బాతాఖాని-లక్ష్మి ఫణి కబుర్లు


   మొన్న సోమవారం నుండీ, ‘మా’టి.వీ లో వంశీ గారి ‘మా పసలపూడి కథలు’ సీరియల్ ప్రారంభం అయింది. టైటిల్ సాంగూ, దానితో చూపించిన సీనరీలూ, బాపు గారిచే గీయబడిన చిత్రాలూ అమోఘంగా ఉన్నాయి.కోనసీమ అందాలు అన్నీ కెమేరాలో చాలా బాగా బంధించారు. ఇంక సీరియల్ చిత్రీకరణకొస్తే, ఏదో ఫరవాలేదనిపించింది కానీ, మాల్గుడి డేస్ స్థాయిలేదేమో అనిపించింది. తణికెళ్ళ భరణి గారి introduction బ్రహ్మాండం గా ఉంది.కొద్ది రోజులైనా ఓ శుభ్రమైన కార్యక్రమం చూడొచ్చూ అనిపించింది.

   ఈ టీ.వీ. లో ప్రసారమయ్యే ‘పాడుతా తీయగా’ కార్యక్రమానికి శ్రీ ఎస్.పి. జుట్టుకి రంగులూ అవీ వేసికోకుండా. ‘విశ్వరూపం’ లో చూడడం నచ్చింది.ఇప్పటికైనా ఆ విషయం శ్రీ బాలూ realise చేయడం ఎంతో బావుంది.ఇంక అంతకు ముందు వారం లో ‘జీ తెలుగు’ లో వచ్చే సరిగమప జోడీల కార్యక్రమం లో ఒక అబ్బాయి తండ్రిగారు, కొద్దిరోజులక్రితమే మరణించారుట, అయినా ఇతను ఈ కార్యక్రమంలో పాల్గొన్న విషయం, అన్ని సార్లు చెప్పి, అంత dramatise చేయవలసిన అవసరం ఏమిటో అర్ధం అవలేదు. పైగా ఈ రౌండ్లు ఎస్.ఎమ్.ఎస్ రౌండ్లు, ఏదో సింపతీ వోట్లకోసం చేసినట్లుంది కానీ,జరిగిన సంఘటనలొని seriousness కనిపించలేదు. ‘పాడుతా తీయగా’ లో ఇలాటి sensationalisations కనిపించవు, అందుకే ఆ కార్యక్రమం అంత బాగుంటుంది.మిగిలిన చానెల్స్ లో వచ్చే ఇలాటి కార్యక్రమాల్లో, ఈ విషయం గమనిస్తే ఎంత బాగుంటుందో కదూ?

   నిన్న ఎన్.టి.ఆర్ ట్రస్ట్ వారు శ్రీ బాపూ రమణ లకు రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఈ సంవత్సరపు ఎన్.టి.ఆర్ పురస్కారం ఇవ్వడం ఎంతో సంతోషమనిపించింది.అక్కినేని నాగేశ్వరరావు పురస్కారం ప్రారంభం అయి, ఆరేళ్ళయినా, ఇప్పటికీ శ్రీ బాపూ రమణలకు ఆ పురస్కారంతో సన్మానించాలని తోచకపోవడం ఎంతో విచారకరం. అక్కినేని వారికి పర రాష్ట్ర కళాకారుల్ని సన్మానించడంలో ఉన్న ఉత్సాహం,మనవారిని సన్మానించాలని ఎందుకు చూపడం లేదో ఆ భగవంతుడికే తెలియాలి. Sorry! శ్రీ అక్కినేని వారు భగవంతుడిని నమ్మరుగా, మర్చిపోయాను!

   అంతే కాదు, జాతీయ పురస్కారాలకి కూడా శ్రీ బాపూ రమణలు నోచుకోపోవడం, తెలుగువారిగా మనం చేసికున్న దురదృష్టం.అందుకే అంటారు, ప్రతిభ అనేది ఉండగానే సరిపోదు, దానికి తగ్గ ‘ఆలంబన’ కూడా ఉండాలి.పాపం వీరేమో, వారిదారిన వారు వ్రాసుకుంటూ పోతారు, ఇంకోరేమో బొమ్మలు వేసికుంటూ పోతారు.మా పేర్లు రికమెండు చేయండీ అని ఎవరినీ అడగరు, అందుకే అంటారు ‘అడక్కపోతే అమ్మైనా పెట్టదూ’ అని.ఈ సంవత్సరమైనా, మన ప్రభుత్వం కళ్ళు తెరిచి, తెలుగు వారి సంపద శ్రీ బాపూ రమణ లకు జాతీయ పురస్కారం( కనీసం పద్మ భూషణ్) ఇచ్చి, మనల్ని మనం గౌరవించుకుంటామని ఆశిద్దాం. చూద్దాం ఇంకో వారం ఉందిగా !

3 Responses

 1. “….మాల్గుడి డేస్ కి శ్యామ్ బెనగల్….”

  గురూజీ మాల్గుడీ డేస్ తీసిన దర్శకుడు శ్యామ్ బెనగల్ కాదు. ఆయన తీసినది అమరావతి కథలు.

  Like

 2. బాపు రమణలు తెలుగు వారి హృదయాలలోనూ , నవ్వులలోనూ ఉన్నారు. పురస్కారాలు ఒకళ్లు ఇప్పించేవి ఏమిటి? just అలంకారాలు.

  టి‌వి గట్రా మీరు నాకు మల్లెనే ఎక్కువగానే చూస్తారన్నమాట. పైకి చెప్పకండి, జనం నవ్వుతున్నారు టి‌వి చూస్తున్నామంటే. :):):)

  Like

 3. @శివ గారూ,

  తప్పయిపొయింది.మార్పు చేశాను.

  @సుబ్రహ్మణ్యం గారూ,

  నిజమే ,శ్రీ బాపు రమణలగురించి మీరు చెప్పినది. అప్పుడప్పుడు చూస్తూంటాను.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: