బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఏవేవో ఊహించేసుకోవడం..


    ఈ మధ్యన మా స్నేహితుల ఇంటికి వెళ్ళాము. భర్త నాకంటె చాలా ముందుగానే రిటైరయ్యారు. భార్య వయస్సుకూడా ఓ డెభై ఏళ్ళుంటాయి. వారి కొడుకూ, కూతుళ్ళూ కూడా ఇక్కడే ఉంటున్నారు. ఆ కబురూ ఈ కబురూ చెప్పుకుని కొంతసేపు కాలక్షేపం చేశాము. మీరు టైము ఎలా గడుపుతారూ అని అడిగాను. ఏదో పూజలూ, పునస్కారాలూ, టైమున్నప్పుడు సీరియల్స్ తోనూ అని చెప్పారు. అంతవరకూ బాగానే ఉందీ, మీరు కంప్యూటరు నేర్చేసికుంటే కావలిసినంత కాలక్షేపం కదా అన్నాను.She was a well educated lady. వద్దూ ఈ వయస్సులో నేర్చుకోవడం కష్టం అవుతుందీ, నా దారిన నన్ను వెళ్ళనీయండీ అన్నారు. అలా కాదూ మీరేమీ బయటకు వెళ్ళఖ్ఖర్లెదు, ఇంటిలోనుంచే నేర్చేసుకోవచ్చు కదా, అంతే కాక మీ పిల్లలందరూ ఐ.టి. లో ఉన్నారూ, ఎవరిని అడిగినా సందేహాలు తీర్చేస్తారు కదా అన్నాను. ఎరక్కపోయి రాంగు నెంబరు డయలు చేశాననిపించింది, ఆవిడ ఆ తరువాత చెప్పింది విని!

    అప్పుడెప్పుడో, ఆవిడ భర్తగారికి ఏదో అవసరం వచ్చి హాస్పిటలుకెళ్ళవలసివస్తే కొడుక్కి ఫోను చేసి చెప్పారుట. అతను ఆ టైములో ఏ పని ఒత్తిడిమీదున్నాడో పాపం, కావలిసిస్తే హాస్పిటలు దాకా వదిలి వస్తానూ, చాలా పనిమీదున్నానూ అన్నాడుట, నాకు హాస్పిటల్లోపలికి రావడానికి టైములేదూ అన్నాడట.అంతే ఈవిడకి కోపం వచ్చేసింది. ఆమాత్రం నేను ఆటో చేసికుని వెళ్ళలేకనేనా అతనికి ఫొను చేసిందీ, ఏదో తండ్రికి ఒంట్లో బాగుండక, తోడుగా ఉంటాడనేగా అడిగిందీ, అని ఈవిడ వాదన. ఇలా అవసరం వచ్చినప్పుడే పిల్లలు రాకపోతే, ఎప్పుడైనా పేరెంట్స్ ఆఖరి క్షణాల్లో ఉన్నా ఇంతే కదా, టైములేదూ అనే చెప్పేస్తారూ అని అసలు ఈ పిల్లలకి తల్లితండ్రుల మీద శ్రధ్ధే లేదూ అని చడా మడా కడిగేశారు. ఇవన్నీ ఆ కొడుకుతో కాదు, మాతోటి.పాపం ఎంతకాలంనుండి కడుపులో దాచుకుని ఉన్నారో సందర్భం వచ్చేసరికి మాదగ్గర బయట పడిపోయారు. పాపం ఆవిడననీ ఏం లాభంలెండి? ఈరోజుల్లో ఉద్యోగాలలా ఉన్నాయి. పిల్లలకి వంట్లో బాగుండకపోయినా టైముల్లేక వీకెండ్లకి వాయిదా వేస్తున్నారు డాక్టర్లదగ్గరకు వెళ్ళడం. అలాగని పిల్లలంటే ప్రేమే లేదంటామా? పరిస్థితుల ప్రభావం అంతే !

    ఆవిడన్నట్లుగా ఆఖరి క్షణాల్లో అవసరం వస్తే ఈ పిల్లలు వస్తారా అన్నది కొంచం over reaction ఏమో అనిపించింది. నిజంగా అలాటి టైమే వస్తే ఊళ్ళోనే ఉన్న ఏ కొడుకు రాకుండా ఉంటాడూ? Everybody will raise to the occasion. ఊరికే మన అనుమానాలూ అపోహలూనూ. మీరు ఆ సీరియల్స్ రోజంతా చూసిచూసి ఏవేవో ఊహించేసుకుంటున్నారూ అని ఆవిడకి సర్దిచెప్పేసరికి తలప్రాణం తోకకి వచ్చింది. ఎవరి హడావిడిలో వాళ్ళుంటారు, ఎవరింట్లో వాళ్ళుంటున్నారు. ప్రతీ వారం వచ్చి చూడాలని తల్లితండ్రులకుంటుంది, ఏ పది పదిహేను రోజులకో వెళ్ళి చూసొచ్చి వాళ్ళతో గడిపితే సరిపోదా అని వీళ్ళనుకుంటారు. ఇలాటి సమస్యలకు పరిష్కారాలుండవు. కొంతలో కొంత బాగానేఉందికదా, ఈ ఊళ్ళో కాక ఏ అమెరికాలోనో ఉంటే ఏం చేసేవారుట ఈ తల్లితండ్రులు? ఎక్కడో అక్కడ ఎడ్జస్ట్ అవాలి.

    అసలు పిల్లలనుండి ఏదో ఆశించడమే తప్పంటాను.వాళ్ళకి చదువులు చెప్పించి, వాళ్ళకాళ్ళమీద నుంచోబెట్టి పెళ్ళిళ్ళు చేసేస్తే మన బాధ్యత తీరిపోయినట్లే. అంతేకానీ జీవితాంతం అమ్మ కొంగే పట్టుకుని తిరగాలనుకోవడం మరీ ఎక్కువేమో?వాళ్ళు ఎక్కడికో ఎగిరిపోయి ఏ రెండుమూడేళ్ళకో వచ్చి హాయ్ మమ్మీ, హాయ్ డాడీ అంటూ, ఏ అవసరానికో ( పురుళ్ళకీ పుణ్యాలకీ) తీసికెళ్తూ మిగిలిన రోజులన్నీ ఈ మెయిల్స్ తోనూ, వీడియో చాటింగుతోనూ గడిపేస్తూంటే ఏం చేస్తారు? మా పిల్లలందరూ బయటే ఉన్నారండీ అంటూ అందరికీ చెప్పుకోవడంతోనే సంతొష పడే వాళ్ళకంటే నయమే కదా.ఉన్న పిల్లలు ఇక్కడే ఈ దేశంలోనే ఉన్నందుకు సంతోష పడాలి. ఎలాటి అవసరం వచ్చినా పన్నెండు గంటలలొపునే టాక్సీలోనో, ఫ్లైట్ లోనో రెక్కలు కట్టుకుని వాల్తారు. పైగా ఉన్న ఊళ్ళోనే ఉండడం ఓ బోనస్! అవన్నీ ఆలోచించి హాయిగా ఉండక, టైముకి వస్తారో లేదో అంటూ ఊహించేసికుని, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ తమే భరించేస్తున్నట్లు ప్రవర్తించడం బాగో లేదు.

   పోనీ ఇవన్నీ చెప్తే, ‘మీకెమండీ చెప్తారు. అనుభవించినవాళ్ళకి తెలుస్తుంది’ అంటారు. పైగా వ్యంగ్యంగా ‘ మీ అంత లెవెల్ కి మేము పెరగలేదులెండి’అనోటీ.ఇందులో లెవెల్ మాటేం వచ్చిందీ అంటే, ‘అసలు మీతో చెప్పుకోవడమే మా తప్పు’ అని ఆఖరిమాటగా చెప్తారు. అసలు అడిగిందెవరూ, చెప్పిందెవరూ? అంటే వాళ్ళు చెప్పేదంతా విని, ‘అయ్యొపాపం అలాగా..’ అని తందానతానా అంటే మనం వాళ్ళ శ్రేయోభిలాషులన్న మాట. లేకపోతే వాళ్ళపిల్లాడిలాగే శత్రుపక్షం వారమన్నమాట! ఒక్కొక్కళ్ళది ఒకోరకమైన స్వభావం. దేనికైనా సంతృప్తనేదుండాలి.

Advertisements

17 Responses

 1. good one sir !

  Like

 2. > తందానతానా అంటే మనం వాళ్ళ శ్రేయోభిలాషులన్న మాట. లేకపోతే శత్రుపక్షం వారమన్నమాట!
  అది నిజమే కదా! ఇప్పుడు రాజకీయ పార్టీలలో చక్క భజన చేసేవాళ్ళు అధిష్టానానికి శ్రేయోభిలాషులు, ఏమన్నా అడిగే వాళ్ళు రెబల్స్

  Like

 3. మబాగ చెప్పారు బాబాయిగారు.మా అమ్మ కుడా మీలానే అంటుంది.అందుకే మా అత్తగారికి అవిడ ఎప్పుడు opposition.వాళ్ళ ప్రతి చిన్న భయాలకి వెళ్ళలంటే,ఎప్పుడు ఎలా కుదురుతుందండి ? ఆ మాత్రానికే,ఆఖరి క్షణాల్లో అవసరం వస్తే ఈ పిల్లలు వస్తారా అన్నది కొంచం కాదు,చాలా over action(reaction)

  Like

 4. ఈ విషయం లో మీతో ఏకీభవించలేను. ఒకే ఊరులో వేరుగా ఉంటున్న 70 ఏళ్ల తల్లి, అంతకన్నా ఎక్కువ వయసు తండ్రి , హాస్పిటల్ అవసరానికి రాలేకపోతే, ప్రేమ అభిమానం అనే పదాలకి వేరే అర్ధం వెతుక్కోవాలేమో. urjent పని ఉంటే, ఈ వేళ కాదమ్మా రేపు తీసుకెళతాను అని కూడా అన్నాడో లేదో తెలియదు.

  Like

 5. @a2zdreams,

  థాంక్స్.

  @పాని పురి,

  అంతే కదా మరి !

  @నిరుపమా,

  అనే నేననుకున్నాను.

  @సుబ్రహ్మణ్యం గారూ,

  తల్లి తరపుగా ఆలోచిస్తే అది రైటే. కానీ అబ్బాయి కోణం లోంచి కూడా ఆలోచించాలికదా. అయేది ఎలాగూ ఆగదు.

  Like

 6. మాస్టారూ, మీరు కొంచెం లౌక్యం నేర్చుకోవాల్సార్. భమిడిపాటివాళ్లంటే వైదీకులే అయ్యుంటారు. 🙂
  ఎప్పటి కెయ్యది ప్రస్తుతం అన్నాడు సుమతీశతక కారుడు.
  కొత్తపాళీ లౌక్యం స్కూల్లో ఎడ్మిషన్లు జరుగుతున్నాయి. సరసమైన ధరలు – ఆలోచించండి! 🙂

  Like

 7. మాస్టారూ, ఇప్పుడే ఎవరో చెప్పారు, కేవలం అర్ధ శతాబ్ది కిందటే ఈ రోజున మీరు పుట్టేరని (మనలో మనం ఇలా అబద్ధాలాడుకూంటే పించనుకేం ఇబ్బంది లేదుగదా?)
  యేప్పీ యేప్పీ బర్త్ డే!!

  Like

 8. కొత్తపాళీ గారూ,

  వైదీకుడినే ! లౌక్యం తెలియకే అప్పుడప్పుడు చివాట్లు తింటూంటాను! మీ స్కూల్లో చేరితే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో చూస్తాను! ఏమైనా రాయితీలిస్తారా ఫీజు విషయంలో?

  Like

 9. మీదగ్గర ఫీజెందుకు లేండి గానీ ఇదిగో మొదటి పాఠం ఊరికినే చెప్పేస్తున్నా. పైన సుబ్రహ్మణ్యం గారికి జవాబిస్తూ అయేది ఎలాగా ఆగదు అని మీరే అన్నారు గదా. ఆ తల్లీ కొడుకులూ తరవాత వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడతారు, కానీ అక్కడ, ఆవిడచేతి కాఫీ తాగిన గెస్టుగా మీ బాధ్యత ఏవిటంటే – ఆవిడ వెలిబుచ్చిన దుఃఖానికి, ఈ పిల్లలింతేనండీ అని రాగయుక్తంగా వంతపాడి, ఆ రాగానికి రెండు మూడు సన్నాయి నొక్కులు నొక్కి, యథోచితంగా తగిన సంతాపం వెలిబుచ్చడం, పనిలో పనిగా మీరే కరక్టు అని ఆవిడ వాదనని బలపరచడం కూడా.

  Like

 10. As majestic as you are at covering this you are going just before prepare yourself headed for write a book lying on the matter… as well as I will be your first buyer.

  Like

 11. Awesome weblog, I’m going near tell all my friends a propos this! Wow, credit again.

  Like

 12. కొత్తపాళీ గారూ,

  ఎందుకులెండి ఈ లౌక్యాలూ అవీను ఈ వయస్సులో. పైగా ఈ పోస్టల్ ట్యూషనోటా !!

  Like

 13. very intense post I enjoy your website keep up the heroic posts

  Like

 14. Not long ago I started a weblog, as well as the information you provide lying on this webpage has helped me tremendously. Thank you for each and every one of your time & work. cheers!

  Like

 15. Hey, find irresistible your website I’ve been impression with reference to this subject all night.

  Like

 16. I must say one thing…You are truly a stately researcher

  Like

 17. Thanks for sharing this. You might consider making a video for this and putting it on youtube. I bet it would reach a lot more people.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: