బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు-కాలక్షేపం


   రెండేళ్ళక్రితందాకా, ఎప్పుడైనా కొత్త బట్టలు కావాలంటే ఏదో ఒక టైలరు దగ్గరకు వెళ్ళడం, అతనికి కొలతలిచ్చి కుట్టించుకోవడం. కొత్తబట్టల తెచ్చుకోగానే, పసుపు రాసి, కట్టేసికోవడం! చిన్నప్పుడైతే, ఏ సత్యన్నారాయణా టైలర్సో, లేక ఏ గోవిందరాజులు టైలర్సో, అక్కడిదాకానే ఉండేది నా లెవెల్.ఆ తరువాత పిల్లలొచ్చినతరువాత, వాళ్ళకి మాత్రం ఏ రెడీమేడ్ షాపుకో వెళ్ళి తీసికోవడం. అయినా ఆరోజుల్లో ఈ బ్రాండెడ్ బట్టలెక్కడుండేవీ?

   పిల్లలు ఉద్యోగాల్లోకి వచ్చినతరువాత, ఏదో అకేషన్ కి వాళ్ళ అమ్మని అడిగి నా సైజు తెలిసికుని, బట్టలు తెచ్చేవారు. అప్పటినుండీ ఈ బ్రాండెడ్ బట్టల్లొకి అడుగుపెట్టాను.ఎంతచెప్పినా వాటందం వాటిదే!!ఆ కటింగూ, ఫిటింగూ అన్నీ స్టైలిష్ గా ఉంటాయి. అలాగని ప్రతీసారీ కొనుక్కోలెనుకదా, నాకొచ్చే పెన్షనులో! ఇంకొకరికి కొనాలంటే మాత్రం సంకోచించను.

   నాకు ఏడాదికీ, ఓ అరడజను జతలుంటే రోజెళ్ళిపోతుంది.కట్టిన బట్టలే కడుతూ, మా ఇంటావిడ చేత చివాట్లు తింటూ, ‘మీ బట్టలుతకలేక ఛస్తున్నాను, కొత్తవి కుట్టించుకోండి మహప్రభో‘ అని అనిపించుకున్న తరువాత, మరీ ఏడిపిస్తే బావుండదూ అని, క్రిందటి రెండేళ్ళలోనూ వాళ్ళూ వీళ్ళూ ‘పెట్టిన’ ప్యాంటుపీసులూ, షర్టుపీసులూ తీసికెళ్ళి, ఆ మధ్యన ఓ టైలరుకిచ్చి వచ్చాను. మూడు పాంటులూ, రెండు షర్టులూ కలిపి 1100/- బిల్లేశాడు.ఇంకా తెచ్చుకోలేదు.ఏదో ఈ ఏడాదెళ్ళిపోతుందిలే అని సంతోషించాను.

   ఈ మధ్యన నా మిస్టరీ షాపింగులో, అన్నీ బట్టల కొట్టులే వస్తున్నాయి!క్రిందటి నెలలో Peter England, ఈవేళ Van Huesen, రేపు Louie Philip. వామ్మోయ్ ఒక్కసారిగా ఇన్నన్ని బ్రాండులా! వాహ్! పైగా ఒక్కొక్కటీ 1200/- దాకా కొనుక్కొమన్నారు. ఈవేళ అదేదో మాల్ కి వెళ్ళి తెచ్చాను. ఈ మిస్టరీ షాపింగు ధర్మమా అని, ఎవరితోనైనా సరే, ఏ సంకోచం లేకుండా మాట్లాడడం ఒకటి బాగా అలవాటయ్యింది.ఇంకో సదుపాయం ఏమిటంటే, ఈ పెద్ద పెద్ద షాపులకెళ్ళి కొనుక్కోవడంతో, వాళ్ళిచ్చే బ్యాగ్గుల్లో పెట్టుకుని తీసికెళ్ళడంతో, మన ఇమెజ్ కూడా బాగుపడింది! ఇదివరకెమిటీ, ఏదో ‘సత్యన్నారాయణా జనరల్ స్టోర్స్’సంచీలూ, ఎల్.జీ ఇంగువ పసుప్పచ్చ సంచీలూ ఇవేగా!!ఇప్పుడో Westside, Allen Solly,Vanhuesen, Loui Philip సంచీలు తీసికెళ్ళడం, మరి తేడా లేదూ?బస్సుల్లో ఎక్కగానే, మరీ మనల్ని ‘కొన్ కిస్కా’ గాడిలా చూడరు.చూశారా బయట కనిపించేదానితోనే అందరూ impress అవుతారు. ఆ మాల్ కి వెళ్తే, ఆ escalator మీదెళ్ళాలంటే చచ్చే భయం, ఎక్కడ కింద పడతానో అని!ఎప్పుడూ మెట్లమీదనుంచే వెళ్తాను. ఆ కొట్లలోకి వెళ్ళినప్పుడు, ఏదో పెద్దవాడిని కదా అని, ఆ కొట్లలో వాళ్ళూ బాగానే మాట్లాడుతారు.I am enjoying these assignments. at the end of the day, thats what matters!

Advertisements

3 Responses

 1. అప్పుడే కొత్త బట్టలు కొనేసారన్నమాట.నేను మీతో కొంతవరకే ఏకీభవిస్తాను.బ్రాండ్ లేదా ఖరీదైన దుస్తులు కొత్తవారిని,అదీ మొదటిసారి ఇంప్రెస్ చెయ్యటానికే పనికి వస్తాయని నా అభిప్రాయం.మనమేమిటో ముందే తెలిసిన వాళ్ళపై వీటి ప్రభావమేమీ ఉండదు.అయినా ఈ టైలర్ లతో భాధపడేకంటే రెడీమేడ్ దుస్తులే నయం,మనకు నప్పాయో లేదో కొనేముందే చూసేసుకోవచ్చు.

  Like

 2. Hello Sir…chala rojulaindhi…blog cheyytam ledhu..

  Like

 3. @వజ్రం,

  కానీ పాతరోజులు జ్ఞాపకం చేసికోడానికి, అప్పుడప్పుడు టైలర్ల దగ్గరకి వెళ్తూండాలి.

  @శిరీషా,

  అనుకున్నంతసేపు పట్టలెదు. ఇదిగో మళ్ళీ మొదలెట్టేశాను. అవునూ, ఫేస్ బుక్ లో ఏమిటీ, నోరూరించే లంచ్ లు తినేస్తున్నావూ !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: