బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


   మొన్నెప్పుడో, నేనూ,మా ఇంటావిడా ఈవెనింగ్ వాక్ కి వెళ్తూ, దారిలో ఉన్న గణపతి గుడికి వెళ్ళాము. ఇంతలో ఒకతను ( అతనెవరో గుర్తుకి రాలేదు)మేము ఉండే పాత ఇంటిదగ్గర ఉండేవాడనుకుంటాను, వచ్చి పలకరించాడు.అదేదో నా మీదేదో అభిమానంతో కాదు.అక్కడికి ప్రక్కనే ఆ ఏరియా కి సంబంధించిన ఓ సీనియర్ సిటిజెన్స్ క్లబ్బోటుందిలెండి, ఆ రోజు అక్కడ వాళ్ళందరూ ‘తంబోలా’ ఆడుకుంటున్నారనుకుంటా. వాళ్ళకి ఆడేవాళ్ళు తక్కువై, నన్ను పిలిచినట్టనిపించింది.అలాటి వాటి మీదైతే నాకు ఆసక్తనేది ఎప్పుడూ లేదు.క్లబ్బు వాతావరణం ఒకటి, నెనెప్పుడూ వాటి జోలికి పోలేదు. అలాగని నేను ఏమీ Unsocial animal కాదు. నా లోకం, నా స్నేహితులూ నాకున్నారు.అసలు ఎవరో ఎందుకూ, మీరందరూ నాకు స్నేహితులే.

    Somehow నాకు, Real world కంటే Virtual world హాయనిపిస్తుంది. మామూలుగా మా సీనియర్ సిటిజెన్స్ క్లబ్బుల్లో జరిగేదేమిటంటే ఓ నలుగురు బెంగాలీ వాళ్ళు Bridge ఆడుకుంటూనో,ఓ నలుగురు మళయాళం వాళ్ళు
రమ్మీ
ఆడుకుంటూనో కనిపిస్తారు. పైగా Bridge ఆడటం ఒక్క బెంగాలీ వాళ్ళకే వచ్చినట్లూ,ఓ Status symbol లా దానిగురించే మాట్లాడుకోవడం. పోనీ ఏదో అదృష్టం బాగుండి ఎవడో ఒకడు ఖాళీగా ఉన్నాడని, కబుర్లు చెప్దామంటే,‘మనకి Next DA instalment ఎంతొస్తుందీ’ లోకి వెళ్ళిపోతుంది. ఏమిటో ఈ తాపత్రయాలు? వచ్చే డి.ఏ. వస్తుందికదా.ఒక మంచివిషయం ఏమిటంటే, దాదాపు అందరూ ఒకే డిపార్ట్ మెంటు లో (ఆర్డ్నెన్స్ ఫాక్టరీ) లోనే పనిచేసినవాళ్ళు కావడం. ‘ ప్రతీ రోజూ పాత మొగుడేనా’ అన్నట్లు, నలభై ఏళ్ళపాటు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూస్తూన్నాము. ఇప్పుడూ వాళ్ళేనా? వెరైటీ ఉండొద్దూ!

   బయటి వాళ్ళు మనల్ని ఎలాగూ వాళ్ళతో చేరనీయరు, ప్రతీ చోటా polarisation. హాయిగా మన దారేదో మనమే చూసుకుంటే పోలేదూ? ఈ ప్రపంచంలో సవాలక్ష మార్గాలున్నాయి కాలక్షేపానికి.One has to look for the options. ఈ బ్లాగులోకంలోకి ప్రవేశించినప్పటినుండీ, ఎంతమంది స్నేహితుల్ని సంపాదించానో తలుచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. అసలు రెండేళ్ళక్రితం వరకూ కంప్యూటరు జోలికే వెళ్ళడానికి భయపడే నేను, ఇంత తక్కువ సమయంలో
ఎంతమంది స్నేహితుల్ని సంపాదించకలిగానో! ఏ ఆరుగురో ఏడుగురో తప్ప చాలామంది నాకంటే చిన్నవారే అని నా అభిప్రాయం.ఆ ఉన్న ఆరుగురూ నాకు సమవయస్కులే అయుండవచ్చు.చెప్పేదేమిటంటే, ప్రత్య్క్షక్షంగా కలిసినది ఓ పాతిక మందిని, వారుకూడా మాట్లాడినంతసేపూ ప్రాణం ఇచ్చి మాట్లాడారు. ఎంత సంతోషమనిపించిందో?

    అలా కాకుండా ఏదో పొడిచేద్దామని ఏ క్లబ్బులోనో చేరితే ఏమౌతుందీ? మొదటి నెలా రెండు నెలలూ అంతా హ్యాపీ హ్యాపీ గానే ఉంటుంది. తినగా తినగా మొహం మొత్తేసినట్లు, ఆ తరువాత మొదలౌతాయి పోలిటిక్స్. ‘మా అబ్బాయి ఫ్లాట్ కొన్నాడు, మీ వాడేం చేస్తున్నాడూ’, మా వాడు ఆన్ సైట్ వెళ్ళాడూ, ఏమిటోనండీ మమ్మల్నీ రమ్మంటున్నాడూ” మా అమ్మాయి ఈ నెక్లెస్ ఇచ్చిందీ, మా వియ్యాలారు మొన్న ఈ పట్టుచీర పెట్టారూ’ ఇవే కబుర్లు. ఇవన్నీ చెప్పి చెప్పి బొరు కొట్టడమే కాకుండా, మన వ్యవహారాల్లోకి తలదూర్చి, అడిగినా అడక్కపోయినా ఊరికే సలహాలోటీ.నలభై ఏళ్ళు భరించాం, ఇంకా ఇప్పుడు కూడా ఈ తలనొప్పి అవసరమంటారా?ఆ చెప్పే కబుర్లు కూడా, భార్య చెప్పేది ఓటీ, భర్త చెప్పేది ఓటీ! దాంతోటే తెలుస్తుంది వాళ్ళు చెప్పేవాటిలో ఎంతంత నిజం ఉందో?

    పోనీ ఏ టి.వీ. యేనా చూద్దామనుకుంటే,ఆ సీరియల్సూ, న్యూసు చానెల్సూ చూస్తే మన భాష కూడా తగలడుతుంది.ఓపికున్నంతసేపు నెట్ లో బ్రౌజింగు చేసికుంటే హాయి.ఈ గోలంతా ఎందుకు వ్రాస్తున్నానంటే ఈ మధ్యన మా ఇంటావిడ ఓ టపా వ్రాసింది.తను పదిహేనేళ్ళనుండీ ఉంటున్న గ్రూప్ లో కంటిన్యూ చేయడమా, మానేయడమా అని. నన్నడిగితే మానేస్తే సుఖ పడతావు అని చెప్పాను. ఏదో మన దారిన మనం ఉండక, ఈ తాపత్రయాలన్నీ ఎందుకూ? ఎవరో ఏదో అన్నారని బీ.పీ. పెంచేసికోవడం ఈ వయస్సులో అంత అవసరమా? నాతో వంతు పెట్టుకుని కంప్యూటరు ఎలాగూ నేర్చేసికుంది.పైగా ఓ అడుగు ముందేసి లాప్ టాప్ కూడా ఉపయోగిస్తుంది. మా అబ్బాయి ధర్మమా అని ఓ లైబ్రరీ ఉంది. కావలిసినన్ని తెలుగు, ఇంగ్లీషు పుస్తకాలున్నాయి.ప్రతీ వారం పిల్లలతో గడుపుతోంది.ఎప్పుడైనా దెబ్బలాట పెట్టుకుని చివాట్లు తిండానికి Yours obediently నేనున్నాను ! ఇంకేం కావాలండి బాబూ?

   మనం ఉండేది ఎన్నేళ్ళూ? ఉన్నంతకాలం హాయిగా నవ్వుతూ బ్రతకాలి కానీ, ఊళ్ళో జరిగే అన్ని విషయాలూ పట్టించుకోకూడదు.అలాగని పేద్ద intellectual లాగ పోజు పెట్టేయమని కాదు. మన Comfort level లో మనం ఉండడం.మనసుకు ఏది తోస్తే అది చేసేయడం. God has given us a beautiful life. Enjoy !

Advertisements

9 Responses

 1. మిమ్మల్నీ, సూర్య లక్ష్మి గారిని చూస్తుంటే ముచ్చటేస్తుంటుంది… ఇద్దరీ ఎంచక్కా ఈ ఏజ్ లో కూడా బ్లాగులు రాసుకుంటూ… చాలా యాక్టివ్ గా ఉంటూ… గుడ్ … మీ ఏజ్ కి వచ్చే సరికి మేము అంత యాక్టివ్ గా ఉంటామా అనేది నాకు డౌటే ….మీరు ఈ టపాలో చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం…

  Like

 2. mee kaburlu naaku chaala chaalaa nachhutayandi. chaala kaalam nunchi telisina varilaga untaru meeru. mee maatalu chaduvutunte naaku intlo vallani vintunnatle anipistundi.

  tapalanni eppudoo chaduvutunna, vyakhya pettadam ide modatisaari.

  Like

 3. >>. పైగా Bridge ఆడటం ఒక్క బెంగాలీ వాళ్ళకే వచ్చినట్లూ,ఓ Status symbol లా ,
  నేను జోర్హాట్ వెళ్ళిన కొత్తలో క్లబ్ కి వెళ్ళితే నాకూ ఇదే అనుభవం. పంతం పట్టి ఒక రెండు పుస్తకాలు కొనుక్కొని మరీ నేర్చుకున్నాను Bridge ఆడటం. ఆ తర్వాత అదొక వ్యసనంగా మారింది.( పెళ్ళి అయేదాకా).

  >>ఎప్పుడైనా దెబ్బలాట పెట్టుకుని చివాట్లు తిండానికి Yours obediently నేనున్నాను !
  హహహహ్హా. ఎప్పుడైనా నా?
  నేను రాయాలనుకున్న టపా మీరు వ్రాసేసారు.
  రాస్తూ ఉండండి మాస్టారూ. బాగా వాస్తున్నారు. చిరు నవ్వులు పంచేస్తున్నారు.

  Like

 4. దెబ్బలాట పెట్టుకుని చివాట్లు తిండానికి Yours obediently నేనున్నాను ! ఇంకేం కావాలండి బాబూ?….హహహ..:)

  ఈ ప్రపంచంలో సవాలక్ష మార్గాలున్నాయి కాలక్షేపానికి.One has to look for the options. నిజమండీ..నన్ను అందరు మారిషస్ లో ఎలా కాలక్షేపం అవుతుందీ అని అడుగుతుంటారు..నెట్ లో పేపర్ ,బ్లాగ్స్ ద్వారా టైమే తెలియడం లేదు.

  Like

 5. దెబ్బలాట పెట్టుకుని చివాట్లు తిండానికి Yours obediently నేనున్నాను ! ఇంకేం కావాలండి బాబూ?

  Suuuuper…!! 🙂

  Like

 6. Phani Garu

  Namaskaram. I am the silent reader of your blog. Suddenly i shocked on looking at subject of u r post. Really you have written a good post on life Certificate. Whatever u have mentioned are close to the middle class man’s life. Every year when November starts my Father in law starts saying life certificate ,life certificate. He cannot move on his own. But in November he will come out from home to go to bank to submit life certificate . Thankyou very much for your nice post.

  Like

 7. @కిషన్ రెడ్డి గారూ,

  ధన్యవాదాలు.శుభ్రంగా మాకంటే బాగానే ఉంటారు !

  @హృద్యా,

  ధన్యవాదాలు.

  @సుబ్రహ్మణ్యం గారూ,

  ఒక్క మాట ముందుగా చెప్తే మీకే ఆ ఛాన్సిచ్చేవాడిని కదా!మీరు మరీనూ…

  @సృజనా,

  ధన్యవాదాలు.

  @రాజా,
  ధన్యవాదాలు.

  @రాకేశ్వరా,

  ధన్యవాదాలు.
  @sslr,
  Thanks a lot.

  Like

 8. one can argue that it can go both ways

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: