బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- కాలక్షేపం


    మొన్న శనివారం నాడు కొత్తగా ఈమధ్యన చేరిన మిస్టరీ షాపింగు ఒకటి చేశాను. కళ్ళజోళ్ళకొట్టు Lawrence & Mayo కి వెళ్ళాను.కళ్ళ టెస్టింగు చేసికోమన్నారు. అప్పటికే ఇంకో ఏజన్సీ వాళ్ళ Titan Eye వి మూడు చేసి ఉన్నాను కాబట్టి, ఈ assignment ఏమీ అంత కష్టమనిపించలేదు.ఆ eye testing చేసిన డాక్టరుతో, నా పాత కబుర్లన్నీ- నాకు మొట్టమొదటిసారి ఫాక్టరీ డాక్టరుతో కళ్ళటెస్టింగు ఎలా అయిందీ, ముందరే రూమ్ము లోకి వెళ్ళి అక్కడుండే అట్టమీదున్న అక్షరాలన్నీ ఎలా బట్టీ పట్టేశానో, చివరకి ఎలా పట్టుబడిపోయానో వగైరా..- చెప్పేటప్పటికి, వాళ్ళందరూ నవ్వాపుకోలేకపోయారు. దానితో నేనొక VIP అయిపోయాను.కన్సల్టేషన్ ఫీ ఇవ్వఖ్ఖర్లేదన్నారు! నేనక్కడుంటున్నానూ అని అడిగితే చెప్పాను. మరి కళ్ళ టెస్టింగుకి ఇంతదూరం ఎందుకొచ్చారూ అన్న దానికి, మీ కంపెనీ పేరు నచ్చింది అందుచేత వచ్చానూ, తప్పా అన్నాను. కాలక్షేపం మాత్రం చాలా బాగా అయింది.బస్సులో వెళ్ళడానికి పేద్ద ఖర్చేమీలేదు, మా పూణె మునిసిపాలిటీ వారి ధర్మమా అని ( సీనియర్ సిటిజెన్స్ కి రోజుకి 10 రూపాయలు మాత్రమే, ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు). ఇంకో నెలలో ఎలాగూ డబ్బులు ( 600 రూపాయలు) పంపుతారు.

    ఇంకో ఏజన్సీ వారిది రెండు కూడాచేశాను ఈవేళ. దీనిలో తేడా ఏమిటంటే, మనం వస్తువు ముందర డబ్బు పెట్టి కొనాలి, ఓ నెలలో మనం ఆ వస్తువు కొనడానికి ఎంత ఖర్చుపెడితే అంతా పంపించేస్తారు. బావుంది కదూ!డిశంబరు నెలలో అదేదో ‘ మోకా’ ట, దానికి వెళ్ళి ఓ 550 రూపాయల తిండి తినాలిట.ఒక్కణ్ణీ తిండం కష్టమేనండి బాబూ. తిన్నంత తిని, ఆ పైది పార్సెల్ కట్టించుకొచ్చేస్తే సరి! వచ్చే నెలలో వాళ్ళు చెప్పిన మల్టీ ప్లెక్స్ కి వెళ్ళి సినిమా చూసి, ఆ థియేటర్ గురించి వ్రాయాలిట. వాళ్ళు ఎసైన్ చేస్తే చేయడం. కావలిసినంత కాలక్షేపం.కొత్తవాళ్ళైనా మాట్లాడడానికి ఏమీ భయం గట్రా ఏమీ లేవు.వయస్సులో పెద్దవాణ్ణి కాబట్టి, మరీ ఎవరూ ఇరుకులో పెట్టరు.ఇంకేం కావాలి?నాకూ మంచి టైంపాసూ.

    మా ఇంటావిడ కూడా చేస్తూంటుంది. ఇక్కడ వచ్చిన గొడవల్లా ఏమిటంటే, మిస్టరీ షాపింగుకి వెళ్ళినప్పుడు, డబ్బులు నా జేబులోంచి వెళ్తాయి, చెక్కు మాత్రం ఆవిడ పేరున పంపుతూంటారు! నా అదృష్టం కొద్దీ, ఈ మధ్యన చెక్కులు ఆపేసి
బ్యాంకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అందుకే ఆ మధ్యన ఒకేనెలలో ఆవిడకి డెంటల్, కళ్ళజోడూ పెట్టించేశాను. ఆ వచ్చిన 5000/-కి అలా కాళ్ళొచ్చేశాయి!మహా అయితే, వైద్యం మీరేమైనా చేయించారా అంటుంది!పోనిద్దురూ, ఎవరి ఆనందం వాళ్ళది. ఆ మిగిలిన రెండు ఏజన్సీలలోనూ రిజిస్టర్ చేయించేస్తే ఓ గొడవొదిలిపోతుంది.తన ఖర్చులేవో తనే చూసుకుంటుంది! హాయి కదా!

    అందుకే అంటాను,రిటైరయి బాధ్యతలు చాలా భాగం తీరిపోయాక, మన దారిన మనమే ఏదో వ్యాపకం పెట్టేసికుంటే కావలిసినంత కాలక్షేపం. పిల్లలు ఎక్కడికైనా వెళ్తే, మనం కూడా నొరు వెళ్ళబెట్టికుని ‘ మేమూ వస్తామూ ఊ ఊ ఊ…’
అని పేచీ పెట్టఖర్లేదు
! పిల్లలు వాళ్ళ దారిన వాళ్ళుంటే వాళ్ళకీ హాయి. ఏ restaurant కేనా వాళ్ళు వెళ్తూ, మొహమ్మాటానికి మనల్నీ రమ్మంటారనుకోండి, పొనీ అని వెళ్ళేమా,అక్కడంతా అగమ్యగోచరంగా ఉంటుంది. సుఖానున్న ప్రాణానికి అంత హింస పెట్టాలంటారా ?

    నేనకోవడం మన దారిన మనం ఉండడం. ఎవరైనా మనింటికి వస్తే, ఓ సారి వాళ్ళింటికి వెళ్ళడం.ఎవరూ రారూ ఇంకా మహబాగు.మన కాలక్షేపం మనకి ఉండనే ఉంది.ఎవరైనా ఏ ఫంక్షనుకో పిలిస్తే వెళ్ళడం.కారణాంతరాలవల్ల, మనల్ని పిలవలేదూ తరవాత తెలిసి ఏడవకూడదు.ఇవ్విధంబుగా మా ఇంటావిడకి బ్రెయిన్ వాష్ చేస్తున్నాను.చూద్దాం ఎంతవరకూ నెగ్గుకొస్తానో? వచ్చే వారం మాతో గడపడానికి మా కజిన్ వస్తున్నాడు. తనతో ఓ అయిదురోజులు కాలక్షేపం !

Advertisements

4 Responses

 1. meeru bhale rastharu babai garu… comment pettaka poyina regular gaa chadhuvuthuntaanu 🙂

  Like

 2. ఆ మిష్టరీ షాపింగు లంకెలేవన్నా ఉంటే ఇలా పడెయ్యండి బాబుగారూ….మా పెద్దవాళ్లకు కూడా ఇస్తాను…వాళ్లకూ కాలక్షేపం…ముందస్తు ధన్యవాదాలు

  Like

 3. retire అయిన వాళ్ళందరు మిమ్మల్ని inspiration తీసుకుంటే బావుండు..వాళ్ళకి ఎమీ తోచదు ఇంక వాళ్ళ పిల్లలని విసిగిస్తారు..వాళ్ళంటే ఇష్తమున్నా,,రోజంతా వాళ్ళతొ కబుర్లు చెప్తూ కుర్చొలెం కదా..ఎదైనా వ్యాపకం పెట్టుకొమంటె,ఈ వయసులొ కూడా మేము సుఖంగ వుండటం కోడలికి ఇష్టం లేదు అన్నట్టు ఫీల్ అవుతారు,ఆరోగ్యం బానే వున్నా సరే .ఆ వయసులొ అలానే అనిపిస్తుందేమొలెండి..మెమైనా అప్పుడు అలనె అనుకుంటామెమో..

  Like

 4. @మధూ,

  కామెంటుకేముందిలే. నచ్చితే చాలు.

  @వంశీ,

  ఈ విషయం మీద వివరాలతో ఒక టపా https://harephala.wordpress.com/2010/09/30/baataakhaani-337/ పెట్టాను.

  @నిరుపమా,

  ఎలాగోలాగ ఓ వ్యాపకం పెట్టుకోడానికి ఒప్పించాలి.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: