బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ‘మర్చిపోయాను…’


    ప్రపంచంలో అత్యంత సుఖాన్నీ(ultimate ecstasy), ఆనందాన్నీ ఇచ్చే ప్రక్రియ ఈ ‘మర్చిపోవడం’ అనేది! ఇందులో కూడా రకాలున్నాయి. కొన్ని జెన్యూన్, కొన్ని సెలెక్టివ్ !సెలెక్టివ్ అంటే, మనం ఏదైనా వినకూడదనుకుంటామనుకోండి, కూల్ గా విననట్టో, వినిపించనట్టో నటించేయడం అదన్నమాట. అలాగే మనం ఏదైనా డెలిబరేట్ గా చేయకూడదనుకున్నామనుకోండి, ‘మర్చిపోయాను’ అనేయడం! ఇలా చేసేవాళ్ళున్నారే,వాళ్ళు సృష్ఠి, స్థితి లయాల లాగ నిర్వికార్, నిరాకార్, నిర్లజ్ లతో,చెప్పెస్తారు మర్చిపొయాను అని. కావలిసిస్తే ‘ఒట్టు’ ‘By God’ ‘कसं सॅ’ అని మూడు భాషల్లోనూ చెప్పేయగల సమర్ధులు!తెలుగులో’ అమ్మమీద ఒట్టు’,’God promise’అని ఇంగ్లిషులోను, ‘ मा कि कसं’ అని హిందీలోనూ చెప్తారు. అవసరం అయితే మన మీద కూడా ఒట్టు పెట్టేస్తారు వాడిదేం పోయిందీ? గొంతుక్కిందుండే యాడమ్సో, ఈవో యాపిల్ కూడా నొక్కుకుని మరీ వక్కాణిస్తారు నిఝంగా మర్చిపోయానూ అని. ఇంత హడావిడి చేసేడంటే, వాడు మర్చిపోలేదన్నమాటే!

అసలు ఈ మర్చిపోవడం అనేది quantify చేయలేము. కాదు అని నిరూపించలేము, సుప్రీం కోర్టుకెళ్ళినా ఎపిలుండదు ! చిన్న క్లాసులకెళ్ళే చిన్న పిల్లల్ని చూస్తూంటాము, నెలలో ఓ రెండుమూడు సార్లు వాటర్ బాటిలో, గొడుగో లేక ఐ.డి. కార్డో స్కూల్లో మర్చిపోయామంటారు. వాళ్ళనేం చేయగలం? నోరుమూసుకోడం, ‘ కాదమ్మా అలా మర్చిపోతూండకూడదూ, బంగారు తల్లివి కదూ’ అని బుజ్జగించి, మళ్ళీ ఆ మర్చిపొయిన సరుకు కొనిపెట్టడం.వాళ్ళ మూడ్ బాగున్నంతకాలం ఫరవాలేదు, మళ్ళీ మనల్ని ఓ ఆటాడిద్దామనుకుంటే మళ్ళీ ‘మర్చిపోవడం’ ! తూర్పు తిరిగి దండం పెట్టడం తప్పించి ఏమీ చేయలేము! మన నుదిటివ్రాతమీద ఆధారపడి ఉంటుంది!

పరీక్షలకి కుర్రాడో కుర్రదో వెళ్ళేరనుకొండి, పరీక్ష్ పేపరు ఎంత ఈజీగా ఉన్నాసరే, సరీగ్గా వ్రాయకపోతే ‘ ఏమిట్రా, దీనికి ఆన్సర్ రాయలేదా’అన్నామనుకోండి,‘మర్చిపొయానూ’ అని చిద్విలాసంగా చెప్పేస్తాడు. పోనీ వీడి జ్ఞాపక శక్తి తక్కువైపోతూంది అనుకుని, ఈ మధ్య మార్కెట్ లొకి వస్తూన్న ‘మీ పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే’ ఏ మందో మాకో తెచ్చి ఇద్దామనుకుంటామనుకోండి, అదికూడా వేసికోవడం’ మర్చిపోయే ‘ ఘనులు! నెను ఆటైపులొకే వస్తాను! చదివేవాడిని, కానీ అదేంఖర్మమో పరీక్షల్లో వ్రాయడం ‘మర్చిపోయేవాడిని’! ఆ స్థితుందే అదో అలౌకికానందం!

భార్య బజారుకెళ్ళి ఏ కూరలో, సరుకులో తెమ్మని పంపించిందనుకోండి, వాటిల్లో ఒకటో రెండో సరుకులు డెఫినెట్ గా ‘మర్చిపోతాము’. పోనీ అదంతా ఓ లిస్టు వ్రాసుకుని వెళ్ళడానికి నామోషీ!ప్రతీసారీ అలాగే అవదు. భార్య చెప్పింది కొనాలనుకున్నా, ఏదో కారణం చేత కొనకూడదనుకున్నామనుకోండి, ఈ ‘మర్చిపోవడం’ మన రెస్క్యూ కి వస్తుంది! ఇంటికి తెచ్చిన సరుకులు చూసి ‘అదేమిటండీ క్యాజూలూ కిస్మిస్స్లూ చెప్పానుగా, తీసుకురాలెదేమిటండీ’ అంటుంది. ‘అర్రే మర్చేపోయానే!’ అని ఓ మాటనేస్తే సరిపోతుంది! కాదూ కూడదూ అని దెబ్బలాడితే, మనం కూడా అఫెన్సివ్ లోకి దిగిపోయి ‘ మర్చిపొయానంటే వినవే. కావాలంటే మళ్ళీ వెళ్ళి తీసుకొస్తాలే’అని ఢాం ఢూం అని చూడండి, మీ అదృష్టం బాగుందా, ‘పోన్లెండి మళ్ళీ ఏం వెడతారు అంత దూరం, తరువాత చూసుకుందాము’ అనొచ్చు. లేదా ‘వెళ్ళి తీసుకు రండి’ అనికూడా అనొచ్చు.అలాటప్పుడు మనది ఫ్లాప్ షో అయిపోతుంది. ఆలోచించి చేస్తూండాలి ఈ ‘మర్చిపోవడం’ . బజారుకెళ్ళి, ఇడ్లీపిండి తెప్పించికుని, బ్రేక్ ఫాస్ట్ కి వారంలో అయిదు రోజులు ఇడ్లీలే వేస్తూంటుంది. ఓ రోజుముందరే చెప్తూంటుంది, మర్నాటికి ఇడ్లీ పిండి లేదూ, వచ్చేటప్పుడు తీసుకురండీ అని. ప్రతీ రోజూ ఇడ్లీలేలా అనుకుంటూ, కన్వీనియంటుగా ఆ రోజు ఇడ్లీ పిండి తేవడం ‘మర్చిపోతాను’! కనీసం ఆరోజునేనా మెనూ మారి ఏ ఉప్మాయో ఇంకోటో చేస్తుందికదా అని!

10 Responses

  1. హ హ బాగుందండి.
    >>ప్రపంచంలో అత్యంత సుఖాన్నీ(ultimate ecstasy), ఆనందాన్నీ ఇచ్చే ప్రక్రియ ఈ ‘మర్చిపోవడం’ అనేది! ఇందులో కూడా రకాలున్నాయి.<<
    చూసి ఏంటి గురువుగారు ఏమైనా దేవదాసు స్టోరీ చెప్పబోతున్నారా అనుకున్నా ఓ క్షణం.

    హర్రెర్రె ఇడ్లీ పిండి సీక్రెట్ ఇలా లీక్ చేసేశారు ఇప్పుడేలా మరి 😀

    Like

  2. > కన్వీనియంటుగా ఆ రోజు ఇడ్లీ పిండి తేవడం ‘మర్చిపోతాను’! కనీసం ఆరోజునేనా మెనూ మారి ఏ ఉప్మాయో ఇంకోటో చేస్తుందికదా అని

    ఇదికనుక ఆంటీ చూస్తే మాత్రం, మీకు తెలియకుండా నెలకి సరిపడ ఇడ్లీ పిండి తెప్పించి సద్దిపెట్టె నిండా నింపేస్తుంది 🙂

    Like

  3. “ప్రపంచంలో అత్యంత సుఖాన్నీ(ultimate ecstasy), ఆనందాన్నీ ఇచ్చే ప్రక్రియ ఈ ‘మర్చిపోవడం’ అనేది” Yes Really if that facility is not there we would have become insane by now. I am talking about genuine forgetting about old events etc.

    Like

  4. @వేణూ శ్రీకాంత్,

    చివరకు జరిగిందేమిటంటే, ఉప్మాలేదూ, ఇడ్లీ లేదు, బయటకు వెళ్ళి తిన్నాను! ఏమిటో ఉన్నమాట ఉన్నట్ట్లుగా చెప్తే రోజులు కావు!

    @పాని పూరి,

    ఇంట్లో ఏమైనా డీప్ ఫ్రీజరు పెట్టాననుకుంటున్నావా నాయనా!!

    @శివ గారూ,

    ఔనండి.

    Like

  5. అయ్యో,మొత్తానికి మీ ప్లాన్ వర్కవుట్ అవ్వలేదన్నమాట!
    నేను ట్రై చేసి చూస్తానుండండి.

    Like

  6. హతోస్మి 🙂 మొత్తానికి మీతో “డామిట్ కథ అడ్డంతిరిగింది!!” అనిపించారనమాట 🙂

    Like

  7. వేణూ శ్రీకాంత్,

    అప్పుడప్పుడు ఇలాటివికూడా జరుగుతూంటాయి. ఏం చేస్తాం?

    Like

  8. వజ్రం,

    ఇంతచెప్పినా ప్రయత్నిస్తానూ అంటే ఏం చేస్తాను? దెబ్బ తినేస్తారు బాబూ !!

    Like

  9. పోనీ నన్ను పంపమంటార ఇడ్లి పిండి ?

    Like

  10. భవానీ,
    ఈమాత్రం సహాయం చేస్తానంటే ఇంక కావలిసిందేముందీ !!

    Like

Leave a comment