బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Brand Image…


    మా చిన్నప్పుడు, అంటే అమలాపురంలో చదువుకునేటప్పుడు, ఊరి మొత్తానికి ఓ అరడజను కార్లదాకా ఉండేవి. అందులో ఒకటి మా ప్రిన్సిపాల్ శ్రీ రామేశం గారు వాడే స్టాండర్డ్ 10, కాలేజి కమెటీ అద్యక్షులు నడింపల్లి రామభద్రరాజుగారిదోటీ,పేరూరు జమిందారుగారిదోటీ, డాక్టరు. మంథా సుబ్బారావుగారిదోటీ. చెప్పొచ్చేదేమిటంటే నాకు తెలిసినవి ఎంబాసెడర్ కార్లవరకే. కానీ, అమలాపురం కొనసీమా బ్యాంకు వాళ్ళకి ఓ స్టుడీబేకర్ అని ఓ పొడుగ్గా, పడవలా ఉండే కారోటుండేది.అదొకటే ఊరంతటికీ ఖరీదైన కారు. కోనసీమకి ఏ ప్రముఖ వ్యక్తి వచ్చినా, అదే కారుపయోగించుకునేవారు.ఏదో ఏ గవర్నరో వచ్చినప్పుడు మాత్రం, రేవుదాటించి, పెద్ద పెద్ద కార్లొచ్చేవి.

    కాలక్రమేణా, గోదావరిమీద ఆలమూరు, సిధ్ధాంతం,వంతఎనలు పడ్డ తరువాత రవాణా సౌకర్యం పెరిగింది.అప్పటికే 1963 లోనే నేను పూనా వచ్చేశాను.ఆ తరువాత వెళ్ళడం, నా పెళ్ళికే 1972 లో.ఎక్కడ చూసినా టాక్సీలే టాక్సీలు. ప్రతీ టాక్సీ ఎంబాసెడరే.వాళ్ళిష్టంవచ్చినంతమందిని కుక్కేయొచ్చు, అదీ ఒక కారణం టాక్సీలు చాలా భాగం ఎంబాసిడర్లే అవడం. ఆ తరువాత ఈ కార్లని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనడం ప్రారంభించాయి. ఈ మధ్యన, ఎంబాసడర్లు వద్దూ, ఇంకో కంపెనీవి కొనండీ అని ఆర్డర్లొచ్చాయిట.
ఎంబాసెడర్ లో ఉన్న టెక్నికల్ వివరాలైతే నాకు తెలియదనుకోండి, సుఖంగా కూర్చుని ప్రయాణం చేయడానికి మాత్రం అదే అన్నిటిలోనూ బెస్ట్ అని నా ఉద్దేశ్యం.ఎంత స్పేసండీ దాంట్లో. ఇప్పుడు వస్తున్న కార్లలో ఏముందీ,మనం ఉండే ఎపార్టుమెంట్లలాగే, అగ్గిపెట్టెల్లో ఉన్నట్లుంటుంది.ఎవరైనా కారుకొందామన్నప్పుడు పోనీ ఎంబాసెడర్ కొనకూడదా అంటే -‘ ఛీ, టాక్సీ అనుకుంటారు’–అంటారు.ఎంబాసిడర్ అంటే టాక్సీయే గుర్తొస్తుంది!

    అలాగే Nirma, మొదట్లో బట్టలుతికే పొడి(డిటర్జెంట్) మొదలెట్టారు. ఆ తరువాత స్నానం చేసే సబ్బుల్లోకి వచ్చారు. అదేమిటో ‘నిర్మా’ అంటే బట్టల సబ్బే గుర్తుకొస్తుంది.అంతదాకా ఎందుకూ WIPRO పేరుచెప్తే షీకాకాయ సబ్బే గుర్తొస్తుంది.అజీం ప్రేమ్జీ ఎంతో శ్రమ పడి విప్రో ని ఐ.టీ లో ఎంతో ఎత్తుకి తీసికెళ్ళారు, అయినా సరే విప్రో వాళ్ళ సబ్బులే గుర్తొస్తాయి.

   ఇంక మినరల్ వాటర్ సంగతికొస్తే Manikchand బ్రాండు చూస్తే, వాళ్ళు తయారుచేసే ‘గుట్కా’ గుర్తొస్తుంది.మల్లయ్య గారి united Breweries అకస్మాత్తుగా పూజా ద్రవ్యాలు తయారు చేసి మార్కెటింగు చేస్తే ఎవడైనాకొంటాడా? అప్పటికీ
చూస్తూంటాము, టి.వీ ల్లో ‘ మందు’ యాడ్లు బ్యాన్ చేసినప్పటినుండీ, Liquors తయారుచేసే ప్రతీవాడూ, ఏదో ఒక ‘మినరల్ వాటర్’ పేరుతో యాడ్లిచ్చేవాడే! ITC సంగతే తీసికోండి, వాళ్ళ పేరుచెప్తే సిగరెట్లే గుర్తుకొస్తాయి. వజీర్ సుల్తాన్ వాళ్ళు ఎంత బుర్ర పగలుకొట్టుకున్నా, సిగరెట్లే అమ్ముకోగలరు.మొట్టమొదట లో LG వాళ్ళు మార్కెట్ లోకి వచ్చినప్పుడు ‘ఇంగువ’ గుర్తుకొచ్చింది. అంతకుముందు పాతికేళ్ళనుండీ ఎల్.జీ. ఇంగువే వాడుతూండడం వలన, ఆ పేరుమీదుండే అభిమానంతో LG కలర్ టి.వీ. కొన్నాను!

   అంతదాకా ఎందుకూ, నాకు మా ఇంటావిడ దగ్గరున్న ఇమేజ్ ఏమిటంటే,ఆవిడ ప్రతీ రోజూ పూరించే శంకరయ్య గారి ప్రహేళికలూ, మురళీ మోహన్ గారి క్రాస్ వర్డ్ పజిళ్ళ విషయంలో నా జ్ఞానం శూన్యం. అలాగే ఉన్నంతకాలం నా పరిస్థితి ఏక్ దం సేఫ్! కాదని ఎదో నా తెలివితేటలుపయోగించాలని చూశానా,అడక్కండి ట్రాప్ అయిపోతాను.’ఆ ఈయనకేం తెలుస్తుందిలే’ అని మా ఇంటావిడనుకున్నంతకాలం హాయిగా ఉంది!

   చాలా కాలం తరువాత లోక్ సభ ప్రారంభం అయింది. అసలు మన టి.వీ. ల్లో కామెడీ చానెల్ అని విడిగా పెట్టడం ఎందుకూ? హాయిగా ‘లోక్ సభ’ చానెల్ పెట్టేసికుంటే కావలిసినంత కాలక్షేపం, కామెడీనూ. ఇవి చాలవన్నట్లు మధ్యాన్నం రోశయ్య గారు ఓ గంటా, సాయంత్రం నాయుడు గారు ఓ గంటా ప్రాణం తీసేశారు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు కానీ ఫలితం మాత్రం శూన్యం.రేపో మాపో వీళ్ళ ప్రమధ గణాలొస్తాయి.’ఫలానా గణం గారు’ లైన్లో ఉన్నారూ అంటూ మన చానెళ్ళకి కాలక్షేపం!
సర్వే జనా సుఖినోభవంతూ !!

Advertisements

10 Responses

 1. నిజమేనండి ప్రస్తుతం టాటా ఇండికా కార్లకు కూడా ఈ ట్యాక్సీ ముద్ర పడిపోయింది. పట్టణాల్లో ఎక్కువ ట్యాక్సీలు ఇవే.

  Like

 2. న్యూస్ చానళ్లల్లో నాయకుల ఆరోపనలంటే గుర్తొచ్చింది. చంద్రబాబు
  రోశయ్యగారిని ఏదో అన్నాడని ఆయనేమో “మామను చంపిన వాడు”
  అంటూ కేకలేశాడు. ఈ రోజేమో తమ అమ్మగారు ఇంకోపాత అమ్మ
  గారిని హత్య చేసిందని ఓ నాయకుడంటే ” ఇలానేనా నాయకుడు
  మాట్లాఅవలసిన తీరు” అంటూ సాక్షాత్తు అదే సీయం రోడ్డు మీద
  ధర్నా చేశాడు! ఆహా! రాజకీయమా! నిగ్గదీసి అడగాల్సింది ఈ రాజకీయ
  నాయకుల్ని కాదు, వాళ్ళనెన్ను కొన్న ఈ సిగ్గులేని జనాల్ని.

  Like

 3. @వేణూ,

  అన్ని బ్రాండులూ టాక్సీలే అయిపోతూంటే, ఇంక BMW, Merc లే కొంటారేమో !!

  @ గురువుగారూ,

  ఇదంతా స్వయంకృతమే గా!

  Like

 4. Mercedes Benz too is a Cab/Taxi brand in Europe 🙂

  Like

 5. Mercedes Benz too is a Cab/Taxi brand in Europe
  —————————————————
  యూరోప్ లోనే నా , మా ఊర్లో కూడా 🙂

  Like

 6. @మలక్ పేట గారూ,

  ఏదో నాకు తెలిసిన అమలాపురం, రాజమండ్రీ లాటి ఊళ్ళల్లో తిరిగే టాక్సీలగురించి వ్రాస్తే, మీరు మరీ యూరోప్ అంటూ నన్ను ఇరుకులో పెట్టేస్తున్నారు !!

  @శ్రావ్యా,

  యూరోప్ అయింది, మీ ఊరేది తల్లీ !!!!!!!

  Like

 7. Mercedes Benz is a police car in northern china ….

  అంబాసిడర్ , ఇండికా కొద్దిగా అయినా పర్లేదు… పర్సనల్ కార్ గా వాడేవాళ్ళు చాలమంది ఉన్నారు. మహెంద్ర వాడి లొగన్ కారయితే ప్రస్తుతం కేవలం టాక్సిలు మాత్రమే నడుపుతున్నారు.

  మేము LG ఇంగువ వాడేవాళ్లం గానీ… బెంగళూరులొ SSP చూసాక అన్నాళ్ళు వాడిన LG ని పక్కన పెట్టేయక తప్పలేదు 🙂 మీరు ఒక సారి SSP(నీలం రంగు డబ్బా మాత్రమే) వాడాల్సిందే… నేను దానికి పెద్ద ఫ్యాన్ ని

  Like

 8. ప్రస్తుతం నేనుండేది సింగపూర్ అండి !
  “Limousine cab ” వాళ్ళ కాబ్ బుక్ చేస్తే చాల సార్లు “mercedes benz ” లో ప్రయాణం చేసే ఛాన్స్ ఉంటుంది :). ఇక మన అదృష్టం బాగుంటే ఒకో సారి మామూలు టాక్సీ స్టాండ్ లో కూడా దొరుకుతుంది .
  అలాగే ఇక్కడ airport లో ప్రత్యేకం గా ఒక సర్వీసు ఉంటుంది , వీళ్ళు మీటర్ మీద ఛార్జ్ చేయరు, 40 $ ఛార్జ్ చేస్తారు సింగపూర్ లో ఎక్కడికైనా సరే .

  Like

 9. మంచు గారూ,
  ఈసారి మీరు చెప్పిన ఎస్.ఎస్.పి. ఇంగువ వాడి చూస్తాము !!

  శ్రావ్యా,

  మా రాజమండ్రీ లోకూడా ఆటో వాళ్ళు అలాగే చేస్తారమ్మా !!!!!!!!

  ఏమీ అనుకోకు, నాది ఆటోల స్థాయే మరి !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: