బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


   మొత్తానికి అనుకున్నంతా అయింది. మా ఇంటావిడ, నేను బయటికి వెళ్ళినప్పుడు, మా అబ్బాయీ, కోడలుతోటీ, అప్పుడెప్పుడో నేను రోడ్డు క్రాసు చేస్తూండగా ఓ సైకిలు వాడొచ్చి ఢీ కొడితే, నేను క్రింద పడ్డానని!నేను ఇంటికి వచ్చేటప్పడికి, అనుకున్నట్లే, మా అబ్బాయీ,కోడలూ ఓ లెక్చరిచ్చేశారు. అదేమిటి డాడీ, అలా జరిగినప్పుడు మాతో ఒకసారి చెప్తే ఏం పోయిందీ? అని.దానివలన, నన్ను ఎక్కడికీ బయటకు వెళ్ళడానికి వీల్లేకుండా చేయడం తప్ప, నాకు ఒరిగిందేమిటీ? నేను పడే బాధేదో నేనే పడాలికదా.దానికి సాయం మీ అందరి చివాట్లోటీ.అందుకే చెప్పలేదు,అన్నాను.

   మా కోడలు చెన్నై నుండి తిరిగి వచ్చేయడంతో, మేము మా కొంపకి వచ్చేశాము.ఈవిడ సరుకులన్నీ వచ్చాయో లేదో చూడ్డం నాకు అప్పజెబుతూంటుంది.ఈవేళ వచ్చేటప్పుడు, కళ్ళజోడు పెట్టి తెచ్చాను,దాంట్లో కళ్ళజోడు లేకుండా! సుఖపడ్డాను, కంప్యూటరు నాకొదిలేసింది!అక్షరాలు కనిపించవు పాపం!ఇటుపైన ఎప్పుడైనా ఇలా కంప్యూటరు నేనే ఉపయోగించుకోవాలీ అనుకున్నప్పుడల్లా, ఇలా ఖాళీ కళ్ళజోడు పెట్టి తెస్తే సరి,సుఖ పడతాను! అబ్బే అంత ఈజీయా ఈవిడతో, పోనీండి, ఇక్కడకూడా ఓ కళ్ళజోడు స్టాండ్ బై పెట్టుకుంటే బాగుంటుందేమో అంటోంది!

   నిన్న ప్రొద్దుట పేపరు తెచ్చుకోడానికి వెళ్ళినప్పుడు, ఒకతను, ఏదో క్రిందబడితే, తీసి, ఎవరికో చెయ్యూపుతున్నాడు. ఆ అబ్బాయి తన ఫోనులో మాట్లాడుకోవడం తప్ప, చెయ్యూపుతున్నతనివైపు చూస్తేనా!చివరికి ఏమిటీ అని అడిగితే, నా చేతిలో పెట్టాడు.సరే ఈ సంగతేదో చూద్దాం అనుకుని,ఆ అబ్బాయి ఫోనులో మాట్లాడ్డం పూర్తయేదాకా ఉండి, అడిగాను- నీ జేబులోంచి ఏదైనా పడిపోయిందా అని, అబ్బే ఏం లేదూ అన్నాడు. కాదు ఓసారి చూసుకో అనగానే, జేబులు వెదుక్కుని, అయ్యో నా ఐ.డి. కార్డ్ పడిపోయిందీ అన్నాడు. మరి అతనెవరో నీ జేబులోంచి పడిన ఈ కార్డు తీసి, నిన్ను పిలుస్తూంటే, కనీసం రెస్పాండేనా చేయొచ్చుకదా అన్నాను.అంటే అతనన్నాడూ, ఫోనులో మాట్లాడుతూ, అంత ధ్యాస పెట్టలేదూ, సారీ అన్నాడు. ఆ కార్డు అతనికిచ్చేసి, రోడ్డుమీద వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలో వగైరాలమీద ఓ లెక్చరిచ్చేసి వెళ్ళాను. చిత్రం ఏమిటంటే, ఈవేళ, నేను పేపరు తీసికెళ్ళడానికి వెళ్ళినప్పుడు, ఆ అబ్బాయి కంపెనీ బస్సుకోసం చూస్తున్నాడనుకుంటాను, ‘అంకుల్, ఈవేళనుండీ జాగ్రత్తగా ఉంటానూ..’అని పలకరించాడు.

   అలాగే అప్పుడెప్పుడో, మిస్టరీ షాపింగుకి, టైటాన్ ఐ షాపుకి వెళ్తే, 11.30 అయినా,షాపు తెరవలెదు.11.00 కి తెరవాలి. తీరిగ్గా వచ్చి తెరిచాడు.ఇదేమిటీ, ఇంత లేటయిందీ అంటే ట్రాఫిక్ జాం, ఆలశ్యం అయిందీ అన్నాడు. ప్రతీరోజూ ట్రాఫిక్ జామ్ ఉంటూనే ఉంటుంది కదా, ఓ అరగంట ముందే బయలుదేరితే, ఓ గొడవే ఉండదుగా అన్నాను. ఆ సంగతే మర్చిపోయాను. నిన్న నేను వెళ్తూంటే, నా పక్కన ఓ బైక్కతను ఆగి, హాయ్ అంకుల్ అని పలకరించాడు. ఆ హెల్మెట్ లో అతనెవరో తెలియక, ఆప్ కౌన్ హై అంటే, నేను ఈమధ్య ఓ అరగంట ముందరే బయలుదేరి, షాప్ టైముకే తెరుస్తున్నానూ అన్నాడు. ఆ టైటాన్ సంఘటన జరిగి నెల పైగా అయింది.అప్పుడు గుర్తొచ్చింది, ఈ కుర్రాడు, ఓహో అతనా అని! నాకైతే చాలా సంతోషం వేసింది. నేను చెప్పిన మర్నాటినుండీ, తన పధ్ధతి మార్చుకోవడమే కాకుండా,గుర్తు పెట్టుకుని నాతో చెప్పడం.నేను చెప్పింది వినాల్సిన అవసరం ఆ అబ్బాయికి లేదు, అయినా నేను చెప్పింది ఆచరించాడు. అప్పుడు అర్ధం అయింది,చెప్పవలసిన పధ్ధతిలో చెప్తే,ఎవరైనా వింటారూ అని!

   వచ్చిన గొడవల్లా ఏమిటీ అంటే, ఈగోలు.వాటిని పక్కకు పెట్టి,అవతలివాడు చెప్పేది మన మంచికే ప్రతీ వారూ అనుకుంటే, ఈ దెబ్బలాటలూ, దీక్షలూ, ధర్నాలూ ఉండనే ఉండవు.పాలక పక్షం చేసేవి అన్నీ తప్పుల తడకలే అని ప్రతిపక్షాలూ, ప్రతిపక్షాలు చేసేది ఎప్పుడూ కుట్రే అని పాలకవర్గం వారూ భావిస్తున్నంతకాలం, పార్లమెంటు సమావేశాలూ, అసెంబ్లీ సమావేశాలూ, ఈమధ్యన జరిగేయ్ చూడండి, అలాగే తగలడతాయి. ఉల్లిపాయ ధర 100 దాటుతుందంటున్నారు. గత రెండు నెలలుగా చేతికొచ్చినట్లు export చేసికోనిచ్చి, స్టాక్ అంతా బయటకు పోనిచ్చారు, ఇక్కడ ఉన్నదేమో అయిపోయింది. ఉన్నదానికి రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. ఓ నెల పోయిన తరువాత, ఇదిగో ఉల్లిపాయ ఖరీదు తగ్గించడానికి బయటి దేశాలనుండి import చేస్తున్నామూ అంటారు! మళ్ళీ దాంట్లో కొంత తినేయడం! చివరకు తేలేదేమిటంటే, మన మంత్రుల జేబులు నిండడం.

   చిత్రం ఏమిటంటే, ఏ పార్టీ వారు పవర్ లోకి వచ్చినా, మన బ్రతుకులింతే.లేకపోతే ఒకటి చెప్పండి,ప్రతీ పార్టీ లోనూ స్కాం లున్నాయి.వీడింత తిన్నాడని వాడూ, వాడింతతిన్నాడని వీడూ అనడమే తప్ప, ఏమైనా చేస్తున్నారా, ఏమైనా చేశేరా, ఇంక్వైరీలూ, కమిషన్లూ తప్ప! ఒకడి వీపు ఇంకోడు గోక్కోడం ఒకటీ మిగిలింది.మన జాతకాలలాగే ఉన్నాయి!
సర్వే జనా సుఖినోభవంతూ !

Advertisements

4 Responses

 1. >>>>వచ్చిన గొడవల్లా ఏమిటీ అంటే, ఈగోలు.వాటిని పక్కకు పెట్టి,అవతలివాడు చెప్పేది మన మంచికే ప్రతీ వారూ అనుకుంటే, >>>>

  చాలా బాగా చెప్పారు. దెబ్బలాటలూ, దీక్షలూ, ధర్నాలూ వరకూ అక్కరలేదండి. ముందు కుటుంబ సభ్యులందరూ ఇంట్లో ఇది పాటిస్తే సుఖశాంతులు ఉంటాయి.

  మీ బ్లాగు మీరు రాజమండ్రిలో ఉండి రాస్తున్నప్పటి నుండి చదువుతున్నాను. కానీ నాకు వర్డ్‌ప్రెస్ బ్లాగుల్లో కామెంట్ రాయాలంటే ఉన్న చికాకు వల్ల మీ బ్లాగులో ఎప్పుడూ వ్యాఖ్యానించను.
  ఎలాగూ ఇప్పుడూ వ్యాఖ్యరాస్తున్నా కనుక మీ పుట్టిన రోజు శుభాకాంక్షలు అందుకోండి, ఇదేమిటి? దొంగ పడిన ఆర్నెల్లకి సామెతలా అనుకోకండి.

  Like

 2. బాబుగారూ!

  ‘చెప్పే’ కాదు ‘చెప్పవలసిన’ పధ్ధతిలో చెప్పాలన్నారు చూడండి…..సూపర్బ్!

  మా బ్యాంకు జీ ఎం కి ఈ పధ్ధతిలోనే చెప్పించా…..మా సీ ఎం డీ తో! దెబ్బతో అన్నీ సెటిల్!

  ఆవేదన పడకండి…..దింపేద్దాం వీళ్లందరినీ……త్వరలో!

  మీ కృషిని కొనసాగించండి.

  “వుందిలే మంచీ కాలం ముందుముందునా……!”

  Like

 3. > మిస్టరీ షాపింగుకి, టైటాన్ ఐ షాపుకి వెళ్తే, 11.30 అయినా,షాపు తెరవలెదు.11.00 కి తెరవాలి
  ఆలా లేటుగా ఒపెన్ చెయ్యడం కూడా, మీ Note / Observation లో వ్రాసి పంపిస్తారా?

  Like

 4. @ఎస్ గారూ,

  ధన్యవాదాలు శుభాకాంక్షలకి. అవునూ, మీకు WordPress అంటే అంత చిరాకెందుకండి బాబూ? ఏణ్ణర్ధంనుండి వ్రాస్తున్నాను, ఎవరూ ఇప్పటిదాకా ఇలా అనలేదు.

  @కృష్ణశ్రీ గారూ,

  ధన్యవాదాలు.

  @పాని పూరి,

  ఇలాటివేమైనా జరిగినప్పుడు, నా రిపోర్ట్ లో వ్రాస్తాను.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: