ఉన్న మా డాక్టరు గారూ, భార్యా నిన్న మా ఇంటికి వచ్చారు. వాళ్ళ అమ్మాయి ప్రస్తుతం US లో ఎం.ఎస్. చేస్తోంది, శలవలకి వచ్చింది.తనతో కలిసి వచ్చారు భుసావల్ నుంచి. మా ఇంట్లో ఎవరికి ఏ సమస్యొచ్చినా, ఆయన్నే కన్సల్ట్ చెస్తూంటాను. హస్తవాసి చాలా మంచిదిలెండి.అవీ ఇవీ మాట్లాడుకుంటూ, నేను ప్రస్తుతం వ్రాస్తున్న టపాలగురించీ, నామిస్టరీ షాపింగులగురించీ ఎలా నడుస్తోందీ అని అడిగితే, ఆ మధ్యన నా పుట్టినరోజు కి మావాళ్ళిచ్చిన నా టపాల పుస్తకం చూపించాను. ఆయనన్నారూ ‘నాకు ఎప్పుడైనా పేషంట్లకి కౌన్సెలింగు చేసే సమయం లో, మీ గురించే చెప్తూంటానూ, రిటైరయ్యిన తరువాత కూడా, ఓ వ్యాపకం ఏర్పరుచుకుని,ఎవరి గొడవల్లోనూ దిగకుండా,హాయిగా ఒక Square cm తనదీ అనుకునే, ఓ ప్రపంచంలో ఎలా ఉండొచ్చూ‘అని. అబ్బో, నాగురించి ఇంకోరికి ఉదాహరణగా చెప్పేటంత, గొప్పవాడిని కాదు కానీ, నామట్టుకు నేను మాత్రం fully enjoying ! అప్పుడప్పుడు ఇలాటి సంతోషాలూ ఉండాలి లెండి.
పైన వ్రాసిందంతా ఏదో స్వంత డబ్బా కొట్టుకోడానికి కాదు వ్రాసింది, మన Sq cm స్థలం మనం ఏర్పరుచుకుంటే, ఎంత హాయిగా ఉంటుందో చెప్పడానికి మాత్రమే.

Advertisements

4 Responses

 1. గురువుగారు,
  మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసాం కదా. ఇది చాలా నిజం. మీ వయసులో ఇంతఆనందంగా.. ఫుల్ ఎంజాయ్ గా వుండేవాళ్ళు చాలా తక్కువమందుంటారు. మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి మరి. ఇప్పట్నుండే మొదలుపెడితే… కనీసం మీ వయసొచ్చేటైముకైనా అలవాటవుతాయోమో లేండి. 🙂

  Like

 2. మీ మిస్టరీ షాపింగు టపా చాలా ఉపయోగపడింది నాకు. మా నాన్నగారు రిటైర్ అయ్యి ఉబుసుపోక కొన్ని రోజులు బ్లాగు రాసారు ఆ తరువాత ఏవో చిన్న చిన్న వ్యాపకాలు పెట్టుకున్నా కానీ ఏదీ ఆయనని పూర్తిగా ఎంగేజ్ చెయ్యలేకపోయాయి

  మీ షాపింగు టపా ఆయనకి పంపాను. ఎంత ఉత్సాహం చూపించారో ఆయన కూడా మొదలెట్టడానికి ఇతరత్రా చిన్న చిన్న వ్యాపకాలు ఉన్నా కానీ. ఆయన ఇప్పుడే అనారోగ్యం నుండి కోలుకుంటున్నారు. కాకినాడ లో ఉంటారు. అక్కడ వివరాలూ అవీ కనుక్కుని త్వరలోనే మొదలుపెడతారు.

  ధన్య వాదాలండీ.

  Like

 3. అయ్యా!
  శ్రీమదాంధ్రమహాభారతం చదవటం గుఱించి. ఈమధ్యనే మహాభారతం చదివి పూర్తిచేసాను. చదివిన వాడిని చదివినట్లుండొచ్చుగా! ఊహు, అలా వుంటే మన ఇదేమిటి? అని మహాభారతం ఎందుకు చదవాలి అనే టేగ్ తో పుస్తకం .నెట్ లో పరిచయ వ్యాసాలు వ్రాయటం మొదలు పెట్టాను. ఇంతవఱకూ ఆదిపర్వం పూర్తి చేసాను. ప్రస్తుతం సభా పర్వం లో ఉన్నాను.క్రింద లింకు నోసారి చూడగలరు.
  http://pustakam.net/?p=6235

  Like

 4. @శ్రీనివాసూ,
  మరి ఎప్పటినుండి మొదలెడదాము క్లాసులు !!!

  @ఆవకాయ గారూ,

  మిస్టరి షాపింగు వివరాలు, నెట్ లో వారి వారి సైట్లలోనే దొరుకుతాయి. కొట్లకెళ్ళి తెలిసికోనఖ్ఖర్లేదు. అందుకే కదా మిస్టరీ షాపింగన్నారు!The key point is that the ‘Mystery Shopper’ is absolutely anonymous. The shops are not aware of this.Then only we can give an unbiased report.Its not like the routine audits .

  @నరసింహరావు గారూ,

  చదివాను. కానీ వ్యాఖ్య పెట్టేటంత స్థాయికి రాలేదు నేను.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: