బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–BBC Test Match Special లోని కొన్ని ఆణిముత్యాలు…


    కొంతమందికి ఒక గొప్ప టాలెంటుంటుంది.వారు ఏ విషయం గురించి మాట్లాడినా, అవతలివారు శ్రధ్ధగా వినేటట్లు చేయడం. ప్రతీ రోజూ జి తెలుగు చానెల్ లో ‘గోపురం’ అనే కార్యక్రమం నిర్వహిస్తూన్న డా.ఎం.సంధ్యాలక్ష్మి గారొకరు.ప్రతీ రోజూ ఏదో ఒక ఆధ్యాత్మిక విషయం మీద అందరికీ అర్ధం అయే భాషలో, చెప్పడం. అలాగని ఆవిడ ఏమీ ఆధ్యాత్మక విషయాలు వినేవారిమీద బలవంతంగా రుద్దడం లేదు. ఆవిడ చెప్పే ప్రతీ విషయానికీ, సైంటిఫిక్ రీజన్ కూడా చెప్తున్నారు.దేముడంటే నమ్మకం లేనివారు కూడా నచ్చినా నచ్చకపోయినా కన్విన్స్ అవుతారు. అవక, తాము పట్టిన కుందేళ్లకి మూడే కాళ్ళంటే, అది వాళ్ళ ఖర్మ!!

   అలాగే సోనీ చానెల్ లో సోమవారం నుండి గురువారం వరకూ ‘కే.బి.సి-4’ నిర్వహిస్తున్న అమితాబ్ బచ్చన్. మొదటి రెండు వెర్షన్లకంటే కూడా బాగా చేస్తున్నారు.మధ్యలో కొంతకాలం షారూఖ్ ఖాన్ నిర్వహించినా కూడా, ఆ కార్యక్రమం అంత విజయవంతం కాలేక పోయింది.అలాగే శ్రీ గరికపాటి నరసింహరావు గారొకరు, ఆయన ప్రవచనాలు ప్రత్యక్షంగా వినడం ఒక అలౌకికానందం.చాగంటి వారివి ప్రత్యక్షంగా వినే అదృష్టం ఇంకా కలుగలేదు.

   అలాగే కాలేజీలో చదువుకునేటప్పుడు, మాకు ఇంగ్లీషు కి వచ్చే శ్రీ గొట్టుముక్కల కృష్ణమూర్తి గారూ, శ్రీ ఆర్.రామకృష్ణరావుగారూ, తెలుగు నేర్పే శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారూనూ. వారు చెప్పే విధానంలోనే ఉందనుకుంటాను.
నాకు జీవితంలో లెఖ్ఖలంటే కొంతైనా ఆసక్తి కలిగించినవారు మా ప్రిన్సిపాల్ శ్రీ గరిమెళ్ళ రమేశం గారు. వాహ్వ్ అదండీ చెప్పడం అంటే. అలాగే అంతకు పూర్వ ప్రిన్సిపాల్ గారు, శ్రీ పెద్దాడ రామచంద్రరావుగారు. మొత్తం బి.ఏ, బి.ఎస్.సీ, బీ.కాం విద్యార్ధులందరికీ మా కాలేజీ హాల్లో కూర్చోపెట్టి, షేక్స్పియర్ డ్రామా చెప్పేవారు.అద్భుతం.

    అలాగే రేడియోల్లో తెలుగు వార్తలు చదివే శ్రీ పన్యాల రంగనాధరావుగారూ, ఇంగ్లీషు వార్తలు చదివే మెల్విల్ డి మెలో, చక్రపాణి, రేడియో సిలోన్ లో వచ్చే శ్రీ గొపాల్ శర్మా. అమీన్ సయానీ గురించి చెప్పడానికైతే మాటలే చాలవు! అలాగ
కామెంట్రీలు చెప్పే వారిలో సారొబిందూ సాన్యాల్, డికీ రత్నాగర్. దేవ్ రాజ్ పురీ. బి.బి.సీ నుంచైతే Brian Johnston, John Arlot, Alan Mcgilvray, Richie Benaud, AFS Talyarkhan.వీళ్ళందరూ చెప్తూంటే, కళ్ళకు కట్టినట్లుగా చెప్పేవారు.

    ఇప్పుడు క్రికెట్ కామెంటరీ వినడం అంటేనే చిరాకొస్తోంది.అరుణ్ లాల్, రవి శాస్త్రి ల కామెంటరీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.అసలు వీళ్లందరికీ వొకాబ్యులరీ లో ట్రైనింగిస్తేనైనా బాగుపడతారేమో? ఎప్పుడు విన్నా ఒకటే గోల!
ఈ గోలంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, ఈ మధ్యన నెట్ లో వెదుకుతూంటే, నా all time favourites ( పైన చెప్పిన వారు), 1960-90 లలో బీ.బీ.సీ లో ఇచ్చిన కొన్ని మచ్చుతునకలు దొరికాయి. మీలో ఎవరికైనా ( అంటే ఈ తరం వారికి) అసలు సిసలైన కామెంటరీ ఎలా ఉండాలో వినాలంటే ఈ లింకు నొక్కి వినండి.
కొంతమందనొచ్చు, స్వాతంత్రం వచ్చి అరవై ఏళ్ళు దాటినా, ఇంకా ఆ బ్రిటిష్ వారినే పొగుడుతున్నారూ అని!టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ సలాం ! ఆ లింకులో పెట్టిన ఒక్కో దానిమీదా నొక్కుకుంటూ వినేసి ఆనందించేయండి. క్రికెట్ కామెంటరీ
ఆ రోజుల్లో ఎలా ఉండేదో తెలుస్తుంది.

3 Responses

 1. అద్భుతమైన లింకు ఇచ్చారు ఫణి బాబుగారూ. ధన్యవాదాలు. ఈ విధంగా పాత రికార్డింగులను బి బి సి వారు చక్కగా భద్రపరచి శ్రోతలకు అందిస్తున్నారు. మన ఆకాశవాణి వారు కూడ ఈ పధ్ధతి అనుసరిస్తే ఎంత బాగుండును. మీ పుణ్యమా అని అప్పటి కామెంటరీలు వినగలిగాను. థాంక్యూ

  ఆకాశవాణి వారు వారి దగ్గర ఉన్న పాత రికార్డింగుల జాబితాని వారి వెబ్సైటులో ఉంచితే, ఈ అరవై ఏళ్ళ ప్రసార చరిత్రలో వారు భద్రపరచగలిగిన రికార్డింగులు ఏమిటో తెలుస్తాయి. కాని, మనవాళ్ళకి అన్నీ రహస్యాలే!

  Like

 2. మీరు ఇలాంటి ఆణిముత్యాలను మరిన్ని అందించాలని నా కోరిక.

  Like

 3. శివ గారూ,

  థాంక్స్.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: