బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


    అన్నీ మనకే వచ్చేసుననుకుంటే పప్పులో కాలేసేమన్నమాటే ! ఈ మధ్యన మా అబ్బాయి బెంగళూరు వెళ్ళేడని, నేనూ,మా ఇంటావిడా,మా ఇంటికి పిల్లలు ఒఖ్ఖళ్ళూ ఉంటారని, గడపడానికి వెళ్ళాము.మా కోడలికి తెలుసు,మామయ్య గారికి
కంప్యూటరు దగ్గర లేకపోతే,ఏదో వంకన బయటికి ( అంటే మేముండే ఫ్లాట్ కి) పారిపోతారూ అని. అందుకోసం, మా అబ్బాయితో చెప్పింది,తన లాప్ టాప్ ఇక్కడే వదిలెసి వెళ్ళమని.ఆమధ్యన దాన్ని ఉపయోగించడం కొంచం నేర్చుకున్నాను లెండి,అదన్నమాట విషయం.

   మా ఇంటావిడ నేను వాడడం చూసి, తనూ మొదలెట్టింది. ఏవో తన ప్రహేళికలూ,గళ్ళనుడికట్లూ పూరించి పంపిందికూడానూ! పేద్ద పోజు పెట్టేసి, నేను మాత్రం ఆమాత్రం చెయ్యలేనా అనుకుని, నానా తిప్పలూ పడి, యంత్రం.కాం ఓపెన్ చేసి, క్రమం తప్పడం ఎందుకూ అనుకుని, రాత్రి 10.30 కి మొదలెట్టి సోమవారం ఓ టపా వ్రాశాను.దాంట్లోంచి కాపీ పేస్టు (నా వర్డ్ ప్రెస్) లోకి చేద్దామనుకుంటుండగా, దేనిమీద నొక్కానో ఏమో,వ్రాసిందంతా హూష్ కాకీ ఐపోయింది.మనవణ్ణి ఆడిస్తూ, మా రూం లోకి వచ్చినప్పుడల్లా, నేను టైపుచేస్తూండడం చూసిందిగా, దేనిమీద వ్రాస్తున్నారూ అని అడగడం, ఏదో వ్రాస్తున్నానులే అని చెప్పడం. తీరా చేసి నేను పడ్డ శ్రమంతా ఠప్పు మని ఎగిరిపోయింది!

   అలా మాయం అయిపోయిందనిచెప్తే, మా ఇంటావిడా, కోడలూ నవ్వరూ! దాంతో ‘ఏదో వ్రాద్దామనుకున్నానూ, మూడ్ లేదూ’అని ఓ వెర్రి నవ్వు నవ్వేశాను.‘మరి ఈమాత్రందానికి, అంతసేపూ లాప్ టాప్ తో ఏం చేస్తున్నారూ? పోనీ అది ఖాళీగా ఉంటే నేను ఏ ‘పొద్దుగడో’ పూర్తిచేసికుందునుకదా! అన్నీ వేషాలూ’ అంటూ ఓ లెక్చరూ! పోనీ సోమవారం అలా అఘోరించానుకదా, మంగళవారం ప్రయత్నిద్దామని చూస్తే, ఆరోజూ అలాగే అయింది! దీంతో రెండు రోజులు వ్రాసిన టపాలూ మట్టిపాలైపోయాయి. పోనీ మళ్ళీ వ్రాద్దామనుకున్నా, ఏం వ్రాశెనో గుర్తుకొస్తుందా ఏమైనానా? ఏదో వ్రాసుకుంటూ పోతే ఏదోఒక టాపిక్ మీద వ్రాసేస్తాను కానీ, ఏం వ్రాసేనో గుర్తుండి చావదు. అదండీ విషయం!

   మా అబ్బాయి బెంగళూరునుండి వచ్చేశాడూ, ఇదిగో ఇలా మా ఇంటికి వచ్చేసి ఈ టపా వ్రాసేశాను. ఎంతా పది నిమిషాలు కూడా పట్టలేదు! అందుకే అంటారు-మనకి తెలియనిదానిలో వేలెట్టకూడదూ అని.‘మెడ్డువారీ’ చేసే గుర్రం లాగ, ఈ లాప్ టాప్ ని కంట్రోల్ చేయడం మాత్రం తెలియడం లేదు. దీనిల్లుబంగారంగానూ, ఆ కర్సరు ఎక్కడెక్కడికో పారిపోతుంది, ఏం నొక్కుతామో ఆ చూస్తున్న విండో కాస్తా మాయం అయిపోతుంది. పోనీ అనిఏదో ఒకటి చదువుదామా అనుకుంటే, సిస్టం కాస్తా హాంగ్ అయిపొతుంది!దాన్ని తిరిగి తెప్పించడం రాదూ! ఏమిటో ఇన్ని తిప్పలతో ఆ లాప్ టాప్ ఒకటి మళ్ళీ కొనడం ఎందుకూ? కానీ మా ఇంటావిడ రుచి మరిగింది,దాంతో ఇంక తప్పేలా లేదు.ఎప్పుడో ముహూర్తం చూసుకోవాలి!

Advertisements

5 Responses

 1. దీపావళి బిజీ అనుకున్నాను, ఈ రెండు రోజులూ రాయకపోతే.

  ఇంతకీ మెడ్డువారీ అంటే?

  Like

 2. ఒక mouse, key board, laptop కి connect చేస్తే ఏ సమస్యా ఉండదండీ.

  Like

 3. > దేనిమీద నొక్కానో ఏమో,వ్రాసిందంతా హూష్ కాకీ
  మీరు మధ్య మధ్యలో (english content) ఒక్కొక్క పేరా / content మొత్తాన్ని నోట్‌పాడ్‌లో సేవ్ చేసుకోండి (as your blog subtitle ex: baataakhaani-361.txt), ఎప్పుడన్న హూష్ కాకీ అన్నా, మీకు సేవ్ చేసిన కాపి backup ఉంటుంది.

  Like

 4. @ఋషీ,

  లాప్ టాప్ తో కుస్తీ పట్టేటప్పటికే పుణ్యకాలం కాస్తా అయిపోయింది! గుర్రబ్బండికి కట్టే గుర్రానికి మూడ్ పాడైపోయినప్పుడు, అవి మన స్వాధీనంలో ఉండకుండా, ఆగిపోతుంది.నానా హంగామా చేసేస్తుంది. దీన్నే మావైపు ( కోనసీమలో)
  మెడ్డువారీ అంటారు!

  @బోనగిరీ,
  మీరుచెప్పేది కరెక్టేనండి బాబూ! కానీ మా అబ్బాయున్నాడే,తను ఇలాగే నేర్చేసికుని కంట్రోల్ చేయమంటాడు.ఏం చెయ్యనూ, ఇంట్లో విడిగా మౌసూ,కీబోర్డూ ఉన్నాయి.అయినా సరే అలాగే నేర్చుకోమంటాడు. అమ్మ నేర్చుకోగాలేనిది నీకేమిటీ
  అంటాడు. ఏం చెయ్యనూ?

  @పానిపురీ,

  అలాటివి టైముకి గుర్తుకు రావు బాబూ! అంతా గ్రహపాటు !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: