బాతాకాని-లక్ష్మిఫణి కబుర్లు-అయిపోయుండేది నా పని…


   మొన్న 16 వ తారీఖున, మేముండే ఫ్లాట్ నుండి, మా ఇంటికి వెళ్ళడానికి బస్సెక్కి, కడ్కీ స్టేషను దగ్గర దిగాను. అటువైపు వెళ్ళడానికి రోడ్డు క్రాస్ చేయాలి. కార్లూ, బస్సులూ వెళ్ళేదాకా ఆగి వెళ్ళొచ్చులే అనుకుంటూ, ఇన్ కమింగు ట్రాఫిక్కుకేసి చూస్తూ, అది ఆగగానే, రోడ్డు క్రాస్ చేయడం మొదలెట్టానో లేదో, అటువైపునుంచి ( రాంగ్ సైడు) నుండి ఓ సైకిలువాడొచ్చి, నన్ను క్రింద పడేయడమూ, నేను రోడ్డుకడ్డంగా బోర్లా పడ్డమూ, చేతిలో ఉన్న సెల్ ఫోను ఓ మూలకీ, భుజాన్నున్న సంచీ జారిపోవడమూ క్షణాల్లో జరిగిపోయింది! బస్ స్టాప్ లో ఉన్న అందరూ వచ్చిలేవదీశారు.ఎలాగొలాగ లేచి నుంచుని, కాళ్ళేమీ విరగలేదు కదా అని చూసుకున్నాను.ఏదో కొద్దిగా మోకాళ్ళమీద కొట్టుకుపోయింది.అంత సడెన్ గా పడితే నొప్పి పెట్టకుండా పోతుందా ఏమిటీ?

   ఆ సైకిలువాడిని ఛడా మడా తిట్టి, అసలు నువ్వెందుకు రాంగ్ సైడులో వచ్చావయ్యా అంటే, వాడు ఏదేదో సారీలూ అవీ చెప్పి మాఫ్ కీజియే అంటూ గోల పెట్టాడు. పైగా మై ఆప్ కా బేటా సమఝ్ కే మాప్ కీజియే అంటూ. పైగా ఇదో చుట్టరికం కూడానా? హాస్పిటల్ కి తీసికెళ్ళమంటారా అంటూ. ఏ కారో, ఆటోయో అయితే అదో సంగతీ. మరీ సైకిలేమిటండి బాబూ! మరీ బిలో డిగ్నిటీ అనుకుని, అసలే సైకిలు తొక్కడం కూడా రాదూ, దానికి సాయం సైకిలుకింద పడితే ఇంకెమైనా ఉందా అప్రతిష్ఠ కూడానూ!అప్పుడనిపించింది, అది ఏ కారో, ఆటోయో అయి ఉంటే అసలు శాల్తీయే గల్లంతయేదని! నేనూ లేను, నా బ్లాగ్గులూ లేవు! అందుకనే ఎటువంటి ట్రాజెడీ అయినా సరే, దానిలోని పాజిటివ్ విషయం చూస్తేనే మనం బ్రతక్కలం.

   అసలు ఈ గొడవంతా ఎందుకు వచ్చిందీ అంటే, రోడ్డుమీదెళ్ళే ప్రతీ వాహన దారుడూ, అవకాశం వస్తే కార్నర్లు కట్ చేయడం వలనే కదా! పొనీ ఓ రోడ్డుందీ, దానికి ఓ డివైడరోటి తగలడిందీ, ఎవరి దారిన వాళ్ళే వెళ్ళాలీ అనే ఆలోచనే ఉంటే ఈ ఆక్సిడెంట్లూ అవీ జరక్కుండా ఉంటాయి కదా. అబ్బే,వాళ్ళకంటే మనమే తెలివైనవాళ్ళమూ అనుకోవడం, ఎలా తోస్తే అలా సిగ్నల్స్ బ్రేక్ చేసికుంటూ పోవడమే. ఎప్పుడో దేన్నో గుద్దేస్తాడు కహానీ ఖతం !

   అసలు విషయానికొస్తే, ఈ సంగతి-ఇలా రోడ్డుమీద పడ్డానూ అని మా వాళ్ళకి తెలిస్తే ఖానా పానీ బంధ్! ఓ మంచం మీద కూలేస్తారు. బయటకు వెళ్ళడానికి వీల్లేకుండా, పథ్యం భోజనం వగైరాలతో! వాటికంటే ఈ నొప్పే నయం బాబూ అనుకుని, ఎవరికీ చెప్పలెదు.పైగా ఆ రొజు గురువారం అవడంతో కరెంటు కూడా లేకపోవడంతో, మా ఫ్లాట్ లోకి,నాలుగంతస్థులూ నడిచే ఎక్కాల్సొచ్చింది! చెప్పుకోలేనూ, ఏం చేస్తాను? ఇంక అక్కడ కొద్దిసేపు కూర్చుని, మేముండే ఫ్లాట్ కి వచ్చాను.ఇంక మా ఇంటావిడ కళ్ళెట్లా కప్పడమా అని ఆలోచించి, పోన్లే ఆ పడ్డప్పుడు, పాంటూ అదీ మోకాళ్ళమీద చిరగలెదూ అనుకున్నాను. లేకపోతే ఆవిడ కనిపెట్టేసి, సంగతంతా తెలిసేసికుని, పిల్లలకి ఫోన్లూ వగైరా చేసేసి, వాళ్ళచేతకూడా చివాట్లు పెట్టించేసి, ఏ డాక్టరుదగ్గరకో తీసికెళ్ళిపోయేది! చూశారా పాంటు మోకాలిమీద చిరక్కపోవడం కూడా పాజిటివ్వే మరి! అలాగన్నమాట మనం ప్రతీ విషయంలొనూ పాజిటివ్ గా ఉండేదే చూస్తే జీవితమంతా హాయి! అక్కడికేదో, నాకు జరిగిన ఆక్సిడెంటు విషయం మా వాళ్ళనుండి దాచాలని కాదు, ఊరికే టెన్షన్ పడిపోయి పానిక్ అవుతారూ అనే నా ఉద్దేశ్యం. ఆ తరువాతెప్పుడో, నాకారోజు అలా అయిందీ అని చెప్తే,ఆ విషయం వేరూ. మహ అయితే బయటకు వెళ్ళొద్దూ, వెళ్ళినా జాగ్రత్తగా ఉండూ తో సరిపోతుంది.అయినా జరిగేదేదో జరక్కా మానదూ!అవన్నీ ఆలోచిస్తూ కూర్చోడం నాకు అసలే పడదు.పైగా లేనిపోని టెన్షన్లోటీ. బయటకు వెళ్ళినప్పుడల్లా ప్రతీ అరగంటకీ నన్ను వాళ్ళకి ఫోను చేయమనో, లేక వాళ్ళే ఫోను చేయడమో, అసలే ఆ బస్సుగోలలో ఆ ఫోను వినిపించి చావదూ. ఇవన్నీ అవసరమంటారా?

   చెప్పొచ్చేదేమిటంటే అయ్యలారా, అమ్మల్లారా మీరు కార్లలోనూ, స్కూటర్లమీదా, బైక్కులమీదా వెళ్ళేటప్పుడు సిగ్నల్స్ పాటిస్తూ, రాంగ్ సైడుల్లోంచి వెళ్ళకండి. మీరే కాదు, ఏ సైకిలుమీదో స్కూలికెళ్తున్న మీ పిల్లలకి కూడా చెప్పండి, ఎప్పుడైనా రాంగ్ సైడులో వెళ్తే, ఇదిగో ఈ బాబాయి గారిలాటివారు బలైపోతారూ అని.

   ఇప్పుడు నేర్చుకున్న నీతి ఏమిటయ్యా అంటే బయటకి వెళ్ళినప్పుడు మనం రూల్స్ ఫాలో అవుతున్నామా అనే కాక,అక్కడ నడిపేవాళ్ళు సరీగ్గా ఉన్నారా లేదా అని కూడా ఓ నజర్ వేయాలని!చచ్చినట్లు రెండువైపులా చూసుకుని మరీ, రోడ్డు క్రాస్ చేస్తున్నాను. బైదవే, ఈవేళే నొప్పీ అదీ తగ్గింది. మరీ నెను వ్రాసిన టపా చదివి తెలిసికుంటే బాగోదని, మా ఇంటావిడకి చెప్పేశాను. ఢూం ఢాం అందనుకోండి.అయినా ఇలాటివన్నీ పట్టించుకుంటే ఎలాగా?

Advertisements

6 Responses

 1. ఫణిబాబుగారు, ఈ వయసులో ప్రేమ లో పడలేదు! ఫరవాలేదు! రోడ్డు మీదే
  పడ్డారు.ఈ విషయం మా ఆవిడతో చెబితే అమ్మో అని, నన్నూ జాగ్రత్తగా
  వుండమని చెప్పటమే కాకుండా బొంబాయినుంచి నిన్ననే వచ్చిన మా
  అబ్బాయితో నాన్నగారిని సాయంత్రం పూట బయటకు వెళ్ళొద్దని చెప్పరా
  అని హుకుం జారీ చేసింది.

  Like

 2. ayyo..

  Like

 3. padipovadamlo kuda positiveness vethike meeku nijanga hatsoff

  Like

 4. @గురువుగారూ,

  ఇదేనంది బాబూ, వచ్చిన గొడవంతానూ !

  @జాబిల్లి,

  ఇప్పుడు పూర్తిగా తగ్గింది.

  @భారతీ,

  అంతకంటే చేసేదేముందమ్మా !!

  Like

 5. అయ్యో సార్…
  మీ పోస్టు ఇప్పుడు చూస్తున్నాను. ఎలా వున్నారు? మీకు అంతా మేలు జరగాలని కోరుకుంటున్నాను.
  రాము

  Like

 6. రామూ,

  ఇప్పుడు పూర్తిగా తగ్గింది. థాంక్స్.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: