బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- వడ్డించేవాడు…


   మనకి ఎక్కడైనా సరే influence అనేది ఉంటే, ఏ పనైనా సరే క్షణాల్లో జరిగిపోతుంది. దాన్నే ఒక్కొక్కప్పుడు recommendation అనికూడా పిలుస్తూంటారు. ఆతావాతా తెలుగులో చెప్పేదేమిటంటే ‘ వడ్డించేవాడు మనవాడైతే, ఎక్కడ కూర్చుంటేనేమిటీ..’ అని పూర్వకాలంలో అనేవారు! ఇప్పుడు ఎక్కడ చూసినా, ఈ recommendation ల పర్వమే కదా! ఆ శ్రివెంకటేశ్వరస్వామి దర్శనం, త్వరగా జరగాలీ అంటే, అదేదో సెల్లార్ దర్శనంట! హైదరాబాదులోనో ఎక్కడో వాడెవడో, ఓ లెటరిస్తాడుట, దాన్ని తీసికెళ్తే, చివరికి ఆ భగవంతుడు కూడా, ఎందుకొచ్చిన గొడవలే అనుకుంటూ దర్శనం ఇచ్చేస్తాడు! ఏమిటో ఆయనకూడా ఈ recommendation కి లోబడిపోయాడు.

ఏ రాజధాని నగరం అయినా ఆఖరికి ఢిల్లీ తో సహా, కిళ్ళి కొట్టువాడి దగ్గరనుండి, కార్పొరేటరు దాకా ప్రతీవాడికీ, ప్రభుత్వం లో ఎవడో ఒకడు తెలిసే ఉంటాడు.ప్రతీవాడూ,మనం ఏదైనా సమస్య గురించి చెప్తే,dont worry, I will do something అనేవాడే! అందుకేనేమో రాడియాల్లాటి వారు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు!

ఒక సంగతి మాత్రం అందరం గుర్తుంచుకోవాలి, ఎలాగోలాగ పాట్లు పడి, జీవితంలో ఎక్కడో చోట influence అనేది సంపాదించుకోవాలి. ఎప్పుడో అప్పుడు, ఎవరో ఒకరికి ఉపయోగిస్తుంది. అవతలివాడెదో పేద్ద ఆఫీసరే అవఖ్ఖర్లేదు, ఆఫీసులోకానీ, ఇంకో చోట కానీ పనిచేసే దర్వాన్ అయినా చాలు!ఆఖరికి, ఆఫీసరుగారి డ్రైవరైనా చల్తా హై! అలా కాదూ, ఆఫీసరుగారి పెళ్ళాం నే పట్టేస్తారా, మీకు తిరుగే లేదు! తిన్నగా కుంభస్థలాన్నే కొట్టేయొచ్చు! రైల్వేలో ఓ టి.టి తో ఫ్రెండ్ షిప్ చేయండి, మీకు ఎప్పుడు ఆఖరి క్షణాల్లో ప్రయాణం చేయవలసివచ్చినా, ఇంటికే టిక్కెట్లొచ్చేస్తాయి. ఓ పొలీసాడితో, పరిచయం చేసుకోండి, ఊళ్ళో ఎవడి బుర్ర పగలుకొట్టినా, మిమ్మల్నడిగే వాడుండడు!

అంతదాకా ఎందుకూ, ఈ గవర్నమెంటు ఆసుపత్రిలు కానీ, కార్పొరేట్ ఆసుపత్రిలు కానీ తీసుకోండి, ఒక్కడైనా తెలిసినవాడుంటే ఉండే ఉపయోగం, మీ దగ్గరెంతడబ్బున్నా దానిముందర బలాదూరే!ఒకడంటే ఒక్కడు, వాడు చివరకి వార్డ్ బోయ్ అయినా సరే, మహరాజభోగాలతో, మనకు వైద్యం జరుగుతుంది. ఎప్పుడైనా బాంకుల్లో చూస్తూంటాం, బయట ఎంత క్యూ ఉన్నా సరే, మనకి తెలిసినవాడొక్కడున్నాడంటే చాలు, ఈ క్యూలూ అవీ to hell with it!క్షణాల్లో పనిచేసికుని వచ్చేయొచ్చు!

ఊరికె స్నేహం చేయడంతోనే సరిపోదు, ఆ స్నేహాన్ని జాగ్రత్తగా maintain చేయడం ఓ కళ! పని ఉన్నా లేకపోయినా సరే, ఆయనాఫీసుకెళ్లి, ఏ రెండు మూడు నెలలకో వారిని పరామర్శిస్తూండాలి.అంతే కానీ, ఎప్పుడో పనున్నప్పుడే వెళ్ళడం కాదు.అప్పుడప్పుడు వెళ్తూ, ఆయన యోగక్షేమాలడుగుతూంటారనుకోండి, మనం ఎప్పుడైనా ఏ పనికోసమో వెళ్ళినప్పుడు, ‘ఊరక రారు మహాత్ములు’ అంటూ, ఓ కాఫీకూడా బోనస్ గా దొరకొచ్చు. అలా కాక, మన పని అయిపోయిందికదా అని, ఆయన ఉన్నాడో ఊడేడో కూడా తెలిసికోకుండా,’ రేవు దాటి తెప్ప తగలెసినట్లు’ గా ఉన్నారనుకోండి, మనం వెళ్ళీ వెళ్ళగానే ఆయన పలకరింపు కూడా అలాగే- ‘ ఏమిటీ, ఏదో పనిమీదొచ్చినట్లున్నారే, లేకపోతే, మేమెక్కడ కనిపిస్తాం లెండి’లా ఉంటుంది.ఆయనకీ తెలుసు, ఈ వెధవకి నాతో పని బడినట్లుంది, లేకపోతే ఎందుకు వస్తాడూ అని.

మనవైపు సినిమాహాళ్ళలో బుకింగాఫిసువాడు అందరిలోకీ బెస్ట్. ఏ సినిమా అయినా సరే,మొదటిరోజు మొదటాటకి మనకి టిక్కెట్లు గ్యారెంటీ!అసలు ఉద్యోగంలో ఉండగానే, మనం వివిధాఫీసుల్లోనూ, ఈ పరిచయాలు cultivate చేసికోవాలి. రిటైరయిన తరువాత మన మొహం ఎవడూ చూడడు. ఉద్యోగంలో ఉన్నంతకాలం ప్రతీవాడూ సలాం కొట్టేది, ఆ సీటుకే, మన మొహం చూసికాదు. చెప్పానుగా, ఈ రోజుల్లో ఏ పనికావాలన్నా, ‘దక్షిణ తాంబూలాలు’ తప్పని సరైపోయాయి.ఎంత చెట్టుకంత గాలి లా ఎంత దక్షిణకి అంత పని!

మా చిన్నతనపురోజుల్లోనూ ఉండేవి, ఇలాటివన్నీనూ, కానీ ఇంత commercialise కాదు. ఏదో పాఠాలు చెప్పిన మాస్టారి కొడుకూ అనో,ఫలానా వారికి చుట్టమనో చెప్పినా చాలు పన్లైపోయేవి. అక్కడ మన గొప్పతనం చూసి కాదు, మనం ఎవరిపేరైతే చెప్పేమో వారిని బట్టి! అంతదాకా ఎందుకూ, నాకు ఉద్యోగం వచ్చింది, మా అమ్మమ్మ గారికి మనవడినై పుట్టినందుకూ, మా అమ్మగారికి కొడుకునై పుట్టినందుకూ! ఎందువలనా అంటే, నా చదువుకి, పిలిచి ఉద్యోగం ఇచ్చినాయన, పై విధంగా మాకు పరిచయం! ఇప్పటికీ, నోట్లో రెండు పూట్లా ముద్దెళ్తోందంటే వారి చలవే!

నేను ఇక్కడ, రెండు సార్లు కమాండ్ హాస్పిటల్లోనూ, ఒకసారి మిలిటరీ హాస్పిటల్లోనూ, ఏ శ్రమా లేకుండా వైద్యం చేయించుకుని, లక్షణంగా ఇంటికొచ్చానంటే కారణం మా స్నేహితుడు బాలరంగయ్యగారూ, మా కజిన్ సదానందా నూ.Influence అనేది జీవితంలో ఎంత ముఖ్యమో,అప్పుడర్ధమయింది. మనం ఓ తీగ లాటివారం,అది ప్రాకడానికి ఓ పందిరో ఏదో, ఆఖరికి ఓ పుల్లయినా కావాలి కదా. అలాగే ఈ పరిచయాలూనూ.మనకి ఏదో ఉపయోగిస్తాడులే అని పరిచయం చేసికోకూడదు.మన ప్రవర్తనని బట్టి వారే మనకి ఉపకారం చేయొచ్చు.ఎందుకంటారా, ఈ రోజుల్లో ప్రతీ చోటా, ఎవరో ఒకరు తెలిసిన వారు లేకుంటే పన్లవడం చాలా కష్టం.నాకేమిటీ, డబ్బు పారేస్తే అదే అవుతుందీ అనుకోకండి, డబ్బొకటే కాదు ముఖ్యం. దాన్ని తీసుకోడానికి కూడా ఓ తెలిసినవాడుండాలి!! ఈ రొజుల్లో ఎవడుపడితే వాళ్ళదగ్గరనుంచి డబ్బులు తీసికోవడం లేదు. ఆ ఇచ్చినవాడు, ఏ ACB వాడో,ఏ T.V. వాడో అయితే ఖర్మ!ఉన్న ఉద్యోగం కూడా పోతుంది!

Advertisements

7 Responses

 1. మనం ఓ తీగ లాటివారం,అది ప్రాకడానికి ఓ పందిరో ఏదో, ఆఖరికి ఓ పుల్లయినా కావాలి కదా.
  ———
  అబ్బా ఎంత చక్కగా చెప్పారు. థాంక్స్ ఫర్ ది పోస్ట్ .
  హ్యాపీ న్యూ ఇయర్.

  Like

 2. రావుగారూ,

  నా టపా నచ్చినందుకు ధన్యవాదాలు. మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు

  Like

 3. బైక్ వెనుక.. కారువెనుక ఈ మధ్య చాలా చోట్ల ఆర్మీ.. పోలీస్ అని రాయించుకుంటున్నారు.. కారణం ఏంటంటే.. ట్రాఫిక్ పోలీస్ వాడు ఆపడని అంట.. ఇంతకూ వాళ్ళ ఎదురింటి బాబాయ్ గారి తోడల్లుడో.. లేక పక్కింటి అంకుల్ తమ్ముడు కొడుకో తప్ప ఎవడూ ఆర్మీలోనూ.. పోలీస్ లోనూ వుండడు.., అలా వున్న వాళ్ళకొడుకులు ఎలాగూ రాయించుకోవటంలేదు.
  దీనినిబట్టి తెలిసిందేంటంటే.., influence వుంటే సరిపోదు.. ఈ influence ని ఉపయోగించుకోవటం కూడా తెలియాలి.. 🙂

  మీ పోస్టు అద్భుతంగా రాసారు.. నేను నా బైక్ వెనుక.. రిటైర్డ్ ఆర్మీ అని రాయించుకుంటా.. మీరు నాకు తెలుసు కదా.. !! D-)

  Like

 4. అందరూ ఆర్మీనేనా? ‘నేవీ’ అని రాయించుకుంటే, చేపలు, రొయ్యలు చవగ్గా , ‘వాయుసేన ‘ అని రాసుకుంటే, వంటవాయువు(గ్యాస్), విమాన టికెట్లు తగ్గింపుధరలకిస్తారంటారా? :))

  Like

 5. /ఆ ఇచ్చినవాడు, ఏ ACB వాడో,ఏ T.V. వాడో అయితే ఖర్మ!ఉన్న ఉద్యోగం కూడా పోతుంది!/

  భలేవారే! ఎందుకు పోతుందండి? ఏ మినిస్టర్పేరో చెప్పో, ఎసిబి వాడి చేయి తడిపో వుద్యోగం తెచ్చుకుంటాము. 😛

  Like

 6. @శ్రీనివాసా,

  నన్ను నమ్ముకుని, ఆర్మీ అని వ్రాయించుకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లే !

  @snkr,

  మీరు చెప్పేదాంట్లోనూ నిజం ఉన్నట్లే కనిపిస్తోంది!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: