బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-ఎవరి బాధలు వాళ్ళవి…


   ఈవేళ సాయంత్రం, మా ఫ్రెండొకరున్నారు,వారింటికి వెళ్ళాము. ఆయన నాకంటె రెండు సంవత్సరాలు ముందే రిటైరయ్యారు. అదీ ఇదీ అంటే మరేమీలేదూ, ఉల్లిపాయ ఖరీదులూ, మాకు కాంటీను లో సరుకులు తక్కువ ధరలకి ఎలా దొరుకుతాయో వగైరా పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకున్న తరువాత, ఆయన వెళ్ళబోసుగున్న ‘బాధలు’ వింటూంటే, మేము ఎంత అదృష్టవంతులమో అనిపించింది!ఆ భగవంతుడి దయవలన, మా పిల్లలిద్దరికీ, 25 ఏళ్ళు నిండేటప్పటికే, వాళ్ళు కోరిన వారినిచ్చి పెళ్ళిళ్ళు చేసేశాము. వాళ్ళూ ఇద్దరేసి పిల్లలతో సుఖంగానే ఉంటున్నారు.ఇందులో మేమేమీ ఘనకార్యం చెసేశామని అనడం లేదూ, ఏదో అలా అన్నీ కలసొచ్చాయి అయింది.పిల్లలిద్దరికీ ఒకళ్ళకొకళ్ళు నచ్చితే చాలూ అనుకున్నాము. వాళ్ళూ సుఖంగానే ఉన్నారు, మమ్మల్నీ తాతయ్య, అమ్మమ్మ/నానమ్మ చేసేశారు.ఇంకో రెండు మూడేళ్ళు అయిన తరువాత అయితే, మాకూ (స్పెషల్లీ మా ఇంటావిడకి మరీనూ)ఓపికా ఉండేది కాదు, పురుళ్ళూ పుణ్యాలూ చూసుకోడానికి.అందుకే అంటాను ఏది జరిగినా మన మంచికే అనుకున్నట్లయితే, అన్నీ బాగానే ఉంటాయి.ఆ భగవంతుడు చల్లగా చూస్తే చాలు.

   ఇప్పుడు వెళ్ళేనే ఆయనకి ముగ్గురు కొడుకులు, ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసేసి, తాతయ్యా, బామ్మా అయ్యారు.ఇప్పుడు మూడో కొడుక్కి చేయాలి. ఏదో మన రాష్ట్రం మీదా, ఆచారవ్యవహారాలమీదా అభిమానం కొద్దీ, తెలుగు సంబంధాలే చూస్తూఉన్నారు ఇన్నాళ్ళూ. కానీ ఈ విషయంలో ఆయనకి అయిన అనుభవాలు చెప్పి, వాళ్ళ కొడుకూ, డాడీ ఆంధ్రా సంబంధాలు చూడ్డం మానేసి, హాయిగా ఇక్కడే పూణే లోనో, ముంబైలోనో సంబంధం చూడండి, అక్కడివాటితో విసుగొచ్చేసిందీ అన్నాడుట.

   ఏం లేదూ, వీళ్ళూ నెట్ లో వచ్చే యాడ్ లు చూసే సంప్రదించేవారు.కానీ వచ్చిన గొడవేమిటంటే,ఆ వధువు కి సంబంధించిన వారు, అన్నీ సరిపోయినా సరే, ఓ పట్టాన సమాధానం చెప్పకపోవడం, ఈయనేమో ఎన్నిసార్లు ఫోను చేసినా, ‘ఇంకా మా అమ్మాయి అభిప్రాయం అడగలేదండీ, ఇదిగో రెండు మూడు రోజుల్లో వస్తూంది, ఏవిషయమూ కనుక్కుని చెప్తామూ’ అని!కమ్యూనికేషను ఇంత ఫాస్ట్ అయినరోజుల్లో కూడా, ఇలాటి సమాధానాలు వింటూంటే, ఈయనకేమో చిరాకొచ్చేస్తుంది. వీళ్ళేమో క్లియర్ గా అప్పుడే చెప్పేశారు, మాకైతే మీ అమ్మాయి నచ్చిందీ, మీ అభిప్రాయం కూడా చెబితే, ముహూర్తాలు పెట్టుకుందామూ అని.అంటే 50% అయిపోయినట్లే కదా!ఆ మిగిలిన 50% దగ్గరే వస్తోంది గొడవంతానూ. ఓ పట్టాన చెప్పరూ, ఎప్పుడో చెప్పినా, ‘పూణె అంటే ఇక్కడికి ( అంటే విజయవాడ కి) చాలా దూరం అంటున్నారండీ, మా ఇంట్లో పెద్దాళ్ళు’ అని. అమెరికా అయితే ఫరవా లేదుట, కానీ పూణే నా? హైదరాబాదయినా ఫరవాలేదు! ఇది మరీ అన్యాయం అండి బాబూ!

   ఇదివరకటి రోజుల్లో కూతురికి పెళ్ళి చేయాలంటే చెప్పులరిగేలా తిరిగేరనేవారు. ఇదేమిటో చిత్రం, మగపిల్లాడి పెళ్ళికి కూడా ఇలా తిరగవలసివస్తోందనుకోలేదు ఆయన!పోనీ ఆ పిల్లాడికేమైనా కాలొంకరా, కన్నొంకరా ఉందా అంటే అదీ లేదు. శుభ్రంగా 28 ఏళ్ళ young and handsome bridegroom! హాయిగా ఐ.టి.లో ఉద్యోగం, ఏ బరువూ బాధ్యతా లేదు. ఓ కారుకూడా కొనుక్కున్నాడు.
అసలు మనవైపు వారి కోరికలు ఏమిటో ఆ మాట్రిమోనియల్ యాడ్ లో ముందరే పెట్టేస్తే,వారికి తగ్గ సంబంధాలే వస్తాయిగా. అన్ని వివరాలూ వ్రాయరు, దేనికైనా transparency అనేది ఉండాలి.లేకపోతే ఇలాగే ఉంటుంది. చివరదాకా వచ్చిన తరువాత ఎదో సాకు చెప్పేసి వద్దనేయడం.ఇలా నాలుగైదు సంబంధాలు తప్పిపోయేసరికి,ఇటు ఈ కుర్రాడికీ డౌటొచ్చేస్తుంది, ఇదేమిటీ మనలో ఏదైనా లోపం ఉందేమో అని!అమ్మాయైనా, అబ్బాయైనా ఇదే పరిస్థితి.ఏమిటో ఎప్పుడు బాగుపడతారో ఈ తల్లి తండ్రులు? ఏదో దొరికిన సంబంధమే చేసేయాలని కాదు,అన్నీ చూసుకునే చేయాలి. కానీ ఈ ‘అన్నీ’ అనేది ఓ relative term. ‘అన్నీ’ అంటే ఏమిటి?పెళ్లికొడుకు రూపం, ఉద్యోగం,సంపాదన వరకూ బాగానే ఉన్నాయి. మరి ఇంకా ఏమిటిట? ఈ ‘అన్నీ’ ల గురించి, మొదట్లోనే మొహమ్మాట పడకుండా చెప్పేస్తే అటువారికీ, ఇటువారికీ ఈ ఈతిబాధలు తప్పుతాయికదా.అసలే male/female ratio చాలా alarming గా ఉందని ప్రతీ రోజూ పేపర్లలో చదువుతున్నాము. దీనికి సాయం ఈ మనస్థత్వాలు కూడా తోడయ్యేయంటే ఇంక అడగఖ్ఖర్లేదు!

   ఈ కార్యక్రమాలన్నీ పూర్తయి ఓ ఇంటివాడో/ ఇల్లాలో అయేసరికి 30-35 ఏళ్లొస్తాయి. ఇక్కడేమో ఈ తల్లితండ్రులకు 70 దాటుతాయి. అప్పుడు పురుళ్ళూ,పుణ్యాలూ చూసే ఓపికా ఉండదు. మళ్ళీ ఏమీ సహాయం చేయటల్లేదో అని గోలా!
ఎందుకొచ్చిన గొడవలండి బాబూ, ఏదో ఆ ‘అన్నీ’ లన్నీ ముందరే చెప్పేసి, పిల్లల్ని చిలకా గోరింకల్లా హాయిగా పెళ్ళవలసిన టైముకి చేసేస్తే ఎంత హాయండి !

Advertisements

6 Responses

 1. “అమెరికా అయితే ఫరవా లేదుట, కానీ పూణే నా? ”
  భలే నిజం చెప్పారు. మా బంధువులబ్బాయికి సరిగ్గా ఇలాగే అయింది. ఇంకోటి ఈ మధ్య – అమెరికా సంబంధమయినా సాఫ్టువేరంటేనే పచ్చజెండా – ఇంకే వుద్యోగమయినా, సాక్షాత్తూ ఒబామాకి పర్సనలి సెగట్రీ అయినా ఠాట్ వీల్ళేదుట

  Like

 2. కొత్తపాళీ గారూ,

  మీరు స్పందించిన పధ్ధతి చాలా బాగుంది!

  Like

 3. బోలెడన్ని నిజాలు చెప్పారండీ… పెళ్ళిసంబంధాలలో ట్రాన్సపరెన్సీ లేకపోవడమే ఒక అర్హతగా తయారయ్యిందండీ ఈ మధ్య. ఉన్నదున్నట్లుగా మాట్లాడుకుని సూటిగా వ్యవహారం తేల్చేవాళ్ళు చాలా తక్కువ.

  Like

 4. Ippudu ammailade raajyam andee guruvu gaaroo. Maa friend and room mate sambandhaala vishayam choostunnaanu kadaa… Ammaila talli tandrulu koncham haayigaa unde rojulu 3 samvatsaraallo vachhestai. Inkoka 10 aellallo KANYASULKAM. 🙂

  Chandu

  Like

 5. అవునండీ.. అమ్మాయిల తల్లిదండ్రులు ఏ.సీ లేకపోయినా చల్లగా నిద్రపోతున్న రోజులు. మా ఫ్రెండ్స్ విషయంలో చూస్తున్నాంగా. నాన్చి నాన్చి నెలతరువాత ఏదో సాకు చెబుతున్నారు. అమ్మాయివాళ్ళ రిక్వైర్మెంటేంటో ఆ దేవుడికే తెలియాలి మరి.
  కట్నం అడిగితే ఒక తప్పు.. అదిగో అడిగాడు అని. అడక్కపోతే.. అదిగో.. అడగటంలేదంటే.. ఎదో లోపం.. ఇలావుంది వరస..
  అన్నీ కాంప్రమైజు అయ్యినా సరే దొరక్కపోతే ఎలాగండీ..!!

  త్వరలో ఎలాగూ కన్యాశుల్కమే..

  మ్చె.. నాకు అమ్మాయి పుట్టినా బాగుండేది… 😀

  Like

 6. @వేణూ శ్రీకాంత్,

  అందుకనే ఓ సంబంధం నిశ్చయించుకోడానికి అంతంత సమయం పడుతోంది.

  @చందూ,

  నేను ఈమధ్య observe చేసిందేమిటంటే, ఊరికే అబ్బాయిల్నే ఆడిపోసుకోనఖ్ఖర్లేదు. నాకు తెలిసిన ఒకరికి ఇప్పటికి ఓ అరడజను సంబంధాలు చెప్పినా ఏదో కారణం చెప్పి reject చేస్తున్నారు. అందువలన అమ్మాయిలేం తక్కువ తినలేదు. जैसॅ को तैसा !!

  @శ్రీనివాసా,

  మరీ అన్నాననికాదు కానీ, ఇప్పుడు మాత్రం ఏం ఆలశ్యం అయింది బాబూ, 2011 Model ఓ అమ్మాయిని కనేస్తే పోలా !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s