బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-నాకిచ్చిన అపురూపమైన గిఫ్టులు..


   ఈవేళ (15/12/2010) ప్రొద్దుట ( ప్రొద్దుటేమిటిలెండి, తెల్లారకట్ల -నా భాషలో) మొట్టమొదటగా మా గురువుగారు, శ్రీ అప్పారావుగారు, రాజమండ్రీ నుండి ఫోను చేసి మాట్లాడారు.ఆ తరువాత శ్రీ కోడిహళ్ళ మురళీ మోహన్ గారు.ఇంతలో ఏడు గంటలయింది కదా అని, శ్రీ బాపు గారికి ఫోను చేసి, ఆయనకి శుభాకాంక్షలు చెబుదామంటే, ముందుగా ఆయనే నాకు చెప్పారు! బాపూ గారికి ఫోను చేసి రమణ గారితో మాట్లాడకపొతే ఎలా అనుకుని, ఫోను చేసేసి చెప్పాను, ఈవేళ నా పుట్టిన రోజండీ అని!ఉత్తిత్తినే అన్నాను..బాపూ గారి ‘దశావతారాలు’ కళాఖండం మీద ‘బాపురమణ’ అని వ్రాశారుగా అందుకూ!!హాయిగా ఇలాటివారి పుట్టినరోజునాడే, మనది కూడా అయితే, కొన్ని లాభాలూ ఉన్నాయి, కొన్ని నష్టాలూ ఉంటూంటాయి! ఈవేళ చూడండి, బ్లాగులనిండా ఆయన గురించే!అయినా కూడా,మనవాళ్ళందరూ నా పుట్టిన రోజు గుర్తుంచుకుని టపాల్లోనూ, ఫోనులద్వారానూ,వ్యాఖ్యలద్వారానూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెపుతూంటే, వామ్మోయ్ నా మీద కూడా ఇంత అభిమానమా అనిపించి, ఒళ్ళు పులకరించిపొయింది, అసలే చలీ ! అయినా ఒకటి చెప్పండి, పుట్టిన రోజులు రోజూ వస్తాయా ఏమిటీ? ఉన్న ఆ ఒక్కరోజు జ్ఞాపకాలూ, గట్టిగా గుండెల్లో దాచేసికుని, వచ్చే ఏడాది వరకూ పదిలంగా దాచేసికోడమే! ఈవేళ నా దిష్టే నాకు తగులుతుందేమో అనిపించింది!ఇంట్లో నాకంటె పెద్దవాళ్ళు లేరూ దిష్టీ అదీ తీయడానికీ, నేనే ‘మమ’ అనుకుని తీసేసికున్నాను! ఫొను చేసిన –జ్యోతి,బులుసు సుబ్రహ్మణ్యంగారూ,చక్రవర్తి,శ్రీనివాస రాజూ,కిరణ్,వేణూ శ్రీకాంత్, ఇప్పుడే శ్రీ మల్లిన నరసింహరావు గారూ– వీరందరూ ఊరికే మొహమ్మాటానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినట్లుగా కాక,నిఝంగా నన్ను తాటిచెట్టు ఎక్కించేస్తూనే మాట్లాడారు. వీళ్ళందరినీ ‘చుట్టాలు’ అనడంకంటే ‘ఆత్మ బంధువులు’ అంటే బాగుంటుంది!

   వీరందరికీ, నన్ను గుర్తుంచుకుని వ్యాఖ్యలద్వారా శుభాకాంక్షలు చెప్పిన వారికీ, నాకూ ఏమిటి బంధుత్వం అంటే ఏం చెప్పనూ? పోనీ నా రాతలేమైనా సాహితీపరంగా ఏమీ గొప్పవి కావు, ఏదో కీబోర్డ్ మీద నొక్కుతూ ఏవేవో వ్రాస్తూంటాను,దానికే సంతోష పడిపోయి ఏమిటేమిటో చెప్పేశారు! I really wonder if I really deserve all this! పోనీ అలా అందామా అంటే, మళ్ళీ మానేస్తే, అమ్మో ! వినడానికి చాలా బాగుంటుందండి.అప్పుడప్పుడు
మా ఇంటావిడ ‘గొప్పే, ఊళ్ళోవాళ్ళందరికీ మీరు బెల్లం ముక్కే…’అంటూంటుంది! ఈవేళైతే మరీనూ! లోపల్లోపల లడ్డూ ఫూట్ అవుతున్నా, బయటకి మాత్రం… మరీ తనూ బహిరంగంగా ఒప్పెసికుంటే నెత్తికెక్కేయనూ? ఏదో ఆ మాత్రం కంట్రోల్ ఉందికాబట్టి సంసారం సజావుగా వెళ్ళిపోతూంది!

   ఈవేళ ధైర్యం చేసేసి చెప్పేద్దామా అనిపించింది- ‘నాకూ ఉన్నారులేవోయ్ బంధువులూ..’ అని. మళ్ళీ అనుకున్నాను,షోడౌన్ వస్తే ఆవిడనే సపోర్ట్ చేస్తారూ, ఎందుకొచ్చిన లేనిపోని గొడవా ఇలా టపాలు వ్రాస్తూ లాగించేద్దామూ అని.పైన పెట్టేనే అవి నేను తీసిన వీడియో లాటిది. ఫుటో తీద్దామంటే పూర్తిగా రావడం లేదూ,ఎలాగోలాగ నానా తిప్పలూ పడి తీశాను. నచ్చినా నచ్చకపోయినా తిట్టకండి.ఏదో నాకొచ్చినట్లు తీశాను.

   ఈ రెండు గిఫ్టుల వెనుకా చాలా పేద్ద ‘కుట్ర’ జరిగింది.అదీ ఈవేళ్టిదాకా తెలియనే లేదూ. ఆ ‘కుట్ర’ గురించీ, దానిలో భాగస్వాములైన వారి గురించీ ఇప్పుడిప్పుడే తెలిసింది.ఆ కథా కమామీషూ ఇంకో టపాలో! చిత్రం ఏమిటంటే దీంట్లో
మా ఇంటావిడ కూడా పాలు పంచుకోవడం! But it was a very sweet conspiracy !!

Advertisements

10 Responses

 1. ఫణిబాబు గారూ,
  శుభోదయం! పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వాళ్ళలో నేనే
  మొదటివాడినైనందుకు అబ్భ! మీ పుట్టినరోజు స్వీట్ తిన్నంత
  మధురంగా వుందండీ ! ఇక నా పుట్టినరోజూ ఓ ప్రముఖుడి పుట్టిన
  రోజు నాడే ! ఆ విషయాలు నా రేఖాచిత్రం బ్లాగు (ఇందుకూ మీరు
  నా గురువు గారే ) లో చెబుతా ! మీరు మరిన్ని ఎన్నెన్నో ఎన్నాళ్ళో
  తనివితీరా కబుర్లు చెప్పాలని సాయిరాముణ్ణి వేడుకుంటూ…
  మీ అప్పారావు (సురేఖ)

  Like

 2. Ayyo miss ayyane.. Happy birthday Andi.

  Like

 3. నాకు మీ పుస్తకం ఎప్పుడెప్పుడు చదువుదామా అనుంది – బ్లాగు బ్లాగే, పుస్తకం పుస్తకమే ఎప్పటికైనా.

  మీకొక్కరికే కాపీనా, లేదా మాలాంటివారికోసం మార్కెట్లో పెడతారా, కనీసం మీ టెండర్లీవ్స్ ద్వారా పంచుకుంటారా?

  Like

 4. ఫణి గారూ,
  బ్లాగ్లోకంలో మీరు “మోస్ట్ పాప్యులర్ యంగ్ మేన్” అనటంలో కించిత్తైనా అతిశయోక్తి లేదు. మీరిలాగే మా అందరికీ ఆదర్శప్రాయంగా సంతోషంగా వుండాలని, అభినందలతో
  శారద

  Like

 5. శారద గారు మహా కరెక్ట్ గా చెప్పారు. నేను కూడా డిటో.
  జేబి. JB గారి వ్యాఖ్యలకి కూడా డిటో.

  Like

 6. meeku puttinaroju subhaakamkshalu

  Like

 7. ఎంత అభిమానమండీ మీ పిల్లలకి మీరంటే! ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చారు మీకు!…చాలా సంతోషం. ఈ ఆనందాన్ని మీరు బాగా ఎంజాయ్ చెయ్యండి.

  Like

 8. నేనూ బులుసుగారి డిట్టోకి డిట్టొ 😀

  గిఫ్ట్ లు రెండూ చాలా అందంగా ఉన్నాయండి. నిన్న మీతో మాట్లాడటం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. హాయిగా ఎన్నో ఏళ్లనుండి తెలిసిన మా ఇంట్లో మనిషితో మాట్లాడినట్లనిపించింది. 🙂

  Like

 9. బాబు గారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు…
  Its too late and too early for next year 🙂

  > వీళ్ళందరినీ ‘చుట్టాలు’ అనడంకంటే ‘ఆత్మ బంధువులు’ అంటే బాగుంటుంది
  ఆ మాటలతో అందరి గుండెలను పిండారుగా!

  Like

 10. @గురువుగారూ,

  ధన్యవాదాలు.

  @జాబిల్లి, శివాని,
  ధన్యవాదాలు.

  @జేబి,సుబ్రహ్మణ్యంగారూ,

  ప్రస్తుతానికి ఒక కాపీ ప్రింటుచేసి ఇచ్చారు.

  @శారదా,
  మీఅభిమానం అలా అనిపిస్తోంది.
  @సౌమ్యా,
  అది నేను చేసికున్న అదృష్టం.

  @వేణూ శ్రీకాంత్,

  ఆరోజు మీతో మాట్లాడడం చాలా సంతొషమనిపించింది.

  @పానిపూరి,

  థాంక్స్.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: