బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


   నేను వీలున్నంతవరకూ మా ఇంటి దగ్గరలోని అయ్యప్ప,అమ్మవారి దేవాలయాలకి వెళ్తూంటాను.కానీ అదేమిటో ఈ దసరాల్లో అమ్మవారి గుడికి వెళ్ళడం పడలేదు మొదట్లో. అందుకోసమని ప్రత్యేకంగా నవమి రోజున వీలుచేసికుని అమ్మవారి గుడి( బెంగాలీ వారి ఆద్వర్యంలో) గుడికి వెళ్ళేటప్పటికి, మా బెంగాలీ ఫ్రెండొకరు Arre bobaa toom hamraa momdir me gayaa ! అన్నాడు. నాయనా నువ్వంటే ఏదో పండగరోజుల్లో వస్తావు కానీ, నేను ప్రతీ రోజూ వస్తానూ అంటే నమ్మడే! ఇంతట్లో ఆ గుడి పూజారీ,వాచ్ మన్నూ వచ్చి నొమస్కార్ సాబ్ అంటూ పలకరించేటప్పటికి, ‘ఇప్పుడైనా నమ్ముతావా’అన్నాను. పూజా రోజుల్లో పండాల్ కి వెళ్ళడం నేను వీలైనంతవరకూ అవాయిడ్ చేస్తాను. కారణం మరేమీ లేదు,బయటి వాళ్ళెవరొచ్చినా సరే, బెంగాలీ మిత్రులు మాత్రం ఒకళ్ళతో ఒకళ్ళు వారి మాతృభాషలోనే,మాట్లాడుకుంటారు. అది తప్పనడం లేదు, పోనీ ఇంకో భాషవాడు వచ్చాడూ, వాడి సౌకర్యంకోసమైనా కామన్ భాషలో మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అని!Somehow I feel leftout.అందుకోసం నా దారిన నేను ప్రొద్దుటిపూటే వెళ్ళి దర్శనం చేసికుంటూంటాను! భక్తుంటే చాల్దా ఏమిటీ, ఎప్పుడు వెళ్తేనే?

   అక్కడినుండి అయ్యప్ప గుడికి వచ్చాను. అక్కడా ఇదే అనుభవం! Oh! yo came tow over demple! అదేమీ వాళ్ళని గేలి చేస్తూ అనడం లేదు, ఇంకోలా అనుకోకండి. ఎవరి ప్రొనన్సిఏషన్ వాళ్ళది! అక్కడికి మనమేమీ పేద్ద పండితుల మనడం లేదు. ఏదో సందర్భం వచ్చిందికదా అని వ్రాశాను!వాళ్ళకీ అదే సమాధానం చెప్పి, అక్కడుండే పూజార్ల ధర్మమా అని, నేను ప్రతీ రోజూ వస్తానూ అని నిరూపించుకున్నాను.మాకు దగ్గరలో ఎక్కడా తెలుగువారిచే నిర్వహింపబడే దేవాలయాలు లేవు. ఉన్న నాలుగైదూ మాకు దూరంగా ఉన్నాయి. అందువలన దగ్గరలో ఉండే దేముళ్ళతోనే సరిపెట్టేసికుంటున్నాను!ఆ దేముళ్ళు కూడా ఏమీ అనుకుంటున్నట్లులెదు! వెళ్ళిపోతూంది రోజు.

   మనవాళ్ళేమైనా తక్కువ తిన్నారేమిటీ, ఏదైనా పండక్కో, పూజకో వెళ్తే తెలుస్తుంది, మనవాళ్ళలో ఓ సుగుణం ఉంది, మాట్లాడే నాలుగు ముక్కల్లోనూ మూడున్నర ఆంగ్ల మాటలే ఉంటాయి!దాంతో తెలుస్తుంది, అమ్మయ్య మన తెలుగువారి కార్యక్రమానికే వచ్చామూ అని!మనం ఎక్కడా నిరాశ పడఖ్ఖర్లేదు.ఇతర భాషలవాళ్ళకి అర్ధం అవదేమో అనుకుని మరీ బాధ పడిపోతూంటారు! అలాగని నేను ఏదో ఆంగ్ల పదాలు లేకుండా, వ్రాస్తున్నానని కాదు, అదేమిటో ఏదో వ్రాద్దామనుకుంటానూ, దానికి తెలుగు పదం ఛస్తే గుర్తుకు రాదు! అందుకే మా అబ్బాయి గ్రంధాలయం లో పెట్టిన పుస్తకాలు, అందులోనూ పాత తరం వారివి- ఉదాహరణకి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, కందుకూరి వీరేశలింగం గారూ వ్రాసిన పుస్తకాలు చదవడం మొదలెట్టాను.ఆ మధ్యన శ్రీ విశ్వనాధ వారి ‘వేయి పడగలు’ పూర్తి చేశాను.నా మట్టి బుర్రలోకి కొంతైనా గుంజు నింపుదామనే ప్రయత్నం లో! ఏ మాటైనా అర్ధం కాపోతే, మా మాస్టారుని( అదేనండీ మా ఇంటావిడ) అడిగేస్తూంటాను. ప్రతీ రోజూ, శంకరయ్య గారి ప్రహేళికలూ, గళ్ళనుడికట్టూ పూరిస్తూంటుందిగా! ఏమిటేమిటో చదువేస్తూంటుంది.

    క్రిందటి వారంలో మా ఇంట్లోనే ఉన్నాము. ఇదివరకైతే డెస్క్ టాప్ మా గదిలోనే ఉండేది కాబట్టి, రాత్రి పన్నెండింటిదాకా ఏదో కెలుకుతూ ఉండేవాడిని. ఆ డెస్క్ టాప్ కాస్తా వాళ్ళు కొత్తగా పెట్టిన ఆఫీసులోకి మార్చేశారు. రాత్రిళ్ళు వెళ్దామంటే
ఆ కాంపౌండు నిండా కుక్కల్ని వదిలెస్తూంటారు. నాకేమో కుక్కలంటే భయమాయిరి
!ఇంక ఎలాగా? మా అబ్బాయి, తన లాప్ టాప్ ఉపయొగించుకోమన్నాడు. తను అనడం అంటే అన్నాడు కానీ, నాకు ఉపయోగించుకోడం రావాలిగా! నాకెమో మౌస్ ఉంటేనే కానీ బండి కదల్దు.అదేమిటో మెయిల్ చెక్ చేసికోడానికే అరగంట పట్టింది.ఎక్కడో నొక్కితే ఏదో తెరుచుకుంటుంది. ఇంక టపాలు వ్రాయడం ఎక్కడ? పైగా నాకొచ్చిన పధ్ధతిలో ఒంటి వేలుతోనే టైపు చేస్తాను. మా వాళ్ళందరికీ నవ్వూ!నా ఇష్టంవచ్చినట్లు చేస్తాను, మీకేం అంటూ దెబ్బలాడేస్తూంటానులెండి.ఇంక ఈయన్ని బాగుచేయడం మన తరంకాదూ అని వదిలేశారు.ఓ గంటసేపు దానితో కుస్తీ పట్టి వదిలేశాను.ఇదౌతున్నంతసేపూ మా ఇంటావిడ, గుమ్ముగా కూర్చుంది. నాకు విసుగెత్తి ఆ లాప్ టాప్ ని వదిలేసి, నా పుస్తకమేదో పుచ్చుకుని కూర్చున్నాను. ఈవిడ నేను అలా వెళ్ళడం చూసి,’యంత్రం.కాం’ ఓపెన్ చేసేసి,గళ్ళనుడికట్టో ఇంకోటేదో టైపు చేసేసి పంపించేసిందికూడానూ!
వామ్మోయ్ మనం కష్టాల్లో పడ్డాం రా బాబూ అనుకున్నంతసేపు పట్టలేదు,’ ఏమండీ వీలున్నప్పుడు ఓ లాప్ టాప్ కొందామండీ, అప్పుడు ఎంచక్కా మనిద్దరం కూడా టపాలు వ్రాసుకోవచ్చూ’ అని అననే అనేసింది!

8 Responses

 1. ponidduru…okka laptop e ga adigaaru..konipetteste sari 🙂

  Like

 2. ఇంతకు ఈ పోస్ట్ లాప్‌టాప్ మీద టైపు చెయ్యడానికి ఎంతసేపు పట్టింది?
  > ఏమండీ వీలున్నప్పుడు ఓ లాప్ టాప్ కొందామండీ
  ఎటుకూడి ఇంక కొన్నిరోజుల్లో ఇంకో లాప్‌టాప్ కొనబోతున్నారన్నమాట! 🙂

  మీకు అనుకూలంగా ఉండటం కొరకు 2 external keyboards & external mouse కొని USB port లొ పెట్టేసెయ్యండి.

  Like

 3. హమ్మయ్య! వేయిపడగలూ చదివేశారన్నమాట. శ్రీపాదవారి “వడ్లగింజలు” చదివారా?

  మీ సంచయనం లో యేవైనా ప్రాచీన పుస్తకాలూ, సిధ్ధాంత వ్యాసాలూ, పత్రికల “ఆర్కైవ్స్” లభిస్తే, మన మాగంటివారికి ఓ లింకు ఇవ్వండి! వారు బృహత్ ప్రయత్నం చేస్తున్నారు.

  ప్రయత్నిస్తారుగా?

  Like

 4. I completely agree with Panipuri. It’s better to have external keyboard and mouse sir.

  Like

 5. ఫణిబాబుగారు,
  నమస్తే……మీ మ్యూజింగ్స్ చూసా. కంప్యూటర్ కష్టాలు చాలా
  తీయగా చెప్పారు. ఏదో రకంగా మొదట్లో ఇలాంటికష్టాలు
  అందరూ అనుభవిస్తున్నావే అని ఒక్కొక్క బ్లాగులోకీ వెళ్తుంటే
  తెలుస్తున్నది. ఈ ప్రపంచంలోకి నేను ఈ మధ్యనే వచ్చాను.
  మా ఆవిడకూ కంప్యూటర్ అలవాటు చేద్దామనుకుంటున్నాను…..
  ఇక నా జాగ్రత్తలో నేను వుంటాను. నేను మీకు గుర్తువుండి
  వుంటానని ఆశిస్తున్నాను…..రాజమండ్రీ వాడ్ని…డి.వి.హనుమంతరావు.

  Like

 6. @నిరుపమా,
  నీకేం, చెప్తావు!!

  @పానిపురి,

  సలహాకి ధన్యవాదాలు.

  @కృష్ణశ్రీ గారు,

  ప్రస్తుతానికి ‘నిలువుచెంబు’ చదివాను.ఆయన వ్రాసిన ఇంకో నాలుగు పుస్తకాలు ఈ వారాంతానికి పూర్తిచేస్తాను. ఇవన్నీ మేము ప్రారంభించిన గ్రంధాలయానికి కొన్నవి.

  @గణేష్,

  ష్యూర్ !

  @హనుమంతరావు గారూ,
  శుభ్రంగా గుర్తున్నారు! బ్లాగులోకంలోకి వెల్కం.

  Like

 7. namasthe andi..
  nenu ee blog ee madye chusanu..inkaa roju nundi vadalakundaa anni tapalu chadivaanu..chaala nachindhi..
  nenu kothaga pelli ayi mauritius lo untunna thelugu ammayi ni..memu vinayaka chavithi ki telugu temple ki velthe akkada aa panthulu gaaru katha shlokalu matram sanskrith lo cheppi dani bhavam antha english lo nu migitha katha antha english lonuu chepparandi..idemiti ila chepthunnaru ante migitha north indians ki mauritians ki andariki artham kavali antaa..

  Like

 8. సృజనా,

  నా టపా నచ్చినందుకు సంతోషం.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: