బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఉపోషం…


    ఈ మధ్యన ఓ రోజు, మా ఇంటావిడ అకస్మాత్తుగా, ఛెస్ట్ లో నొప్పొస్తోందని, మంచం మీద కాకుండా, నేలమీదే సెటిల్ అయిపోయింది. పాపం చాలా బాధపడిందిలెండి ఓ అరగంటసేపు.ఎసిడిటీ వలనేమో అనుకుని, యాంటాసిడ్ కొద్దిగా తీసికొన్న తరువాత, స్వస్థత వచ్చినట్లు కనిపించింది.అయినా నేను తీసికోవలసిన జాగ్రత్తలు తీసికొందామనే ఉద్దేశ్యంతో, మా డాక్టరు ఫ్రెండు కి ఫోను చేశాను. ఎందుకంటే, మా కుటుంబం అందరిగురించీ ఆయనకు గత పాతికేళ్ళగా తెలుసును.
ఆయనకూడా, ఊరికే అశ్రధ్ధ చేయకుండా, వీలైనంత త్వరలో ఒకసారి అన్ని టెస్టులూ చేయించూ అన్నారు.సరే అని ఇక్కడ, మా ఫామిలీ డాక్టరు దగ్గరకు వెళ్ళాను. ఆయనేమో ఈ.సీ.జీ,సుగరూ వగైరా చెక్ చేసి, ఇంకో డజను టెస్టులు చేయించుకోమని వ్రాసిచ్చారు.మా చుట్టాలొస్తున్నారూ, ఓ వారం తరువాత చేయిస్తే ఫరవా ఏమీ లేదు కదా అంటే, ఈ వారానికి ఏవేవో మందులూ అవీ వ్రాసిచ్చారు. ఈ విషయం, మా పిల్లలతో చెప్పలేదు, ఊరికే ఖంగారు పడిపోతారూ, మమ్మల్ని ఎక్కడకీ కదలకుండా కొంపలోనే ఉంచేస్తారూ అని.అంతేనే కానీ, మరో దురుద్దేశ్యమూ లేదు, అక్కడికి నేనే ఒంటరిపోరాటం చేద్దామనీ కాదు.అయినా ఆ డాక్టరుగారు చెప్పనే చెప్పారు, మా ఇంటావిడ గుండెకాయకి ఏమీ ధోకాలేదూ అని! ప్రతీ విషయమూ పట్టించుకోకుండా, తాపత్రయాలు వదిలేస్తే అన్నీ బావుంటాయి. ఆవిడ వదలా వదలదు, నాకు ఈ డాక్టర్ల ట్రిప్పులు తప్పా తప్పవు.ఊరికే అనుకోవడం వరకే!

   మా డాక్టరుగారికిచ్చిన మాట ప్రకారం, ఈ వేళ ఆ మిగిలిన టెస్టులకి వెళ్దామనుకున్నాము. ఇంతలో ఏమయిందంటే, మేము వెళ్ళిన డాక్టరుగారి దగ్గరకే, మా అగస్థ్యని తీసికెళ్ళారు.అదేమిటీ పిడిక్కీ బియ్యానికీ ఒకటే మంత్రమా అనకండి, ఆయన నిజానికి ‘పిల్లల డాక్టరు’. గత 36 ఏళ్ళనుండీ మా ఫామిలీ డాక్టరులెండి.ముందుగా ఆయన్ని సంప్రదించిన తరువాతే, మిగిలిన కార్యక్రమాలు.లేకపోతే ఏ కొత్త డాక్టరుదగ్గరకో, వెళ్ళి,లేనిపోని వర్రీలు తెచ్చుకోవడం కంటే ఇదే నయంకదా!చెప్పొచ్చేదేమిటంటే, నిన్న అక్కడ కంప్యూటరులో చూసినప్పుడు, మా పిల్లలకి కనిపించిందన్నమాట, మా విజిట్ గురించి. పోనీ అక్కడే ఆయన్నే అడిగేస్తే పోలా? అబ్బే ఇంటికి రావాలి, ‘అమ్మకు అలా అయిందని చెప్పలేదే’ అని మా అబ్బాయి మమ్మల్ని నిలదీయాలి, ఎంత ప్రోగ్రామో కదా!మొత్తానికి వాళ్ళు అడగనూ అడిగారు, నేను వివరాలన్నీ చెప్పనూ చెప్పాను.

   ఈవేళ్టి కార్యక్రమానికి, నిన్న రాత్రి 7.30 కి భోజనం తినేసి,ఈ టెస్టులన్నీ పూర్తయేదాకా ఉపోషం ఉండాలిట.మామూలుగానే తిండి అంతంత ఆవిడకి,బరువు పెరిగిపోతున్నానో అని అవేవో ఫుల్కాలూ,మొలకలూ తింటుంది. ఇంక ఉపోషం అంటే ఇంకేం ముట్టుకుంటుందీ?ఏదో తిన్నాననిపించేసి, ప్రొద్దుటే బయలుదేరి వెళ్ళాము. అక్కడ, ఓ సిరంజి పీకలదాకా, ‘డ్రాక్యులా’ లాగ ఈవిడ వంట్లో ఉన్న రకతం తీసేసి, ఓ పన్నెండు వందలుచ్చేసికుని, పంపించేశాడు. ఆ బేరియమ్ టెస్టో ఏదో అక్కడ చేయరుట.పోనీ ఇంకో రోజెళ్దామంటే, ఎలాగూ ఉపోషంలోనే ఉన్నాను కదా, ఓ పని అయిపోతుందీ వెళ్దామంది.సరే అని అక్కడకు వెళ్ళాము.మంచిదయింది, అక్కడకు వెళ్ళగానే మొదటి ప్రశ్న-ఖాళీ కడుపుతోనే ఉన్నారా అని!

   నేనే అన్నీ మాట్లాడుతున్నాను కదా, ఈ టెస్టులు అన్నీ నాకేనేమో అని నావెపు అనుమానంగా చూశాడు. నామొహం చూస్తే, పికలదాకా తిన్న మొహమాయిరి, నాక్కాదయ్యా బాబూ ఆవిడకీ అని చెప్పాను.అప్పటికే అక్కడ ముందరే ఎపాయింటుమెంటు తీసికున్నవాళ్ళున్నారు.కొంచం టైము పడుతుందీ అన్నారు. నాదేం పోయిందీ సరే అన్నాను. అప్పుడు గుర్తుకొచ్చింది ఈవిడ పద్నాలుగు గంటలనుండీ ఉపోషం అని! చెప్పాను అతనితో, ఊరికే ఆలశ్యం చేయకూ, ఈవిడకి నీరసం వచ్చి శోషొచ్చిందంటే నీదే బాధ్యతా అని. అంతే, ఎందుకొచ్చిన గొడవరా బాబూ అనుకుని ఆ టెస్టేదో పూర్తిచేశాడు.

   మొత్తానికి పధ్ధెనిమిది గంటల ఉపోషం పూర్తయింది. ఈవేళ్టి పేపర్లో చూస్తూంటే, నాయుడుగారు దీక్షట, జగన్ గారు ఎప్పుడో 48 గంటలు చేస్తాడుట, ఈ నెలాఖరుకి మళ్ళీ దీక్షలూ, ఉపోషాలూ,నిరసనలూ ఎలాగూ ఉండనే ఉంటాయి. మరీ పేపర్లలో వచ్చేటంతటి ముఖ్యమైన వార్త కాపోయినా, మా ఇంటావిడ ‘ఉపొషం’ గురించి ఈ టపా! నిఝంగా మంచినీళ్ళుకూడా తీసికోలేదు పాపం!!

Advertisements

11 Responses

 1. మాస్టారూ, బ్రిలియంట్. ఇంటావిడ మెడికల్ టెస్టుల్ని కూడా హాస్యంగా రాయగలగడం మీకే చెల్లింది. బాబూ, జగనుల దీక్షలతో పెట్టుకోకండి – ఉపోషానికీ నిరాహార దీక్షకీ చాలా తేడా ఉంది 🙂

  Like

 2. adedo cinemalo anukunta bharyabhartalaki okarimeda okariki samdharbhanni batti prema bayatapadutundi. mottam me tapa ki last line line lo prema naku nachhindi.

  i wish i know how to post my comment in telugu.

  Like

 3. శ్రీ ఫణి బాబు గార్కి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇల్లాగే మమ్మలనందరిని నవ్విస్తూ మరింత ఆనందంగా మరెన్నో పుట్టిన రోజు పండగలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.

  Like

 4. శ్రీ ఫణి బాబు గార్కి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇల్లాగే మమ్మలనందరిని నవ్విస్తూ మరింత ఆనందంగా మరెన్నో పుట్టిన రోజు పండగలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.

  Like

 5. ఫణి్బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను.

  Like

 6. బాబాయిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరిలాగే ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు జీవించాలని (ఇలా టపాలు కూడా రాస్తూ మమ్మల్నందరినీ ఆహ్లాదపరచగలరని) మనసారా కోరుకుంటున్నాను. 🙂

  Like

 7. రిటైర్ అయిన ప్రతి మనిషీ మీలా ఉండగలగాలి. అప్పుడే జీవితం మొదలైనట్లు ఉండాలి. మీరు ఇలాగే పదికాలాలు ఆరోగ్యంగా నవ్వుతూ నవ్విస్తూ ఎన్నో టపాలు రాస్తూ, మీకిష్టం వచ్చిన రీతిలో ఉల్లాసంగా జీవిస్తూ మాలాంటి వారికి కూడా మీ ఉత్సాహాన్ని కొంచెం పంచి పెడుతూ ఉండాలని కోరుకుంటూ…మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు!

  Like

 8. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు…:) మీరిలాగే ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు జీవించాలని మనసారా కోరుకుంటున్నాను..

  Like

 9. ఆంటీ లంఖణం పరమౌషధం అన్న సూత్రం పాటిద్దామనుకున్నట్టున్నారు.
  మీకు జన్మదిన శుభాకాంక్షలు

  Like

 10. @కొత్తపాళీ గారూ,

  నావి కాకుండా ఆవిడవే కనుకే హాస్యంగా వ్రాయకలిగానేమో !!!

  @రవీ,

  ఈ వ్రాసినదేదో (ఇంగ్లీషులో) http://type.yanthram.com/te/ లో పెట్టేస్తే హాయిగా తెలుగులిపి లో వచ్చేసేదికదా! ఒకసారి ప్రయత్నం చేయండి. ఎనీవే నా టపా నచ్చినందుకు ధన్యవాదాలు.

  @సుబ్రహ్మణ్యంగారూ,

  ధన్యవాదాలు.

  @సిరిసిరి మువ్వా,

  ధన్యవాదాలు.

  @సౌమ్యా,
  ధన్యవాదాలు.

  @సుజాతా,

  ధన్యవాదాలు

  @సృజనా,వజ్రం,

  ధన్యవాదాలు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: