బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–అలా అయితే ఎంతబావుంటుందో….


    ఒక్కొక్కప్పుడు ఏమీ పనిలేనప్పుడు కూర్చుంటే, ఏమిటేమిటో చిన్నప్పటి జ్ఞాపకాలు వచ్చేస్తూంటాయి. మనకి తెలుసును గడిచిపోయిన సమయం మళ్ళీ రాదని అయినా వాటిని జ్ఞాపకం చేసికుంటే ఎంత సంతోషం వేస్తుందో? ఇలాటివి ఇంట్లోవాళ్ళకి చెప్తే ‘ఈయనకి మతి స్థిరం తప్పిందీ, ఏ డాక్టరుకైనా చూపించాలేమో ‘అన్నా అనుకోవచ్చు! అయినా సరే,నేను కొన్ని కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకున్నాను. అవేమీ పేద్దపేద్ద ఇడీల్ విషయాలేమీ కాదు. మామూలు విషయాలే. ఇప్పటి కాలమానపరిస్థితుల్ని చూస్తే అవన్నీ సిల్లీగా కనిపించొచ్చు. కానీ అవి జరిగినప్పుడు, మన బుల్లిబుర్ర ఎంత సంతోషించిందో, ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.కాదూ, మీకు నచ్చలేదంటారూ వదిలేయండి, ‘ ఏదో పాడుకల వచ్చుంటుందీ,ఏమిటేమిటో వ్రాస్తున్నారూ’ అని!

నాకు గుర్తొచ్చినవి ఇవీ.జీవితంలో ఛాన్సంటూ వస్తే మళ్ళీ అలా చేయాలని….

చిన్నప్పటి జ్ఞాపకాలు–

1) తేగలు కాల్చుకుని తినడం, గుర్తుంచుకుని అందులో ‘చందమామ’ ని తినడం.
2) జనుము (ఆవులకీ, గేదెలకీ గడ్డితో పెట్టేది) పుల్లకి నిప్పంటించి గుప్పుమని పొగ పీల్చడం.
3) రోడ్డుమీద ఏ సీనారేకు డబ్బా అయినా కనిపిస్తే దాన్ని తన్నడం ( ఈ విషయం మీద అప్పుడెప్పుడో క్యాడ్బరీస్ యాడ్ కూడావచ్చింది)
4) గోడలమీద పెన్సిళ్ళతో వ్రాయడం, చివాట్లు తినడం.
5) ఫ్రెండ్స్ తో ఏదైనా ‘కాకి ఎంగిలి’ చేసి పంచుకోవడం.
6) దీపావళి రోజున ‘ తిప్పుడు పొట్లం’ తిప్పుకోవడం.
7) శలవల్లో పొద్దున్నే లేవఖ్ఖర్లేకుండా దుప్పటీ ముసుగెట్టుకుని నిద్రపోవడం.
8) మొదటి రోజు మొదటాటకి టిక్కెట్లకోసం నుంచోవడం, టిక్కెట్టు దొరికితే ఏదో సాధించేసేసేమన్నట్లు ఊరికే ‘ఫీలైపోవడం’.
9) ఇంట్లో ‘తద్దినాలు’ ప్రతీరోజూ వస్తే బాగుండుననుకోవడం. ఎందుకంటే ఆరోజే గారెలూ, అప్పాలూ చేస్తారుగా!
10) ఆ రోజుల్లోలాగ మన నెత్తిమీద వెంట్రుకలు గాలికి ఎగురుతూండాలనుకోవడం !
11) కోపం వస్తే పళ్ళు కొరుక్కోవాలనుకోవడం.
12) కిరాణా కొట్టుకెళ్ళి కొట్టువాడిని బెల్లం ముక్క పెట్టమనడం !
13) తీర్థాల్లో జీళ్ళు కొనుక్కోవడం, రంగులరాట్నంలో ఎక్కడం.
14) శ్రీరామనవమికి పానకం త్రాగడం.

    మా ఇంటావిడని ఈ విషయం అడిగితే,’ శుభ్రంగా తిని కూర్చోక, ఇప్పుడు అవన్నీ అడిగితే ఎలాగండి బాబూ’ అంది.మా అమ్మాయిని అడిగితే, ‘ డాడీ, ఇప్పటికే ఆదిత్య( అంటే మా మనవడు), నిన్నూ, విశాల్ వాళ్ళ డాడీ నీ, ఎప్పుడూ ఇంట్లోనే ఉండడం చూస్తూంటే, ‘ మమ్మీ నేను కూడా రిటైరయిపోతే బావుంటుందనుకుంటున్నానూ అంటున్నాడు'” అని చెప్పింది! ఇంతాచేసి వాడు చదివేది ఫస్ట్ స్టాండర్డ్!

ఈయన IQ level ఇంతే, ఇంతకంటే ఏం గుర్తుకొస్తాయిలే అనుకున్నా ఫరవాలేదు. ఇప్పుడు ఈ వయస్సులో దేశాన్నేమీ ఉధ్ధరించేద్దామనుకోవడం లేదు!

అలాగని వదిలేస్తాననుకోకండి. మీకు గుర్తుకొచ్చి, మళ్ళీ అలా చేస్తే బావుండునూ,అనుకునే విషయాలు అందరితోనూ పంచుకోండి.

Advertisements

8 Responses

 1. 1) తేగలు కాల్చుకుని తినడం, గుర్తుంచుకుని అందులో ‘చందమామ’ ని తినడం.
  5) ఫ్రెండ్స్ తో ఏదైనా ‘కాకి ఎంగిలి’ చేసి పంచుకోవడం.
  6) దీపావళి రోజున ‘ తిప్పుడు పొట్లం’ తిప్పుకోవడం.
  13) తీర్థాల్లో జీళ్ళు కొనుక్కోవడం, రంగులరాట్నంలో ఎక్కడం.
  ఇల్లాంటివన్నీ ఎందుకు గుర్తు చేస్తారు మాష్టారూ. ఒక్కమాటు ఏభై ఐదు ఏళ్ళు వెనక్కి వెళ్ళితే మళ్ళీ అక్కడనించి తిరిగి రావాలనిపించదు.

  Like

 2. సుబ్రహ్మణ్యం గారూ,

  నిజంగా అలాగే ఉండిపోగలిగితే అంతకన్నా ఇంకేమి కావాలండి? ప్రస్తుత వాతావరణం లో సిల్వర్ లైనింగు ఆ జ్ఞాపకాలే !

  Like

 3. బాగున్నాయి మీ కబుర్లు.చిన్నప్పుడూ మా అమ్మమ్మో తాతగారో వాళ్ళ తరం కబుర్లు చెప్తోంటే విసుగొచ్చేది.అబ్బా,,ఏమిటి ఈ సుత్తి అనిపించేది. నాకయితే ఈ కిందవి చేయాలనిపిస్తుంది కాలం వెనక్కి వస్తే

  1)తాతగారి దగ్గర గడిపి ఆయన కబుర్లు వినడం

  2)హాయిగా పొద్దున్న స్కూలు ఫస్టు బెల్లు కొట్టాకా ఇంటి నుండీ బయలుదేరడం స్కూలు కి

  3)మామిడీ తాండ్ర కొనుక్కోవడం స్కూలు దగ్గర(నాన్న కి తెలీకుండా)

  4)దసరా శెలవల్లో జామ చెట్టెక్కి పసిరి కాయలని తెంపి తినడం

  5)సాయంత్రం స్కూలు వదిలాకా ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటూ(వీలయితే మీరన్నట్లు ఓ డబ్బానో రాయినో తన్నుకుంటూ) తీరికగా ఇంటికి రావడం.

  6)మార్చి నెలలో ఇంట్లో మామిడి చెట్టున్న వాళ్ళతో అస్సలు దెబ్బలాడకపోవడం.(మామిడి పిందెలు ఇస్తారని ఉప్పూ కారం పెట్టుకు తినడానికి.)

  ఈ లిస్టు కి అంతు ఉందదు లెండి.

  Like

 4. నా మటుకు నాకు పొలము వెళ్లి la

  Like

 5. నా మటుకు నాకు తాటి టెంకలు చీకు కొని బుర్ర గుంజు తినాలనీ కూడా అనిపిస్తుంది మరి.

  Like

 6. @ ఆవకాయ,
  సరదాగా గుర్తుచేసికోడానికి వ్రాశాను.

  @నరసింహరావు గారూ,

  మరి ఇంకా ఎవరికోసం చూస్తున్నారు? హాయిగా పొలం వెళ్ళిపోక !

  Like

 7. బాబుగారూ!

  మీరు చెప్పినవన్నీ మేమూ చేశాము–ఒక్క మొదటాట సినిమా తప్ప. యెందుకంటే, మా వూరికి రిలీజు సినిమాలు వచ్చేవి కాదు. అవి వచ్చినప్పుడే రిలీజు అనుకొన్నా, మా ‘కొండెగాణ్ణి ‘ ప్రవేశపెట్టిన వైనం నా ‘తెలుగు రాడికల్ ‘ బ్లాగులో వ్రాశాను.

  ఇంకాకొన్ని ఙ్ఞాపకాలు మరోసారి.

  Like

 8. కృష్ణశ్రీ గారూ,

  మీ జ్ఞాపకాలు అందరితోనూ పంచుకోండి.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: