బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- చదువులు


    మనం చిన్నప్పటినుండీ నేర్చుకున్న చాలా చాలా పాఠాలు, అసలు ఆ గురువులు ఎందుకు నేర్పారో, మనం బట్టీ పట్టేసి ఎందుకు నేర్చుకున్నామో ఇప్పటికీ నాకైతే తెలియదు. ఉదాహరణకి తెలుగు అక్షరాల్లో అలు,అలూ ( ౡ).ఈ అరవైఅయిదేళ్ళలోనూ, చిన్నప్పుడు నేర్చుకోవడం తప్ప, ఇంకెక్కడా ఆ అక్షరాలు ఉపయోగించగా చూడలేదు. అలాగని నేనేమీ పేద్ద చదువుకున్నవాడిననడం లేదు. తెలుగుకి సంబంధించినంతవరకూ, మిగిలిన అక్షరాలు ఎక్కడో అక్కడ చదివే సందర్భం వచ్చింది, అదీ నేను చెప్పేది.మనకేం తెలుసునూ, ఈ అక్షరం వాడుక భవిష్యత్తులో ఉండదూ అని! నేర్చుకోకపోతే మాత్రం, ఓ తొడపాయసమో, గోడకుర్చీ యో,టెంకి జెల్లో మాత్రం పడేది!చచ్చినట్లు నేర్చుకున్నాము!

ఎక్కాలోటీ,రెండునుంచి పంథొమ్మిదో ఎక్కందాకా కిందనుంచి పైకీ, పైనుంచి కిందకీ బట్టీ పట్టాల్సిందే! ఆతరువాత ఇరవయ్యో ఎక్కంనుండీ కొంతకాకపోతే కొంత సుళువుగానే ఉండేవి.ఏదో అంతకుముందు నేర్చుకున్నవాటికి ఒకటో రెండో సున్నలు చేర్చేస్తే పనైపోయేది! అన్నిటిలోకీ చిత్రహింసలు పెట్టేది పదమూడో ఎక్కం.ఛస్తే వచ్చేది కాదు. అదివచ్చేదాకా ఇంట్లోనూ, స్కూల్లోనూ, ప్రెవేటు లోనూ బుర్ర పగలుకొట్టుకోవడమే! ఏమిటో ప్రపంచం అంతా మనకి శత్రువుల్లా కనిపించేవారు!మన ఇంటికి వచ్చే పాలవాడూ, చాకలీ, డబ్బులు లెఖ్ఖెట్టేటప్పుడు టకటకా మని నోటి లెఖ్ఖ కట్టేసి, టక్కుమని చెప్పేసేవారు. వాళ్ళని చూపించి ‘ వీళ్ళలా లెఖ్ఖలు నేర్చుకుంటే, పెద్దయిన తరువాత ఏ కొట్లోనో పద్దులు వ్రాసే గుమాస్తాగా అయినా ఉద్యోగం వస్తుందీ’ అని చీవాట్లేసేవారు.

ఎలాగోలా ఈ బాలారిష్టాలన్నీ దాటి పెద్ద స్కూల్లోకొచ్చేటప్పటికి జనరల్, కాంపొజిట్ మాథ్స్ అనేవొచ్చాయి.వాటిల్లో ఏమిటేమిటో స్క్వేర్ రూట్లూ అవీనూ.వాటిని ఎందుకు కనిపెట్టారో,అవన్నీ మనకి ఎందుకు ఉపయోగిస్తాయో అంతా అగమ్యగోచరంగా ఉండేది. పోనీ అలాగని నేర్చుకోనూ అందామా అనుకుంటే, పైక్లాసుకు వెళ్ళమేమో అనో భయం!జనరల్ మాథ్స్ లో అవేవో పొలాలూ, చుట్టుకొలతలూ, ఆవులూ, గడ్డీ,వైశాల్యాలూ అవీ ఉండేవి.గోడలు కట్టడాలూ, కూలీలూ కూడా.ఇంక కాంపోజిట్ మాథ్స్ కి వస్తే,ఏవేవో ఏ స్క్వేర్లూ, బీ స్క్వేర్లూ అవీ ఉండెవి. ఏమిటో ఈ గోలంతా అనిపించేది.కాలేజీకొచ్చేసరికి సైన్ తీఠాలూ, కాస్ తీఠాలూ, టాన్ తీఠాలూ వచ్చేశాయి.ఆ ఫిజిక్సోటీ,యాక్సిలరేషన్ డ్యూ టూ గ్రావిటీ ఎంతైతే మనకెందుకంట! ఎంతంత చిత్రహింసలు పెట్టారండి బాబూ!పైగా ఈ మాథ్స్ లో కాలుక్లస్,జామెట్రీ,ట్రిగనామెట్రీ, ఇవన్నీ సరిపోనట్లు ఎస్ట్రానమీ ఒకటీ.అన్నిటికీ విడివిడిగా క్లాసులూ! అసలు ఈ హింసలన్నీ దాటుకుని బతికి బట్ట కడతానా అనిపించేది!

ఏదో తిప్పలు పడి ఎలాగోలాగ ఆ బి.ఎస్.సీ పూర్తిచేసేననిపించుకున్న తరువాత, ఆ వెలగబెట్టిన చదువుకి సంబంధించిన ఉద్యోగం చేశామా అంటే అదీ లేదూ.ఏం చదివానో, ఎందుకు చదివానో అంతా అగమ్యగోచరం! ఇప్పటి వాళ్ళని చూస్తే అసూయ వేస్తుంది ఆ ఎక్కాలూ అవీ నేర్చుకోనఖ్ఖర్లేదు. ఓ కాలిక్యులేటరు తీసికుని ఠక్కు మని నొక్కేస్తే చాలు.పైగా అదికూడా అఖ్ఖర్లేదు.సెల్ ఫోన్లలోనే పెట్టేశారు.

ఆ రోజుల్లో తెలుగులో ఛందస్సూ,అలంకారాలూ, ఇంగ్లీషులో గ్రామరూ మనల్ని ‘ నిను వీడని నీడనులే ‘ అంటూ ఉండేవి. ఇంగ్లీషు గ్రామరుకైతే జే.వీ.రమణయ్య గారి గ్రామరు పుస్తకమో,కొంచం ఎఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళైతే రెన్ ఎండ్ మార్టిన్ గ్రామరూ ఉంచుకునేవారు.కాంపోజిషనూ, లెటర్ రైటింగూ అయితే ఆ రోజుల్లో నేర్చుకున్నదే ఇప్పటికీ గుర్తు.లీవు లెటర్ వ్రాయడం, ఏదొ కంపెనీకి వ్రాయడం అప్పుడు నేర్చుకున్నదే.నాలుగక్షరాలు వంటబట్టాయీ అంటే,ఆ రోజుల్లో మనకి చదువు చెప్పిన గురువులదే ఆ చలవంతా.ఆ రోజుల్లో ఇంగ్లీషులో ‘ఫిగర్ ఆఫ్ స్పీచ్’ అనేదొకటి నేర్చుకున్నాము. ఈ మధ్యన ఏదో మాటల సందర్భంలో స్కూల్లో చదువుకునే ఒక అబ్బాయినడిగాను- మీకు ‘ఫిగర్ ఆఫ్ స్పీచ్’ నేర్పుతారా అని.అంటే అతనన్నాడూ, ‘అంకుల్ మాకు క్లాసులో ఉండే ఆడపిల్లల ఫిగర్ తప్ప ఇంకేదీ తెలియదూ’ అని.నవ్వాలో ఏడవాలో తెలియలేదు.

ఒకలా చూస్తే, మాకు కాలేజీల్లో నేర్పేవి ఇప్పుడు అయిదో, ఆరో క్లాసునుండే నేర్పుతున్నారు. మా మనవరాలి పుస్తకాలు ఒక్కొక్కప్పుడు చూస్తే తల తిరిగిపోతూంటుంది!ఆరోజుల్లోది తక్కువ స్టాండర్డా అనిపిస్తూంటుంది. పోన్లెండి ఈ గొడవలన్నీ పడఖ్ఖర్లేకుండా ఏదో గట్టెక్కేశాను !!

Advertisements

4 Responses

 1. మరే,,ఇప్పటి competetion గట్రా బాధలు లేకుండా ఎంచక్కా గట్టెక్కెసారు..ఎదో సరదాకి అన్నాను కాని,,ఎప్పటి కష్టాలు అప్పటివే..

  Like

 2. అదేమిటండీ అలా అనేసారు
  మాలాౢక్ ప్తా సనస్థ
  అన్న ధ్యాన శ్లొకంలో నేను చిన్నప్పట్నుండీ చూస్తున్నా
  కాకపోతే ఇక్కడ టైప్ చేయలేక పోయాను

  Like

 3. అదేమిటండీ అలా అనేసారు
  మాలాౢక్ ప్తా సనస్థ
  అన్న ధ్యాన శ్లొకంలో నేను చిన్నప్పట్నుండీ చూస్తున్నా
  కాకపోతే ఇక్కడ టైప్ చేయలేక పోయాను 🙂

  Like

 4. నిరుపమా,

  ఏమీ ఫరవాలేదు. ఉన్నమాటే కదా !!

  @ రహ్మానుద్దీన్ ,

  వ్రాసే ప్రతీదానికీ ఎక్సెప్షన్స్ ఉంటాయి. అందులో నీలాటివారొకరు.అదేమిటి, మరీ ఎక్కడా మాటా మంతీ లేకుండా ఉండిపోయావు? పెళ్ళి హడావిడి ఏమైనా ఉంటే మాత్రం చెప్పు !!..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: