బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-A Sweet Conspiracy…


   రెండు నెలలనుండి, మా కోడలు చి.శిరీష నాతో మాట్లాడడానికే టైము లేనట్లుగా ప్రవర్తిస్తోంది. పాపం పని ఒత్తిడి వలనేమో అని సమాధాన పడ్డాను.పైగా ఇంకో విషయమేమిటంటే, తనూ, మా ఇంటావిడా, అబ్బాయీ అప్పటివరకూ మాట్లాడుకుంటున్నవారు కాస్తా, నేను వెళ్ళేటప్పటికి సైలెంటయిపోవడం!ఏదో చాలా అమాయకుడిని, నాకు ఇవేమీ రిజిస్టర్ అవలేదు.మొన్న ఆ పుస్తకం ఇచ్చినతరువాత అర్ధం అయింది, అసలు సంగతంతా!

    వాళ్ళు ప్రింటు చేయించే పుస్తకానికి, ముందుగా శ్రీ బాపు గారిచేత ఓ బొమ్మవేయిద్దామనుకుని, ఆయనను సంప్రదించారుట. ఆయనకూడా,ఓ కోడలు తనమామగారిమీద అభిమానం కొద్దీ ఓ పుస్తకం ప్రింటు చేయించి, బహుమతీ గా ఇస్తోందంటే, సంతోషించి, తప్పకుండా ఇస్తానమ్మా అని చెప్పారుట!ఆయన సినిమా షూటింగు హడావిడిలో ఉండి, ఇవ్వలేక, ఆయనే వేసిన ‘దశావతారాలు’ సంతకం చేసి, డిజిటైజ్ చేయించి కొరియర్ చేశారుట!వామ్మో! పైగా ఈవిడ చెప్పిందిట, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ విషయం నాకు తెలియకూడదని! ఆయనతో ఈ మధ్యన ఒకటి రెండు సార్లు మాట్లాడినప్పుడు కూడా ఈ ప్రస్తావనే రాలేదు! అమ్మ బాపూ గారూ!!

   ఇక్కడతో ఎక్కడయిందీ వ్యవహారం? జ్యోతి గారికి మెయిల్ పంపి, ఆవిడకు తెలిసిన తెలుగు బ్లాగర్ల ఐ.డీ లు అన్నీ సంపాదించింది! పోనీ ఆవిడైనా చెప్పొచ్చుగా నాతో! అబ్బే ఎవరికి వారేనండి బాబూ, నాతో ఆడేసికున్నారు!శిరీష,తను సంపాదించిన ఐ.డి. లకు ఓ మెయిల్ పంపింది. ఇలా ఫలానా ఫణిబాబు గారి కోడలుని నేను,ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన వ్రాసిన టపాలు ఓ పుస్తకంగా తయారుచేస్తున్నామూ, మీరు ఆయనమీద మీ అభిప్రాయమేమిటో వ్రాసి పంపండీ అంటూ..పైగా ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ 15 వ తారీఖు లోపల నాకు తెలియకూడదనీనూ !

   నాగురించి ఎంతో అభిమానంతో నాలుగు ముక్కలు వ్రాసిన– ఎం.వి.అప్పారావు, జ్యోతి,మాలాకుమార్,బులుసు సుబ్రహ్మణ్యం,స్వర్ణబాల,బులుసు రామచంద్రుడు,దినవహి హనుమంతరావు,నారాయణస్వామి(కొత్తపాళి),రవి, వికటకవి శ్రీనివాస్,నేస్తం, సుభద్ర, శ్రీనివాసరాజు ‘— గార్లకు హృదయపూర్వక ధన్యవాదాలు. సుజాత గారు వ్రాసి పంపినది కొంచం ఆలశ్యంగా అందడం వలన ప్రచురించలేకపోయారు.

   ఏమండీ మరీ ఎక్కువగా వ్రాసి మునగచెట్టెక్కించేశారు ! నా టపాలు మీఅందరికీ నచ్చడం మీలోని సహృదయతని తెలియచేస్తుందిరాత్రి చివరగా శ్రీ మల్లిన నరసింహరావుగారు ఫోను చేశారు..ఎస్.ఎమ్.ఎస్ ల ద్వారా శ్రీ ఎస్.ఆర్.రావుగారు,రవిచంద్ర,సుజాత,శుభాకాంక్షలు చెప్పారు.ధన్యవాదాలు.
కొంచం ఎక్కువగా టపాలు పెట్టేననుకుంటాను (4). బోరుకొట్టేశానుకదూ!ఏం చెయ్యను చెప్పండి, నా సంతోషం మీఅందరితోనూ పంచుకోవాలిగా! రేపటినుండి మళ్ళీ రొటీన్ లో పడతాను. ఇప్పటికే నాలుగైదు టాపిక్కుల గురించి ఆలోచించేశాను.మీ అందరికీ నచ్చినా నచ్చకపోయినా చదవండి.. పైగా ఇదోటా అనుకోకండి….

    ఇప్పుడర్ధమయిందా ఈ టపాకి శీర్షిక అలా ఎందుకు పెట్టానో?…

Advertisements

11 Responses

 1. హి..హి..హి… క్రెడిట్ అంతా మీ పిల్లలకే…

  Like

 2. జ్యోతీ,

  ఇప్పుడు అలాగే అంటారు చేసిందంతా చేసేసి.మీరు చేసిన రెండో ‘కుట్ర’ గురించికూడా ఇప్పుడిప్పుడే సమాచారం వచ్చింది.

  Thanks a lot for all the trouble you took..This was my most memorable birthday.

  Like

 3. ఫణిబాబు గారు, ఇది కుట్ర కాదండి, భలే మంచి కుట్ర ! ఛి” సౌ” శిరీష నాకు
  ఫోను చేసి చెబితే నేనూ, మా శ్రీమతి ఎంతో సంతోషించాము , మీకు ఇంతటి
  మంచి కోడలిని ఇచ్చినందుకు. సరేకానీ మాకో కాపీ, కాఫీ కాదు,
  పంపించే ఏర్పాటు చేస్తారుగా ! ఇట్లు ఓ కుట్రదారుడు.

  Like

 4. మమ్మలని కుట్రదారులని అనేశారా. అన్యాయం, ఖండిస్తున్నాను ఈ మాటని. బ్లాగుల్లో చాలా పుట్టిన రోజులు, లక్ష హిట్ల ఉత్సవాలు, 100 టపాల సంబరాలు, చాలా చూసాము. మీ పుట్టినరోజు నిజంగా స్పెషల్. ఈ వేళ మీ మూడు టపాలు హారం లో టాప్ లో ఉన్నాయి. మీరంటే బ్లాగ్ పాఠకులకు ఎంత ఇష్టమో వేరే చెప్పక్కర్లేదు.

  మీకుటుంబ సభ్యులకి అభినందనలు. ముఖ్యంగా మీ కోడలు చి. ల. సౌ. శిరీష కృషి ప్రశంసనీయము.

  Like

 5. నాకూ మైల్ వచ్చిందండీ, కానీ నేను బిజీగా ఉండి పంపలేకపోయాను. ఆరోజు మీకెన్నిసార్లు ఫోన్ ట్రై చేసానో..దొరికితేగదా…బిజీ బిజీ బిజీ అని వచ్చింది….ఇంక విసుగొచ్చి బ్లాగులోనే చెప్పేసాను శుభాకాంక్షలు.

  మీ కోడలుగారికే క్రెడిట్ అంతా.

  Like

 6. శిరీష నాకూ మెయిల్ పంపారు గానీ అది ఎంచేతో స్పాం లోకి వెళ్ళిపోయింది. అంచేత చాలా రోజులు దాన్ని నేను చూడలేదు. మొన్న ఎందుకుఓ చూద్దునా కనపడింది. అప్పటికి మీ పుట్టినరోజు నాల్రోజులుంది. ఆ పాటికి పుస్తకం ప్రింటైపోయుంటందని అర్థమైపోయింది.

  కానీ అభిప్రాయం మాత్రం రాసి పంపాను. పుస్తకంలో వేసినా వేయకపోయినా ఆవిడకంటూ తెలియాలి కదాని!

  మొత్తానికి, మీ పుట్టినరోజు ఇంట్లోనూ, బ్లాగుల్లోనూ ఝాం
  ఝామ్మని చేసేశామన్నమాట! :-))

  Like

 7. మాస్టారూ, బ్లాగ్లోకపు వేడుకలాగా జరిగింది మీ పుట్టినరోజు. మాక్కూడా చాలా సంతోషమైంది.

  Like

 8. @గురువుగారు,
  ధన్యవాదాలు.

  @సుబ్రహ్మణ్యంగారూ,
  అందరూ చూపించే అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలని ప్రార్ధిస్తున్నాను.

  @సౌమ్యా,

  చాలా థాంక్స్.

  @సుజాతా,

  ఇంతమంది సహృదయులు ఉండగా నాకు లోటేమిటి?

  @కొత్తపాళీ గారూ,

  నాకైతే ఏనుగెక్కించేసినట్లనిపించింది. థాంక్స్.

  Like

 9. చాలా సంతోషకరంగానుందండి మీ బ్లాగ్వేడుక.
  మీచేత బ్లాగు మొదలుపెట్టించినందుకు , ఈ రచ్చలోనికి మిమ్మల్ని లాగినందుకు, నాకు పదిగుణాల సంతోషం.
  నేనెప్పుడు మొదలుపెట్టించానా అనుకుంటున్నారేమో. మీరు అబ్బేలేదు అబ్బేలేదు, అంటుంటే నేను అబ్బేలేదు అబ్బేలేదు మొదలుపెట్టాల్సిందే అన్నాను, ఆనాడు గోదావరి గట్టుమీదన. 😀

  Like

 10. ఫణి బాబుగారూ నమస్కారము,
  మీ బిజీ షెడ్యూల్ లో కూడా నాకు సమాధానం…
  చాలా ఆనందం కల్గించింది…ఏదో హడావుడిలో
  వెంటనే సమాధానించలేదు. మన్నించండి.
  మీ బ్లాగులో..మీ పట్ల జరిగిన కుట్ర చూసా.
  ఔరా! అనిపించింది…ఏది ఏమైనా చి’సౌ’శిరీష
  నిర్వహణ సామర్థ్యం అభినందనీయం…మీ
  మంచితనపు పేజీల్లో మాపేరూ వుండడం
  మా అదృష్టం… శలవు…దినవహి.

  Like

 11. @రాకేశ్వరా,

  చూసావా ఆరోజు నాచేత మొదలెట్టించి, ఇప్పుడు అందరినీ ఇంత శ్రమ పెట్టించావో !

  @హనుమంతరావు గారూ,

  ధన్యవాదాలు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: