బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఈ రోజుల్లోకూడా…


Wife kills self, case against techie, mother – Express India

    ఈవేళ ఓ పేపరులో చదివిన వార్త పైన ఇచ్చాను. ఈ సంఘటన పూణె లో జరిగింది.దురదృష్టం ఏమిటంటే ఈ రోజుల్లో ఇలాటివి జరుగుతున్నాయని. అదీ ఓ విద్యావంతులైన కుటుంబంలో. వచ్చిన న్యూసు ప్రకారం, ఓ అమ్మాయిని,ఆడపిల్ల కనిందన్న కారణం చేత, తన భర్తా, అత్తగారూ హింసలు పెట్టడం చేత, పాపం ఆ అమ్మాయి ఆత్మహత్యచేసికుంది.ఆ అమ్మాయిది ధవళేశ్వరం ( ఆ విషయం ఇంకో పేపర్లో చదివాను). ఆడపిల్ల పుడితే ఏం అయిందిట? ఐ.టి. లో పనిచేస్తున్న అతనికి, ఒక్క ఆడపిల్లనే పెంచి పెద్దచేసే తాహతేలేదంటే,వాణ్ణేం చేసినా పాపం లేదు అని నా ఉద్దేశ్యం.

   అస్సలు ఇంటికి ఆడపిల్ల ఉంటేనే అందం. ఉన్న పిల్లలంతా మగపిల్లలే అని విర్రవీగే తల్లితండ్రుల్ని చూస్తూంటాను.ఇంట్లో ఓ ఆడపిల్లని పెంచి పెద్దచేస్తేనే, ఆ వచ్చే కోడలుతో ఎలా ఉండాలో తెలుస్తుంది. ఆడపిల్లని పెంచడంలో ఉండే ఆనందం ఇలాటి ( అదే న్యూసులో వచ్చినవాడు) దౌర్భాగ్యులకి ఎలా తెలుస్తుందీ? రేపెప్పుడైనా వీడు ఛస్తే ‘ అయ్యో నాన్నా…’ అని ఏడ్చేది ఈ ఆడపిల్లే.మొగపిల్లలు, ఎంత ప్రేమా, ఆప్యాయతా ఉన్నా కానీ, ఏడవడం వచ్చేటప్పటికి ఊరికే మొహమ్మాటపడిపోతూంటారు!

   ఆడపిల్ల ఉంటే ఆ పాపకి ఎన్నిరకాల డ్రెస్సులు,అలంకారాలూ వేసి ఆనందించొచ్చో! మగపిల్లాడికేమిటీ, ఓ లాగూ చొక్కా వేస్తాం. ఓ రెండేళ్ళదాకా ఓ డయపరు బస్ అంతేగా ! మగపిల్లలు ఏదో ఉధ్ధరించేస్తారని, నెత్తిమీద కిరీటం పెడతారని ఆశించడం ఉత్తి అపోహే. రెక్కలొచ్చేదాకా అమ్మా అమ్మా అంటూ కొంగుపట్టుకు తిరిగినవాడే అవి వచ్చీరాగానే జుయ్యి మని ఏ అమెరికాకో ఎగిరిపోతాడు! అమ్మా నాన్నా సెకండ్ ప్రయారిటీలోకి వచ్చేస్తారు. ఇంట్లో అమ్మాయుంటే, తనకి చదువు చెప్పించడం, పెళ్ళి సంబంధాలు వెదికి పెళ్ళి చేయడం ఇదివరకటి రోజుల్లో కష్టమనుకునేవారు. ఈ రోజుల్లో ఏదో నెట్ లో వెదికి ఇదిగో ఈవేళ్టి న్యూసులో వచ్చిన ప్రబ్రుధ్ధుడి లాటివాడికి కట్టబెడతారు.వాడేమిటో, వాడి బాగోగులేమిటో ఎవరికీ తెలియదు.ఇదివరకటి రోజుల్లోనే బాగుండేది, పెళ్ళి నిశ్చయించే ముందరే, అటు ఏడు తరాలూ, ఇటు ఏడు తరాల వివరాలూ తెలిసేదాకా పెళ్ళిళ్ళయేవి కావు.అందుకే అప్పటి జంటలు అరవై, డెభ్భై ఏళ్ళు కాపరాలు చేసే వారు.ఇప్పుడో, సంబంధాలకోసం వెదికి వెదికి విసుగెత్తేసి, చాలా మంది నెట్ లో వచ్చే ‘వివాహ వేదికలు’ కే సెటిల్ అయిపోతున్నారు. అక్కడికి అవేవో తప్పనడం లేదు.అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడంటారు, గ్రీన్ కార్డుందంటారు, హాయిగా అక్కడి పిల్లనే చేసేసికుంటే హాయికదా!

   పోనీ ఈ ‘ వేదిక’ల ద్వారా,తెలిసికుని సంబంధం సెటిల్ చేసికుంటే, ఆ పెళ్ళికొడుకు, ఆ అమెరికాలో ఏమేమి నిర్వాకాలు చేశాడో బ్రహ్మక్కూడా తెలియదు.పెళ్ళికొడుకు వాళ్ళిచ్చిన వివరాలు తప్ప ఇంకేమీ తెలియకుండా జాగ్రత్త పడతారు. మన పిల్ల వాడికి పార్ట్ టైము భార్యా, లేక ఫుల్ ఫ్లెడ్జ్డ్ భార్యో అసలు తెలియదు.పోనీ, ఆ గొడవలన్నీ ఎందుకూ, మన దేశంలోనే ఉన్నవాణ్ణి సెలెక్ట్ చేస్తే ఇదిగో పైన చెప్పిన వాడిలాటి వారు దొరుకుతారు!ఏం చెప్పండి, అంతా మన అదృష్టం మీదుంటుంది.

   అలాగని మగపిల్లాడికి పెళ్ళి చేయడం మాత్రం అంత సులభమంటారా? ఎన్నెన్ని ‘ కోరికలు’- రంగు, కట్నం,ఒకత్తే ఆడపిల్లేనా,చదువూ, సంధ్యా, జీతం ఎంత తెస్తోందీ, వంటొచ్చునా వగైరా వగైరా… ఈ గొంతేరమ్మకోరికలన్నీ తీరడానికి
ఓ పాతిక సంబంధాలు చూసేసరికి మనవాడికి 35-40 ఏళ్ళొచ్చేస్తాయి.మరి వీడికి ఇరవై, పాతికేళ్ళ సుకుమారి కావాలంటే ఎక్కణ్ణించొస్తుందీ? ఏదో కాంప్రమైజు గా ఎవరో ఒకరు దొరికితే చాలూ అనుకుంటారు. ఈ పనేదో ఓ పదేళ్ళముందరే చేస్తే పోలే? ఈపాటికి ఓ ఇద్దరు పిల్లల తండ్రి అయిఉండేవాడు!అస్సలు ఈ బాదరబందీలూ, భవబంధాలూ వద్దే అనుకుంటే హాయిగా ఆజన్మబ్రహ్మచారిగా ఉంటే పోలా? అవ్వాకావాలి బువ్వాకావాలంటే ఎలా? ఓ పిల్లని పెళ్ళి చేసికుని బాధ్యత తీసికున్న తరువాత,ఆ పిల్ల బాగోగులన్నీ చూసుకోవాలి, అంతేకానీ పైన చెప్పిన దరిద్రుడిలాగ ఆడపిల్లని కన్నావూ, మగపిల్లాడిని కనలేదూ అంటూ హింస పెడితే ఎలా? అయినా ఓ మాట చెప్పండి,ఆడపిల్లో, మగ పిల్లాడో పుట్టేది వీడి ఘనకార్యమేకదా!
ఈ మాత్రం దానికి ఆ పిల్లే బాధ్యురాలూ అని ఏడవడం దేనికో?

ఏమిటో ఈవేళ ఏదో రాద్దామనుకుంటూ దేంట్లోకో వెళ్ళిపోయాను. మూడ్ అంతా తగలేశాడు !

Advertisements

6 Responses

 1. era…. ada maga tedha entra… evvarini penchina aanadhame… vallu mana pillale kadha…

  nenu ok apillala thandrigaa chepputhaanu… evvarini penchinaa andhamu untundhi.. okka aada pillani penchadame kaadhu…. maga pillalni penchi chudu .. aa anadhamu telusthadhi…

  neelanti daridhrulu ala chusthunnarau kanukane alanti daridhrulu thayaru avuthunnaru

  Like

 2. విద్యావంతుల కుటుంబాల్లోనే ఇల్లాంటివి ఎక్కువగా జరుగుతుండడం విచారకరం. ఆడ పిల్ల పుట్టితే మహా లక్ష్మి వచ్చిందనేవారు ఇది వరకు కాలం లో.
  మీ సునిశిత హాస్యం నాకు బాగా నచ్చుతుంది. మంచి విషయం మీద టపాకి థాంక్యూ

  Like

 3. సుబ్రహ్మణ్యం గారూ,

  ధన్యవాదాలు.ఇక హాస్యం సంగతికొస్తే ‘ సరి లేరు మీ కెవ్వరూ…’ అని అదేదో సినిమాలోని సుశీలమ్మ పాట పాడాలనిపిస్తుంది మీ గురించండి బాబూ !!!

  Like

 4. మబాగా చెప్పారు బాబాయిగారు.ఎంతైనా ఒక అమ్మాయి,ఒక అబ్బాయి వుంటే బావుంటుంది.ఎదేమైనా వాడు అలా చేసి వుండకూడదు.

  Like

 5. నిరుపమా,

  నేనూ అలాగే అనుకున్నాను.

  Like

 6. అమరుడు,

  నాకొక విషయం అర్ధం అవలేదు! పైన ఇచ్చిన వార్తా విశేషం నాకు సంబంధించింది కాదండి బాబూ. పేపర్లో వచ్చిన వార్త పెట్టాను! ఇంక మీరు ఏదో సలహా ఇచ్చేరని ఇప్పుడు ఇంకో మగ పిల్లాడిని కనఖ్ఖర్లేదు! నాకు ఒక అమ్మాయీ, ఒక అబ్బాయీ. ఇద్దరికీ ఒక్కో అమ్మాయీ, ఒక్కో అబ్బాయీ. అందరూ రత్నాల్లాటివారు. మీరు ఏదేదో ఊహించేసికుని మరీ అలాగ వ్రాస్తే ఎలాగా? మీరు వాడిన భాష ఏమీ బాగుండలేదు. పైగా తెలుగుని ఇంగ్లీషులో వ్రాసి ఏమీ అర్ధం అవకుండా ఉంది! కొద్దిగా ఆలోచించి వ్రాస్తే బాగుంటుందేమో? మిరు వ్రాసిన వ్యాఖ్యని అంగీకరించకపోయినా ఎవరూ అడగరు. కానీ మీలాటి సో కాల్డ్ intellectuals గురించి అందరికీ తెలియాలి కదా మరి!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: