బాతాఖాని-లక్ష్మి ఫణి కబుర్లు–Its different….


   ఏమిటో రోజులెలా మారిపోతున్నాయో? ఒక్కళ్ళూ మన గురించి పట్టించుకోరూ, అసలు నేను అనే ప్రాణి ఒకడున్నాడూ అని గుర్తున్నట్లే కనిపించదు. చిన్నప్పుడయితే, అమ్మా నాన్నలు తిథి ప్రకారం, ప్రొద్దుటే లేపి, తలంటు పోసి, కొత్త బట్టలిచ్చి, ఓ స్వీటు చేసి, ఆరోజుకి ఏంత అల్లరిచేసినా తిట్టకుండా ఉండి, చదువుకోమని ఊరికే నస పెట్టకుండా, సాయంత్రం ఫస్టుషో సినిమాకి బాల్కనీకి వెళ్ళడానికి డబ్బులిచ్చి, అబ్బో ఏం హడావిడండి బాబూ!మర్నాటినుండీ మామూలే!ఆ ఒక్క రోజూ మాత్రం ‘ప్రతీ రోజూ పుట్టిన రోజులయితే బావుండునూ..’ అనే ఫీలింగొచ్చేస్తుంది.అనుకుంటాం కానీ, చదువూ సంధ్యా ఎవడు చేస్తాడుట? ఏదో ఆ రోజుకిమాత్రం అన్నీ గ్రాంట్!

    ఆ తరువాత ఉద్యోగం, పెళ్ళి,పిల్లలూ. పెళ్ళాం పిల్లలకి చేయడంలోనే ఆనందంగా ఉండేది.అయినా ఏళ్ళు నెత్తిమీదకొచ్చిన తరువాత,మనం అలాటివి చేసికుంటేనేం, చేయకపోతేనేం? సంసారం సరీగ్గా లాక్కొస్తే చాలు. పుట్టినరోజులకేముందీ, బ్రతికున్నంతకాలం చేసుకోవచ్చు ! పుట్టి మనం ఏం ఉధ్ధరించామనీ,? ఇంట్లో వాళ్లకి తప్పదు, ఏదో కట్టుకున్నవాడూ అని భార్యకీ, జన్మనిచ్చినవాడూ అని పిల్లలకీ విధాయకం.ప్రపంచంలో అందరికీ ఉండాలని ఏం రూలేమీ లేదుగా? అప్పటికీ
మురళీ మొహన్ గారు ఓ నాలుగు రోజులు ముందుగానే ‘జన్మదిన శుభాకాంక్షలు’ అని ఓ వ్యాఖ్యకూడా పెట్టారు. నిన్న( 13 వ తారీఖు) అమెరికా నుండి మిత్రుడు అబ్బులు ఫోను చేసి మరీ గ్రీటింగ్స్ చెప్పారు. ఫేస్ బుక్ లో కూడా పెట్టారు.
ఇక్కడ ఇంట్లో చూస్తే మా వాళ్ళకేమీ పట్టినట్లే లేదు. అలాగని మరీ అడిగితేనూ బాగుండదు.ఏం చేయడంరా బాబూ అనుకున్నాను. అసలు వీళ్ళందరూ నాగురించే పట్టించుకోవడం లేదూ, అందరితోనూ ‘కచ్చి’ చెప్పేద్దామని నిశ్చయించేసుకున్నాను!

    14/12/2010… అది అర్ధరాత్రి సమయం..ఊరంతా నిశ్శబ్దంగా ఉంది… కిచురాళ్ళూ వగైరాలు లేవనుకోండి..ఎలాగూ నాగురించి ఎవరూ పట్టించుకోవడంలేదూ అనుకుని, మొహం ముడుచుకుని, దుప్పట్లోంచి తొంగి చూస్తూ,ప్రతీ ఏడాదిలాగానే, పోనీ మా అమ్మాయైనా ఫొను చేసి గ్రీటింగ్స్ చెప్పకపోతుందా అనుకుంటూ.. ఎదురుచూస్తూంటే,.. ట్రింగ్..ట్రింగు మంటూ నా సెల్ ఫోను సౌండ్. అమ్మయ్యా ఎవరో ఒకరికైనా జ్ఞాపకం ఉందిలే అనుకుంటూ, ఫొను ఎత్తగానే,
మా అమ్మాయి ఫోను..’డాడీ హాపీ బర్త్ డే’ అంటూ,ఆ తరువాత అల్లుడూ.పోన్లే ఎవరో ఒకరైనా చేశారూ అనుకుని, దుప్పటీ ముసుగు పెడుతూంటే…

   మా ఇంటావిడా, కొడుకూ,కోడలూ, అగస్థ్యా,నవ్యా ..’హాపీ బర్త్ డే..’అంటూ.మొహమ్మాటానికి థాంక్యూ అనేసి, చేతిలో ఏమీ ఉన్నట్లులేదే అనుకుంటూ..పక్కకు తిరిగాను.ఇంతలో మా అగస్థ్య చేతిలో, అదేదో సిలిండ్రికల్ బాక్స్ లాటిది
( టెన్నిస్ బాల్స్ పెడుతూంటారు అలాటిదన్నమాట..).చివరికి మా మనవడితో ఆడుకోడానికి బంతులా తెచ్చారూ అనుకునే లోపల…దాంట్లోంచి ఓ ఆర్ట్ పేపరు చుట్టచుట్టింది తీశారు..అబ్బాయీ, కోడలూ చెరోవైపునా పట్టుకుని ఆ చుట్టని తెరిచారు..

   చూస్తే ఏముందీ? ముందుగా నోట మాట రాలేదు..కళ్ళల్లో నీళ్ళు నిండిపోయాయి..ఏం చెప్పాలో, ఏం చేయాలో కూడా తెలియని అలౌకికానందం.కలా నిజమా అనిపించేలా.. నా ఆరాధ్యదైవం ( శ్రీ వెంకటేశ్వరస్వామి తరువాత ఈ జంటే నాకు!), కుంచె తో గీసిన రంగురంగుల దశావతారాలూ, క్రింద ‘ శ్రీ భమిడిపాటి ఫణిబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలతో.. బాపు రమణ ‘ అంటూ, మొత్తం 10 అడుగుల పొడుగు కళాఖండం…

   ఆ సంతోషం నుండి ఇంకా తేరుకోలెదు..ఇంతలో మా మనవరాలు నవ్య చేతిలో ఓ గిఫ్ట్ పాక్.. ఏదో పుస్తకం అయుంటుందిలే, వాళ్ళ లైబ్రరీకికూడా ఉపయోగించేది..అనుకున్నాను.’హాపీ బర్త్ డే తాతయ్యా ‘అంటూ, పాపం అంతబరువు ప్యాక్ మోయలేక, నా చేతిలో పెట్టేసింది. తీరా చూస్తే ఏమిటీ..గత ఏణ్ణర్ధం నుండీ నేను వ్రాస్తున్న టపాలలోంచి కొన్నిటిని ప్రింటుచేసిన పుస్తకం!!! 700 పేజీలకు పైగా వచ్చింది! నేను వ్రాసినవే కదా అనుకుని, పుస్తకం తెరవగానే, కనిపించింది ఏమిటీ.. నా బ్లాగు మిత్రులు ( వివరాలు తరువాతి టపాలో..) నా గురించి వారి వారి అభిప్రాయాలు…అన్నీ మరీ అతిశయోక్తులే!!

   ఇంతకంటే జీవితంలో కావలిసినది ఏమిటీ? నా టపాలు మా ఇంట్లోవాళ్ళు (కొడుకూ,కోడలూ,కూతురూ,అల్లుడూ) చదవలేకపోతున్నారే అన్న లోటు కాస్తా తీర్చేసింది మా కోడలు చి.శిరీష..నేను వ్రాసినవన్నీ ఓపిగ్గా చదివి, ఎడిట్ చేసి,
వాటిని పి.డి.ఎఫ్. చేసి, ప్రింటు చేయించి దానిమీద కోనసీమ పచ్చని అందాలు ప్రతిబింబచేసే ఓ ఫొటో పెట్టి, ఓ అందమైన పుస్తక రూపం
తెచ్చి చేతిలో పెట్టించింది..

   అందుకే అన్నాను..Its different… అని. ఇంకా రెండు మూడు టపాలు వ్రాయాలి ఈ విషయం మీద…

Advertisements

23 Responses

 1. మీకు జన్మదిన శుభాకాంక్షలు… మీ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ సూపర్ అండీ.. చాలా బావుంది..

  Like

 2. ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలండి.

  చదువుతుంటేనే నాకు ఆనందంగా ఉంది, మీకెంత సంతోషం కలిగిందో ఊహించగలను.

  మీరు ఒక్కసారి వారిని కలిసినందుకు బాపు-రమణగార్లు మిమ్మలి గుర్తుపెట్టుకోవడం వారి సంస్కారము-మీ స్నేహతత్వమునకు గుర్తు.

  మీరు ఇలాగే రోజూ కబుర్లు చెబుతూ వుంటే హ్యారీపోటర్ సిరీస్ లాగ, బాతాఖానీ సంచికల కోసం ప్రతి సంవత్సరం ఎదురుచూస్తాం.

  Like

 3. మీలాంటి తండ్రిని కలిగిన మీ పిల్లలు వాళ్ళ లాంటి పిల్లలని కలిగిన మీరు ఎంత అద్రుష్టవంతులో మీ హాస్యప్రియత్వం సర్దుబాటు ధోరణి అందరి సమస్యలని వారి కోణం నుండి ఆలొచించే తత్వం చూసి మాలాంటి వాళ్ళు జీవితమంటె ఎంటొ నెర్చుకోగలుగుతున్నారు ప్రతి ఏడాది ఇలాంటి జన్మదినాలు ఆనందంగా జరుపుకుంటూ జీవించాలన్ నా హ్రుదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

  భారతి

  Like

 4. మీ కబుర్లు చదివిన తర్వాత నాకు అనిపిస్తున్నదండి, “ఏవిటో ఈ జన్మ, మనకూ పుట్టిన రోజులున్నయ్.. ఎందుకూ!” అని. :))

  Like

 5. పుట్టినరోజు శుభాకాంక్షలండి.

  Like

 6. superr..:)

  Like

 7. MANY MANY HAPPY RETURNS OF THE DAY!!
  ఎంతో అదృష్టం ఉంటే కాని ఇలాంటి పిల్లలు ఉండరు. మీరు ఇలాగే ఎన్నో పుట్టిన రోజులు,ఇలాగె బోల్డన్ని గిఫ్త్స్ అందుకుంటూ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ..

  Like

 8. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఫణిబాబు గారు. ఆనందంతో కళ్ళు చెమరించాయి మీ టపా చదువుతుంటే చాలా సంతోషమనిపించింది. మీ సంతోషాన్ని అంచనా వేయడానికి నా శక్తి చాలడంలేదు 🙂 మిగిలిన టపాల గురించి ఫోటోల గురించి ఎదురు చూస్తున్నాను 🙂

  Like

 9. happy and eventful birthday, and many returns of the day

  Like

 10. many many returns of the day Phani garu.

  ఇలాంటి మధురమైన గురుతులు మరింకెన్నో
  మీ జీవితంలో
  ఆనంద సంబరాల్ని మిగల్చాలని
  మనస్ఫూర్తిగా కోరుకుంటూ…

  గీతిక

  Like

 11. Happy birthday sir! Very many happy returns of the day.

  Like

 12. ఎంత చక్కని బహుమతులు!!!మీ ఆనందంతో మా కళ్ళు చెమరించేలా చేశారు.. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🙂

  Like

 13. Happy Birthday sir, Many Many happy returns of the day. I regularly follow your blog.

  Like

 14. ఫణి బాబు గారూ

  మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. చాలా అపురూపమైన బహుమతి ఇచ్చారు మీ పిల్లలు. చదువుతుంటేనే ఆనందంతో కళ్ళు, మనసు కూడా తడి అయ్యాయి.
  మీ బ్లాగ్లో ఇదే నా మొదటి కామెంట్, కానీ మీ బ్లాగ్ కి చాలా రెగ్యులర్ అతిధిని. మీ టపాలు చదువుతుంటే నాకు కూడా అందరి లాగే మా బాబాయి గారో , పెద్ద మామయ్య గారో కబుర్లు చెప్తున్నట్టుగానే ఉంటుంది.
  మిగతా టపాల గురించి పుస్తకం ఫోటోల గురించి ఎదురు చూస్తూ ..

  పద్మవల్లి

  Like

 15. HAPPY BIRTHDAY

  Like

 16. Many Happy Returns of the Day Sir.

  Sree

  Like

 17. Happy B day Sir

  Like

 18. Happy birthday sir! Very many happy returns of the day.

  Like

 19. బాబుగారూ!

  మేము ధన్యులం. మూడు నాలుగు కదు….ఫ్ఫదీ, ఫదహారు టపాలు వ్రాయండి ఈ విషయాలమీద.

  అన్నీ చదివాక, వివరంగా ‘కామెంటుతాం!’.

  కనీసం ద్విసహస్ర చంద్రోదయాలు చూడాలి మీలాంటివాళ్లు!

  శుభాకాంక్షలు!

  Like

 20. పుట్టినరోజు శుభాకాంక్షలండీ

  Like

 21. మేధా,జేబి,భారతీ, రవీ,అనూరాధా, సృజనా,లక్ష్మీ, వేణూ శ్రీకాంత్,మోహన్, గీతికా,కొత్తపాళి,నిషిగంధ, చారి,పద్మవల్లి, శ్రీలలిత,శ్రీ, మలక్ పేట రౌడి,చింతా రామకృష్ణరావు,కృష్ణశ్రీ, ఊకదంపుడు…

  మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నామీది అభిమానం ఇలాగే కొనసాగాలని ఆ శ్రీవెంకటేశ్వరుని ప్రార్ధిస్తూ….

  Like

 22. Oh! Its really different birthday.
  You are very lucky.
  HAPPY BIRTHDAY SIR.

  Like

 23. బోనగిరీ,

  ధన్యవాదాలు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: