బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–KBC-4


    వారమంతా సోనీ టి.వీ. లో ప్రొమోలు చూపిస్తూనే ఉన్నారు- అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న KBC-4 లో ఈ సీజన్ కి మొట్టమొదటి సారిగా ఒక అబ్బాయి కోటి రూపాయలు నెగ్గాడని-అందుకోసం ఎంతో ఉత్సాహంగా టి.వీ. ముందరే కూర్చున్నాము. మీరట్ నుండి వచ్చిన ఆ అబ్బాయి ప్రశాంత్ చాలా చాలా బాగా ఆడి, చివరి రెండు ప్రశ్నలకూ మూడు lifeline లు కూడా మిగుల్చుకున్నాడు.ఆఖరి ప్రశ్నకు రెండు lifeline లు ఉపయోగించుకుని, చివరకు తన మనస్సుకు తోచిన సమాధానమే చెప్పేసి, మొత్తానికి కోటి రూపాయలు నెగ్గాడు.

   చిట్టచివరగా, జాక్ పాట్ ప్రశ్న అయిదు కోట్లది ప్రయత్నించాడు. అప్పటికీ అమితాబ్, అతని తల్లి తండ్రులూ చెప్తూనే ఉన్నారు, క్విట్ అయిపోయి కోటి రూపాయలతో సంతృప్తి పడమని. అబ్బే అలా అయితే బాగానే ఉండేది. ఆఖరి lifeline ఉపయోగించి, చివరకు తప్పు ఆన్సర్ చెప్పడంతో, ఒక్కసారిగా మూడు లక్షల ఇరవై వేలల్లోకి దిగిపోయాడు ! చాలా బాధేసింది.అంటే అతనికి వస్తే మనకేదో ఒరిగిపోతుందనికాదు,వద్దు వద్దూ అంటున్నా కానీ, ఆడడం ఎందుకూ అనే బాధ!

    అమితాబ్ చెప్పినట్లుగా Confidence కీ Over confidence కీ మధ్య చాలా చిన్న గీతే ఉంటుంది. ఇప్పటి తరం వారితో అన్నట్లైతే ‘ఈ రోజుల్లో వారికి drive లేదూ, ambition లేదూ’ అనే అంటారనుకోండి.మేము ఇక్కడకు వచ్చింది just for fun అనికూడా అనొచ్చు.మేమేం నెగ్గుతామని వచ్చామా, ఊరికే అమితాబ్ తో కొంత టైము గడపొచ్చని కానీ, అని కూడా అంటారు.

   ఏమిటీ, అతనెవరో నెగ్గకపోతే ఈయనింత బాధ పడిపోతున్నాడేమిటీ అని కూడా అనుకోవచ్చు.ఇక్కడ బాధ పడేదేమిటంటే,వయస్సులో పెద్దవారైన వారు చెప్పినా కూడా వినకుండా, ఉత్తి పుణ్యాన్న చేతికి వచ్చింది తీసికోక, ఖాళీ చేతులతో వెళ్ళాడే అని.అక్కడికి పెద్దవారు చెప్పినవన్నీ వినాలీ అని కాదు. దేనికైనా ఓ లిమిట్ కానీ కంటెంట్మెంట్ అనేది ఉండాలీ అని.రోడ్డుమీద బైక్కు మీద వందమైళ్ళ స్పీడులో వెళ్ళడం ఓ సాహసం అనుకునే రోజులు ఇవి.అలా వెళ్ళకపోతే దేశం ఏమీ అయిపోదు. అయినా సరే ఎవడో చెప్పాడు, మనం ఎందుకు వినాలీ అనే మనస్థత్వం ఈ రోజుల్లో చాలామందిలో చూస్తూంటాము.

    పోనీ పెద్దవారు ఏదో చెప్పారూ వింటే ఏం పోయిందీ అనే మనస్థత్వం ఎప్పటికి వస్తుందో ఏమిటో? ఈవేళ ఆ గేం లో నెగ్గకపోవడం వలన ఆ అబ్బాయి కొంతైనా నేర్చుకున్నాడేమో అని ఆశిద్దాం.సరదాగా బయటివాళ్ళు కాకుండా, ఇంట్లో వాళ్ళు చెప్పిందైనా సరదాగా ఒక్కసారి విని చూడండి, ఏమీ నష్టపోరు.ఆ అబ్బాయి అయిదుకోట్లూ నెగ్గుంటే ఈ గోలంతా వ్రాసేవాడినా అనకండి. ఏమో I don’t know !

Advertisements

6 Responses

 1. హ హ చివరిలో నేనడుగుదామన్న ప్రశ్న మీరే వేశారు 🙂 ఆ అబ్బాయి ఈ షో కు వచ్చిందే ఐదు కోట్లు గెలవడానికి కదండీ. మీరన్న ఆ కంటెంట్మెంట్ తో ఏ పాతిక లక్షల దగ్గరో ఆగుంటే మీరు అతని గురించి మాట్లాడే వారు కాదు కదా. మరొక్క ప్రశ్నేకదా పరీక్షించుకుందాం అనుకుని ఉంటాడు. పెద్దల మాట కాదు కానీ మిగిలి ఉన్న

  Like

 2. లైఫ్ లైన్ లను పట్టి సరైన నిర్ణయం తీసుకుని ఉండవలసింది పాపం.

  Like

 3. నేను ఆ ప్రోగ్రాం చూడలేదు. కానీ ఆ అబ్బాయి ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండ లేను. బహుశా మన లాంటి వాళ్ళు పాతిక లక్షల దగ్గరే ఆగిపోయుండే వారు. కాదూ అనుకుంటే ఏభై. అంతకు మించి వెళ్ళేవాళ్ళం కాదు. ఆ అబ్బాయి ఇక్కడ ఫెయిలైనా మరో చోట తప్పకుండా విజయం సాధించవచ్చు. May God bless him..

  Like

 4. నా లోకం బ్లాగ్ లో మీ వ్యాఖ్య ప్రకారం అక్షర పరిణామం ఇప్పుడు కొంత పెంచాను .చదివి మీ అభిప్రాయం తెలియచేస్తారు కదూ ఫణి బాబు గారూ ! ధన్యవాదాలు !

  Like

 5. @వేణూ శ్రీకాంత్,

  డిస్క్రిషన్ సరీగ్గా ఉపయోగించుకోలెదనిపించింది.

  @సుబ్రహ్మణ్యం గారూ,
  అదే అనుకుంటా తేడా మనకీ, ఈ తరం వారికీ. ఒకటి చెప్పండి, మనం అలా ఉండడం వలన ఏమైనా నష్టపోయామంటారా?

  @హనుమంతరావు గారూ,
  మీరు వెంటనే స్పందించినందుకు ధన్యవాదాలు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: