బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–నా అగచాట్లు..


    ఈ వేళ ప్రొద్దుట, మా అబ్బాయి మా మనవడు చి.అగస్థ్య కి పాస్ పోర్ట్ కి ఎప్లికేషన్ ఇవ్వడానికి వెళ్తూ, నన్ను కూడా రమ్మన్నాడు. సరే పనేముందీ అనుకుంటూ నేనూ బయలుదేరాను, తన కారులో. ఈ మధ్యన ఆన్ లైన్ లో ఎప్లికేషన్లు తీసికుని వాళ్ళిచ్చిన టైముకి వెళ్ళి డబ్బులు కట్టాలిట.దాంట్లో 10.00AM 14/10/2010 అని ఇచ్చారు. వాళ్ళు టైమిచ్చారుకాబట్టి తొందరగానే పని పూర్తైపోతుందన్నాడు. మేము వెళ్ళేసరికే ఓ రెండు వందలమందిదాకా క్యూలో నుంచున్నారు.తనకి అడగడానికి మొహమ్మాటపడుతున్నాడూ, పోన్లే నేనే వెళ్ళి సంగతేదో కనుక్కుందామని వెళ్ళి అడిగితే తేలిందేమయ్యా అంటే, ఆన్ లైన్ లో ఎప్లై చేసిన ప్రతీవాడికీ by default అదే టైము ఇస్తారుట! ఈ మాత్రందానికి ఇంత హడావిడి ఎందుకో అర్ధం అవదు.దాంతో అర్ధం అయిందేమిటంటే, online అయినా offline మనం ఇదివరకటిలాగానే క్యూల్లో నుంచోవడమే! అక్కడ ఉండే సెక్యూరిటీ వాడు నన్ను లోపలికి వెళ్ళనీయనన్నాడు. మీకేం పనీ అని అడిగితే
ఊరికే టైంపాస్స్ కీ అన్నాను.లోపల బాగా రద్దీగా ఉంటుందీ, బయటే బాగుంటుందీ అనడంతో, చేసేదేంలేక బయటే నుంచుండిపోయాను. మా అబ్బాయి అంతసేపు ఊరికే నుంచోడం ఎందుకూ, కారులో కూర్చుని ఏ పేపరో చదువుకో అని కారు తాళాలు ఇచ్చాడు.

    అక్కడిదాకా బాగానే ఉంది. మా కారు పెట్టిన చోటుకి వెళ్ళి, డోర్ తీద్దామని ప్రయత్నిస్తే ( నేను ఎప్పుడైనా కార్ల తాళాలు తీశానా!) దీనిల్లుబంగారంగానూ రాదే! అటు తిప్పీ ఇటుతిప్పీ ప్రయత్నించాను. అప్పటికే ప్రక్కనే నిల్చున్నవాళ్ళు నావైపు అనుమానంగా చూడ్డం మొదలెట్టారు ఏ కార్ లిఫ్టరో అనుకుని! ఇంక లాభం లేదనుకుని, వాళ్ళనే అడిగేశాను నాయనలారా ఇది మా అబ్బాయి కారూ, తను లోపల క్యూలో నుంచున్నాడు, టైము పడుతుందని నన్ను కార్లో కూర్చోమన్నాడూ అని! నా అదృష్టం బాగుండి, వాళ్ళు అదేదో సెంట్రల్ లాకింగుని ఓ నొక్కు నొక్కి మొత్తానికి తీశారు.పోనీ నేనైనా బుధ్ధిమంతుడిలా, ముందరి డోర్ తీసి కూర్చోవచ్చుగా, అబ్బే ముందర కూర్చోడం ఎప్పుడైనా అలవాటుంటేగా,పెద్ద గొప్పగా వెనక్కాల డోర్ తీసి అందులో సెటిల్ అయ్యాను. గాలి రావడం లేదని అద్దం కిందకు దింపుదామంటే రాదు. పోనీ తలుపు తీద్దామంటే వెనక్కాలి రెండు డోర్లకీ child lock వేసేశాడు. లోపల్నించి రాదూ,బయటకు వెళ్ళాలంటే దారేది భగవంతుడా అనుకున్నాను. పోనీ ఆ లాక్ తిసినవాళ్ళు ఉంటారేమో అడగొచ్చూ అనుకుంటే అప్పటికే వాళ్ళు వెళ్ళిపోయారు! ముందర సీట్ లోకి వెళ్తే, డోర్ తీసికుని బయటకు వెళ్ళొచ్చూ అని తెలుస్తోంది, కానీ వెళ్ళడం ఎలాగ? సీట్లేమో ఇరుగ్గా ఉన్నాయీ.

   మొత్తానికి ఏదో తిప్పలు పడి పద్మాసనాలూ, యోగాసనాలూ వేసి అన్ని రకాల acrobatics చేసి, ముందర సీటులోకి వెళ్ళాను. ఈ ప్రక్రియ లో కాలు దేంట్లోనైనా ఇరుక్కుపోతే అదో అప్రదిష్టా! ముందరకైతే వెళ్ళాను కానీ, ఆ డోర్ గ్లాసు రాదూ. ఇదికాదు పధ్ధతీ అనుకుని, ఆ డోర్ తెరిచేసి కూర్చుని, ఊపిరి పీల్చుకుని ఓ పేపరు తీసికుని సెటిల్ అయ్యాను!అక్కడితో కథ పూర్తయినా బాగుండును,ఆ పక్క కారు తీసేయగానే, ఆ ఖాళీలోకి ఇంకో ఆవిడ వచ్చింది. మా కారు అడ్డం వచ్చిందేమో, అంకుల్ కొద్దిగా కారుని పక్కకు జరపండీ అని అడిగారు. ‘మా తల్లే నువ్వొక్కర్తివే తరవాయీ, నన్నే ఆడిగావా’ అనుకుని. ఏం మొహమ్మాట పడకుండా చెప్పేశాను, ‘నాకు రాదూ, మీరే ఇంకో చోటుకి వెళ్ళండీ’ అని.

    ఓ రెండు గంటల తరువాత, మా అబ్బాయి పని పూర్తిచేసికుని వచ్చాడు. అదేమిటి డాడీ ఏ.సీ. వేసికునుండవలసింది,అంటే అప్పటిదాకా నేను పడ్డ తిప్పలు చెప్పేసరికి, నవ్వాపుకోలేకపోయాడు. అలా కాదూ, తాళం ఇగ్నిషన్ లో పెట్టి ఒకసారి తిప్పితే, అన్నీ యాక్టివేట్ అవుతాయీ,అలా చేయవలసిందీ అన్నాడు. నాయనా నారోజు బాగోపోతే ఆ కీ కాస్తా ఒకసారికి బదులు రెండు సార్లు తిరిగితే ఏమౌతుంది బాబూ, అంటే కారు స్టార్ట్ అవుతుందీ అన్నాడు!’ ఏదో ఉన్నంతకాలం నన్ను ఇలా వెళ్ళిపోనీ, నీ కార్లూ వద్దూ, కీ లూ వద్దూ అన్నాను! అలా కాదూ, మొదట్లో కంప్యూటరు నేర్చుకోమంటే అప్పుడూ ఇలాగే అన్నావూ, ఇప్పుడు చూడు మన tenderleaves పని అంతా మీరే చూస్తున్నారూ,అలాగే డ్రైవింగు కూడా నేర్చేసికో అన్నాడు. చూడు నాయనా అది వేరూ, ఇది వేరూ. కంప్యూటర్ కి ఏమైనా అయితే మీరందరూ ఉన్నారు బాగుచేయడానికి. కారు నడిపేటప్పుడు ఏమైనా జరిగి, ఏ కాలో చెయ్యో విరిగితే నేనే బాధ పడాలి, ఈ వయస్సులో అంత అవసరమా అన్నాను!
నా టపా కి టాపిక్ దొరుకుతుందనే ప్రొద్దుట నన్ను తీసికెళ్ళాడుట పైగా !!

Advertisements

16 Responses

 1. last line chaala bavundandi.

  Like

 2. ఏంటి సార్, ఇన్ని ఘనకార్యాలు చేసినవారు ఆఫ్ట్రాల్ కారు నేర్చుకోలేరా? ఉద్యమించండి!!

  Like

 3. అయ్యో మొత్తానికి ఇద్దరూ ఇబ్బంది పడ్డారన్న మాట
  పాస్ పోర్ట్ కి టైం ఇస్తారు కదా అది అందరికీ ఒకే టైం ఇవ్వరు , ఒక అరగంట తేడాతో ఇస్తారు . మనం ఆ టైం కి వెళ్లి జనరల్ లైన్ లో నిన్చోకుండా నేరుగా వెళ్ళొచ్చు , కాకపొతే మొదటి అంతస్తులో కౌంటర్ లో టైం పడుతుంది
  మీరు కారు కూడా నేర్చుకోండి , చాలా సులువు, కనీసం కారులో క్లచ్ , బ్రేకు , విండోస్ ఓపెన్ చెయ్యడం , హ్యాండ్ బ్రేఅక్ వెయ్యడం లాంటి చిన్న చిన్న విషయాలు తెలుసు కోవాలి, అత్యవసర పరిస్తితులలో అవి ఉపయోగ పడతాయ్. కారు డ్రైవింగ్ నేర్చుకోక పోయినా ఇవి తెలుసు కోవాలి.

  Like

 4. >>మొత్తానికి ఏదో తిప్పలు పడి పద్మాసనాలూ, యోగాసనాలూ వేసి అన్ని రకాల acrobatics చేసి, ముందర సీటులోకి వెళ్ళాను.

  :))))))))))))

  🙂

  హాయిగా ఉంటాయండీ మీ టపాలు యే బాబాయిగారో పక్కన కూర్చుని కబుర్లు చెప్తునట్లు.డ్రైవింగు మీద కూడా ఓ రాయేసి చూడండి పోనీ.

  డ్రైవింగు రావడం,రాకపోవడం సంగతి పక్కన పెడితే ఆ అనుభవంతో టపాలు రాసి మాకు బోలెడు కబుర్లు చెప్పచ్చు.ఏమంటారు?

  Like

 5. నీకు టాపిక్కులకేమి కరువు. కానీ హరీష్ అనుకున్నది రైటైంది.
  ౩౦ ఏళ్ళ క్రితము, కారు స్లోపులో ఆపి, డ్రైవరు పెద్దమనిషి బయటుకు దిగేడు. ఈలోగా కారు బయలుదేరింది. కారులో కూర్చున్న నా కొలీగుకి నీ పరిస్థితే. నేను అంతే అనుకో. డోరు ఓపెన్ చేసి బయటకు గెంతేసేడు. శాస్త్రి గారు చెప్పినట్లు అన్ని నేర్చుకో.

  Like

 6. 🙂 మొత్తానికి అభిమన్యుడి లాగా అయిందన్న మాట మీ పరిస్థితి!
  కొత్తపాళీ గారు, అప్పారావు గారూ అలాగే చెబుతార్సార్, మనం పట్టించుకోనక్కర్లేదు. ఇపుడూ.. రైలెక్కుతున్నాం గదాని దాన్ని నడపడం నేర్చేసుకుంటన్నామా ఏంటి? 🙂

  Like

 7. కొత్తపాళీ గారూ,

  మీకేం చెప్తారు! నాకు సైకిలు పట్టుకోవడమే రాదు బాబోయ్ అంటే, ఈ కార్లూ స్కూటర్లూ గొడవేమిటండి బాబూ !

  Like

 8. అప్పారావు శాస్త్రీ,

  మీ ఊళ్ళో సంగతి నాకు తెలియదు. ఇక్కడ మాత్రం నిన్న క్యూలో నుంచున్న ప్రతీ వాడికీ 10.00 AM అనే ఉంది.అవన్నీ నేర్చుకుని తిప్పలు పడే కంటే, హాయిగా కారులో ఒక్కడినీ కూర్చోకుండా ఉండడం ఎకనామికలేమో !!!

  Like

 9. ఋషీ,

  మీ అందరికీ నా ‘అనుభవాల’ కబుర్లు చెప్పడానికి, ఇంతకంటె మంచి సలహా లేదా నాయనా! నన్ను నామానాన్న బ్రతకనీయండి!

  Like

 10. రామం,

  అందరూ సలహాలు చెప్పేస్తున్నారు. మీకేం పోదుగా!

  Like

 11. చదువరి గారూ,

  అదండీ భేషుగ్గా చెప్పారు! మీరొక్కరే నన్నర్ధం చేసికున్నారు!

  Like

 12. Age is never a hurdle for learning.
  learn driving, better late than never.
  Mohan

  Like

 13. నేను కొంచెం ముందు జాగ్రత్తగా చెప్పానండీ
  డ్రైవింగ్ నేర్చుకోవడం కూడా అవసరమే, అత్యవసర సమయాలలో ఆటోలు దొరకని వేళలలో మనమే డ్రైవ్ చెయ్యొచ్చు ,
  నేర్చుకోవడం కన్నా అందులో ఉండే ఆపరేటింగ్ సిస్టం గురించి తెలుసుకోవడం చాలా మంచిది.
  కార్ లోపల వైర్ లు మెల్ట్ అయినప్పుడు, సెంటర్ లాకింగ్ సిస్టం తెలియక లోపల ఉండి ఉక్కిరి బిక్కిరి అయిన సందర్భాలు ఉన్నాయండి కొంత మందికి.
  మిత్రులు రామచంద్రులుగారు చెప్పినట్లు హ్యాండ్ బ్రేక్ వెయ్యకపోవడం వల్ల / లోపల ఉన్నవాళ్ళకి తెలియక పోవడం వల్ల ఇబ్బంది పడతాము
  రైలు ఉన్నప్పుడు, అత్యవసర సమయాలలో చైన్ లాగాలని, కిటికీని పగలకొట్టి బయటకి దూకాలని ఎలా తెలుసుకుంటామో అలా.
  చిన్నవాడిని చెప్పానని అన్యదా భావించకుండా హ్యాండ్ బ్రేక్ , బ్రేక్ , స్టార్ట్ చేయడం లాటివి తెలుసుకోవడానికి ఒక గంట కూడా పట్టదు ( మీరు బ్లాగ్ వ్రాసే సమయం కన్నా తక్కువ)
  మీ భవదీయుడు
  అప్పారావు శాస్త్రి

  Like

 14. :))

  కొన్నేళ్ళ క్రితం టొరంటోలో ఒక ఫ్రెండ్ ఇండియాకు వెళుతూ మరొక ఫ్రెండుకి విమానాశ్రయంలో తన సెల్ ఫోను ఇచ్చేసి లోపలికి వెళ్ళాడు. కొద్దిసేపయింతరువాత ఏదో అవసరం వుండి లోపలికి వెళ్ళిన ఫ్రెండు మావాడికి కాల్ చేసాట్ట. రింగు వినపడుతోంది కానీ దానికి ఆన్సర్ ఎలా ఇవ్వాలో తెలియక మావాడు చాలా ఖంగారు పడ్డాడట. మా వాడి ఖంగారు చూసి చుట్టూ వున్న జనాలు నవ్వారంట. ఇప్పుడొస్తున్న సెల్ ఫోన్లు ఇంకా కాంప్లెక్సుగా వుంటున్నాయి. ఎన్నడో నాకూ అదే పరిస్థితి వచ్చేలా వుంది.

  అన్నట్లు మీరు ప్రతిస్పందనలు విడిడిగా ఇవ్వకుండా కొన్నింటినన్నా కలిపి ఇస్తే కాస్త అగ్రిగేటర్లలో మా కామెంట్లకీ చోటు దక్కుతుంది 🙂

  Like

 15. @mohan,

  Sure!

  @అప్పారావు శాస్త్రీ,

  నా మంచి కోరే చెప్పారు.ప్రయత్నిస్తాను.

  @ శరత్,

  ఇప్పుడిచ్చినట్లుగానేనా? ఏమిటో ఇన్నాళ్ళూ తట్టనేలేదు!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: