బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-టైంపాస్


    ఏ సినిమా అయినా హిట్ అవాలంటే, ఆ యూనిట్ లో ఉండే ప్రతీవారికీ ( Spotboys, Drivers,Junior Artists Suppliers etc…)తోసహా.ఇదివరకటి రోజుల్లో, ప్రతీ భాషలోనూ వచ్చే సినిమాల్లో, వీరందరి పేర్లూ
సినిమా టైటిల్స్ చూపించేటప్పుడే స్క్రీన్ మీద కనిపించేవి. ఉదాహరణకి..కళ-గోఖలే, దుస్తులు- పీతాంబరం… అంటూ, ఆఖరికి Distributors వివరాలు కూడా. ఆ రోజుల్లో అయితే తెలిసేది కాదు, వీళ్ళందరిపేర్లూ ఎందుకు వేస్తున్నారో!
క్రమక్రమంగా, ఆ వివరాలు సినిమా మొదట్లో చూపించడం మానేసి, మొక్కుబడిగా, సినిమా అంతా అయి, ప్రేక్షకులు సీట్లలోంచి బయటకు వెళ్ళే హడావిడిలో ఉన్నప్పుడు, అదికూడా యమా స్పీడులో చూపించేస్తూంటారు. పోనీ ఎప్పుడైనా ఆ సినిమా ఏ టీ.వీ. లో వచ్చినప్పుడో చూద్దామన్నా, పైన చెప్పిన టెక్నీషియన్ల పేర్లు, బుల్లి బుల్లి అక్షరాల్లో కనిపిస్తాయి, ఛస్తే చదవడానికి వీలు పడదు. ఈ వేళ ఇదేమిటీ, ఈ టెక్నీషియల్ని గురించి ఇంత బాధ పడిపోతున్నారేమిటీ అని అడక్కండి. నటులూ, దర్శకుల కంటే కూడా వీరిపాత్ర సినిమా విజయంలో పెద్ద పాత్ర వహిస్తుందని నా అభిప్రాయం.

   ఎవార్డులు ఇచ్చేసమయంలోకూడా,టెక్నికల్ ఎవార్డులని ఈమధ్యన మొదలెట్టారు, కానీ ఆ బహుమతి గ్రహీతలు స్టేజ్ మీదకొచ్చినప్పుడు, ఒక్కడంటే ఒక్కడూ పట్టించుకోడు పాపం! మళ్ళీ ఏ హీరోయో, హీరోయినో వచ్చినప్పుడు మాత్రం ఈలలూ, చప్పట్లూ, Standing ovationలూనూ.ఆ టెక్నీషియన్ల ప్రతిభే లేకపోతే, ఈ హీరోలూ, హీరోయిన్లూ ఎక్కడుండేవారుట? మన 50-60 ఏళ్ళ హీరోల్ని, స్టూడెంట్లగానూ, Angry young man ల గానూ చూపించడంలో, ఆ మేకప్పు వాళ్ళు ఎంత శ్రమపడుతున్నారో గుర్తుండదు. అదంతా తమ ప్రతిభే అనుకుని ఆ హీరోలూ, వాళ్ళ అభిమాన సంఘాలూ మంగళ హారతులూ వగైరా చేస్తూంటారు. వాడెవడికో Best actor వచ్చిందీ, తమ అభిమాన నటుడికి రాకపోవడంలో ఏదో రాజకియం ఉందీ అంటూ మీడియాలో గెంతులేస్తూంటారు!

   నిన్న అదేదో చానెల్ లో Wanted అనే హిందీ సినిమా వస్తూంటే, అది మన మహేష్ బాబు నటించిన ‘పోకిరీ’Hindi version అని తెలిసి ఎలా ఉందో అని చూసాను.ఎంత దరిద్రంగా అంటే అంత దరిద్రం గా ఉంది! అక్కడికి నేనేదో మహేష్ బాబు ఫాన్ అని కాదుకానీ, I feel he does not overact.ఇక్కడ Salmankhan అంతా ఆపోజిట్! వీడికి మొత్తం సినిమాలో ఒక్క సీన్లోనైనాపై బట్టలు విప్పందే నిద్ర పట్టదు!చివరలో ఒక సీన్ లో ప్రకాష్ రాజ్, వీడిమీదకి ఒక కాగడా లాటిది విసురుతాడు.That was enough to provoke our hero to take off his shirt ! వాడి సిక్స్ ప్యాక్కో, సెవెన్ ప్యాక్కో చూపించడం!నలభై ఏళ్ళొచ్చినా, ఇంకా యూత్ ఫుల్ గా ఉండడం చూడ్డానికి బాగానే ఉంటుంది. మరీ ప్రతీ సినిమాలోనూ అలా షర్టులు తీసేసికోవడం ఎందుకో? ఈ విషయం లో మన వాళ్ళు చాలా బెటర్! పాపం హిరోయిన్లే బట్టలిప్పుకోడంలో ఉత్సాహం చూపిస్తూంటారు!

   ఈ వేళ సాయంత్రం’మా’ టీ.వీ. లో ఒక మంచి కార్యక్రమం వినే/చూసే అవకాసం వచ్చింది-‘నవ సాహితీ సౌరభం’-అనుకుంటాను. శ్రీ సముద్రాల (సీనియర్) గారిచే రచింపబడిన కొన్ని అద్భుతమైన పాటల గురించి శ్రీ వెన్నెలకంటి ( సినీ గీత రచయిత) అనుకుంటాను చెప్పారు.కార్యక్రమం అద్భుతంగా ఉంది.కానీ ఆయన టీ.వీ. లో బాగా కనిపించడానికి వేసికున్న పెద్ద పెద్ద పువ్వుల స్లాక్ మాత్రం చాలా గాడీ గా ఉంది. సందర్బానుసారంగానైనా కొద్దిగా సొబర్ డ్రెస్ వేసికుంటే ఆయనదేమి పోయిందిట? His dress was definetely an eyesore! ఇలాటి చిన్న చిన్న విషయాల్లో కొద్దిగా శ్రధ్ధ తీసికుంటే బాగుంటుందేమో అని నా అభిప్రాయం.

Advertisements

9 Responses

 1. 🙂 Salman mida comments super andi.

  Like

 2. అయ్యా,ఫణిబాబు గారు,మీరు చెప్పింది ఉత్తి టైం పాసు కాదండి.
  నిజం! చూసారుగా, ఇటీవలి నంది అవార్డుల విషయంలో గొడవ.
  వాళ్ళ హీరో నటించిన సిన్మాకి తొమ్మిది నందులొస్తే (టెక్నీషియన్స్)
  హీరోకి ఉత్త(మ)ఎవార్డు రాలేదని తెగ గొడవచేశారు.కొన్ని ఊర్లలో
  ధర్నాలు కూడానట! బ్రహ్మాండంగా ఆడిన సినిమాకు హీరోకి ఇవ్వరా,
  ఏం ఫైట్లు చేయలేదా అంటూ న్యూస్ చానళ్లల్లో డిస్కషన్సు! నటనకి,
  సిన్మా ఆడటానికి తేడా తెలియని సన్నాసులను చూసి నవ్విపోడం
  తప్ప మనమేం చేయగలము?!

  Like

 3. తెలుగు లో కూడా సల్మానులు వున్నరు సార్… ఒక నితిన్ ఒక అల్లు అర్జున్ సినిమా లో ఒక్కసారన్నా చొక్కా విప్పందే రిలీజ్ చెయనివ్వరు….ఇక పొతే సినిమాలో టెక్నిషియన్స్ మాటకి వస్తే మీ మాటలు అక్షరసత్యాలు.. “రోబో” సినిమాకి ఆ టెక్నిషియన్స్ సరైన కృషి చెయక పొతే ఎవరు హీరో అయినా 10 రొజులు మించి ఆడదు..టెక్నిషియన్స్ సరిగా చేయక పొయిన సినిమా కి ఉదాహరణ “పులి”

  Like

 4. లైట్, స్పాట్, క్లాప్ బాయ్స్ లాంటి వాళ్లూ, జూనియర్ ఆర్టిస్టులు అనబడే ఎక్స్ ట్రాలూ కేవలం వుపాధికోసమే పని చేస్తున్నారు.

  మరి హీరోలూ వగైరా చేస్తున్నది–కళామతల్లి సేవ! అందుకే వారికి పారితోషికాలూ, అవార్డులూ, రివార్డులూ, లైఫ్ టైం అఛీవ్ మెంట్ లూ!

  అయినా, “టైం పాస్” కోసం మీ యింట్లో పిల్లులూ, బల్లులూ గురించి వ్రాసినా బాగుంటుంది కానీ, వీళ్లగురించి యెందుకండీ బాబూ!

  Like

 5. జాబిల్లీ, ఇందూ,

  ధన్యవాదాలు. నా టపా నచ్చినందుకు.

  Like

 6. గురువుగారూ,

  టపాకి పేరేంపెట్టాలో తెలియక టైంపాస్ అన్నాను!

  Like

 7. ఫణీ,

  మీరన్నట్లు తెలుగులోనూ ఉన్నారు.ఏమైనా అంటే ఏం గొడవొస్తుందో అని వ్రాయలేదు!

  Like

 8. కృష్ణశ్రీగారూ,

  ఇళ్ళల్లో ఉండే పిల్లులూ,బల్లులూకీ కోపం వస్తే ?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: