బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- కామన్వెల్త్ క్రీడలు


www-expressindia-com (1)

    ప్రస్తుతం ఢిల్లీ లో జరుగుతున్న కామన్వెల్తు క్రీడల్లో,inspite of all odds, మన క్రీడాకార్లు అందులోనూ షూటర్స్ చాలా మంచి ప్రదర్శనలు ఇచ్చి, మన దేశానికి స్వర్ణ పతకాలు తెస్తున్నారు. ఇందులో మన ప్రభుత్వం క్రెడిట్ ఎక్కడా ఉన్నట్లులేదు! ఒలింపిక్స్ లో అభినవ్ బింద్రా, స్వర్ణం తెచ్చినప్పుడు, మనప్రభుత్వం చంకలెగరేశారు.నిజంగా అభినవ్ తండ్రి ఇచ్చిన సదుపాయలతోనే నెగ్గాడు. మన దేశంలోని వివిధ క్రీడా సంస్థలు ఎంతంత చేస్తున్నాయో ప్రతీ రోజూ చూస్తూనే ఉన్నాము.

    ఒక్కటంటే ఒక్క అసోసిఏషన్ చూపించండి, అన్నీ సవ్యంగా జరుగుతున్నాయని! ప్రతీ దానికీ ఓ రాజకీయనాయకుడిని ఏ ఛైర్మన్/ ప్రెసిడెంటు గానో చేయడం, వాడేమో యుగాల తరబడి, చేతికొచ్చినంతా మెక్కేయడం. అదేదో తమ స్వంత ఇలాకాలా భావిస్తారు. ఏళ్ళ తరబడి క్రీడాకార్లకివ్వలిసిన డబ్బులివ్వరు, చివరకు మేము దేశం తరపున ఆడం అని బెదిరించేదాకా వస్తుంది పరిస్థితి!అప్పుడు హడావిడిగా ఎవరికీయవలసినది వాళ్ళకి ఇచ్చేసి, చేతులు దులిపేసికుంటారు. క్రికెట్ తప్ప మిగిలిన అన్ని క్రీడల సంగతీ ఇంతే. పోనీ ఏదో అన్ని సరీగ్గా జరుగుతున్నాయన్నంతసేపు పట్టదు, ఏ కోచ్చో ఎవరో క్రీడాకారిణిని మోలెస్ట్ చేశాడనో, లేక ఇంకెదో చేశాడనో న్యూస్సూ! ఇన్ని అవాంతరాలున్నప్పుడు, మనవాళ్ళు పతకాలు తేవడంలేదో అని మెడ మీద తలకాయ ఉన్న ప్రతీవాడూ ఏడవడం ఎందుకో?

   మన అసోసిఏషన్లవాళ్ళు ఏదో తమ జేబుల్లోంచి డబ్బు ఇచ్చేస్తున్నామనేలా ప్రవర్తిస్తూంటారు! ఏమిటో లాలూలూ, పవార్లూ, ఇంకా ఇలాటివాళ్ళే అసలు క్రీడా సంస్థలకి అద్యక్షుళ్ళేమిటీ? వాళ్ళ వాళ్ళ పన్లు సరీగ్గా చేయరూ, పైగా క్రీడల్ని తగలేయడం ఎందుకో? క్రికెట్ లో ఇంకో గోలా! వాళ్ళకి డబ్బులెన్నున్నాయో వాళ్ళకే తెలియదు!అసలు మన జనాల్ని అనాలి, ప్రతీ మాచ్ కీ ఊపుకుంటూ వెళ్ళిపోతారు,అంత ఎండలోనూ ఓపిగ్గా కూర్చుంటారు, మనదేశం నెగ్గిందా సరే, లేకపోతే వాడెవడో అలా ఆడవల్సింది కాదూ, ఇలా ఆడుంటే నెగ్గేవాళ్ళం అంటూ, కిళ్ళీకొట్టువాడిదగ్గరనుండి, పార్లమెంటు మెంబర్లదాకా ప్రతీవాడూ చెప్పేవాడే! ఎప్పుడో ఎక్కడో తెలుస్తుంది, ఆ మాచ్చిలు ముందరే ఫిక్స్ అయ్యాయని! ఈమాత్రందానికి,అంతంతసేపు ఎండల్లో ఉండడం దేనికో? వీటికి సాయం ODI లూ,T-20 లూ, లేకపోతే IPL లూ! ప్రతీ దాంట్లోనూ ఏదో ఒక లఫ్డాయే! ఏదైనా మాచ్ లో ఓడిపోయినప్పుడు, మన క్యాప్టెన్ గారు ‘మాకు ఏడాదంతా ఆడడంతో అలిసిపోయామూ’ అనేది ఒక standard excuse. ఎవరికోసం ఆడుతున్నాడంటా, వాడికొచ్చే డబ్బులకోసమేకదా! పైగా వీళ్ళిచ్చే యాడ్లోటీ.Less said the better!

    ఈ గోలంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, కామన్వెల్తు క్రీడల్లో, నిన్నో, మొన్నో పూణె అమ్మాయి- Anisaa Sayyed- కి షూటింగులో స్వర్ణం వచ్చింది.అంతే మన రైల్వే శాఖవారు, ‘ వాహ్ వాహ్ మన రైల్వేల్లో క్రీడలకి ఎంతంతా ఎంకరేజ్మెంటిచ్చేస్తున్నామో అంటూ డప్పాలకి పోయారు. పైన ఇచ్చిన దానిమీద క్లిక్ చేయండి, అసలు సంగతేమిటో, రైల్వేవారు ఈ అమ్మాయికి ఎంత సహాయం చేశారో తెలుస్తుంది. పాపం మమతమ్మ మాత్రం ఏం చేస్తుంది లెండి, ఆవిడకి బెంగాల్లో రాజకీయాలతోటే టైముండడం లేదూ, ఇలాటివన్నీ పట్టించుకోడానికి టైమెక్కడిదీ? కావలిసిస్తే ఓ ఎన్క్వైరీ కమిషను వేస్తుంది తరువాత!
मॅरा भारत महान !!

Advertisements

6 Responses

 1. గౌ. ఫణి బాబు గారూ ,అభివందనాలు.

  ఆవేదన వలదు వలదు
  ఆందోళన తగదు తగదు
  ప్రభుత్వాల
  నియంత్రణలో
  అనునిత్యం
  జరుగుతున్న
  అవక తవక
  అన్యాయాలకు
  అహో ఓహో అంటూ
  గొంతులు అవిసేలా అరచి
  అరచేతులు పగిలేలా
  చప్పట్లు కొట్టి
  ఇప్పటికైనా
  అలవాటుగా
  మార్చుకొని
  ఆనందించడమే
  పనిగా పెట్టుకొంటే …
  మేలేమో
  క్రుళ్ళుతున్న పండువంటి
  వ్యవస్తలో

  Like

 2. మన ప్రజలకీ కిర్రికెట్టు మీదున్న ఆసక్తి లో సగమైనా మిగతా క్రీడలపై ఉండి ఉంటే ఎందరో క్రీడాకారులు వెలుగులోకి వచ్చేవారు.ఈ CWG వల్లనైనా మిగతా క్రీడలపై ఆసక్తి పెరుగుతుందని ఆశిద్దాం.ప్రభుత్వ సహాయం కూడా అంతంత మాత్రం.మన పతక విజేతలకు అభినందనలు.
  రాఘవేంద్రరావుగారూ, అన్యాయం చూస్తూ చూస్తూఎలా ఊరుకుంటామండి, అభినందిస్తూ ఎలానూ గొంతు చించుకుంటున్నాం,ఆక్రోశిస్తూ గొంతెత్తి అరిస్తే మరి కొంతమందికి తెలియనన్నా తెలుస్తుంది.

  Like

 3. Anisaa sayyed గురించి ‘లింక్’ ఇవ్వడం మరిచిపోయినట్టున్నారు.

  Like

 4. krishnasri garu,

  Please click on express(1) on left

  Like

 5. రాఘవేంద్ర రావుగారూ,

  మీరు వ్రాసినదంతా అక్షరసత్యం. వ్యవస్థే భ్రష్టు పట్టినప్పుడు, ఇలా ఆక్రోశించడం తప్పితే ఇంకేం చేయగలము?

  Like

 6. వజ్రం గారు,

  ధన్యవాదాలు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: