బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- ఆలోచనా మార్గం మార్చుకోవాలేమో?


    ఈవేళ ప్రొద్దుట, క్రిందటేడాది HDFC Bank లో వేసిన ఓ డిపాజిట్ మెచ్యూర్ అయిందని, దాన్ని మళ్ళీ ఇంకో ఏడాదికి వేసేద్దామని వెళ్ళాను. క్రిందటేడాది 6.5% వడ్డీ మాత్రమే ఇచ్చాడు. సీనియర్ సిటిజెన్స్ కి ఇప్పుడు,7.5% ఇస్తున్నారు కదా, దాన్ని ఆటోమెటిక్ గా రెన్యూ ఎందుకు చేయరూ అని అడిగాను. క్రిందటి సారి ఏడాదీ పదిహేను రోజులకి వేశారూ, ఇప్పుడు ఏడాదీ పదహారు రోజులకైతేనే 7.5% ఇస్తామూ, అందువలన మీరు మళ్ళీ, ఫారం నింపి కొత్తది ఏడాదీ పదహారు రోజులకి తీసుకోవాలీ అన్నారు. క్రిందటేడాదేమైనా ఏడాదీ పదిహేను రోజులకు వేయమన్నానా, ఒక్కరోజు తేడా గురించి, మళ్ళీ ఈ ఫారాలూ అవీ నింపమనడం న్యాయమా అంటే సమాధానం లేదు. వచ్చే ఏడాది,సంవత్సరం పదిహేడు రోజులన్నారనుకోండి, మళ్ళీ ఈ తాపత్రయం అంతా పడాలి. రూల్సనేవి మనల్ని హింసించడానికే అని తేలింది. నాకేమో ఈ ఫారాలూ అవీ నింపడానికి చాలా శ్రమ పడవలసివస్తుంది, అందుకోసం అక్కడున్న వారినే నింపేయమని సంతకం పెట్టేసి వచ్చాను.

   అక్కడినుండి మా ఇంటికిందుండే రిలయన్స్ ఫ్రెష్ కి వచ్చాను. మా ఇంటావిడ బ్రేక్ ఫాస్ట్ లోకి అవేవో మొలకలూ వగైరా తింటూంటుందిగా అవి కొందామని. పేమెంటు కౌంటరు దగ్గరకు వెళ్ళేసరికి, అక్కడ ఒకాయన బిల్లింగు అవుతోంది, అక్కడున్న పిల్లకి కార్డు స్వాప్ చేయడం అదీ రాదనుకుంటా, ఇంకోడెవడినో పిలిచి చేయించింది. వాడేమో అది తప్పు చేసినట్లున్నాడు, దాన్ని క్యాన్సిల్ చేసి ( అని అన్నాడు!) మళ్ళీ చేశాడు. అక్కడున్నాయనతో అన్నానూ, ఒకసారి ఫోను చేసి తెలుసుకోండీ, డబుల్ బిల్లింగేమైనా అయిందేమో . ఇదిలా ఉండగా, ఆయన తీసికున్న ఆలౌట్ లిక్విడ్ మీద అదేదో ఫ్రీ అని ఉందిట. ఆ విషయం అక్కడున్న పిల్లని అడిగితే, నాకు తెలియదూ అంది. మరక్కడుందేది ఎందుకూ భజన చేయడానికా? దానిమీద ఉన్నది చదవడం రాదూ, మరి అలాటివారిని అక్కడ ఎందుకు పెడతారో తెలియదు. ఇంతలో ఇంకోడెవడో వచ్చి,ఫ్రీ ఐటం ఉన్నట్టుందీ, ఇప్పుడు దొరకడం లేదూ అన్నాడు. నాకో విషయం అర్ధం అవదు- కంపెనీ వాళ్ళు
product promotion కోసం ఏవేవో ఫ్రీగా ఇస్తూంటారు.ఎన్నైతే ఐటం లు ఉన్నాయో వాటికి సరిపడే ఫ్రీ ఐటం కూడా ఇస్తూంటారు. మధ్యలో ఈ కొట్లవాళ్ళే కక్కూర్తి పడి, నొక్కేయడమో, అమ్మేసికోవడమో చేస్తూంటారు. మనం అడిగితేనే కానీ ఇవ్వరు. పోనీ అడిగినా అదేదో పేద్ద నేరం చేసినవాళ్ళని చూసినట్లు అందరూ నవ్వడం ఓటి మరీ ఇంత కక్కూర్తిగా అడుగుతున్నాడేమిటీ అని. ఇంక మన పిల్లలెవరైనా ఉంటే ‘అదేమిటి డాడీ, అంత చిన్న విషయానికి అంత పెద్ద ఇస్యూ చేస్తారూ’ అని ఓ జ్ఞానబోధ కూడా చెయ్యొచ్చు.

    ఇక్కడ వస్తువు చిన్నదా పెద్దదా అని కాదు విషయం. అసలు ఆకొట్టువాడు why should he take us for a ride అని.బహుశా ఇలాటివన్నీ ఛాదస్తాలలాగ కనిపించొచ్చు. లేక మధ్యతరగతి మనస్థత్వం అనికూడా అనుకోవచ్చు.ఏం చేస్తాం, Value for money బుర్రంతా తినేస్తూంటుంది.అలా పెరిగి పెద్దయ్యాము.ఇప్పుడు వాటిల్లోంచి బయట పడడం కూడా కష్టమే.ఊరికే స్టేటస్ చూపించుకోడానికి డబ్బులు కూడా ఉండేవి కావు.

    ప్రస్తుత విషయానికొస్తే, ఇలాటి మాల్స్ లో పనిచేసేవాళ్ళు ఏమేం వెలగబెడుతున్నారో ఎక్కడో ఉండే మాల్స్ యజమాన్లకి తెలియదుకదా, ఇలాటివాటి ఆడిట్టే నాలాటివాళ్ళు చేసే మిస్టరీ షాపింగు. కస్టమర్ రిలేషన్ ఎలా ఉందీ, లాటి విషయాలమీద ఓ థర్డ్ పార్టీ ఎసెస్మెంటన్నమాట.

    నిన్న రాత్రి అదేదో స్పానిష్ లీగ్ లో ఫుట్ బాల్ మాచ్ (Barcelona Vs Real Madrid) నిన్న అనుకుని రాత్రి చాలాసేపు మెళుకువగా ఉన్నాను. టి.వీ లో ఆ మాచ్ వస్తూంటే చూస్తూ, పైగా గొప్పగా మా అబ్బాయికి మెస్సేజ్ పంపాను,అక్కడ మా ఇంట్లో టెన్ స్పోర్ట్స్ చానెల్ రాదులెండి.పంపితే వాడన్నాడూ ‘ డాడీ మాచ్ నిన్ననే అయిపోయిందీ, నువ్వు చూసింది రికార్డెడ్డూ’అని!ఇలా ఉంటుంది ఏదో గొప్ప పనిచేసేశామనుకుంటే ఫ్లాప్ అయిపోతూంటుంది! రాత్రి అంతసేపు మెళుకువగా ఉండేటప్పటికి నిద్ర రాక అటూ ఇటూ దొర్లుతూ పరుపుమీద వాలాను. నేను నిద్రపోవడంలేదూ అంటే, మా ఇంటావిడ ఏదో కబుర్లు మొదలెడుతుంది.కళ్ళు మూస్తూ తెరుస్తూ ఆవిడకి నేను నిద్రపోతున్నానూ అనే ఫీలింగిస్తూ లాగించేశాను. ఎంతసేపు అలా నటించగలం? మధ్యలో లేవ్వలసొస్తుంది కదా, అలా లేచి చూసేసరికి ఆవిడ గాయబ్ ! ఏమైందా అని చూద్దామని లేచేటప్పటికి, కర్టెన్ అడ్డుండంతో ఒకళ్ళనొకళ్ళు ఢీ కొట్టుకున్నాం! ఒక్కసారి హడిలి చచ్చాం!ఆవిడక్కడుందని నాకు తెలియదూ, నేనక్కడ ఉన్నానని ఆవిడకు తెలియదూ. వాకింగు చేస్తోందట! ఇదేం చిత్రమమ్మా అర్ధరాత్రి దాటాక ఇలా వాకింగులూ అవీ చేస్తారా? ఏమిటో వెళ్ళిపోతూంది జీవితం !!

Advertisements

8 Responses

 1. Mee writings annee baaguntai sir! 🙂

  Like

 2. మా రాజమండ్రి రిలయన్స్ మార్ట్ లో నా HDFC Bank cardతో వాళ్ళు
  రెండు సార్లు స్క్రాచ్ చేస్తే బ్యాంకు వాళ్ళునా అకౌంట్ లో రెండుసార్లు ఖర్చు రాసారు.
  వాళ్ళు చేసిన తప్పుకు బ్యాంకుకు వెళ్ళి చెబితే లక్ష ప్రశ్నలు వేసి
  ఓ ఉత్తరం వ్రాసివ్వమని ఓ నెల తరువాత జమ చేసారు. ఆ రోజు
  నుంచి డబ్బిచ్చే కొంటున్నా!

  Like

 3. ఇదేం చిత్రమమ్మా అర్ధరాత్రి దాటాక ఇలా వాకింగులూ అవీ చేస్తారా? …:) 🙂 🙂

  Like

 4. @చందూ,

  ధన్యవాదాలు.

  @గురువుగారూ,

  మంచి పని చేస్తున్నారు.

  @సృజనా,

  థాంక్స్ !

  Like

 5. Hilarious sir, but so so true!

  Like

 6. కొత్తపాళీ గారూ,

  ధన్యవాదాలు.

  Like

 7. బ్యాంకులు ప్రత్యేక “స్కీములు” అంటూ తెరలేపిన నాటకంలో రంగాలు ఈ 555; 775; 1000 రోజులు మొదలైన డిపాజిట్ స్కీములు. వీటిమీద వివరంగా ఓ టపా వ్రాద్దామనుకొంటున్నాను యెప్పటినించో. త్వరలో వ్రాస్తాను.

  ఇక బ్యాంకైనా, డిపార్ట్ మెంటల్ స్టోర్ అయినా, వాళ్లిచ్చే జీతాలకి జాబ్ నాలెడ్జ్ వున్నవాళ్లు రారు! వచ్చినవాళ్లు నేర్చుకొనేలోగా, ఇంకో వుద్యోగానికి మారిపోతున్నారు! మన ప్రభుత్వానికి కావలసింది “వృధ్ధి రేటు” లెఖ్ఖలు తప్ప, ఇవన్నీ కాదు.

  మీ షాపింగులు, వాకింగులు బాగున్నాయి.

  Like

 8. కృష్ణశ్రీ గారూ,

  అదేదో త్వరలో వ్రాశేయండి.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: